controversial land
-
వివాదాస్పద స్థలంలో భారీ ఆలయం!
న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో బాబ్రీమసీదు నిర్మాణం కన్నా ముందు ఒక భారీ హిందూ దేవాలయం విలసిల్లిందని రామ్‌లల్లా విరాజ్మాన్ తరఫు న్యాయవాది శుక్రవారం సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఆ దేవాలయం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినదన్నారు. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థల వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతీరోజు విచారిస్తుండటం తెల్సిందే. ప్రస్తుత వివాదాస్పద ప్రాంతాన్ని 1950లో పరిశీలించిన కోర్టు కమిషనర్ నివేదికను, పురాతత్వ శాఖ నిర్ధారించిన అంశాలను తన వాదనకు సమర్ధనగా రామ్‌లల్లా తరఫు లాయర్ వైద్యనాథన్ కోర్టుకు చూపించారు. మండపంతో కూడిన పెద్ద దేవాలయం ఉందని పురాతత్వ శాఖ నిర్ధారించిందన్నారు. అది రామాలయమే అనేందుకు స్పష్టమైన సాక్ష్యాలేవీ లేవన్నారు. శివుడితో సహా పలువురి దేవుళ్ల చిత్రాలు అక్కడి గరుడ స్తంభాలపై చెక్కి ఉన్నాయని, అలాంటివి మసీదులపై ఉండవని ఆయన వాదించారు. ‘బాబ్రీమసీదు నిర్మాణానికి ముందు అక్కడ నిర్మాణం ఉందనే విషయం మాకు ముఖ్యం కాదు.. అది దేవాలయమా? కాదా? అన్నదే ముఖ్యం’ అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘అక్కడ ఒక సమాధి కూడా ఉంది కదా! దానిపై ఏమంటారు?’ అని వైద్యనాథన్‌ను ప్రశ్నించింది. దాంతో, ‘ఆ సమాధి దేవాలయ అనంతర కాలానికి సంబంధించినద’ని ఆయన సమాధానమిచ్చారు. తవ్వకాల్లో పై భాగంలో సమాధి ఆనవాళ్లు ఉన్నాయని, అవి తవ్వకాల్లోని లోతైన భాగాల్లో లేవని వివరించారు. -
వివాదాస్పద స్థలం పరిశీలన
సాక్షి, కావలి: నెల రోజులుగా కావలి పట్టణంలో గుడిసెలు కూల్చివేత వివాదాన్ని పరీశీలించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె.రాములు, జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచార్య తల్లోజు శుక్రవారం కావలి పట్టణానికి వచ్చి, స్థానిక బాలకృష్ణారెడ్డినగర్ పక్కన ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. అప్పటికే అక్కడ ఉన్న మూడు వర్గాల వాదనలను రెండు జాతీయ కమిషన్ సభ్యులు ఉమ్మడిగా విన్నారు. బీజేపీ నాయకురాలు పత్తిపాటి వరలక్ష్మి ఇచ్చిన స్థలాల్లో గుడిసెలు నిర్మించుకుంటే వాటిని కూల్చేశారని ఒక వర్గానికి చెందిన బాధితులు కమిషన్ సభ్యులకు తెలిపారు. రెండో వర్గం బాధితులు మాట్లాడుతూ బీజేపీ నాయకురాలు పత్తిపాటి వరలక్ష్మి తమ వద్ద వేలాది రూపాయాలు తీసుకుని, ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలాలకు నకిలీ పట్టాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆమెవల్ల నిండా మునిగి పోయామని కన్నీటిపర్యంతమయ్యారు. మూడో వర్గానికి చెందిన స్థలం యజమానులు తాము పైసా పైసా కూడబెట్టి పిల్లల భవిష్యత్‌కు అండగా ఉంటుందని ఆశతో ప్లాట్లను కొనుగోలు చేశామని కమిషన్ సభ్యులకు చెప్పారు. ముగ్గురి వాదనలను ఆలకించిన జాతీయ కమిషన్ సభ్యులు ప్రైవేట్ వ్యక్తుల స్థలాల్లో ఇళ్లు నిర్మిస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పట్లోనే అధికారులు సీరియస్‌గా చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి ఇంత వరకు వచ్చిందన్నారు. ఇళ్లు కూల్చేయడంతో నిరాశ్రయులైన పేదలకు మూడు నెలలకు సరిపడే నిత్యాసరవర సరుకులు వెంటనే అందజేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఇళ్లు కూల్చేయడంతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని చెప్పారు. పేదల కోసం ప్రభుత్వ భూమిని గుర్తించి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. అలాగే ఆ స్థలాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం పక్కా గృహాలు మంజూరు చేయాలన్నారు. ఇంటి స్థలాలు ఇచ్చే వరకు పేదలకు తాత్కాలికంగా నీడ కల్పించాలన్నారు. పేదలకు నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తుల చేతిలో మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేస్తే వారిపై పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలని కావలి డీఎస్పీని ఆదేశించారు. కార్యక్రమంలో కావలి సబ్ కలెక్టర్ చామకూరి శ్రీధర్, బీజేపీ నాయకులు కందుకూరి వెంకట సత్యనారాయణ, ఆర్.డేవిడ్ విల్సన్, జి.భరత్‌కుమార్, సి.వి.సి.సి.సత్యం, మాల్యాద్రి పాల్గొన్నారు. -
ఔను! ఆ ఆస్తులు మావే.. అంగీకరించిన లాలూ
పట్నా: బినామీల పేరిట ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం భారీగా ఆస్తులు పోగేసుకుంటున్నదంటూ బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ చేసిన ఆరోపణలపై తాజాగా లాలూ స్పందించారు. బిహార్‌లోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌ను నిర్మిస్తున్న పట్నాలోని రెండు ఎకరాల భూమి తమ కుటుంబానిదేనని లాలూ అంగీకరించారు. అంతేకాకుండా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్లో కూడా తమకు 50శాతం వాటా ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. ‘మాల్ నిర్మాణంలో ఉన్న భూమి లారా ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీకి చెందినది. ఈ కంపెనీలో రబ్రీదేవికి, తేజ్ ప్రతాప్‌కు, తేజస్వికి వాటాదారులు. మేమే మా భూమిని మెరిడియన్ కన్‌స్ట్రక్చన్ కంపెనీకి మాల్ నిర్మాణానికి ఇచ్చాం. మా కుటుంబానికి కొంత భూమి ఉన్నప్పుడు దానిని వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకోకూడదా? ఏం ’ అంటూ ఆయన ప్రశ్నించారు. నిర్మాణంలో ఉన్న మాల్లో 50శాతం వాటా తమదని, మిగతా 50శాతం బిల్డర్దని చెప్పుకొచ్చారు. 2005లో లాలూ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు రైల్వేశాఖకు చెందిన రెండు హోటళ్లను హర్ష్ కొచర్ అనే వ్యాపారవేత్తకు ఇచ్చారని, అందుకు ప్రతిఫలంగానే పట్నాలోని ఈ ఖరీదైన భూమిని ఆయనకు ముట్టజెప్పారని బీజేపీ ఆరోపించగా.. ఆ ఆరోపణల్ని లాలూ తోసిపుచ్చారు.