counceling
-
బండి, ఈటల మాటలతో కాషాయ పార్టీలో మంటలు..!
-
భరోసా ఇవ్వాలి.. బాధ్యతగా ఉండాలి
‘‘నెల నెలా డాక్టర్ దగ్గరకు వెళ్తున్నావా’’ ‘‘న్యూట్రిషనిస్ట్ ఇచ్చిన డైట్ చార్ట్ ప్రకారం తింటున్నావా’’ ‘‘రోజూ వాకింగ్ చేస్తే డెలివరీ సులువవుతుంది’’ ‘‘నీకేం తినాలని ఉందో చెప్పు... చేసి పంపిస్తాను’’ గర్భిణికి ఇలాంటి ఆత్మీయ పలకరింపులెన్నో. ఆత్మీయతలు... ఆనందాలు బయటకు కనిపిస్తాయి. ఆమె మనసు పడే సంఘర్షణ బయటకు కనిపించదు. ఆమె మనసు మౌనంగా మాట్లాడుతుంది. జీవిత భాగస్వామి ఆ మనసు భాషను అర్థం చేసుకోవాలి. తగిన సహకారం అందించాలి. గర్భిణులకు క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ చేసుకోవాలని చెబుతుంటాం. పోషకాహారం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతుంటాం. వ్యాయామం ఎంత అవసరమో సూచిస్తుంటాం. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఒకమ్మాయి గర్భం దాల్చిందని తెలియగానే ఫోన్ చేసి అభినందనలు చెబుతూ రకరకాల పరామర్శల్లో భాగంగా పై జాగ్రత్తలన్నీ చెబుతుంటాం. మరొక అడుగు ముందుకు వేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోమనే ఓ మంచిమాట కూడా. అయితే గర్భంతో ఉన్న మహిళకు ఈ జాగ్రత్తలతోపాటు సైకాలజిస్ట్ కౌన్సెలింగ్ కూడా అవసరమనే సున్నితమైన విషయాన్ని చెప్పేవాళ్లుండరు. ‘సైకాలజిస్ట్‌ను సంప్రదించడం ఎందుకు? ఏ మానసిక సమస్య ఉందని’ అనే ప్రతిస్పందన కొంచెం ఘాటుగా కూడా వినిపిస్తుంటుంది. ‘నిజానికి పై జాగ్రత్తలన్నింటితోపాటు మానసిక విశ్లేషకుల సలహాలు, సూచనలు కూడా అవసరమే. ఆ సూచనలు గర్భంతో ఉన్న మహిళకు మాత్రమే కాదు భర్తకు కూడా’ అంటున్నారు క్లినికల్ సైకాలజిస్ట్ కాంతి. ఇద్దరికీ కౌన్సెలింగ్ ‘‘ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఉండాలి. తల్లి కావాలనే అందమైన ఆకాంక్ష ప్రతి మహిళకూ ఉంటుంది. అలాగే మాతృత్వం గురించిన మధురోహలతోపాటు అనేకానేక భయాలు కూడా వెంటాడుతుంటాయి. ప్రసారమాధ్యమాల్లో వచ్చే అనేక దుర్వార్తల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తన బిడ్డకు అలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయేమోననే భయం వెంటాడుతూ ఉంటుంది. ఆమె తన భయాలను భర్తతో పంచుకున్నప్పుడు వచ్చే ప్రతిస్పందన చాలా కీలకం. నిర్లక్ష్యంగానో, విసుగ్గానో రెస్పాండ్ అయితే గర్భిణి మనసుకయ్యే గాయం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే గర్భిణిలో తలెత్తే శారీరక, మానసికమైన మార్పుల గురించిన అవగాహన భర్తకు ఉండి తీరాలి. అందుకే కౌన్సెలింగ్‌కి ఇద్దరూ రావాలని చెబుతాం. కొంత మంది భర్తలు ప్రెగ్నెంట్ ఉమన్‌తో వాళ్ల తల్లిని లేదా సోదరిని పంపిస్తుంటారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటి రాజీలు ఉండకూడదని చెబుతుంటాం. భార్య మానసిక స్థితిలోని సున్నితత్వం స్థాయులు భర్తకు అర్థమైనప్పుడే అతడు భార్యకు అన్ని వేళల్లోనూ అండగా నిలబడగలుగుతాడు. మెంటల్ వెల్బీయింగ్ గురించిన అవగాహన ఇద్దరిలో ఉన్నప్పుడే పాపాయిని జాగ్రత్తగా చూసుకోవడంలో కూడా పరిణతితో వ్యవహరించగలుగుతారు. మూడో వ్యక్తికి సాదర స్వాగతం సాధారణంగా మన ఇళ్లలో గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెను అందరూ అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. డెలివరీ తర్వాత బాధ్యతలన్నీ ఆమె భుజాల మీద మోపుతూ జాగ్రత్తల పేరుతో ఆమెను కట్టడి చేస్తుంటారు. నిజానికి ఈ దశలో భర్త సపోర్టు చాలా అవసరం. పోస్ట్ పార్టమ్ డిజార్డర్ ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో ఉంటుంది. మహిళ తన జీవితం ఒక్కసారిగా స్తంభించి పోయినట్లు భావిస్తుంది. ఒంటరితనం, నెగిటివ్ థాట్స్, ‘అందరూ సంతోషంగా ఉన్నారు... నా జీవితమే ఇలాగైంది, సోషల్ లైఫ్‌కు దూరంగా ఇంట్లో నాలుగ్గోడలకే పరిమితమైపోయింది జీవితం... అని దిగులు పడడం వంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఎందుకంటే చాలామంది మగవాళ్లకు తండ్రి అయిన తర్వాత కూడా లైఫ్‌స్టయిల్ ఏమీ మారదు. ఆడవాళ్ల విషయంలో అందుకు పూర్తిగా భిన్నం. అలాంటప్పుడే భర్త పట్టించుకోవడం లేదనే న్యూనత కూడా మొదలవుతుంది. అందుకే పోస్ట్ డెలివరీ ప్రిపరేషన్ గురించి డెలివరీకి ముందే భార్యాభర్తలిద్దరినీ మానసికంగా సిద్ధం చేయడం జరుగుతుంది. మగవాళ్లు తండ్రి అయిన సంతోషాన్ని బయట స్నేహితులతో సెలబ్రేట్ చేసుకోవడం సరికాదు, ఇంట్లోనే స్నేహితులతో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసి భార్యను కూడా వేడుకలో భాగస్వామ్యం చేయాలి. పెటర్నిటీ లీవ్ సౌకర్యం ఉంటుంది. ఆ సెలవు తీసుకుంటారు, కానీ భార్యకు సహాయంగా ఉండక ఇతర వ్యాపకాలతో గడిపే వాళ్లూ ఉంటారు. కానీ తమ కుటుంబంలో మూడో వ్యక్తికి స్వాగతం పలికే క్రమంలో ప్రతి దశలోనూ భర్తను భాగస్వామ్యం చేయగలిగితే ఇలాంటి పరిణామాలుండవని నా అభిప్రాయం. డెలివరీ అయిన మహిళలకు దేహాకృతి విషయంలో ఎక్కడ లేని ఆందోళన మొదలవుతుంటుంది. దేహం తిరిగి మామూలు కాదనే భయం వెంటాడుతుంటుంది. మరికొందరు... నా బిడ్డకు నేను చేయాల్సినంత చేయడం లేదేమో, నేను మంచి తల్లిని కాలేనేమో అని బాధపడుతుంటారు. ఒక్కొక్కరైతే తమలో తామే బాధపడుతూ మౌనంగా రోదిస్తుంటారు, పెద్దగా వెక్కి వెక్కి ఏడుస్తారు కూడా. భావోద్వేగ పరమైన అసమతుల్యతకు లోనవుతున్న విషయాన్ని గుర్తించలేకపోతారు. మా కౌన్సెలింగ్‌లో భార్యాభర్తలిద్దరికీ ఇలాంటి విషయాలన్నింటి మీద అవగాహన కల్పిస్తాం. కాబట్టి భార్య మానసికంగా న్యూనతకు లోనయినప్పుడు ఎమోషనల్ సపోర్టు ఇవ్వాలనే విషయం మగవాళ్లకు తెలుస్తుంది. – ఎమ్. కాంతి, క్లినికల్ సైకాలజిస్ట్ హైదరాబాద్ చర్చ కావాలి... వాదన వద్దు! ఇక చంటి బిడ్డను చూడడానికి ఇంటికి వచ్చిన వాళ్లు కూడా ‘ఫలానా ఆమె తన బిడ్డను కింద పెట్టకుండా ఒంటి చేత్తో పెంచుకుంటోంది’ వంటి స్టేట్మెంట్లు అలవోకగా ఇచ్చేస్తుంటారు. ఆ మాటల ప్రభావంతో అన్నీ తనే చూసుకుంటూ సూపర్ మామ్ కావాలనే అవసరం లేని పట్టుదలకు కూడా పోతుంటారు చంటిబిడ్డల తల్లులు. ఇలాంటి కామెంట్లకు ప్రభావితం కాకుండా, విపరీత పరిణామాలకు తావివ్వకుండా ఉండాలి. భార్యాభర్తల మధ్య డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇద్దరికీ అవగాహన ఉంటే చంటిబిడ్డను పెంచడంలో భార్యాభర్తలిద్దరూ సమంగా బాధ్యతలు పంచుకోగలుగుతారు. ప్రతి విషయాన్నీ చక్కగా చర్చించుకోవాల్సిన అవసరాన్ని తెలియచేస్తాం. అలాగే ఇద్దరి మధ్య డిస్కషన్ వాదనకు దారి తీయకూడదనే హెచ్చరిక కూడా చేస్తాం. సామరస్యమైన చర్చ ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనిపిస్తాయి. వితండ వాదన వివాదానికి దారి తీస్తుంది. మన సంప్రదాయ పెంపకంలో... మగవాళ్లను అనేక విషయాలకు దూరంగా ఉంచడమే జరిగింది ఇంతవరకు. భార్యకు ఎమోషనల్ సపోర్టు ఇవ్వడం, బిడ్డ పెంపకంలో బాధ్యతను పంచుకుంటూ బాలింతకు విశ్రాంతినివ్వడం వంటివేవీ మగవాళ్లకు తెలియచేయడం ఉండదు. అందుకే ఏ విషయంలోనైనా భర్త తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటే అది అతడికి ఎలా స్పందించాలో తెలియక పోవడం కూడా అయి ఉండవచ్చు. అపోహ పడడానికి ముందు అతడికి తెలియచేసే ప్రయత్నం చేయాలని కూడా మహిళలకు చెబుతుంటాం. భార్యకు ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన బాధ్యతను భర్తకు గుర్తు చేస్తుంటాం’’ అన్నారు కాంతి. – వాకా మంజులారెడ్డి -
నత్తనడకన మెడికల్ ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. ప్రవేశాలకు ప్రకటన వెలువడి దాదాపు 3 వారాలు పూర్తయినా ఇప్పటికీ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆలిండియా కోటాలో మొదటిదశ ప్రవేశాలు పూర్తయ్యాయి. ఆలిండి యా కోటాలో మొదటి విడత ప్రవేశాలు పూర్తయిన వెంటనే, రాష్ట్రంలోనూ మొదటి విడత ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వాలి. ఈసారి మాత్రం తీవ్రమైన జాప్యం జరుగుతోంది. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ విద్యార్థుల సమక్షంలో జరగ్గా, ఇప్పుడు కరోనా కారణంగా ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతోంది. దీంతో విద్యార్థులు ధ్రువపత్రాలు అప్లోడ్ చేయలేదంటున్నారు. చాలావరకు తప్పుల తడకగా ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంటున్నాయి. కుల ధ్రువీకరణ పత్రాల్లోనూ అనేక తప్పులు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని కులాలు కొన్ని జిల్లాలకే పరిమితమై ఉంటాయి. కానీ కొందరు సంబం ధిత జిల్లాలో లేని కుల ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కేటగిరీలో ధ్రువపత్రాల్లోనూ తప్పులు ఉన్నాయి. కొందరు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు కూడా ఈడబ్లు్యఎస్ ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేశారు. వారికి ఈడబ్లు్యఎస్‌కు సంబంధం లేకున్నా తహసీల్దార్లు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు ఉండాల్సి ఉండగా, రూ.10 లక్షలకు పైగా ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు కొందరు ఈడబ్ల్యూఎస్ కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇటువంటి వాటిని గుర్తించి, విద్యార్థులకు ఫోన్లు చేసి చక్కదిద్దడానికి ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే అడ్మిషన్ల ప్రక్రియ జాప్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు. (చదవండి: ఎంబీబీఎస్ రాక.. బీడీఎస్ ఇష్టం లేక..) 28 నుంచి వెబ్ ఆప్షన్లు... రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లకు వెబ్ ఆప్షన్లను ఈ నెల 28 నుంచి నిర్వహించడానికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తుంది. శుక్రవారం నాటికి ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యే అవకాశాలున్నాయని, ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అర్హుల జాబితాను ప్రకటిస్తారు. జాబితాపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలించడానికి మరో రెండ్రోజులు సమయం తీసుకుంటారు. అనంతరం మెడికల్ కాలేజీని ఎంచుకోవడానికి వచ్చే సోమవారం నుంచి విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నెలాఖరులో మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను వెల్లడిస్తామని ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. కన్వీనర్ కోటాలో తొలివిడత పూర్తయిన తర్వాత ప్రైవేటు వైద్యకళాశాలల్లో మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటాలో సీట్ల భర్తీకి ప్రకటన జారీచేస్తారు. (చదవండి: పక్కింటి పద్మావతితో ప్రేమాయణం.. 14 ఏళ్ల తర్వాత డాక్టర్‌గా) రెండో విడత ప్రవేశాలు.. ఆలిండియా మెడికల్ ప్రవేశాల్లో రెండో విడత శుక్రవారం నుంచి నిర్వహిస్తారు. ఈ నెల 24 వరకూ రెండో విడతలో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. 27న సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడిస్తారు. 28 నుంచి వచ్చే నెల 8లోగా కేటాయించిన మెడికల్ కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాల వల్ల అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం జరుగుతుందని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
అరరే ! ప్లాన్ బెడిసి కొట్టిందే..
బయ్యారం : హాస్టల్ నుంచి తప్పించుకోవటమే గాకుండా తన మాటలతో పలువురిని బురిడి కొట్టిద్దామనుకున్న ఓ విద్యార్థిని చివరకు తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకుల చెంతకు చేరింది. ఈ ఘటన శనివారం బయ్యారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బయ్యారంలోని ఏకలవ్య రెసిడెన్షీయల్ పాఠశాలలో మరిపెడ మండలం అబ్బాయిపాలెంకు చెందిన మానపాటి మల్లయ్య తన కుమార్తె భానును ఐదవతరగతిలో ఇటీవల జాయిన్ చేశారు. అయితే తల్లిదండ్రులను వదిలి పాఠశాలలో ఉండేందుకు ఇబ్బంది పడిన భాను ఉదయం పాఠశాల గేటు నుంచి టీచర్ల కండ్లుగప్పి బయటకు వచ్చి పరుగున గాంధీసెంటర్‌కు చేరుకుంది. ఇంతలో అటు వైపు నుంచి బస్టాండ్ సెంటర్‌కు వెళ్తున్న ఆటోను ఆపిన భాను అబ్బాయిపాలెం వెళ్లాలని డ్రైవర్‌కు తెలిపింది. దీంతో అనుమానం వచ్చిన ఆటోడ్రైవర్ బస్టాండ్ సెంటర్లో ఆటో నుంచి దింపాడు. తనను శుక్రవారం నలుగురు వ్యక్తులు కారులో బయ్యారం తీసుకొచ్చారని, తాను వారి నుంచి తప్పించుకొని వచ్చినట్లు బురిడి కొట్టించడానికి ప్రయత్నించింది. దీంతో ఆ బాలిక చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన స్థానిక ఆటోడ్రైవర్లు బాలికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీస్‌స్టేషన్‌లో బాలికకు ఎస్సై మురళీధర్ కౌన్సెలింగ్ నిర్వహించి వివరాలు అడుగగా తాను పాఠశాలలో ఉండేందుకు ఇష్టం లేక ఇంటికి వెళ్లేందుకు వచ్చానని అసలు విషయం తెలిపింది. దీంతో ఎస్సై బాలిక తల్లిదండ్రులతో పాటు పాఠశాల నిర్వాహకులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. మొత్తానికి సినీ ఫక్కిలో చిన్నారి చెప్పిన కథ స్థానికులను ఆందోళనకు గురిచేసినా ఆ తరువాత అసలు విషయం తెలిసి నివ్వెరపోయారు. -
ఎప్పుడు పరీక్ష చేయించినా...
నా వయసు 50 ఏళ్లు. నేను ఒక ప్రభుత్వ ఉన్నతోద్యోగిని. ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా మాస్టర్ హెల్త్చెకప్ చేయించుకుంటూ ఉంటాను. అయితే ప్రతిసారీ పరీక్షల్లో నేను ఒక విషయం గమనిస్తున్నాను. నా విటమిన్ బి12, విటమిన్–డి పాళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. మిగతా అన్ని పరీక్షలూ నార్మల్‌గా ఉంటున్నాయి. ప్రతిసారీ ఇందుకోసం మందులు వాడుతున్నా, నాకు ఆ పరీక్షల్లో నార్మల్ రిజల్ట్ రావడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి దీనికి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా? – ఒక సోదరుడు, హైదరాబాద్ విటమిన్ బి12 సాధారణంగా మాంసాహారంతో పాటు పాలు, పాల ఉత్పాదనల్లోనే చాలా ఎక్కువగా లభ్యమవుతుంటుంది. ఒకవేళ మీరు శాకాహారి అయి ఉండి, పాలు చాలా తక్కువగా తీసుకునేవారైతే మీకు విటమిన్ బి12, విటమిన్–డి లు పూర్తిస్థాయిలో భర్తీ అయ్యే అవకాశాలు ఉండవు. అయితే చాలామంది మాంసాహారం తీసుకునేవారిలో సైతం, దాన్ని రక్తంలోకి తీసుకెళ్లే కొన్ని కాంపోనెంట్స్ లేకపోవడం వల్ల అవి భర్తీకాకపోవచ్చు. ఇలా విటమిన్ బి12 తక్కువగా ఉన్నవారు వాటిని డాక్టర్ సూచించిన మోతాదులో (అంటే సాధారణంగా మొదట... ప్రతి రోజు ఒకటి చొప్పున నాలుగు రోజులూ, ఆ తర్వాత ప్రతివారం ఒకటి చొప్పున నాలుగు వారాలు, ఇక ఆ తర్వాత ప్రతి నెలా ఒకటి చొప్పున ఆర్నెల్లు... ఆ తర్వాత మూడు నెలలకొకసారి చొప్పున) ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాలి. ఇక విటమిన్–డి అనేది కేవలం సూర్యకాంతితోనే మనకు లభ్యమవుతుంది. ఆహారం ద్వారా లభ్యం కావడం చాలా చాలా తక్కువ (అందులోనూ చాలా ఎక్కువ మోతాదులో డి–విటమిన్ చేర్చితే తప్ప). ఒకవేళ విటమిన్–డి కోసం మీరు ఎండలో తిరిగినా కేవలం మీ ముఖం, బట్టలతో కప్పి లేని చేతుల వంటి భాగాలు మినహా మిగతా భాగాలు ఎండకు ఎక్స్పోజ్ కావు. మీ మేని రంగు నలుపు అయితే మీకు విటమిన్–డి పాళ్లు తక్కువగా సమకూరే అవకాశం ఉంది. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని విటమిన్–డి లోపం ఉన్నట్లు కనుగొన్నప్పుడు విటమిన్–డి 60,000 యూనిట్ల టాబ్లెట్లను వారానికి ఒకటి చొప్పున ఎనిమిది వారాలు వాడాల్సిందిగా డాక్టర్లు సూచిస్తారు. ఆ తర్వాత కూడా ప్రతి నెలా ఒక టాబ్లెట్ తీసుకొమ్మని సూచిస్తారు. మీరు ఒకసారి మీ ఫిజీషియన్/న్యూరాలజిస్ట్‌ను కలిసి చర్చించి, మీ డాక్టర్ సలహా మేరకు విటమిన్ సప్లిమెంట్లు వాడండి. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
రేపు సీనియర్ అసిస్టెంట్ల కౌన్సెలింగ్
అనంతపురం న్యూసిటీ : మునిసిపల్ ఆర్డీ కార్యాలయంలో ఈ నెల 6వ తేదీ జూనియర్ అసిస్టెంట్ల నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందుతున్న వారికి కౌన్సిలింగ్ చేపడుతున్నట్లు ఆర్డీ విజయలక్ష్మి తెలిపారు. 22 మునిసిపాలిటీల చైర్మన్లు, కమిషనర్లతోపాటు సిబ్బంది కూడా హాజరవుతున్నారన్నారు. -
నేడు వికలాంగ అభ్యర్థులకు కౌన్సెలింగ్
కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు వికలాంగ కేటగిరీ అభ్యర్థులకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కేయూలోని అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో కౌ న్సిలింగ్ జరుగుతుందని కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ మట్టా కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ వై.వెంకయ్య, డాక్టర్ లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. స్పె షల్ కేటగిరీ కింద సీటు కోరే వికలాంగ అభ్యర్థులు ఉదయం 9గంటలకు ప్రా రంభమయ్యే కౌన్సెలింగ్‌కు విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. -
ప్రారంభమైన ఐసెట్ కౌన్సెలింగ్
టూటౌన్: నల్లగొండ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఐసెట్–2016 కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు ఒకటవ ర్యాంకు నుంచి 12000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 222 మంది విద్యార్థులు హాజరు కాగా అధికారులు వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లింగం, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
23న ఐదోతరగతిలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : ఐదోతరగతిలో ఖాళీల భర్తీకి ఈనెల 23వ తేదీ ఉదయం 11గంటలకు జడ్చర్లలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వíß ంచనున్నట్టు జిల్లా సమన్వయకర్త కష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ బాలుర 14, బాలికలు 38, ఎస్టీ బాలికలు ఐదు, బీసీ బాలుర, బాలికలు, ఓసీ బాలుర రెండు చొప్పున, బాలికలు మూడు, మైనారిటీ బాలుర, బాలికలు నాలుగు చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే 21కొత్త గురుకుల పాఠశాలల్లో 6, 7తరగతులలో ప్రవేశాలకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సీజీజీ ద్వారా ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా భర్తీ చేస్తామన్నారు. ప్రవేశం పొందిన వారికి మెసేజ్ పంపడంతోపాటు కేటాయించిన పాఠశాల వివరాలు ్tswreis.telangana.cgg.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకుని, నేరుగా పాఠశాలకు వెళ్లి చేరాలని ఆయన సూచించారు. -
25 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఐసెట్–2016కు కౌన్సెలింగ్‌ను ఈ నెల 25 నుంచి ఎస్‌జీపీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తామని కోఆర్డినేటర్ వై.విజయభాష్కర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 25 నుంచి 29వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందన్నారు. జూలై 28 నుంచి 30వ తేదీ వరకు కళాశాలలకు ఆప్షన్లు, ఆగస్టు రెండో తేదీ కళాశాలల కేటాయింపు ప్రక్రియ ఉంటుందన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500, బీసీ/ఓసీ విద్యార్థులు రూ.1000 చెల్లించాలన్నారు. ఎన్సీసీ/పీహెచ్సీ/క్యాప్/స్పోర్ట్స్ కేటగిరీ వారికి విజయవాడ బెంజ్ సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఐసెట్–2006 హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, ఆధార్‌కార్డు, పది, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 9 నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్ల ఒరిజినల్స్, రెండు సెట్ల జిరాక్స్ ప్రతులతో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ (www.apicet.nic.in) లో చూడాలన్నారు. -
గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
రాజాపేట : సూర్యాపేట, నల్లగొండ, భువనగిరిలో నూతనంగా ఏర్పాటుచేసిన సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం ఈ నెల 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ భూక్యా శకృనాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 23న బీఏ, బీకాం (జనరల్), బీకాం (కంప్యూటర్), 24న బీఎస్‌స్సీ–ఎంపీసీ, బీఎస్సీ–ఎంఎస్సీఎస్, బీఎస్సీ–బీజెడ్సీ, బీఎస్సీ–జెడ్ఎంసీ గ్రూపులకు సూర్యాపేట ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే కౌన్సిలింగ్‌కు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఉదయం 10:30కు ఆయా తేదీల్లో కౌన్సెలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఉదయం 11 గంటల తరువాత ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించరని తెలిపారు. అభ్యర్థులు ఇంటర్మీడియెట్ మెమో, టీసీ, కుల, ఆదాయం, స్టడీ సర్టిఫికెట్, ఆధార్, రేషన్‌కార్డు, ఫిజికల్ ఫిట్నెస్, లోకల్ క్యాండెట్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు. -
కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టేకు హైకోర్టు నిరాకరణ