రైల్వే, కార్మిక చట్టాలకు సవరణలు
లోక్సభలో బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం
న్యూఢిల్లీ: విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే కార్మిక చట్టాలను సవరించేందుకు ఉద్దేశించిన రెండు వివాదాస్పద బిల్లులను కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్సభలో ప్రవేశపెట్టింది. అదనపు పనివేళల(ఓవర్ టైమ్) పరిమితి పెంపు, నాన్-ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్రెంటిస్షిప్ శిక్షణ, రాత్రి షిఫ్టుల్లో మహిళలకున్న పలు సడలింపుల ఎత్తివేత తదితర అంశాలకు సంబంధించి ‘ద ఫ్యాక్టరీస్(సవరణ) బిల్లు, 2014’తోపాటు ‘అప్రెంటిసెస్ (సవరణ) బిల్లు, 2014’ను కేంద్ర కార్మిక మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సభలో ప్రవేశపెట్టారు.
వీటిని గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అయితే బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించే వరకూ ప్రవేశపెట్టొద్దని కాంగ్రెస్ ఎంపీలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై తర్వాత పూర్థి స్థాయిలో చర్చించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.