ఔట్ పేషెంట్ ఉద్యోగుల విషయమై తెలంగాణ సర్కారు యోచన
సాక్షి, హైదరాబాద్: ఔట్ పేషెంట్‌గా వచ్చే ఉద్యోగుల ఉచిత వైద్యంపై తెలంగాణ సర్కారు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. క్యాష్‌లెస్ ఆరోగ్య కార్డు ల ద్వారా నేరుగా కార్పొరేట్ వైద్యం చేయించుకోవచ్చని... అయితే ఔట్ పేషెంట్ల విషయంలో కొన్ని నిబంధనలను తయారు చేయాలని వైద్య ఆరోగ్యశాఖను తాజాగా ఆదేశించింది. ప్రతీ చిన్న దానికి నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లడం కాకుండా ముందుగా ప్రభుత్వాసుపత్రుల్లో ఔట్‌పేషెంట్‌గా వెళ్లి అక్కడ రోగ నిర్ధారణ చేసుకొని... ఆ వైద్యుల సూచన మేరకు మాత్రమే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాలన్న ప్రతిపాదన చేసే యోచనలో ఉంది. ఇటీవల కార్పొరేట్ ఆసుపత్రుల యాజ మాన్యాలతో జరిగిన సమావేశంలో వారి నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ సవరణలు చేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది.
అయితే ఈ ప్రతిపాదనపై కొన్ని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణ యం ఆచరణలో అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని, ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆలోచనలో తప్పేమీ లేదని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అభిప్రాయపడ్డారు. వైద్య ఖర్చులపై మూడు ప్రత్యామ్నాయాలు: ఇదిలావుండగా వివిధ చికిత్సలకు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ తమకు ఏమాత్రం సరిపోదని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. దీనికి మూడు ప్రత్యామ్నాయాలను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించా యి. కేంద్ర ఉద్యోగులకు ఇచ్చే ప్యాకేజీని అమలు పరచడం ఒకటి కాగా... రెండోది నిమ్స్ ఆసుపత్రుల్లో మిలీని యం బ్లాక్ ప్యాకేజీని అమలు చేయడం రెండోది... బీమా సంస్థల ప్యాకేజీనైనా అమలు చేయడం మూడోది. వీటిలో తమకు ఏదైనా ఆమోదయోగ్యమేనని వారు అంటున్నారు.
ప్రభుత్వాసుపత్రి నుంచి వస్తేనే కార్పొరేట్ వైద్యం
Published Wed, Dec 17 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM
Advertisement