contract works
-
రూ.50 లక్షలకు టీడీపీ నేత టోకరా
బొమ్మలసత్రం (నంద్యాల): తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పనులు చేద్దామని చెప్పి ఓ డీఎస్పీ కుమారుడ్ని నిండా ముంచేసిన ఘటనలో మైదుకూరు టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి మల్లిఖార్జునయాదవ్‌పై చీటింగ్ కేసు నమోదయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్‌యాదవ్ సన్నిహితుడు, కాంట్రాక్టర్ మల్లిఖార్జునయాదవ్ హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి, కొల్లాపూర్ మధ్య కేతిపల్లి గ్రామంలో వంతెన నిర్మాణ పనులకు కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో నంద్యాలలో నివశిస్తున్న కర్నూలు, నంద్యాల జిల్లాల ఇంటెలిజెన్స్ విభాగం ఇన్ఛార్జ్ డీఎస్పీ యుగంధర్ కుమారుడు చిరంజీవిని భాగస్తుడిగా చేసుకుని కాంట్రాక్ట్ పనులు పూర్తి చేశారు. మల్లిఖార్జునయాదవ్ తప్పుడు లెక్కలు చూపిస్తున్నాడనే అనుమానంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో చిరంజీవికి రూ.80 లక్షలు చెల్లించేలా మల్లిఖార్జునయాదవ్ ఒప్పందం చేసుకున్నాడు. అయితే రూ.30 లక్షలు చెల్లించి.. మిగతా రూ.50 లక్షలు చెల్లించకుండా మొండికేశాడు.దీంతో చిరంజీవి నంద్యాల తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మల్లిఖార్జునయాదవ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ దస్తగిరిబాబు తెలిపారు. -
నాడు కక్కుర్తి.. నేడు హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ పాలి‘ట్రిక్స్’
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య.. ఆ పార్టీ అధినేత దగ్గర నుంచి పార్టీ నాయకుల వరకూ ఒకటే తీరు. నాడేమో కాసుల కోసం కక్కుర్తి పడి..కావల్సిన వారికి కాంట్రాక్ట్ అప్పజెప్పి..పనులు వేగంగా జరుగుతున్నాయని ఆర్భాటంగా ప్రచారాలు చేసుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా వారి తీరు మారలేదు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. తాజాగా కొత్తపట్నం వంతెనపై క్షుద్ర రాజకీయానికి తెరతీశారు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్..బకింగ్‌హామ్ కెనాల్ సాక్షిగా ఆయన చేస్తున్న డ్రామా పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షి, ఒంగోలు: ఒంగోలు నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతలకు కడుపుమంట పుడుతోంది. అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. నాడు కమీషన్లకు కక్కుర్తిపడి సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి బకింగ్ హాం కెనాల్ బ్రిడ్జి కాంట్రాక్టు పనులు అప్పగించారు.. పనులు వేగంగా జరుగుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు... ఇతని రాజకీయ డ్రామాలు తెలుసుకున్న ప్రజలు 2019లో జరిగిన ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టారు.. దీంతో నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులను అడుగడుగునా అడ్డుకునే కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ప్రజలపై ఉన్న కోపమో, బాలినేనిపై అక్కసో తెలియదు గానీ పేదల ఇళ్లు దగ్గర నుంచి ఎన్నో పనులకు అడ్డుపడుతూనే ఉన్నారు. కరోనా కారణంగా సుమారు రెండేళ్లపాటు ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో జనార్దన్ హైదరాబాద్‌కు, బెంగళూరుకు పరిమితమయ్యారు తప్ప, వారి ఇబ్బందిని పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే సమయంలో ఎమ్మెల్యే బాలినేని మాత్రం నిత్యం ప్రజలతో ఉంటూ జీజీహెచ్‌లో వంద పడకలు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఆక్సిజన్, మందులు, భోజనం ఉచితంగా అందించడమే కాక, నగర ప్రజలందరికీ నిత్యవసర వస్తువులు అందిస్తూ వారితో మమేకమయ్యారు. దీన్ని జీర్ణించుకోలేక దామచర్ల జనార్దన్ అండ్ కో బాలినేనిపై ఎన్నో కుట్రలు, కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా నేడు ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులోని బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి వద్ద ధర్నా అంటూ మరో రాజకీయ డ్రామాకు తెరతీశారు. అసలు బ్రిడ్జి నిర్మాణం విషయానికొస్తే జనార్దన్ జేబులు నింపుకోవడానికే దీన్ని ఉపయోగించుకున్నారు తప్ప, ఏనాడు చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు లేవని కొత్తపట్నంతోపాటు, ఒంగోలు నియోజకవర్గ ప్రజలు మండి పడుతున్న పరిస్థితి. బ్రిడ్జి పనులు చేస్తున్నది తాను అప్పగించి.. తమ సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్ అయినప్పటికీ బాలినేనిపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ విఫలమయ్యారు. తాజాగా మరోసారి బ్రిడ్జి వద్ద ధర్నా అంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్ ప్రస్తుతం సైతం పనులు చేస్తున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టర్ వద్ద కమీషన్లకు దామచర్ల జనార్దన్ కక్కుర్తి పడ్డా..బాలినేని మాత్రం బ్రిడ్జి వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతూ వచ్చారు తప్ప, కాంట్రాక్టర్‌ను ఎక్కడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అయితే రాజకీయ కుట్రలో భాగంగా పనులు నత్తనడకన జరుగుతున్నాయని గ్రహించిన బాలినేని పనులు వేగవంతం చేయాలని, లేదంటే చర్యలు తప్పవంటూ కాంట్రాక్టర్‌ను హెచ్చరించడంతో అప్పటి నుంచి పనుల్లో వేగం పెరిగింది. దీన్ని గమనించిన జనార్దన్ త్వరలో పనులు పూర్తవుతాయని తెలుసుకుని రాజకీయ డ్రామాకు తెరతీశారు. బ్రిడ్జి వద్ద ఆందోళన చేపట్టి తన ఆందోళన కారణంగానే పనులు వేగవంతంగా జరుగుతున్నాయనే కలరింగ్ ఇచ్చుకునే కుయుక్తులకు పథక రచన చేస్తున్నారు. చదవండి: (పరిశ్రమలకు స్వర్గధామం ఆ జిల్లా.. మూడేళ్లలోనే రూ.300 కోట్లతో 990 పరిశ్రమలు) కరోనా కారణంగా సుమారు రెండేళ్లపాటు సక్రమంగా పనులు జరగలేదని తెలిసినా బ్రిడ్జిని రాజకీయంగా తన రాజకీయ డ్రామాకు వాడుకునే ప్రయత్నం చేస్తుండటంపై ప్రజలు సైతం ఛీ కొడుతున్నారు. సొంత పార్టీలో ఉన్న అసమ్మతిని పోగొట్టుకునేందుకు ఏవో ఉద్యమాలు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆపార్టీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తుండటం గమనార్హం. బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేసి ఈనెల 20వ తేదీన ట్రయల్‌రన్ నిర్వహించేందుకు ఆర్అండ్బీ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈనెల 20 తరువాత వాహనాల రాకపోకలను బ్రిడ్జిపై అనుమతించి చిన్న చిన్న పనులు మిగిలి ఉంటే వాటిని అతి త్వరలోనే పూర్తి చేస్తామంటూ అధికారులు చెబుతుండటం విశేషం. బ్రిడ్జి పనులు పూర్తయ్యే సమయంలో జనార్దన్ చేస్తున్న రాజకీయ డ్రామాలు ప్రజలందరికీ తెలుసని, చీప్ పాలిటిక్స్ చేస్తూ జనార్దన్ ప్రజల్లో మరింత చులకనవుతారని గుర్తించాలని పలువురు హెచ్చరిస్తున్నారు. కరోనాతో ఒంగోలు నియోజకవర్గ ప్రజలు అల్లాడుతున్నా వారి ప్రాణాలు పోతున్నా కనీసం స్పందించని జనార్దన్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నట్లు చూపించే కుయుక్తులకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి ఆటంకాలు కలిగించకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలని ప్రజలు హితవు పలుకుతున్నారు. కమీషన్లు దండుకొని రాజకీయ డ్రామాలా.. ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులోని బకింగ్‌హాం కెనాల్‌పై వంతెన నిర్మాణం విషయంలో కాంట్రాక్టర్ వద్ద మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు దామచర్ల జనార్దన్ కమీషన్లు దండుకొని రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారు. 2016లో మంజూరైన బ్రిడ్జి పనులు టీడీపీ ప్రభుత్వంలో మూడున్నర సంవత్సరాలపాటు కమీషన్ల కోసం కాలయాపన చేస్తూ నిర్మాణ పనులను నిర్వీర్యం చేశాడు. కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన నిధులతో ప్రారంభమైన పనులు, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమును రద్దు చేసిన సంగతి తెలిసి కూడా జనార్దన్ ప్రజలను మభ్యపెట్టే పనులు చేపట్టడం ఏదో సానుభూతి పొందాలని తప్ప ప్రజలకు మేలు చేద్దామని కాదు. నిర్మాణ పనులు పూర్తవుతున్న బ్రిడ్జి వద్దకు వెళ్లి ఏదో నిరసన వ్యక్తం చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. ఆయన హడావుడి చేసినందు వల్ల పనులు వేగంగా జరిగాయని బిల్డప్ ఇచ్చుకోవాలని చూస్తున్నాడు. అయితే నియోజకవర్గ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ట్రయల్ రన్ పూర్తి చేసి అనంతరం బ్రిడ్జిపై నుంచే వాహనాల రాకపోకలు కొనసాగిస్తాం. – బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే, ఒంగోలు -
కాంట్రాక్టుల కోసం రూ.కోటి లంచం
న్యూఢిల్లీ: కాంట్రాక్టులు కట్టబెట్టే విషయంలో ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించి, కోటి రూపాయలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేస్‌కు చెందిన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(కన్స్ట్రక్షన్) మహేందర్ సింగ్ చౌహాన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అరెస్టు చేసింది. ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్(ఐఆర్ఎస్ఈ) 1985 బ్యాచ్‌కు చెందిన చౌహాన్‌ను అస్సాం రాజధాని గువాహటిలో అదుపులోకి తీసుకున్నారు. అలాగే లంచం చేరవేసిన ఏబీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగి భూపేంద్ర రావత్, మరో వ్యక్తి ఇంద్రాసింగ్ను అరెస్టు చేశారు. దీంతో సంబంధం ఉన్న రైల్వే అధికారులు హేమ్‌చంద్ బోరా, లక్ష్మీకాంత్ వర్మ, ఏబీసీఐ సంస్థ డైరెక్టర్ పవన్ బైద్పై కేసు నమోదు చేశారు. ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేస్ పరిధిలో పలు ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు చౌహాన్ ఏబీసీఐ సంస్థకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఆయన ఆ సంస్థ నుంచి లంచం కింద రూ. కోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 60 లక్షలను సీబీఐ రికవరీ చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, ఉత్తరాఖండ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, అస్సాంలో పలుచోట్ల దాడులు చేసి, రూ.54 లక్షలు స్వాధీనం చేసుకుంది. -
కోడెల శివరామ్.. ఆంధ్రా నయీమ్
పట్నంబజారు (గుంటూరు): కోడెల శివరామ్ తన నుంచి ‘కే ట్యాక్స్’ వసూలు చేశాడంటూ మంగళవారం మరో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇది వరకే ఫిర్యాదు చేసిన ఇంకో బాధితుడు తన డబ్బు ఇప్పించాలంటూ గుంటూరులోని కోడెల శివరామ్‌కు చెందిన షోరూం ఎదుట ఆందోళనకు దిగాడు. తనకు చెల్లించాల్సిన రూ.11 లక్షలు ఇస్తే.. తప్ప తాను ఇక్కడ నుండి కదలబోనని.. డబ్బులు ఇవ్వకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. కోడెల శివరామ్‌ను చూసినప్పుడల్లా ఆంధ్ర నయీమ్లాగే అనిపించేదని అతను వాపోయాడు. బాధితుడి కథనం మేరకు.. సత్తెనపల్లికి చెందిన యేల్లినేడి శ్రీనివాసరావు కాంట్రాక్ట్ పనులు చేయటంతో పాటు, భోజనాల క్యాటరింగ్ చేస్తుంటారు. 2017లో నరసరావుపేటలో జరిగిన ఖేలో ఇండియా కబడ్డీ పోటీలకు సంబంధించి 2 వేల మందికి భోజనాలు సరఫరా చేసేందుకు రూ.24 లక్షల కాంట్రాక్ట్ శ్రీనివాసరావు తీసుకున్నారు. దానికి సంబంధించి తొలుత ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షలు ఇచ్చి, మిగతా మొత్తం కబడ్డీ పోటీలు ముగిశాక ఇస్తామని కోడెల శివరామ్ చెప్పారు. పనులు ముగిసిన తరువాత రూ.10 లక్షల చెక్కు వచ్చిందని, రూ.5 లక్షలు కట్టి తీసుకెళ్లాలని శివరామ్ హుకుం జారీ చేయటంతో చేసేది లేక రూ.5 లక్షలు చెల్లించారు. అనంతరం వచ్చిన రూ.5 లక్షల చెక్కులో రూ.3 లక్షలు, మరోసారి వచ్చిన రూ.4 లక్షల చెక్కులో రూ.2 లక్షలు తీసుకున్నారు. తనకు జరిగిన అన్యాయం శ్రీనివాసరావు తన ఆత్మీయులకు చెప్పుకున్నారు. దీంతో కోడెల శివరామ్ తన గురించి మాట్లాడతావా.. అంటూ రూ.లక్ష పెనాల్టీ వసూలు చేశాడు. దీనిపై బాధితుడు శ్రీనివాసరావు కొద్ది రోజుల క్రితం అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. కోడెల శివరామ్ అనుచరులు, డబ్బులు జూలై 1వ తేదీ కల్లా ఇస్తామని, కేసు పెట్టవద్దని శ్రీనివాసరావుకు చెప్పారు. తర్వాత ఫోన్లు అన్ని స్విచ్చాఫ్ చేసుకోవటంతో శ్రీనివాసరావు ఆందోళన చేపట్టారు. నగరంపాలెం ఎస్‌హెచ్‌వో కె.వెంకటరెడ్డి, ఎస్ఐ పి.భాగ్యరాజులు శ్రీనివాసరావును స్టేషన్‌కు పిలిచి వివరాలు తెలుసుకున్నారు. డబ్బులు ఇప్పించకపోతే ఆత్మహత్యే శరణ్యం కోడెల శివరామ్ తన నుంచి వసూలు చేసిన డబ్బులు ఇప్పించకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన యార్లగడ్డ వెంకటపద్మారావు నగరంపాలెం స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశాడు. వెంకటపద్మారావుకు 2015లో మద్యం షాపు రాగా మురళీకృష్ణ వైన్స్ పేరుతో నరసరావుపేటలో ప్రారంభించారు. అదే ఏడాది ఆగస్టు 2న కోడెల శివరామ్ ఆయనకు ఫోన్‌చేసి గుంటూరు చుట్టుగుంట వద్ద ఉన్న గౌతమ్ హీరో షోరూమ్‌కు రావాలని చెప్పారు. రూ.20 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. వెంకటపద్మారావు నాలుగు రోజుల వ్యవధిలో రూ.20 లక్షలు తీసుకెళ్ళి కోడెల శివరామ్‌కు ఇచ్చారు. తర్వాత 2017లో సత్తెనపల్లిలో కల్యాణి వైన్స్ పద్మారావుకు వచ్చింది. తిరిగి కోడెల శివరామ్ ఫోన్ చేసి మరో రూ.20 లక్షలు డిమాండ్ చేసి తీసుకున్నాడు. దీంతో తాజాగా వెంకట పద్మారావు నగరంపాలెం ఎస్హెచ్ఓ కె.వెంకటరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశాడు. -
చెరువుపై చెరో కన్ను..!
సాక్షి, కావలి (నెల్లూరు): అధికార పార్టీ నాయకుల హోదాలో కావలి టీడీపీ నాయకులైన బీద సోదరులు ప్రభుత్వ నిధులను లూటీ చేయడాన్ని అడ్డూ అదుపు లేకుండా ఐదేళ్లపాటు నిర్విఘ్నంగా కొనసాగించారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని మండల కేంద్రమైన అల్లూరు చెరువును అడ్డాగా చేసుకొని నిధుల దోపిడీకి రంగం సిద్ధం చేశారు. అయితే ఇరిగేషన్‌శాఖ అధికారులు బీద సోదరుల అడ్డమైన దోడిడీకి సహకరించి తాము ఎందుకు బలైపోవాలని ఆత్మపరిశీలన చేసుకున్నారు. రూ.3 కోట్లకు సరిపడే బిల్లులును అల్లూరు చెరువు, పంట కాలువలు మరమ్మతుల పేరుతో చెల్లింపులు చేయాలని బీద సోదరులు చేస్తున్న వత్తిళ్లకు అధికారులు లొంగలేదు. చెరువును అడ్డం పెట్టుకుని.. అల్లూరు చెరువు నుంచి 25 వేల ఎకరాలకు పైచిలుకు సాగునీరు అందుతుంది. అలాగే అల్లూరులోని 30 వేల జనాభాకు తాగునీరు అందించే వసతి ఉంది. అలాగే ఈ చెరువు నుంచి మరో మూడు చెరువులకు నీరు చేరుతోంది. ఇలా అల్లూరు చెరువుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. సరిగ్గా ఈ అంశాన్ని టీడీపీ నాయకులు అడ్డం పెట్టుకొని చెరువు కట్టను, పంట కాలువ మరమ్మతులను, సిమెంట్ కాంక్రీట్‌తో లైనింగ్ పనులు ఇలా తమకు తోచిన పనులు అర్జెంట్‌గా చేయాల్సి ఉందని అధికారులతో ప్రతిపాదనలు తయారు చేయించారు. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి అత్యవసరంగా రూ.3 కోట్లు నిధులు మంజూరు చేయాలని సదరు నివేదికలో అధికారులు పొందుపరిచేలా చేశారు. ఆ ప్రతిపాదనలకు సంబంధించిన ఫైలును అల్లూరు నుంచి జిల్లా కేంద్రమైన నెల్లూరు, అక్కడ్నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి చేరేలా పరుగులు తీయించారు. ఎట్టకేలకు ప్రభుత్వం రూ.3 కోట్లు నిధులు మంజూరు చేసింది. దీంతో టీడీపీ నాయకులైన బీద సోదరులు బినామీలుగా అవతరించి ఈ కాంట్రాక్ట్ పనులను సొంతం చేసుకొన్నారు. అధికారులపై గుర్రుగా బీద సోదరులు కాలువలు కాంక్రీట్ లైనింగ్ పనులు, చెరువు కట్ట బండ బలోపేతం చేసే పనులు, కలుజు మరమ్మత్తులు తదితర పనులు చేయాలని సోమశిల జలాలను సైతం చెరువు రాకుండా అడ్డుకొన్నారు. రైతులు తమ పొలాలకు నీరు ఇవ్వకపోతే పంటలు ఎలా పండించుకోవాలని అల్లూరు రైతులు నెత్తినోరు బాదుకున్నా బీద సోదరులు లెక్క చేయలేదు. అదేమంటే చెరువు, కలుజు, కాలువలు మరమ్మతు పనులు చేస్తున్నారు, సాగుకు నీరు వదిలితే పనులు ఆగిపోతాయని రైతులపైనే బీద సోదరులు గుడ్లురిమారు. క్రమంలో అల్లూరు చెరువు, పంట కాలువలు మెరుగుపడుతాయని రైతులు, అల్లూరు ప్రజలు ఆశించారు. అయితే బీద సోదరులు మొక్కుబడిగా ఈ పనులు చేసి రూ.3 కోట్లకు బిల్లులు చేసి, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను తమ బ్యాంక్ ఖాతాలో జమచేయాలని ఇరిగేషన్ అధికారులను వేపుకుతిన్నారు. అయితే ఇరిగేషన్ అధికారులు బీద సోదరుల దోపిడీ దూకుడును గమనించి భీతిల్లిపోయారు. కనీసం కంటికి కనిపించే పనులు కూడా చేయకుండా రూ.3 కోట్ల నిధులను టీడీపీ నాయకులకు అప్పనంగా అప్పగిస్తే, అనంతరం వచ్చే సమస్యలకు తాము బలైపోవాల్సి వస్తుందని అధికారులు భావించారు. దీంతో బిల్లులు చేయకుండా పక్కన పెట్టేశారు. బీద సోదరులు మాత్రం తమ బిల్లులు చేయకుండా ఉంటారా.. అంటూ ఇరిగేషన్ అధికారులపై కత్తులు నూరుతున్నారు. -
నెల్లూరులో నెక్లెస్ రోడ్డు నిర్మాణం పేరుతో భారీ అవినీతి
-
మట్టి పనికే తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు పనులపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను ఉపసంహరించుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలను కేంద్రం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టే కాంట్రాక్టు పనులకు 12 శాతం జీఎస్టీ ఉంటుందని... అయితే మట్టిపనులకు మాత్రం 5 శాతం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ నెల ఆరో తేదీన ఢిల్లీలో జరిగిన 22వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించింది. భారం తగ్గనట్టే..! తొలుత జీఎస్టీ చట్ట ప్రకారం కాంట్రాక్టు పనులపై 18 శాతం జీఎస్టీని విధించారు. అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గుదిబండగా మారుతుందని.. ఇప్పటికే జరుగుతున్న మిషన్ కాకతీయ, భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు లాంటి కార్యక్రమాలపై రూ.36 వేల కోట్లకు పైగా భారం పడుతుందని ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. జీఎస్టీని తగ్గించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగా.. కేంద్రం 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది. కానీ ఆ తగ్గింపు వల్ల ఉపశమనం నామమాత్రమేనని అధికారులు అంచనా వేయడంతో.. 5 శాతానికి తగ్గించాలని రాష్ట్రం డిమాండ్ చేసింది. అసలు ప్రజోపయోగ కాంట్రాక్టు పనులపై జీఎస్టీని రద్దు చేయాలని కోరింది. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 9న జరిగిన 21వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే వాదన వినిపించింది. కేంద్రం ఈ వాదనలను పట్టించుకోలేదు. ఆ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. జీఎస్టీని తగ్గించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన సరికాదని, దీంతో కాంట్రాక్టు సంస్థలకే తప్ప రాష్ట్రానికి ఏమీ ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. అయితే మరోసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అనంతరం ఈ నెల 6న ఢిల్లీలో జరిగిన 22వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. మట్టిపనుల విలువ 75 శాతం కన్నా ఎక్కువగా ఉండే కాంట్రాక్టు పనులకు మాత్రమే జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. స్థానిక సంస్థలకూ అవకాశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇరు ప్రభుత్వాల సంస్థలతో పాటు స్థానిక సంస్థలు చేపట్టే మట్టిపనుల కాంట్రాక్టులకు ఈ తగ్గింపు వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులను జీఎస్టీ కౌన్సిల్ వెబ్సైట్లో ఉంచింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఉపశమనం కలిగే అవకాశం లేదని పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మిషన్ కాకతీయ లాంటి మట్టిపనులకు కొంతమేర వెసులుబాటు ఉంటుందని... మిగిలిన కార్యక్రమాలకు ప్రయోజనమేమీ చేకూరదని అంటున్నాయి. ఇక కాంట్రాక్టు పనులపై 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు కేవలం ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు చేపట్టే ప్రాజెక్టులకే వర్తిస్తాయని తెలిపింది. ఈ క్రమంలో వచ్చే నెల 10న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రం ఎలాంటి వాదనలు వినిపిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. -
నా కూతుర్ని బాగా చూస్కో అన్నా..
బుక్కరాయసముద్రం : అన్నా నా కూతురుని బాగా చూస్కో... నాకున్న ఇళ్లు ప్లాటు అమ్మి అయినా సరే కూతురికి ఉద్యోగం తెప్పించాలి... అని ఓ వ్యక్తి లెటర్ రాసి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అనంతపురం పాతూరులోని ఉమానగర్‌కు చెందిన బండి ఓబిలేసు (51 ) చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉండేవాడు. ఇతనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ కారణాలతో ఓబిలేసు గత 4 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులకు పురుగు మందు తాగి చనిపోతాను అంటూ బుధవారం ఫోన్ చేశారు. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకపోవడంతో బంధువులు వెతికారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా దయ్యాలకుంటపల్లి సమీపంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏఎస్ఐ జనార్ధన్ ఆద్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టాగా.. శుక్రవారం దయ్యాలకుంటపల్లి కొండ సమీపంలో శవం ఉన్నట్లు గుర్తించారు. కూల్ డ్రింక్‌లో పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మృత దేహాన్ని పోస్ట్‌మార్ట్ కోసం తరలించారు. మృతుడు ఒక లెటర్లో నా కూతురిని బాగా చూస్కో అన్నా... నా కూతరు ఉద్యోగానికి నా ఇంటి ప్లాటును అమ్మి అయినా సరే ఉద్యోగం ఇప్పించాలని రాసి ఉంచినట్లు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కోటరీ నేత దందా !
కాంగ్రెస్ ఓటమి పాలవడంతో..రాజ్యాంగేతర శక్తిగా పెత్తనం చెలాయించిన షాడో నేత బాధ వదిలిందని భావించిన అధికారులకు ఇప్పుడు ఓ ‘చంటి’ నేత దాపురించాడు. ముఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులను అయినదానికి, కానిదానికీ పీడిస్తూ నానా యాగీచేస్తున్నా డు. నోటికి వచ్చినట్టు ఆదేశాలు జారీ చేస్తూ... రాజు గారి మనిషిగా దందా చేస్తున్నాడు. చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసి, అధిక మొత్తంలో బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఉద్యోగుల బదిలీల విషయంలో తలదూర్చి తనకు నచ్చిన వారిని తీసుకొచ్చేందుకు అధికారులపై ఒత్తిళ్లకు దిగుతున్నాడు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆయనొక రాజకీయ కాంట్రాక్టర్. ఏ ఎండకాగొడుగు పట్టేస్తారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పర్వాలేదు. ఎంచక్కా కాంట్రాక్ట్‌లు దక్కించుకుంటారు. స్వతహాగా టీడీపీ నాయకుడైనప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలను మచ్చిక చేసుకుని, ముడుపులు ముట్టజెప్పి పనులు చేయించుకున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో అశోక్ బంగ్లా మనిషిగా చెప్పుకుని దందా ప్రారంభించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి చెలరేగిపోతున్నారు. ఇంజినీరింగ్ అధికారులపై అజమాయిషీ చెలాయిస్తున్నారు. చెప్పినట్టు నడుచుకోవాలని వారిని బెదిరిస్తున్నారు. కోరిన విధంగా బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. లే దంటే స్థానచలనం తప్పదని హెచ్చరిస్తున్నారు. జెడ్పీ పాలకులపైనా ఒత్తిళ్లు చేస్తున్నారు. ఫలానా ఇంజినీర్‌ను నియమించాలని సిఫారసు చేస్తున్నారు. ఈయ న గారి భాగోతాన్ని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వద్ద ఇటీవల ఒక టీడీపీ కౌన్సి లర్ ప్రస్తావించారు. ఆయన చేస్తున్న నిర్వాకాలను వివరించే ప్రయత్నం చేశారు. బంగ్లాలో ఆయనదే హడావుడి అశోక్ బంగ్లాను నిత్యం అంటిపెట్టుకుని ఉంటారు. కోటరీలో ఆయనొకరుగా చెలామణి అవుతున్నారు. టీడీపీ కార్యక్రమాలేం జరిగినా ఆయన హడావుడి అంతాఇంతా కాదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకెదురే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తన వృత్తికి సంబంధం గల ఇంజినీరింగ్ శాఖలపై పెత్తన ం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ పనులొచ్చినా తనకు తెలియాలని, తన కన్నుసన్నల్లో కాంట్రాక్ట్‌లు ఖరారు చేయాలని, పనుల పర్యవేక్షణలో చెప్పినట్టుగా నడుచుకోవాలని, కోరిన విధంగా బిల్లులు చెల్లించాలని ఒత్తిళ్లు చేస్తున్నారు. లేదంటే ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నారు. బిల్లుల కోసం ఒత్తిళ్లు పూసపాటిరేగలో రూ. 5 లక్షల విలువైన మరమ్మతు పనులు చేసి రూ. 25 లక్షల బిల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం పట్టణ శివారులో వేసిన రోడ్డుకు ఉమ్మితడి మరమ్మతులు చేసి పెద్ద ఎత్తున బిల్లు గుంజుతున్నారు. భోగాపురంలోని రూ.5 కోట్ల వర్కు కోసం అక్కడి నేతలపైనా ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి ఆగడాలు అనేకం ఉన్నాయి. టీడీపీ నేతలం దరికీ ఈయన వ్యవహారం తెలిసినా రాజుగోరు మనిషి అని చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. ఇటీవల టీడీపీ కౌన్సిలర్ ఒకరు కాస్త జోక్యం చేసుకుని సదరు కాంట్రాక్ట్ గుట్టు అంతా అశోక్ వద్ద విప్పేందుకు ప్రయత్నించారు. తోటి కౌన్సిలర్లు, నాయకులు అడ్డు తగలకపోయి ఉంటే ఆయన యవ్వారమంతా బయటపడేది. జెడ్పీ పాలకులపైనా .... ప్రస్తుతం బదిలీల సీజన్ కావడంతో ఇంజినీరింగ్ శాఖలో హవా సాగాలని ప్రయత్నిస్తున్నారు. తనకు కావల్సిన ఇంజినీరింగ్ అధికారులను వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగ్లా మనిషిగా చెప్పుకుని జెడ్పీ పాలకులపై ఒత్తిళ్లకు దిగుతున్నారు. ఎవరెవర్ని ఎక్కడ వేయాలో, ఈఈలగా ఎవరి వేయాలో సిఫారసు చేస్తున్నారు. పెద్దాయన మాటగా చెప్పుకుని హల్చల్ చేస్తున్నారు. కాక పోతే ఈయన గారి వ్యవహారంతో జెడ్పీ పాలకులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇక్కడ ఆయన పెత్తనమేంటని అంతర్మధన ం చెందుతున్నారు. బయటికి చెప్పుకోలేక, లోపల దాచుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈయన గారి తీరుపై టీడీపీ నేతల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులంతా బంగ్లాలోని చెట్లు కిందే కాలం వెళ్లదీస్తున్నారని, ఆయన మాత్రం దర్జాగా అన్నీ అవకాశాలను పొందుతున్నారని ఆవేదన చెందుతున్నారు. -
అధికార జులుం
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో ప్రభుత్వం మాది.. మీఇష్టమొచ్చినట్లు కాంట్రాక్టు పనులు చేయిస్తామంటే ఒప్పుకునేది లేదు. మేము చెప్పినోళ్లకు కాంట్రాక్టు పనులు అప్పగించాలి.. వీరిది చిలంకూరే. వీరి నేతృత్వంలోనే ఇకపై కాంట్రాక్టుపనులు చేపట్టాలి. -ఐసీఎల్ యంత్రాంగంపై టీడీపీకి చెందిన ఓ ఎంపీ సోదరుడి హుకుం అసాంఘిక కార్యక్రమాలు ఇప్పుడే కన్పించాయా.. సరదాగా పేకాట ఆడుకుంటుంటే పట్టుకొస్తారా... వెంటనే వారిని వదిలేయండి. కేసు నమోదు చేశారా.. మళ్లీ పొద్దున్నే వస్తారులే.. అంతలోనే కేసు పెట్టకపోతే ఏమౌతుంది. ఇకపై మావాళ్లను పట్టుకొస్తే సహించేది లేదు. మీకు తెలియకుండా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వస్తారా.. - పేకాటరాయుళ్లును విడిపించే క్రమంలో రాజంపేట పోలీసులపై ఓ ప్రజాప్రతినిధి హూంకరింపు గల్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే పంధాను ప్రదర్శిస్తున్నారు. అధికారులపై పెత్తనం చలాయించేందుకు ముందు వెనుకా ఆలోచించడం లేదు. అసాంఘిక చర్యలైనా, ఆదాయవనరులైనా టీడీపీకి అండగా నిలవాల్సిందేనని అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నారు. పబ్లిక్ రంగ సంస్థలను సైతం శాసిస్తూ అధికార జులుం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టగానే అనుకూలురైన అధికారుల కోసం దేశం నేతలు అన్వేషణ చేపట్టారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ శశిధర్, ఎస్పీ అశోక్‌కుమార్ రాజకీయ బదిలీ పర్వాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఆ అంశాన్ని సాకుగా పెట్టుకుని కింది స్థాయి యంత్రాంగాన్ని ఇష్టానుసారంగా బెదిరిస్తున్నారు. రాజంపేటలో విచ్చలవిడిగా జూదం... డివిజన్ కేంద్రమైన రాజంపేటలో అసాంఘిక కార్యక్రమాలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కనుసన్నల్లో విచ్చలవిడిగా జూదం నిర్వహిస్తున్నారు. అక్కడి యంత్రాంగానికి తెలిసినప్పటికీ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోంది. మంగతై జూదంకు నిలయంగా ప్రస్తుతం రాజంపేట నిలుస్తోంది. ఈక్రమంలో గురువారం టీడీపీ నేత రామ్మోహన్నాయుడు సహా 24 మంది పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. వారి నుంచి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకోగా, రూ.3.5లక్షలు అధికారికంగా చూపారు. అయితే వారందరినీ రాత్రికిరాత్రే ఇంటికి పంపినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఒత్తిడి కారణంగా రెండు గంటల వ్యవధిలో ఇంటికి పంపి శుక్రవారం ఉదయం పోలీసుస్టేషన్‌కు రప్పించి, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. జూదరులను నియంత్రించకపోగా, అక్కడి పోలీసు యంత్రాంగం టీడీపీ నేతల కనుసైగలను పరిగణలోకి తీసుకోని పనులు చేసిపెడుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈక్రమంలో జూదరులకు రాచమర్యాదలు తగ్గకుండా చూసుకున్నట్లు సమాచారం.