సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో పెద్దల నుంచి పిన్నల వరకూ దేన్నైనా చూసి భయపడుతున్నారంటే అది చలి ఒక్కటే.. అంతలా వణికించేస్తోంది మరి.. మధ్యాహ్నం రాత్రి అన్న తేడా లేకుండా జనాన్ని గజగజలాడిస్తోంది. అటు ఉత్తరాది నుంచి రాష్ట్రం వైపు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో తెలంగాణలో రెండ్రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలి పింది. ఫలితంగా సోమ, మంగళవారాల్లో ఆదిలాబా ద్, నిర్మల్, నిజామాబాద్, కొమురంభీం, మంచిర్యా ల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు.
గత 24 గంటల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అనేకచోట్ల సాధారణం కంటే ఐదారు డిగ్రీలు తగ్గడం గమనార్హం. ప్రధానంగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలు నమోదైంది. మెదక్‌లో 8 డిగ్రీలు రికార్డు అయింది. రామగుండంలో రాత్రి ఉష్ణోగ్రత 9 డిగ్రీలు నమోదైంది. హన్మకొండలో 10, హకీంపేట, హైదరాబాద్, నిజామాబాద్‌లో 11 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం ఐదు అయిందంటే చాలు బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. స్వెట్టర్లు, జర్కిన్లు లేనిదే బయటకు రావడంలేదు. దీంతో స్వెట్టర్లకు డిమాండ్ ఏర్పడింది. చలి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment