Cool Atmosphere
-
న్యూఢిల్లీ: 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి..
న్యూఢిల్లీ: రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో మార్పులు కారణంగా దేశరాజధానిలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఢిల్లీ నగరం కాస్త చల్లబడడంతో మే నెలలో ఏకంగా ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో గత 70 ఏళ్లలో మే నెలలో ఇంత స్వల్ప స్థాయికి చేరడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల కాలంలో కాలుష్యం కారణంగా నగరాల్లో ఉష్ణోగ్రతలు ప్రతీ ఏటా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు 1951లో నమోదైన 23.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలే అత్యల్పంగా ఉండేది. కానీ ప్రసుత టౌటే తుపాను ప్రభావం వర్షాలు కురవడం వాతావరణం చల్లబడడంతో దేశరాజధానిలో 70 ఏళ్ల రికార్డు చెరిగిపోయిందని ఐఎండీ ప్రాంతీయ అంచనా కేంద్రం అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ అన్నారు. ఈ మధ్యలో 1982 మే 13 న 24.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట స్థాయి నమోదైందని ఆయన చెప్పారు. కానీ ప్రస్తుత నమోదైన ఉష్ణోగ్రత 1951 కంటే అత్యల్పమని ఆయన అన్నారు. 35 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షాలు ఢిల్లీలో టౌటే తుపాను కారణంగా బుధవారం రాత్రి 8.30 గంటల వరకు 60 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్‌లలో బుధవారం కురిసిన వర్షపాతం టౌటే తుపాను, పాశ్చాత్య కారణాల ఫలితంగా ఏర్పడిందని ఐఎండి తెలిపింది. ఇంతకుముందు 1976 లో మే 24 న 24 గంటల వ్యవధిలో రాజధాని 60 మిమీ వర్షపాతం నమోదైంది. నిన్నటి వర్షపాతంతో, ఇప్పటి వరకు ఉన్న మునపటి గణాంకాలను ఇది చెరిపేసిందని జాతీయ వాతావరణ అంచనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఆర్.కె జెనమణి అన్నారు. మే నెలలో వాతావరణం పొడిగా ఉంటుంది, సాధారణంగా ఈ నెలలో ఢిల్లీలో గరిష్ఠంగా 30-40 మిల్లీ మీటర్ల వర్షం (24గంటల్లో) నమోదవుతుందని అధికారులు పేర్కొన్నారు. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తుఫానుకు పాశ్చాత్య అవాంతరాలు తోడవడంతో రికార్డు స్థాయిలో వర్షాపాతం నమోదైందని ఆయన చెప్పారు. చదవండి: ఢిల్లీ సీఎం ట్వీట్‌పై సింగపూర్ విదేశాంగ మంత్రి ఫైర్ -
ఆదిలాబాద్‌లో రికార్డుస్ధాయిలో ఉష్ణోగ్రతలు
-
ఇదేం చలిరా బాబూ!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో పెద్దల నుంచి పిన్నల వరకూ దేన్నైనా చూసి భయపడుతున్నారంటే అది చలి ఒక్కటే.. అంతలా వణికించేస్తోంది మరి.. మధ్యాహ్నం రాత్రి అన్న తేడా లేకుండా జనాన్ని గజగజలాడిస్తోంది. అటు ఉత్తరాది నుంచి రాష్ట్రం వైపు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో తెలంగాణలో రెండ్రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలి పింది. ఫలితంగా సోమ, మంగళవారాల్లో ఆదిలాబా ద్, నిర్మల్, నిజామాబాద్, కొమురంభీం, మంచిర్యా ల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అనేకచోట్ల సాధారణం కంటే ఐదారు డిగ్రీలు తగ్గడం గమనార్హం. ప్రధానంగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలు నమోదైంది. మెదక్‌లో 8 డిగ్రీలు రికార్డు అయింది. రామగుండంలో రాత్రి ఉష్ణోగ్రత 9 డిగ్రీలు నమోదైంది. హన్మకొండలో 10, హకీంపేట, హైదరాబాద్, నిజామాబాద్‌లో 11 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం ఐదు అయిందంటే చాలు బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. స్వెట్టర్లు, జర్కిన్లు లేనిదే బయటకు రావడంలేదు. దీంతో స్వెట్టర్లకు డిమాండ్ ఏర్పడింది. చలి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
వాన.. వాన.. వెల్లూవాయె..