Community halls
-
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
-
‘మిథ్యా’న వనాలు
అవి పార్కులు.. మామూలుగా అయితే పచ్చని చెట్లు, మొక్కలు.. పిల్లల ఆట పరికరాలు.. ఆహ్లాదకర వాతావరణం ఉండాలి.. కానీ అక్కడ చెట్లు, మొక్కలు కాదుకదా గడ్డి కూడా ఉండదు.. అంతా చెత్తాచెదారం.. ఆ కాస్త భూమీ ఆక్రమణల మయం.. ఓ చోట వాహనాల పార్కింగ్ స్థలంగా మారిపోతే.. మరోచోట నివాస భవనాలు వెలిశాయి.. ఇక వివిధ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ భవనాలు భూత్ బంగ్లాలుగా మారిపోతున్నాయి.. ఇదీ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో పార్కులు, కమ్యూనిటీ హాళ్ల దుస్థితి. పార్కులు, కమ్యూనిటీ హాళ్ల పరిస్థితిపై ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో ఎన్నో విస్మయకర అంశాలు వెల్లడయ్యాయి. – సాక్షి నెట్వర్క్ ఆనవాళ్లు కూడా లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పేరుకు పార్కులు ఉన్నా.. చాలా చోట్ల వాటి ఆనవాళ్లు కూడా లేవు. పిల్లలకు క్రీడా వసతులు, ఆట పరికరాలు, వాకింగ్ ట్రాక్‌ల వంటివేమీ లేవు. పచ్చదనం కనుమరుగై, పరికరాలు తుప్పుపట్టిపోయినవి కొన్ని అయితే.. ఎడాపెడా కబ్జాల పాలవుతున్నవి మరికొన్ని. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలూ పార్కుల స్థలాల్లోనే.. ఇక స్థలాల కొరత పేరుతో.. చాలా చోట్ల పార్కుల స్థలాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. వనపర్తి, తాండూరు, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ మున్సిపాలిటీల పరిధిలో పార్కు స్థలాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు వెలిశాయి. పలుచోట్ల స్త్రీశక్తి భవనాలు, గ్రంథాలయాలు, ఇతర ప్రభుత్వ అవసరాలకు పార్కు స్థలాలనే కేటాయిస్తున్నారు. ఇక బెల్లంపల్లి, జనగామ, పెద్దపల్లి, సిరిసిల్ల, గోదావరిఖని, బాన్స్వాడ తదితర మున్సిపాలిటీల్లో అసలు పార్కులే లేవు. ప్రస్తుతం అమృత్ పథకం కింద ఎంపికైన పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వందకుపైగా పార్కులు రూపుదిద్దుకోనున్నాయి. వాటికి నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. ఖాళీ జాగా.. వేసెయ్ పాగా చాలా చోట్ల పార్కులు కబ్జాల పాల వుతున్నాయి. ‘ఇది ప్రభుత్వ భూమి’అని తెలిపే బోర్డు సహా దురాక్రమణకు గురవుతున్నా అడిగేవారు లేరు. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో మాత్రం పార్కులు, పార్కు స్థలాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. మిగతా ఏ జిల్లాలో నూ ఉద్యానవనాలు, వాటి స్థలాలు చేతులు మారడమో, కబ్జా కావడమో జరిగినట్టు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. వరంగల్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పార్కు స్థలాలపై అధికారుల వద్ద లెక్కాపత్రం కూడా లేకుండా పోయింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో పార్కుల స్థలాల్లోనే గుడిసెలు, దుకాణాలు వెలిశాయి. వాటికి ఇంటి నంబర్లు కూడా ఇచ్చేయడం గమనార్హం. అలాంటి చోట తొలుత పేదల పేరుతో గుడిసెలు వేస్తున్నారు. కొంతకాలం తర్వాత భారీ భవంతులు నిర్మిస్తున్నారు. పార్కు స్థలం.. ప్రైవేట్ స్కూల్ పార్కింగ్ ప్లేస్ మెదక్ జిల్లా కేంద్రం నడిబొడ్డున జంబికుంట వీధిలోని పార్కు స్థలం ఇది. దీని విలువ కోటి రూపాయలకు పైమాటే. పక్కనే ఉన్న ఓ ప్రైవేటు స్కూలు నిర్వాహకులు ‘ఇది పార్కు స్థలం’అనే బోర్డు సహా ఆ స్థలాన్ని కబ్జా చేసేశారు. ఏకంగా ప్రహరీ కూడా కట్టేసి.. వాహనాల పార్కింగ్‌కు వినియోగిస్తున్నారు. కానీ ఇదేమిటని అడిగేవారెవరూ లేరు. మనుగడ కోల్పోతున్న కమ్యూనిటీ హాళ్లు మున్సిపాలిటీల పరిధిలోని వార్డులు, బస్తీలు, కాలనీల్లో వివాహాలు, ఇతర శుభకార్యాలు, ప్రభుత్వపర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలుగా నిర్మించిన కమ్యూనిటీ హాళ్ల పరిస్థితి దారుణంగా మారిపోయింది. సరైన నిర్వహణ లేక చాలా చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల కమ్యూనిటీ హాళ్లు స్త్రీశక్తి భవనాలుగా మారిపోగా.. చాలా తక్కువ భవనాలు మాత్రమే కమ్యూనిటీ హాళ్లుగా వినియోగంలో ఉన్నాయి. ఇక పదులకొద్దీ మున్సిపాలిటీల్లో అసలు కమ్యూనిటీ భవనాలే లేకపోవగం గమనార్హం. కొన్ని చోట్ల ఉన్నా నిరుపయోగంగా ఉంటున్నాయి. ఉదాహరణకు నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో పది కమ్యూనిటీ భవనాలున్నా.. చిన్నపాటి కార్యక్రమం కూడా నిర్వహించలేనంత ఇరుగ్గా ఉండడం గమనార్హం. మున్సిపాలిటీల్లో పరిస్థితి ఇదీ.. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట మున్సిపాలిటీలో ఉన్న ఓ పార్కు మిషన్ భగీరథ పంపుహౌస్‌గా మారిపోయింది. సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, మెదక్ మున్సిపాలిటీల్లోని ఐదు పార్కుల్లో ఒక్క నిమిషం గడపలేని పరిస్థితి ఉంది. పాత ఖమ్మం జిల్లా పరిధిలోని పార్కులు, కమ్యూనిటీ హాళ్ల నిర్వహణ లోపించింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 20 పార్కుల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నా.. పనులు మొదలు కాలేదు. చాలా చోట్ల పార్కు స్థలాలు కబ్జా అయ్యాయి. పాత రంగారెడ్డి జిల్లాలో చాలా చోట్ల పార్కుల స్థలాలు కబ్జాల పాలయ్యాయి. తాండూరులో ఉన్న పార్కులో జిల్లా ఆస్పత్రిని నిర్మించారు. నిజామాబాద్ పట్టణంలో పేరుకు చాలా పార్కులున్నా ప్రభుత్వ నిర్మాణాలు వెలిశాయి. పాత మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో పేరుకే పార్కులు.. ఎక్కడా వసతులు లేవు. పలు చోట్ల పార్కుల కోసం ఉద్దేశించిన స్థలాలు ఖాళీగానే ఉన్నాయి. కమ్యూనిటీ హాళ్లు అయితే పాడుబడిన బంగళాలను తలపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా పార్కుల స్థలాలు పరాధీనమైపోయాయి. ఉన్న ఒకటి రెండు చోట్లా సౌకర్యాలేవీ లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఇదే దుస్థితి. గోదావరిఖనిలో ఖాళీ స్థలంలో పార్కు, ఆస్పత్రి నిర్మాణంపై వివాదం నెలకొంది. లక్ష జనాభా ఉన్న జగిత్యాలలో ఒకే పార్కు ఉంది. -
పేరు గొప్ప వ్యవస్థ.. ఎన్నేళ్లీ అవస్థ?
‘గ్రేటర్’ నగరం చూడర బాబూ.. కనీస సదుపాయాలూ లేవు పన్నుల వసూళ్లలో ఫస్ట్.. సౌకర్యాల కల్పనలో లాస్ట్ ఏళ్లుగా పట్టిపీడిస్తున్న సమస్యలు సాక్షి, సిటీబ్యూరో: చినుకు పడితే వణుకు.. రోడ్డెక్కాలంటే గుబులు.. రోజూ నీళ్లందక దిగులు.. ఆహ్లాదం, ఆటలు కరువు.. చెత్తాచెదారానికి నెలవు.. ఏళ్లుగా అవే సమస్యల దరువు.. ఇదీ మహా నగర ‘చిత్తరువు’. రోడ్లు, కాలువలు, పారిశుధ్యం, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, చెరువులు, ఆటస్థలాలు.. ఇవన్నీ కనీస సౌకర్యాలు. పేరు గొప్ప గ్రేటర్ హైదరాబాద్‌లో వీటిలో ఒక్కటీ సవ్యంగా లేవు. పైగా ఇవన్నీ నిన్నా మొన్నటి సమస్యలు కావు. కానీ వీటిని తీర్చేందుకు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు ‘పదవీ కాలాలు’ సరిపోవట్లేదు. ప్రతిసారీ ఎన్నికల్లో మీ సమస్యలు తీరుస్తామని హామీలివ్వడం, గెలిచాక వాటిని గాలికొదిలేయడం రివాజైంది. దీంతో సమస్యలు కాస్తా మహా నగరాన్ని వదలని గుదిబండలుగా మారుతున్నాయి. అధికారులదీ అదే తీరు.. ఆస్తిపన్ను వసూళ్లలో రికార్డులు తిరగరాస్తున్నా.. సదుపాయాల కల్పనలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. కూడు, గూడు, గుడ్డ, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు, ట్రాఫిక్ ఇబ్బందులు- గోతులు గొప్పులు లేకుండా సాఫీగా ప్రయాణించేందుకు అనువైన మార్గాలు, పారిశుధ్యం, పార్కులు, ఆటస్థలాలు, వీధిదీపాలు.. ఇవే ప్రజలు కోరుకునే కనీస మౌలిక సదుపాయాలు. ఇవుంటే చాలు నగరం నందనవనం అవుతుంది. ఐదేళ్లకోసారి ఎన్నికల జాతర.. ఎడాపెడా హామీల వెల్లువ.. నేతలు, అధికారులు మారుతున్నారు. కానీ నగరం తలరాత మాత్రం మారట్లేదు. మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఈ‘సారీ’.. సమస్యలింతేనా?. కనీస సదుపాయాలు సమకూరేనా? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. కనీస సదుపాయాలు కల్పిస్తే చాలని ఆశిస్తున్నారు. ఇదే ఈనాటి ‘ప్రజా ఎజెండా’. తీరనివి కాదు.. పరిష్కరించే తీరికే లేదు! నిజానికి కొన్ని తీరని సమస్యలు కావు. నగరంలో ఇంటి చిరునామా కనుక్కోవాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఇంటి నెంబర్ల ప్రక్రియ అంత గజిబిజిగాఉంటుంది. దీన్ని సరళం చేసేందుకు చేపట్టిన నెంబర్ల విధానం అతీగతీ లేదు. ఇక, ఆయా ప్రాంతాలకు ‘దారి చూపే’ సైనేజీల ఏర్పాటూ దారీతెన్నూ లేదు. ప్రజావాణి, ఫోన్‌ఇన్, ముఖాముఖి వంటి కార్యక్రమాల పేరిట ప్రజా సమస్యలు పరిష్కరిస్తామంటూ ఫిర్యాదులు తీసుకుంటున్నారే తప్ప పరిష్కరించట్లేదు. ఒక్కసారి ఒక సమస్య గురించి ఫిర్యాదు చేస్తే.. నిర్ణీత వ్యవధిలోగా దాన్ని పరిష్కరించే వ్యవస్థ కావాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యలన్నీ తీరాలంటే.. గ్రేటర్ ప్రజలు సమస్యలన్నీ తీరి సదుపాయవంతమైన జీవనం గడపాలంటే ఏం చేయాలో లెక్కలేనన్ని లెక్కలు వేశారు. అంచనాలు రూపొందించారు. ఏవీ కాగితం దాటలేదు. ఉదాహరణకు దిగువ పేర్కొన్న నిధులతో అభివృద్ధి పనులు చేయాలని గతంలో ప్రతిపాదనలు తయారుచేశారు. వీటిలో పది శాతం మేర కూడా పనులు జరగలేదు. కనీసం దశలవారీగానైనా వీటిని చేపట్టి ఉంటే ఈసరికి పూర్తయి ఉండేవి. నాలాల అభివృద్ధి రూ.10 వేల కోట్లు రోడ్ల అభివృద్ధి రూ.4000 కోట్లు ఫ్లైఓవర్లు రూ.4500 కోట్లు ప్రయాణం.. అధ్వానం రోడ్ల నిండా గుంతలే. పట్టుమని పది కిలోమీటర్ల రహదారి కూడా సాఫీగా ప్రయాణించే పరిస్థితి లేదు. అడుగుతీసి వేయాలన్నా ‘నడక’యాతనే. ప్రజావసరాలకు తగిన విధంగా రహదారులు నిర్మించడంతో పాటు, ట్రాఫిక్ జామ్‌లు లేకుండా చూడాలని జనం కోరుతున్నారు. టోలిచౌకి, అంబర్‌పేట, బాలానగర్ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం, ఉప్పుగూడ, కందికల్‌గేట్, సఫిల్‌గూడ, తుకారాంగేట్ ప్రాంతాల్లో ఆర్ఓబీ/ఆర్‌యూబీలు, బార్కాస్, బజార్‌ఘాట్, మూసాపేట, మియాపూర్, మొఘల్‌కానాలా, న్యూరహ్మత్నగర్, కవాడిగూడ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పనులు పడకేశాయి. మొత్తం నగర రోడ్ల విస్తీర్ణంలో 30 శాతం మేర కూడా ప్రయాణానికి అనువుగా లేవు. పలుచోట్ల మరమ్మతులు, కొత్త రోడ్లు వేయాల్సి ఉంది. గ్రేటర్లో రోడ్ల పొడవు: 6411 కి.మీ.లు బీటీ రోడ్లు: 2280 కి.మీ.లు సీసీ రోడ్లు: 2080 కి.మీ.లు మట్టి రోడ్లు: 1660 కి.మీ.లు ‘చెత్త’శుద్ధి ఏదీ? ఎటుచూసినా చెత్తకుప్పలు.. అంతటా పేరుకుపోయిన చెత్తాచెదా రం.. రూ.కోట్లు వెచ్చిస్తున్నా పారిశుధ్యం పరిస్థితిలో మార్పు లేదు. ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోతున్న చెత్తకుప్పలతో, పొంగిపొర్లుతున్న మురుగునీటితో నగర ప్రజలు దుర్భరంగా గడుపుతున్నారు. తరచూ రోగాల పాలవుతూ ఆస్పత్రులకు ఖర్చు చేయాల్సి వస్తోంది. శివార్ల గోడు.. శివార్ల పరిస్థితి మరీ దుర్భరం. అందరి నుంచీ వివిధ రకాల పన్నులు వసూలు చేస్తున్న జీహెచ్ఎంసీ శివార్లలో మౌలిక సదుపాయాల కల్పనపై సవతి ప్రేమ చూపుతోంది. శివార్లలోని 30 లక్షల మంది తాగునీటికీ నోచట్లేదు. కొన్నిచోట్ల వారానికోసారి.. ఇంకొన్ని ప్రాంతాల్లో రెండు వారాలకోమారు సరఫరా చేస్తున్నారు. రోజూ నీటి సరఫరాకు స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించాలి. శివార్ల నీటి అవసరాలు తీర్చేందుకు రూ.2400 కోట్లతో 2008లోనే ప్రతిపాదనలు సిద్ధం చేసినా.. నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఇక రోడ్లు, వీధిదీపాలు, పార్కులు, ఆటస్థలాల ఏర్పాటు.. అన్నింటా పక్షపాతమే. దీన్ని తొలగించి శివార్లలో సంపూర్ణ మౌలిక సదుపాయాలు కావాలంటున్నారు. చూడు చూడు జాడలు గుడిసెల్లేని నగరంగా మారుస్తామంటున్న పాలకుల మాటలు నీటిమూటలే అవుతున్నాయి. పథకాలు, నిధులు పుష్కలం.. పనులు నిష్ఫలం అన్నట్టుగా పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారుల్లో చిత్తశుద్ధి లోపం వల్లే మురికివాడల స్థితిగతులు మారడం లేదని జనం అంటున్నారు. గుండె‘చెరువే’.. ‘ఇదిగో.. ఒకప్పుడు ఇక్కడ చెరువు ఉండేది తెలుసా?’ అని చెప్పుకోవాల్సిన దుస్థితి.. ఇప్పటికే అంతమైపోయిన చెరువులు పోను, మిగతా వాటినైనా పరిరక్షించాలని,అవి కుంచించుకుపోకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. చెరువుల పరిరక్షణకు రోజుకో కొత్త పథకాన్ని ప్రకటిస్తున్నా ఆ మేరకు పురోగతి కరువవుతోంది. వానొస్తే హైరానా నాలుగు చినుకులు పడితే నగరం చిగురుటాకులా వణుకుతోంది. వానొచ్చిన ప్రతిసారీ వరద బీభత్సం నెలకొంటోంది. వాన నీరు వెళ్లే మార్గాల్లేవు. అందుకోసం చేపట్టిన ప్రాజెక్టులు ఏళ్ల తరబడి పూర్తవుతున్న దాఖలాల్లేవు. ఇక, మ్యాన్‌హోళ్లలో పడి మనుషులు కొట్టుకుపోతున్నారు. నడిరోడ్లు కళ్లెదుటే కుంగిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చే వాళ్లు కావాలంటున్నారు జనం. 70 కి.మీ.ల మేర నాలాల అభివృద్ధి పనులు జరగాల్సి ఉండగా, 20 కి.మీ.ల మేర కూడా పూర్తి కాలేదు. రోడ్లన్నీ శిథిలావస్థలో.. రాజేంద్రనగర్ పరిధిలో రోడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు గోతులమయంగా మారి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. - పి.శ్రీధర్, బుద్వేల్, రాజేంద్రనగర్ అభివృద్ధి జాడలేదు రాజేంద్రనగర్ సర్కిల్లో అభివృద్ధి పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేపట్టం లేదు. కొత్త వాటి ఊసే లేదు. రోడ్లు, పారిశుధ్యం వంటి సమస్యలు యాతనకు గురిచేస్తున్నాయి. - పి.మహేష్, ఉప్పర్‌పల్లి ‘చెత్త’గా ఉంది మా ప్రాంతంలో చెత్త తొలగింపులో అధికారులు, కిందిస్థాయి సిబ్బంది నిరక్ష్యం చూపుతున్నారు. అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారడంతో రాకపోకలు సాగిం చాలంటే నరకం కనబడుతోంది. - కృష్ణచైతన్య, అడ్డగుట్ట సొసైటీ నివాసి పర్యవేక్షణ లేకే.. కేపీహెచ్‌బీకాలనీ 6వ ఫేజ్‌లో అంతర్గతరోడ్లు అధ్వానంగా మారాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. పారిశుధ్య సిబ్బంది సరిగా పని చేయట్లేదు. జీహెచ్ఎంసీ పర్యవేక్షణ లోపం వల్లే ఈ దుస్థితి నెలకొంది. - రఘునాథ్‌రెడ్డి, కేపీహెచ్ బీ కాలనీ, 6వ ఫేజ్ -
కాగితాల్లోనే 115 కమ్యూనిటీ హాళ్లు
=కాగితాల్లోనే 115 కమ్యూనిటీ హాళ్లు =పైసలున్నా.. పనులు కావు =ఆశించిన కమీషన్లు లేక పట్టించుకోని కార్పొరేటర్లు =పేదబస్తీలపై నిర్లక్ష్యం =కబ్జా చెరలో పాతహాళ్లు సాక్షి, సిటీబ్యూరో : పేదల బస్తీల్లో పుట్టినరోజులు, తదితర చిన్నచిన్న వేడుకలు, చిన్నచిన్న సంఘాల సమావేశాలు జరుపుకోవాలంటే కమ్యూనిటీ హాళ్లే ఆధారం. ఫంక్షన్‌హాళ్ల ఖర్చులు భరించలేని పేదలు పెళ్లిళ్లకు సైతం వీటినే వినియోగిస్తున్నారు. నగరంలోని దాదాపు 1500 బస్తీల్లోని ప్రజలు వేడుకలకు అవసరమైన కమ్యూనిటీ హాళ్లు లేక అల్లాడుతున్నారు. గతంలో ఉన్న ఎంసీహెచ్ కమ్యూనిటీ హాళ్లు కబ్జాల పరమయ్యాయి. చోటామోటా నేతలు వాటిని తమ సొంత ఆస్తుల్లో కలిపేసుకోవడంతో చిన్నాచితకా ప్రజలు వేడుకలు జరుపుకోవాలంటే కుదరడం లేదు. పేదల అవసరాన్ని గుర్తించిన స్థానిక ప్రజాప్రతినిధులు తమ కార్పొరేటర్ల ఫండ్ నుంచి భారీగానే నిధులను మంజూరు చేయించారు. కానీ.. ఆశించిన కమీషన్లు రాకపోవడంతో వాటి గురించి పట్టించుకోవడం లేదు. దాంతో, కమ్యూనిటీహాళ్ల పనులు ముందుకు కదలడం లేదు. కొందరు కాంట్రాక్టర్లే ఎక్కువ పనులు దక్కించుకుంటూ.. తగిన న్ని వనరులు లేక వాటి నిర్మాణాలు పూర్తి చేయడం లేదు. ఇంకొందరు టెండరులో తక్కువ లెస్తో పనులు దక్కించుకున్నప్పటికీ.. అనంతరం గిట్టుబాటు కావడం లేదని చేతులెత్తేస్తున్నారు. ప్రతి పనిలోనూ కార్పొరేటర్లు, అధికారులకు ముడుపులు చెల్లించాల్సి రావడం.. వీటి నిర్మాణాలతో తమకు పెద్దగా ఆదాయం లేకపోవడంతో వారికి ముడుపులు చెల్లించలేక పనులు వదులుకుంటున్నవారు ఇంకొందరు. ఈ నేపథ్యంలో, కాంట్రాక్టులు పొందినవారు నిర్మాణాలు ప్రారంభించి కొద్దిరోజులకే వాటిని వదిలివేయడం.. ఇంకొందరు అసలు పనులే చేపట్టకపోవడం వంటి కారణాలతో కమ్యూనిటీ హాళ్లు కాగితాలను దాటడం లేదు. నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ చర్యలు తీసుకోవడం లేదు. కార్పొరేటర్లు సైతం రోడ్డు పనులు.. పారిశుధ్య పనులు, డీసిల్టింగ్ వంటి వాటిల్లో వచ్చే కమీషన్లు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాల్లో రాకపోవడంతో వాటిని పట్టించుకోవడం లేదు. 52 డివిజన్లలో మంజూరైన కమ్యూనిటీ హాళ్లు : 117 నిర్మాణ పనులు ప్రారంభించినవి : 2 కేటాయించిన మొత్తం నిధులు : 8.80 కోట్లు వ్యయం చేసినవి : 7.15 లక్షలు