corporate treatment
-
అర్హులందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం
గుంటూరు మెడికల్: అర్హులందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఫీల్డ్ ఆపరేషన్స్ సర్వీసెస్ జేఈవో డాక్టర్ శ్రీదేవి అన్నారు. సోమవారం గుంటూరు జీజీహెచ్‌లో ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ నాగళ్ల జయరామకృష్ణ అధ్యక్షతన ఆరోగ్యమిత్రలు, టీమ్ లీడర్లు, ఎంఎల్‌హెచ్‌పీలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. శ్రీదేవి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 2,446 జబ్బులకు, 1,973 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ట్రస్టు పీఎంయూ జీఎం అంకయ్య, నరసరావుపేట ఆరోగ్య కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.సునీల, జిల్లా మేనేజర్ సి.హెచ్.రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా ‘కార్పొరేట్’ వైద్యం
సాక్షి, హైదరాబాద్: అన్ని జిల్లాల్లోనూ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను నెలకొల్పేలా ప్రోత్సహిం చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంపై నూతనంగా తీసుకున్న అనేక నిర్ణయాలను రాష్ట్రాలకు తెలియజేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహాయక వైద్య సేవల్లోనూ ప్రైవేట్ రంగాన్ని ముందుకు తీసుకురానున్నారు. ఇక జిల్లా రెసిడెన్సీ పథకం కింద పీజీ మెడికల్ విద్యార్థులంతా తప్పనిసరిగా మూడు నెలలపాటు జిల్లా ఆసుపత్రుల్లో పనిచేయాలని ఆదేశిం చింది. మరోవైపు ముఖ్యమైన జిల్లాల్లో క్రిటికల్ కేర్ ఆసుపత్రి బ్లాక్‌లను ఏర్పాటు చేస్తారు. మున్ము ందు కరోనా వంటి మహమ్మారులు ఎలాంటివి విజృంభించినా వాటిని ఎదుర్కొనేందుకు వీటిని ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటు చేస్తారు. ఆ మేరకు తెలంగాణలో దాదాపు 20 జిల్లాల్లో ఇవి ఏర్పాటయ్యే అవకాశముంది. వీటిని కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులతో నెలకొల్పుతారు. గత పదేళ్లలో 75% కొత్త వ్యాధులు జంతువులు లేదా వాటి ఉత్పత్తుల ద్వారా ప్రబలినట్లు గుర్తించారు. గతేడాది ప్రపంచంలో కరోనాతోపాటు 60కు పైగా అంటువ్యాధు లు జనంపై దాడి చేశాయి. అందువల్ల జిల్లాల్లో క్రిటికల్ కేర్ ఆసుపత్రుల బ్లాక్‌లను ఏర్పాటు చేస్తారు. 25 లక్షల ఎకరాల్లో ఔషధ మొక్కల సాగు దేశవ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో అత్యంత విలువైన ఔషధ మొక్కల సాగును చేపట్టనున్నారు. రైతులను, రైతు ఉత్పత్తిదారుల సంఘాలను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఇందులో భాగస్వామ్యం చేస్తారు. ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించ డం, పండించే సమయంలో నిర్వహణ, వాటికి అవసరమైన మార్కెట్ సదుపాయాల కోసం కేంద్రం రూ. 4 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కోరింది. తెలంగాణలో దాదాపు లక్ష ఎకరాల్లో ఔషధ మొక్కల సాగుకు అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయుష్ గ్రిడ్... డిజిటల్ ప్లాట్‌ఫాంపై ఆయుష్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తారు. ఆయుష్ రంగంలో వైద్య సదుపాయాలు కల్పించడం, ఆస్పత్రులు, లేబొరేటరీలు ఏర్పా టు చేయడం దీని ఉద్దేశం. భారతీయ సంప్రదాయ వైద్యానికి అంతర్జాతీయ స్థాయి కల్పనకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి గ్లోబల్ సెం టర్ను ఏర్పాటు చేస్తారు. ‘జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా ఆయుష్ రంగంలో నైపుణ్యాభివృద్ధి జరగాలి. ప్రైవేట్‌లో ఆయుష్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పాలి. అందుకోసం ఆయుష్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాలి. ఆయుష్ వైద్య విద్యలో నాణ్యత, ప్రమాణాలను పెంచడం కోసం ప్రత్యేక వ్యవస్థలను నెలకొల్పాలి’అని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 12,500 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. 100 జిల్లాల్లో... జిల్లాస్థాయి ఆయుష్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తారు. అన్ని జిల్లాల్లో ప్రజారోగ్య లేబరేటరీలు అన్ని జిల్లాల్లోనూ సమగ్ర ప్రజారోగ్య లేబరేటరీలను నెలకొల్పుతారు. వాటిల్లో వైద్య పరీక్షలు చేస్తారు. 2022 డిసెంబర్ నాటికి దేశంలో లక్షన్నర హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. అందులో 11,024 సెంటర్లను అర్బన్ మురికివాడల్లో ఏర్పాటు చేస్తారు. ఆయా వెల్నెస్ సెంటర్లలో 12 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. వెల్నెస్ సెంటర్ల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండటానికి ఏంచేయాలన్న దానిపై దృష్టిపెడతారు. అందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేస్తారు. సరైన తిండి (ఈట్ రైట్), ఫిట్ ఇండియా, యోగాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అత్యవసర మందులు, వైద్య పరీక్షలూ ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. అలాగే దేశంలో మరిన్ని బల్క్ డ్రగ్ పార్కులు, మెడికల్ డివైజెస్ పార్కులను వచ్చే మూడేళ్లలో ఏర్పాటు చేయాలి. ఫార్మా టెక్నాలజీని ఆధునీకరించాలని కేంద్రం నిర్ణయించింది. -
కార్పొరేట్ వైద్యం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి లో అత్యాధునిక సేవలు త్వరలో అందుబాటులోకి వస్తున్నాయి. కార్పొరేట్‌స్థాయిలో వైద్యం అందించేందుకు నూతన పరికరాలు మంజూరయ్యాయి. రిమ్స్ ప్రారంభం నుంచి సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటులో జాప్యం జరుగుతూ వచ్చింది. త్వరలో ఇది కూడా అందు బాటులోకి రానుంది. ఆస్పత్రిలో సదుపాయలు, వైద్యసేవల మెరుగు కోసం కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమం లో త్వరలో ఆస్పత్రికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం అందుబాటులో లేని అత్యాధునిక పరికరాలు రానున్నాయి. ఇటీవలే రిమ్స్‌లో డయాలసీస్ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే మొదట్లో ఉద్యోగుల హెల్త్‌కార్డులకు ఈ సేవలు వర్తించలేదు. వారం క్రితం ఉద్యోగులకు సైతం ఈ సేవలు వర్తింపజేస్తూ ఉత్తర్వులు వెలువడినట్లు రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు డయాలసీస్ కేంద్రంలో 500 మందికి రక్తశుద్ధి చేశారు. అలాగే రూ.కోటి వ్యయంతో ఆస్పత్రిలో లిక్విడ్ కల్చర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా టీబీకి సంబంధించిన స్పుటం పరీక్షలు చేస్తారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆస్పత్రుల నుంచి నమూనాలు రిమ్స్‌కు తీసుకురానున్నారు. ఇలా పలురకాల అత్యాధునిక సేవలు రిమ్స్‌లో ప్రారంభం కానున్నాయి. శరవేగంగా సెంట్రల్ ఆక్సిజన్‌ప్లాంట్.. ఆస్పత్రిలో సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆవరణలో ఇప్పటికే ప్లాంట్ మిషన్ ఏర్పాటు చేశారు. మెడికల్ ఐసీయూ, పిడియాట్రిక్, ఆపరేషన్ థియేటర్, ఐసీసీయూ, ఎమర్జెన్సీవార్డుల నుంచి పైపులైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తారు. పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జంబోసిలిండర్ ద్వారా రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నారు. సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే వార్డులో రోగులకు పైపులైన్ ద్వారా ఆక్సిజన్ అందించవచ్చు. కలెక్టర్ ఫండ్స్ నుంచి రిమ్స్‌కు నిధులు.. రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధితో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించారు. ఇప్పటికే ప్రతీవారం ఆస్పత్రి అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్న కలెక్టర్ రిమ్స్‌లో అవసరమైన సదుపా యాల కోసం కలెక్టర్ ఫండ్స్ నుంచి నిధులు వెచ్చిస్తున్నారు. ఇందులో భాగంగానే రూ.7.5 లక్షలతో అంబులెన్స్ మంజూరు చేశారు. దీంతో పాటు రూ.15లక్షలతో ఈఎంటీ పరికరాలు కొనుగోలుకు టెండర్ ప్రక్రియ ప్రారంభించారు. జేసీ ఆధ్వర్యంలో ఈ టెండర్లు జరుగనున్నాయి. వీటితో పాటు రిమ్స్‌లో మరిన్ని సేవలు త్వరలో అందుబాటులోకి రా>నున్నాయి. ఇటీవల చిన్నపిల్లలకు శస్త్రచికిత్స సేవలు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే రూ. 1.60 కోట్లతో అప్తాలమిక్ విభాగంలో రేజర్స్, మైక్రోస్కోప్, టోనోమిటర్స్, తదితర పరికరాల కోసం ఈ నిధులు మంజూరయ్యాయి. రోగులకు మెరుగైన వైద్యసేవలు.. రిమ్స్‌కు వచ్చే రోగులకు ఇప్పటికే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. త్వరలో మరిన్ని అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ఫుల్లీ ఆటోమెటిక్ మిషన్, సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్, లిక్విడ్ కల్చర్ ల్యాబ్, ఈఎంటీ, అప్తాలమిక్ విభాగాల్లో నూతన పరికరాలు మంజూరయ్యాయి. సెంట్రల్ ఆక్సిజన్‌ప్లాంట్ పనులు 80 శాతం పూర్తయ్యాయి. కలెక్టర్ నిధుల నుంచి సైతం అంబులెన్స్ మంజూరైంది. రోగులకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు, సేవలు ఇక్కడే అందుతాయి. అలాగే వైద్య విద్యార్థుల కోసం రూ. 6లక్షలతో డిజిటల్ లైబ్రెరీ ప్రారంభించనున్నాం. ఇందుకు సంబంధించి 12 కంప్యూటర్లు కొనుగోలు చేశాం. – కె.అశోక్, రిమ్స్ డైరెక్టర్ గంటకు 400 పరీక్షలు.. రిమ్స్ బయోకెమిస్ట్రీ విభాగానికి రూ.40 లక్షల విలువ చేసే ఫుల్లీ ఆటోమెటిక్ మిషన్ ఇప్పటికే చేరుకుంది. త్వరలో ఈ యంత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ పరికరానికి గంటకు 400 పరీక్షలు చేసే సామర్థ్యం ఉంది. 50 రకాల రక్త పరీక్షలను దీని ద్వారా చేస్తారు. ప్రస్తుతం ఆయా రక్త పరీక్షల రిపోర్టు రావాలంటే రోజంతా సమయం పడుతుంది. రోగులు పరీక్షల రిపోర్టు కోసం మరుసటి రోజు రావాల్సి ఉండేది. ఈ మిషన్ ద్వారా ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు సైతం ఒకే రోజు అన్ని పరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్లే వీలు ఉంటుంది. రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో మాత్రమే ఈ పరికరం ఉంది. ఇప్పటికే ఇద్దరు టెక్నీషియన్లకు శిక్షణ సైతం ఇచ్చారు. కేవలం రక్త నమూనాలు సేకరించి మిషన్‌లో పెడితే చాలు మిగతా పనులన్నీ పరికరమే చూసుకుంటుంది. -
కరుణ లేని పాలకుడు..!
రాష్ట్రంలో ప్రాథమిక వైద్యాన్ని పునాదులతోసహా పెకిలించివేసి, కార్పొరేట్ వైద్యాన్ని విస్తృతం చేయడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజల దౌర్భాగ్యానికి, అభాగ్యానికి, శోకానికి పాలకుడు కారణం కారాదు. ఆంధ్రప్రదేశ్‌లో అనారో గ్యం తాండవిస్తోంది. ప్రభుత్వానికి ప్రజల ఆరో గ్యంపై శ్రద్ధ లేదనే విషయం అడుగడుగునా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదా సీనతే దీనికి కారణం. రాష్ట్రంలోని ప్రాథమిక వైద్యశాలలన్నీ నరకకూపాలుగా మారాయి. విష జ్వరాలకు మందుల్లేక పీహెచ్‌సీలు వట్టి పోయాయి. నిరంతర వర్షాల వల్ల ప్రజలు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి జ్వరాల పాలబడు తున్నారు. లక్ష కోట్లకు పైగా వార్షిక బడ్జెట్ ఉన్న ప్రభుత్వం పీహెచ్‌సీలను పనిగట్టుకుని నిర్భాగ్యంగా ఉంచటం దారుణం. ఒకవైపు సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ప్రజలు విలవిలలాడుతుంటే మరోవైపు వెంటిలేటర్స్, బ్లడ్‌టెస్ట్ ల్యాబ్‌లు, మందులు, సరైన గదులు, శుభ్రత, సిబ్బంది లేక పీహెచ్‌సీలు తేలిపోతున్నాయి. ప్రజలు తమ ఇళ్ళ కంటే పీహెచ్ సీలే అధ్వాన్న స్థితిలో ఉన్నా యని వెనక్కి వస్తున్నారు. ‘పరిపాలనాదక్షుణ్ణి, నన్ను మిం చినవారు’ లేరనే చంద్రబాబు పాలనలో ఇలాంటి పరిస్థితి ఎందుకుంది? ఆయనకు కరుణ లేదా? ప్రజల మీద ప్రేమ లేదా? ప్రజలు అనా రోగ్యాన్ని ముఖ్యమంత్రి ఇష్టపడుతున్నారా? సాక్షాత్తు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నియోజకవర్గంలోని ప్రత్తిపాడులో ప్రాథమిక వైద్య శాల పిచ్చిమొక్కలు పెరిగి ప్రజలు లోనికి వెళ్ళడా నికి వీల్లేకుండా ఉంది. సభాపతి కోడెల శివప్రసాద్ రావు ప్రాంతమైన నరసరావుపేట, సత్తెనపల్లి పీహెచ్‌సీలన్నీ నరక కూపాలుగా ఉన్నాయి. ఆయ నేమో బాత్రూమ్లు కట్టించడంలో జాతీయ అవా ర్డులు పొందాలని చూస్తున్నారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గం చిల కలూరిపేటలో పీహెచ్‌సీలు అధ్వానంగా ఉన్నాయి. యడ్లపాడు, నాదెండ్ల, గణపవరం పీహెచ్సీలలో వైద్యులే వైద్యశాలలకు రావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రాథమిక వైద్యం ఎందుకు చేయించలేకపోతోంది? వైద్యులు సకా లంలో వైద్యశాలకు వచ్చేటట్లు ఎందుకు చూడలేక పోతుంది? ఎంతోమంది జ్వరాలతో మరణిస్తు న్నారు. వృద్ధులైతే కుక్కి మంచం మీద పడుకుని కనీసం కషాయం ఇచ్చేవాళ్ళు అల్లాడుతున్నారు. మరణిస్తే తీసుకెళ్లేవాళ్లు లేక, చనిపోయినవారిని పూడ్చిపెట్టేవారు లేక, పూడ్చిపెట్టడానికి శ్మశానాల్లో స్థలాలు లేక, జీవించే హక్కు లేక, అకాలంగా మరణించినవారిని ఖననం చేసే స్థితి లేక ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి వీడియో కాన్ఫ రెన్స్‌లు జరుపుతూ కాలక్షేపం చేయడం ధర్మమా! ప్రజలు కడుతున్న పన్ను ప్రజలకు ఖర్చుపెట్ట కుండా మిగిలిపోతున్న నేపథ్యంలో ప్రజల దుర్భ రమైన పరిస్థితి కళ్లనీళ్లు తెప్పించడం లేదా! 2015- 16 బడ్జెట్‌ని చూస్తే ఒక లక్షా పదమూడు వేల కోట్ల బడ్జెట్లో 64 శాతం ప్రణాళికేతర వ్యయం చూపిం చారు. మిగిలిన 36 శాతం నిధులను రెవెన్యూ ఖాతా కింద చూపించారు. ఒకసారి ఆ ప్రణాళికేతర వ్యయాన్ని పరిశీలిస్తే జీతాలు రూ.30,403 కోట్లు, పింఛన్లు రూ.11,828 కోట్లు, వేతనేతర వ్యయం రూ.2,839 కోట్లు, నిర్వహణ రూ. 939 కోట్లు, సబ్సిడీలు, ఇతర గ్రాంట్లు రూ14,816 కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ11,189 కోట్లు, రుణాల చెల్లింపులు రూ.5,087 కోట్లు, ఇతర ఖర్చులు రూ.1,536 కోట్లు ఈ మొత్తం ప్రణాళికేతర వ్యయం 78,637 కోట్లు ఉంది. ఇక ప్రణాళిక వ్యయం విష యానికొస్తే వ్యవసాయం, గ్రామీ ణాభివృద్ధికి రూ.10,424 కోట్లు, జలవనరులు రూ. 4,678 కోట్లు, విద్యుత్తు రూ. 96 కోట్లు, సామా జిక సేవలు రూ.14,904 కోట్లు, రవాణా రూ. 2,155 కోట్లు, ఇత రత్రా 2,150 కోట్లు ఈ మొత్తం రూ. 34,307 కోట్లవరకు ఉంది. ఇందులో ఉద్యోగులకు ఇస్తున్న 30,403 కోట్ల రూపాయలకు రూ. 10,200 కోట్ల రూపాయలు మాత్రమే పని రాబటు ్టకుంటారని విశ్లేషకుల అంచనా. కార్పొరేట్ వైద్య వ్యవస్థకు ఆరోగ్యశ్రీ పేరుతో వేలాది కోట్ల రూపా యలు తగలెట్టడానికి బదులు ప్రభుత్వ వైద్యాన్నే ఎందుకు అభివృద్ధి చేయట్లేదు! చంద్రబాబు రాష్ట్రంలో ప్రాథమిక వైద్యాన్ని పునాదులతోసహా పెకిలించివేసి, తన సామాజిక వర్గం బలంగా ఆశ్ర యించి వున్న కార్పొరేట్ వైద్యాన్ని విస్తృతం చేయ డానికి రాష్ట్రంలో పెద్దఎత్తున కార్యక్రమం సాగిస్తు న్నారు ఇది తెలుగు జాతికి వెన్నుపోటు పొడవటమే. నాయకత్వం అంటే ప్రజలను నడిపించటం అని అర్థం. కానీ, ప్రజల దౌర్భాగ్యానికి, అభాగ్యా నికి, శోకానికి పాలకుడు కారణం కాకూడదు. ఆరో గ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అనేక కోణాల్లో నిలదీసే చైతన్యం కావాలి. ‘రాజ్యం అనేది మానవుల కోర్కెలను, ఆశలనూ సఫలీకృతం చేసే ఒక సాధనం మాత్రమే. రాజ్యానికీ, వ్యక్తికీ మధ్య అంతస్సంబంధాలు సమతుల్యంగా ఉండాలని’ అంభేడ్కర్ భావించారు. ప్రజలు ప్రత్యామ్నాయ రాజ్యావిష్కరణ కోసం, ప్రత్యామ్నాయ చైతన్యంతో ముందుకెళ్లాల్సిన చారిత్రక సందర్భం ఇది. - డాక్టర్ కత్తి పద్మారావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, అధ్యక్షులు, నవ్యాంధ్రపార్టీ. మొబైల్: 9849741695 -
ప్రభుత్వాసుపత్రి నుంచి వస్తేనే కార్పొరేట్ వైద్యం
ఔట్ పేషెంట్ ఉద్యోగుల విషయమై తెలంగాణ సర్కారు యోచన సాక్షి, హైదరాబాద్: ఔట్ పేషెంట్‌గా వచ్చే ఉద్యోగుల ఉచిత వైద్యంపై తెలంగాణ సర్కారు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. క్యాష్‌లెస్ ఆరోగ్య కార్డు ల ద్వారా నేరుగా కార్పొరేట్ వైద్యం చేయించుకోవచ్చని... అయితే ఔట్ పేషెంట్ల విషయంలో కొన్ని నిబంధనలను తయారు చేయాలని వైద్య ఆరోగ్యశాఖను తాజాగా ఆదేశించింది. ప్రతీ చిన్న దానికి నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లడం కాకుండా ముందుగా ప్రభుత్వాసుపత్రుల్లో ఔట్‌పేషెంట్‌గా వెళ్లి అక్కడ రోగ నిర్ధారణ చేసుకొని... ఆ వైద్యుల సూచన మేరకు మాత్రమే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాలన్న ప్రతిపాదన చేసే యోచనలో ఉంది. ఇటీవల కార్పొరేట్ ఆసుపత్రుల యాజ మాన్యాలతో జరిగిన సమావేశంలో వారి నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ సవరణలు చేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. అయితే ఈ ప్రతిపాదనపై కొన్ని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణ యం ఆచరణలో అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని, ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆలోచనలో తప్పేమీ లేదని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అభిప్రాయపడ్డారు. వైద్య ఖర్చులపై మూడు ప్రత్యామ్నాయాలు: ఇదిలావుండగా వివిధ చికిత్సలకు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ తమకు ఏమాత్రం సరిపోదని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. దీనికి మూడు ప్రత్యామ్నాయాలను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించా యి. కేంద్ర ఉద్యోగులకు ఇచ్చే ప్యాకేజీని అమలు పరచడం ఒకటి కాగా... రెండోది నిమ్స్ ఆసుపత్రుల్లో మిలీని యం బ్లాక్ ప్యాకేజీని అమలు చేయడం రెండోది... బీమా సంస్థల ప్యాకేజీనైనా అమలు చేయడం మూడోది. వీటిలో తమకు ఏదైనా ఆమోదయోగ్యమేనని వారు అంటున్నారు. -
గడప గడపకూ సర్కారు మందులు
తెలంగాణ రాష్ట్రంలోని గడప గడపకు సర్కారు మందులు అందేవిధంగా కృషిచేస్తాం. ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ని ఆస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా మారుస్తాం. ప్రతీమండలంలో నలుగురు వైద్యులతో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటాం. వైద్యరంగాన్ని అభివృద్ధి చేసి హైదారాబాద్‌ను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దుతాం.. - షాద్‌నగర్‌లో డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య షాద్‌నగర్ రూరల్ : తెలంగాణలోని ప్రతి మండలంలో నలుగురు డాక్టర్లతో నిరుపేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య అన్నారు. గురువారం రాత్రి 10:15గంటలకు ఆయన షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమం అనంతరం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయని, ఆ సమావేశాలలో ప్రణాళికను సిద్ధంచేసి ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని ఆస్పత్రిని అభివృద్ధి చేసి ఏరియా ఆస్పత్రిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని, గడప గడపకూ సర్కాలు మందులు అందేలా చూస్తామని అన్నారు. వైద్యరంగాన్ని అభివృద్ధి చేసి హైదరాబాద్ హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. అదేవిధంగా అవుటర్ రింగురోడ్కు 10కిలోమీటర్ల పరిధిలో బీబీనగర్ వద్ద అన్ని హంగులతో నిమ్స్ ఆస్పత్రిని అభివృద్ధి చేశామని, త్వరలోనే అక్కడ వైద్యసేవలు మొదలవుతాయని తెలిపారు. నిమ్స్భీమిడి యూనివర్సిటీలో ఆరోగ్య కళాశాలను ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయి హెల్త్ టూరిజంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మార్చాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మంత్రి రాజయ్యకు వినతిపత్రం అందజేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధే లక్ష్యంగా రానున్న 5సంవత్సరాల కాలంలో రూ.లక్ష కోట్లు ఖర్చుచేస్తామన్నారు. ప్రతిపైసా క్షేత్రస్థాయిలో అందరికీ చేరేవిధంగా కృషిచేస్తామని చెప్పారు. రూ.50వేల కోట్లతో రాష్ట్రంలోని దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేయనున్నారని వెల్లడించారు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల పరిధిలో శాటిలైట్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఐటిఐఆర్ ప్రాజెక్టుకు అన్ని వనరులను సమకూర్చి, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని తెలిపారు. పోలవరంలోని 7 మండలాలోని ముంపుగ్రామాలను రాజ్యాంగానికి విరుద్దంగా ఆర్డినెన్స్‌ను జారీచేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. ఆర్టికల్-3 ప్రకారం ఆర్డినెన్స్‌ను జారీ చేయాల్సిన కేంద్రం చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడుల ఒత్తిడితో జారీ చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వీర్లపల్లిశంకర్, వెంకట్రాంరెడ్డి, అందెబాబయ్య, రాంబల్‌నాయక్, ఎంఎస్ నటరాజన్, సలీం, ఆర్లయాదయ్యయాదవ్, మన్నెనారాయణయాదవ్, పరంధాములుయాదవ్, సుధాకర్, తుమ్మలపల్లికృష్ణయ్య, లింగారంపెంటయ్య, సిద్దలశ్రీనాధ్, దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.