connectivity problem
-
1,117 బోర్డర్ పోస్టులకు అత్యాధునిక 4జీ కమ్యూనికేషన్.. కారణం ఇదేనా..
దేశసరిహద్దుల్లో సేవలందిస్తున్న జవానులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కొండ ప్రాంతాలు, లోయలు ఉండడంతో వారికి నెట్వర్క్ కనెక్టవిటీ సమస్య ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు 2020లో చైనాతో జరిగిన సరిహద్దు వివాదం నేపథ్యంలో అక్కడి బలగాలతో మరింత కనెక్టివిటీ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా పొరుగుదేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతాల్లోని దాదాపు 1,117 బోర్డర్ పోస్టులకు అత్యాధునిక 4జీ మొబైల్ కమ్యూనికేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వీటిల్లో కొన్ని సాయుధ దళాలకు చెందిన ఇంటెలిజెన్స్ పోస్టులు కూడా ఉండనున్నాయి. అయితే ఇందుకు దాదాపు రూ.1,545 కోట్లు అవసరం అవుతాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో టెలికాం శాఖ, హోంశాఖ, బీఎస్ఎన్ఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రం చేపట్టిన 4జీ సాచురేషన్ ప్రాజెక్టులో భాగంగా లద్దాఖ్‌లో మొత్తం 379 గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వీటిల్లో తొమ్మిది గ్రామాల్లోనే పనులు పూర్తయ్యాయి. మరో 34 చోట్ల ప్రారంభమయ్యాయి. మయన్మార్‌తో 2.4 కి.మీ, పాక్‌తో ఉన్న 18 కి.మీ సరిహద్దులో గతేడాది ఫెన్సింగ్ పని కూడా పూర్తి చేశారు. 2023లో చైనా సరిహద్దుల్లో కొత్తగా 48.03 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. దీంతోపాటు నాలుగు ఔట్ పోస్టులు, మూడు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. చైనాతో భారత్‌కు దాదాపు 3,488 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉంది. ఇదీ చదవండి: నేటి నుంచి రాబోతున్న కీలక మార్పులు ఇవే.. భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో కారణంగా ఇరుదేశాల సైనికులు మోహరించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంటోంది. అక్కడి ప్రాంతాల పేర్లను మారుస్తూ చైనా వివాదాలకు తెర తీస్తోంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న ఆ దేశం సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక, సైనిక వసతుల కల్పనకు పెద్దయెత్తున నిధులు వెచ్చిస్తోంది. సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారానే డ్రాగన్ దూకుడుకు ముకుతాడు వేయవచ్చని ఇండియా బలంగా విశ్వసిస్తోంది. అందులో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. -
కొండంత సమస్యలు.. గోరంత హామీలు
హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాలు చిన్నవి. సమస్యలు మాత్రం చాలా పెద్దవి. అధికార బీజేపీకి ఈ సమస్యలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా అయిదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న హిమాచల్ ప్రదేశ్ ఓటరు ఈ సారి ఎటువైపు మొగ్గు చూపుతారా అన్న ఆందోళన నెలకొంది. అయిదు అంశాలు ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా ప్రభావాన్ని చూపించబోతున్నాయి. సమస్యలివీ... నిరుద్యోగం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య దారుణంగా ఉంది. జాతీయ స్థాయిలో నిరుద్యోగం రేటు 7.6% ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లో 8.6 నుంచి 9.2 శాతం వరకు ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత 15 లక్షల మంది వరకు ఉంటే, వారిలో 8.77 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లో పేర్లు నమోదు చేసుకున్నారు. యాపిల్ రైతుల దుస్థితి దేశంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక యాపిల్ ఉత్పత్తిలో 26% వాటా హిమాచల్‌దే. గిట్టుబాటు ధర లేక రైతులు నిరసన బాట పట్టారు. సాగు ఖర్చు పెరగడం, వాతావరణ మార్పులు కుంగదీస్తున్నాయి. దీనికి తోడు యాపిల్స్‌ను రవాణ కోసం వాడే కార్టన్లపై జీఎస్టీని 12 నుంచి 18 శాతానికి పెంచడం రైతుపై మరింత భారాన్ని పెంచింది రోడ్డు కనెక్టివిటీ కొండ ప్రాంతం కావడంతో రాష్ట్రంలో ఏకంగా 39% గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేదు! ఇవన్నీ అటవీ ప్రాంతంలోని గ్రామాలు కావడంతో రోడ్లు నిర్మించాలంటే సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి. ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేక వీరంతా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,125 కి.మీ. రోడ్ల పునరుద్ధరణకు బీజేపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. అగ్నిపథ్ త్రివిధ బలగాల్లో కాంట్రాక్ట్ నియామకానికి కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకం మంచుకొండల్లో మంటలు రాజేసింది. 70 లక్షల హిమాచల్ జనాభాలో ఏకంగా 10 శాతం పని చేస్తున్న, లేదా రిటైర్డ్ సైనికులే ఉన్నారు. ఎందరో యువకులు సైన్యంలో చేరాలని ఆశతో శిక్షణ పొందుతున్న సమయంలో బీజేపీ తెచ్చిన పథకం వారిని నిరాశలో ముంచింది. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా ఎన్నికల్లో అత్యంత ప్రభావిత అంశంగా మారింది. 2004లో నాటి బీజేపీ ప్రభుత్వం దీన్ని నిలిపివేసింది. పాత పెన్షన్ పథకం ప్రకారం ఉద్యోగులు ఆఖరిగా తీసుకున్న జీతంలో 50 శాతం పెన్షన్‌గా ఇస్తారు. కొత్త స్కీమ్‌లో ఉద్యోగుల జీతం నుంచి 10%, ప్రభుత్వ వాటాగా 14% ఇస్తారు. కాంగ్రెస్, ఆప్ పాత పథకం తెస్తామంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కార్ల కంపెనీతో జియో ఒప్పందం.. నెట్ కనెక్టివిటీలో కొత్త శకం
ముంబై: ప్రయాణం చేసేప్పుడు మారుమూల ప్రాంతాల్లో తరచుగా ఎదురవుతున్న ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎంజీ మోటార్స్ ఇండియా, జియో నెట్‌వర్క్‌లు చేతులు కలిపాయి. అంతరాయం లేని ఇంటర్నెట్ అందిస్తామంటూ వినియోగదారులకు హమీ ఇస్తున్నాయి, ఈ మేరకు ఎంజీ మోటార్స్ ఇండియా, జియో నెట్‌వర్క్‌ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ఎంజీ ప్లస్ జియో మోరిసన్ గ్యారెజేస్ (ఎంజీ) ఇండియా నుంచి ఇప్పటికే హెక్టార్, గ్లూస్టర్ మోడళ్లు భారతీయ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. కాగా త్వరలోనే మిడ్ రేంజ్ ఎస్‌యూవీని లాంఛ్ చేసేందుకు రెడీ ఎంజీ మోటార్స్ రెడీ అవుతోంది. అయితే ఈ ఎస్‌యూవీలో ఇన్ఫోంటైన్‌మెంట్‌కి సంబంధించి గేమ్ ఛేంజర్ ఫీచర్‌ని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఇంటర్నెట్ కనెక్టివిటీలో సంచలనం సృష్టించిన జియో నెట్‌వర్క్‌తో జోడీ కట్టింది. నెట్ కనెక్టివిటీ త్వరలో రిలీజ్ చేయబోతున్న మిడ్ రేంజ్ ఎస్‌యూవీలో నిరంతం నెట్ కనెక్టివిటీ ఉండే ఫీచర్‌ని ఎంజీ మోటార్స్ జోడించనుంది. దీనికి సంబంధించిన సాంకేతిక సహకారం జియో నెట్వర్క్ అందిస్వనుంది. కారులో నిరంతరం నెట్ కనెక్టెవిటీ ఉండేందుకు వీలుగా ఇ-సిమ్‌తో పాటు ఇతర హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను జియో అందివ్వనుంది. దీంతో ఈ కారులో మారుమూల ప్రాంతాల్లో ప్రయాణించేప్పుడు కూడా 4G ఇంటర్నెట్ను పొందవచ్చు. ఏమూలనైనా కొత్తగా వస్తున్న కార్లలో ఇన్ఫోంటైన్మెంట్ విభాగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జీపీఎస్ నావిగేషన్‌తో పాటు ఆడియో, వీడియోలకు సంబంధించి లేటెస్ట్ ఫీచర్లు యాడ్ చేస్తున్నారు. అయితే ఇంటర్నెట్ లేకపోతే ఇందులో సగానికి పైగా ఫీచర్లు నిరుపయోగమే,. దీంతో కారులో ప్రయాణించే వారు పల్లె పట్నం తేడా లేకుండా ఏ మూలకు వెళ్లినా నెట్ కనెక్టివిటీ లభిస్తుంది. టెక్నాలజీలో నంబర్ 1 జియోతో చేసుకున్న తాజా ఒప్పందం వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టెక్నాలజీకి సంబంధించి తమ బ్రాండ్ నంబర్‌వన్‌గా నిలుస్తుందని ఎంజీ మోటార్స్ ప్రెసిడెంట్స్, ఎండీ రాజీవ్ చాబా అన్నారు. కనెక్టివీటీ, ఇన్ఫోంటైన్మెంట్, స్ట్రీమింగ్, టెలిమాటిక్స్ విషయంలో ఇప్పటి వరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న అవరోధాలు తీరిపోతాయని జియో ప్రెసిడెంట్ కిరణ్ థామస్ అన్నారు. -
సాంకేతిక సమస్యతో మూతపడ్డ బీఎస్ఈ సెన్సెక్స్
బీఎస్ఈ ఆగిపోయింది. వరుసగా రెండో రోజు కూడా సాంకేతిక సమస్య కారణంగా దాని ఇండెక్సులన్నీ నిలిచిపోయాయి. బుధవారం ఉదయం కొద్దిసేపు కనెక్టివిటీ సమస్య కారణంగా నిలిచిపోయి, మళ్లీ మొదలైంది. అయితే, గురువారం ఉదయం సెన్సెక్స్ 26 వేలకు సమీపంలో ఉండగా మళ్లీ కనెక్టివిటీ సమస్య తలెత్తడంతో స్టాక్ మార్కెట్లను మూసేయాలని బీఎస్ఈ నిర్ణయించింది. షేరు ధరలు, ఇండెక్సులు అన్నీ ఆగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు హెచ్‌సీఎల్ బృందం కృషి చేస్తోందని.. సమస్య పరిష్కారం అయితే మళ్లీ మార్కెట్లు తెరుచుకుంటాయని బీఎస్ఈ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంట్రాడే ట్రేడర్లకు ఇది కాస్త చేదువార్తే అవుతుంది. బీఎస్ఈలో షేర్లను అమ్మడం, కొనడం చేసే ఇంట్రా డే ట్రేడర్లు ఇలా ట్రేడింగ్ ఆగిపోయినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. అయితే.. ఇప్పటికే డెలివరీగా స్టాకులు ఉన్నవాళ్లు మాత్రం వాటిని ఎన్ఎస్ఈ లేదా ఎంసీఎక్స్-ఎస్ఎక్స్లో అమ్ముకోవచ్చు. కేవలం పావుగంట పాటు ట్రేడింగ్ జరిగిన తర్వాత సెన్సెక్స్ ఆగిపోయింది. ఉదయం 9.53 గంటల సమయంలో మార్కెట్లు మూతపడ్డాయి.