counciler
-
టీడీపీ మహిళా కౌన్సిలర్ ఓవరాక్షన్.. ఉద్యోగిపై దాడియత్నం!
తాడిపత్రి: టీడీపీ కౌన్సిలర్ల దాష్టీకం పరాకాష్టకు చేరుకుంది. రెండు రోజుల క్రితం మున్సిపల్ ఉద్యోగిపై ఏకంగా దాడికి యత్నించి, దూషణలకు దిగారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. రెగ్యులర్ నాన్ మస్టర్ రోల్ (ఆర్‌ఎన్‌ఎంఆర్) ఉద్యోగి జేసీ సూర్యనారాయణరెడ్డి శుక్రవారం ఉదయం విధుల విషయమై కమిషనర్ వద్దకు వెళ్లాడు. అప్పటికే చైర్మన్ చాంబర్లో కూర్చుని ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్, 36వ వార్డు టీడీపీ కౌన్సిలర్ జింకా లక్ష్మీదేవి, మరికొంతమంది కౌన్సిలర్లు ఉద్యోగి సూర్యనారాయణపైకి దూసుకొచ్చారు. ‘ఎప్పుడు చూసినా కమిషనర్ చాంబర్ వద్దే ఉంటావు.. ఇక్కడ ఏం పని’ అంటూ గద్దించారు. వారి మాటలను పట్టించుకోకుండా సదరు ఉద్యోగి కమిషనర్ చాంబర్ నుంచి బయటకు వెళ్తుండగా కౌన్సిలర్ లక్ష్మీదేవి అడ్డుకుని.. చొక్కా పట్టుకునేందు ప్రయచింది. కమిషనర్ జోక్యం చేసుకుని సర్దిచెప్పబోయారు. అయినా వినకుండా మహిళా కౌన్సిలర్‌తో పాటు మరి కొందరు కౌన్సిలర్లు ఉద్యోగిపై తిట్ల దండకం మొదలు పెట్టారు. ఉద్యోగిపై కార్యాలయంలోనే దాడికి యత్నించి, మానసిక స్థైర్యం దెబ్బతీసేలా ప్రవర్తించిన టీడీపీ కౌన్సిలర్ల తీరు పట్ల అక్కడే ఉన్న ప్రజలు అసహ్యించుకోవడం కనిపించింది. రెస్ట్ హౌస్‌గా చైర్మన్ చాంబర్ టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి చాంబర్‌ను రెస్ట్ హౌస్లా వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. వీరు నిత్యం ఉద్యోగుల విధుల్లోకి తలదూర్చడం, వారిని భయపెట్టడం వంటి చర్యలకు పూనుకుంటున్నారన్నది కొందరు మున్సిపల్ ఉద్యోగుల వాదన. ఎవరు ఏ పని చేయాలి.. ఎవరిని కలవాలనేది కూడా కౌన్సిలర్లే తమకు చెబితే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ ఉద్యోగికి పని చేయకున్నా జీతమా..? మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు, టీడీపీ సానుభూతిపరుడు అయిన రెగ్యులర్ నాన్‌మస్టర్ రోల్ ఉద్యోగి తిరుపాల్‌రెడ్డి పని చేయకున్నా జీతం వస్తోంది. మరి ఆ ఉద్యోగి విధులు ఏవి.. ఎక్కడ పని చేస్తున్నాడు.. వంటి వివరాలను ప్రజలకు తెలిపి ప్రజాధనం దురి్వనియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత టీడీపీ కౌన్సిలర్లపై లేదా అని ఉద్యోగులు నిలదీస్తున్నారు. కౌన్సిలర్లపై ఫిర్యాదు తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు దాడికి యత్నించిన టీడీపీ కౌన్సిలర్ లక్ష్మీదేవితో పాటు మరికొంతమంది కౌన్సిలర్లపై ఆర్‌ఎన్‌ఎంఆర్ ఉద్యోగి జేసీ సూర్యనారాయణరెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిని ఖండిస్తూ నిరసన ఆర్‌ఎన్‌ఎంఆర్ ఉద్యోగిపై దాడికి యతి్నంచి, మానసిక స్థైర్యం దెబ్బతీసేలా టీడీపీ కౌన్సిలర్ జింకా లక్ష్మీదేవి, మరికొందరు ప్రవర్తించిన తీరుపై మున్సిపల్ ఉద్యోగులు శనివారం నిరసన తెలిపారు. దురుసుగా మాట్లాడిన కౌన్సిలర్ లక్ష్మీదేవిపై చర్యలు తీసుకోవాలని కార్యాలయ మేనేజర్ రాజేశ్వరీబాయికి ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. చర్యలు తీసుకోకుంటే మున్సిపల్ సేవలు స్తంభింపజేసేందుకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. -
ఉక్రెయిన్‌పై దాడిని ఖండించిన మాస్కో కౌన్సిలర్‌కు ఏడేళ్ల జైలు
మాస్కో: ఉక్రెయిన్, రష్యా యుద్ధం గత నెలుగు నెలలకుపైగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి రష్యా సేనలు. యుద్ధం ముగించాలని ప్రపంచ నేతలు సూచిస్తున్నా, కఠిన ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గటం లేదు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ దాడిని ఖండించిన మాస్కో కౌన్సిలర్ అలెక్సీ గోరినోవ్కు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఖండిస్తూ మాట్లాడటమే ఆయన చేసిన తప్పు. క్రాస్నోసెల్స్కీ మున్సిపల్ కౌన్సిల్‌కు చెందిన 60 ఏళ్ల గోరినోవ్.. సిటీ కౌన్సిల్ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రశించారు. ఉక్రెయిన్‌లో వందల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ.. బాలల దినోత్సవంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను తప్పుపట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో చినిపోయిన వారికి సంతాపం తెలుపుతూ కొద్ది సేపు మౌనం పాటించారు. దీంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయనపై అభియోగాలు మోపారు. రష్యా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే కారణంగా కేసు నమోదైనట్లు తీర్పు చెబుతున్న సందర్భంలో న్యాయమూర్తి ఒలెస్యా మెండెలెయెవ తెలిపారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య తర్వాత అసమ్మతి వాదులను ఎదుర్కొనేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టాల ప్రకారం ఓ వ్యక్తికి జైలు శిక్ష విధించటం ఇదే మొదటి. ఈ కొత్త చట్టాల ప్రకారం.. ప్రభుత్వానికి, ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్యకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారికి గరిష్ఠంగా 15 ఏళ్ల జైలు శిక్ష విధించేందుకు వీలు కల్పించారు. సైనిక చర్య ద్వారా తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రజల్లో ఆందోళన నెలకొనేలా గోరినోవ్ మాట్లాడారని తీర్పు సందర్భంగా జడ్జి తెలిపారు. విచారణకు హాజరైన సందర్భంగా ఓ చిన్న కాగితంపై 'ఇప్పటికీ ఈ యుద్ధం మీకు అవసరమా?' అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేశారు గోరినోవ్. దానిని కెమెరాకు కనిపించకుండా చేసేందుకు అక్కడి భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. చదవండి: Russia-Ukraine War: అసలు యుద్ధం ముందే ఉంది -
మురికి కాల్వలో దూకిన కౌన్సిలర్.. వెంటనే పాలాభిషేకం.. ఎందుకో తెలుసా..?
సాక్షి, న్యూఢిల్లీ: సింహాద్రి సినిమాలో సింగమలై అంటూ విలన్లను ఊచకోత కోస్తాడు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఎన్టీఆర్‌కు పాలాభిషేకం చేస్తారు. ఇదే తరహాలో ఓ కౌన్సిలర్ చేసిన పనికి ప్రజలు ఫిదా అయిపోయి ఆయనకు పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా కౌన్సిలర్.. ఎందుకిలా చేశారు అనుకుంటున్నారా.. వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలో మున్సిపల్ కార్మికులు మురికి కాలువను శుభ్రం చేయడంలేదని ఆ ప్రాంత కౌన్సిలర్‌కు వినతి పత్రాలు అందాయి. దీంతో అక్కడికి చేరుకున్న ఆప్ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హసన్.. శాస్త్రి పార్క్‌లో పొంగిపొర్లుతున్న మురుగు కాలువను శుభ్రం చేయడానికి అందులోకి దిగారు. అనంతరం కాలువలోని చెత్తను తొలగించారు. AAP councilor Haseeb-ul-Hasan jumps in drain during mission clean up, then milk bath much in the style of actor Anil Kapoor in the Bollywood blockbuster “Nayak”. Watch the #ViralVideo. (Video by @PankajJainClick) #AAP #Drain #MilkBath pic.twitter.com/bkBAi5PyEB — IndiaToday (@IndiaToday) March 22, 2022 ఈ సందర్భంగానే ఆ కాలువను అక్కడి అధికారులు శుభ్రం చేయడం లేదని.. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగానని హసీబ్ చెప్పడం గమనార్హం. కాలువలోని చెత్తను తొలగించిన అనంతరం ఆ ప్రాంతంలోని ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు ఆయనను కూర్చోబెట్టి పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్ స్పందిస్తూ.. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతల స్టంట్లు మొదలయ్యాయంటూ కామెంట్స్ చేశాడు. -
పోలీసుల అదుపులో కౌన్సిలర్ హత్య కేసు నిందితుడు
-
అధికారులను కార్యాలయంలో పెట్టి తన్నాలి!
శ్రీకాకుళం, ఆమదాలవలస: అధికారులను కార్యాలయంలో పెట్టి తన్నాలంటూ టీడీపీ కౌన్సిలర్ ఎస్.మురళీధరరావు అనుచిత వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ తమ్మినేని గీత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌తోపాటు కౌన్సిలర్లు ప్రజాసమస్యలపై మాట్లాడుతూ అధికారులను, పాలకులను నిలదీశారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టి సాధారణ నిధులు, మున్సిపల్ బడ్జెట్ తదితర అంశాలపై లోతుగా అధ్యయనం చేసి కౌన్సిలర్లందరికీ వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో టీడీపీ కౌన్సిలర్ ఎస్.మురళీధరరావు లేచి ఈ సమాచారం అంతా మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులే ప్రతిపక్ష నాయకులకు అందిస్తున్నారని, అధికారులను కార్యాలయంలో పెట్టి తంతే బుద్ధి వస్తుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అధికారుల వల్లే గోప్యంగా ఉంచాల్సిన సమాచారం వైఎస్సార్ సీపీ నాయకులకు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు నిరసన తెలియజేస్తూ చైర్పర్సన్ పోడియం వద్దకు చేరారు. అధికారుల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం తగదన్నారు. వెంటనే మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతలో మున్సిపల్ చైర్పర్సన్ జోక్యం చేసుకొని రమేష్‌కుమార్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడటంతో విపక్ష, స్వపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
మాజీ కౌన్సిలర్ కుమార్తెపై టీడీపీ నాయకుడి దాడి
ప్రకాశం , కందుకూరు అర్బన్: పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు ఓ మాజీ కౌన్సిలర్ కుమార్తెపై కత్తితో దాడి చేశాడు. ఫలితంగా ఆమె ఎడమచేతికి 3 కుట్లు పడ్డాయి. ఈ సంఘటన శ్రీరామ్‌నగర్‌లో ఆదివారం జరిగింది. క్షతగాత్రురాలి బంధువుల కథనం ప్రకారం..మున్సిపాలిటీలోని 14వ వార్డు మాజీ కౌన్సిలర్ పుష్ప కుమార్తె రమాదేవి వివాహం అనంతరం స్థానికంగా నివాసం ఉంటోంది. బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్తూ తన అన్న వైఎస్సార్ సీపీ నాయకుడు మాధవరావు ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో టీడీపీ చెందిన సుధాకర్ అనే వ్యక్తి మద్యం తాగి మాధవరావు ఇంటి ముందు నిలబడిఅసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. రమాదేవి నువ్వు ఎవరిని తిడుతున్నావని ప్రశ్నించింది. మీ అన్ననే కావాలని తిడుతున్నానని సుధాకర్ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. సుధాకర్ కత్తితో రమాదేవిని పొడవడంతో ఆమె ఎడమ చేతికి గాయమైంది. వెంటనే రామాదేవి తన అన్న మాధవరావుకు సమాచారం ఇవ్వడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకొని రమాదేవిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాడు. దీన్ని గమనించిన సుధాకర్ తన తలను గోడకేసి కొట్టుకొని తనపై కూడా దాడి చేశారని పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేశాడు. బాధితులు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సుధాకర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు ఆయనకు వత్తాసు పలికారు. కత్తితో దాడి చేసిన సుధాకర్‌ను వదిలి గాయపడిన బాధితురాలి అన్నతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి పోలీసుస్టేష్టన్‌లో పెట్టారు. పోలీసులు తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అండగా నిలవాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ అన్యాయంగా తమపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని బాధితులు వాపోయారు. సుధాకర్ మాత్రం తనపై రమాదేవి బంధువులు దాడి చేయడంతో తలకు బలమైన గాయాలయ్యాయని ఆరోపిస్తుండటం గమనార్హం. -
కోటలోకి దండయాత్ర
విజయనగరం, బొబ్బిలి: ఆయనో మాజీ కౌన్సిలర్. గొల్లపల్లిలో ఉన్న ప్రజలను ఏదో ఒక అంశంలో వేధించడం, గ్రామ పెద్దలు, ఇతరులను దూషించడమే పనిగా పెట్టుకున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే రాజుగారి మనిషిని నేను. ఆయన ఆదేశాలతోనే చేస్తున్నా. వ్యతిరేకిస్తే పోలీస్‌స్టేషన్‌లో చూసుకుందాం. అట్రాసిటీ కేసులు పెడతానంటూ బెదిరించడం పరిపాటైంది. గ్రామంలో ఇళ్ల స్థలాలను కబ్జా చేయడం ఇతరులకు విక్రయించడం చేస్తున్నా సహించిన గ్రామస్తులు కుటుంబ వ్యవస్థ మీదకు వచ్చిన ఆ మాజీ కౌన్సిలర్ అంతు చూడాల్సిందేనంటూ పట్టుబట్టారు. గ్రామంలోని మహిళల మీద అసభ్యకర పదజాలంతో బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో యువత, మహిళలు, గ్రామ పెద్దలు ఓపిక నశించి అంతా ఒకటయ్యారు. తాను చేస్తున్న పనులన్నింటికీ రాజుల పేరు చెబుతుండడంతో ఆయన దగ్గరకే వెళ్లి అమీ తుమీ తేల్చుకునేందుకు కోటలోకి వెళ్లారు. చివరకు యువరాజు బేబీనాయన కూడా ఈ సంఘటనను తేలిగ్గా తీసుకున్నారంటూ ఉసురుమంటూ వెనుతిరిగారు. ఇంతమంది ప్రజలు వచ్చి మొత్తుకున్నా మాకు న్యాయం చేయలేదంటూ నిరుత్సాహం చెందారు. ఆదివారం చోటు చేసుకున్న ఈ సంఘటన పూర్వాపరాలను ఆ గ్రామానికి చెందిన ప్రజలు వివరించారు. అన్నింటా ఆయనదే హవా.. గొల్లపల్లిలో మాజీ కౌన్సిలర్ కాకల వెంకటరావు అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రైవేటు కార్యక్రమాల్లో తన హవా ప్రదర్శిస్తున్నాడు. ఎస్సీ, బీసీల మధ్య అంతరాలను పెంచుతూ తనదే పైచేయంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ తనకు రాజుల అండ ఉందంటూ చెబుతుంటాడు. దీంతో ప్రజలు ఇన్నాళ్లూ రాజుల మీద గౌరవంతో పడుతూ వచ్చారు. ఇటీవల బీసీల కుటుంబ వ్యవస్థ మీద దెబ్బకొట్టేలా ఓ వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. మైనర్ హరిజన బాలిక, బీసీ యువకుడితో ప్రేమ వివాహాన్ని నిర్వహించారు. కాకల వెంకటరావు చేపట్టిన ఈ కులాంతర వివాహాన్ని స్థానికులు, కుటుంబ సభ్యులు అడ్డుకోకపోయినప్పటికీ గ్రామంలో ఊరేగింపు చేపట్టి, బీసీ మహిళలపై అసభ్యకరంగా తనకు సానుకూలంగా ఉండే వ్యాఖ్యలను చేయడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నాళ్లిలా మౌనం దాల్చాలంటూ మహిళలు, యువత పెద్దల్ని ప్రశ్నించారు. దీంతో పెద్దలు సైతం ఇక మా వల్ల కాదంటూ పదండి రాజుల వద్దే తేల్చుకుందామని బయలు దేరారు. వందలాది మంది గ్రామస్తులు ఆటోలు, ట్రాక్టర్లపై కోటలోకి దండయాత్రలా వెళ్లారు. పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ మాకు న్యాయం చేయాలని గగ్గోలు పెట్టారు. నానా గొడవ చేసినా.. మహిళలు, యువత ఏదో ఒకటి తేల్చాలంటూ నానా గొడవ చేశారు. గ్రామ పెద్దలు సావు కృష్ణమూర్తి, వజ్జి చిన్నారావు, బొబ్బాది తవిటినాయుడు, దమ్మా అప్పచ్చి తదితరులు బేబీ నాయనకు జరిగిన సంగతిని వివరించారు. మీ పేరు చెబుతుండడంతో మేం ఏం అనలేకపోతున్నామనీ, చివరకు కుటుంబాల్లో చిచ్చు పెడుతూ తన హవా సాగిస్తున్నాడనీ, ఇక భరించడం మా వల్ల కాదనీ చెప్పుకొచ్చారు. ఆయన్ని కోటలోకి రానివ్వమని ప్రకటించాలనీ, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకానొక దశలో గ్రామస్తుల అరుపులు, కేకలతో కోట దద్దరిల్లిపోయింది. చివరకు బేబీ నాయన మాట్లాడేందుకు ప్రయత్నించినా జనాల నిరసన గళాల మధ్య వీలు పడలేదు. మీ మనోభావాలు దెబ్బతిన్న సంగతి తెలుసు.. చివరిగా బేబీ నాయన మాట్లాడారు. కాకల వెంకటరావు పేరు కూడా ఎత్తకుండా మీ మనోభావాలు దెబ్బతిన్నాయి. కొన్ని సంఘటనలు, సన్నివేశాల వల్ల మీ గ్రామ గౌరవం, ప్రతిష్ట దెబ్బతింది. మీ మనసులు గాయపడ్డాయి. పెద్దలు చెప్పగా తెల్సింది. కానీ ఇంత మందిలో న్యాయం చేయడం సరికాదు. గాబరాలో నిర్ణయాలు మంచివి కావు. ఒక ట్రెండు రోజుల్లో మీకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని అనడంతో ప్రజలు నిరుత్సాహం చెందారు. ఇంత చెప్పినా బేబీనాయన మా మాటలు మన్నించలేదు. మాకు న్యాయం జరుగలేదంటూ ఏఎస్పీ వద్దకు బయలు దేరి వెళ్లిపోయారు. ఏఎస్పీ గౌతమీ శాలిని ఆశ్రయించిన మహిళలు.. మా కుటుంబ వ్యవస్థలను మంటగలిపేలా మాజీ కౌన్సిలర్ వ్యాఖ్యలు చేస్తున్నాడనీ, నాతో బీసీ మహిళలు తిరుగుతున్నారంటూ వ్యాఖ్యానించడంతో మా ఆత్మస్థైర్యం దెబ్బతిందని మహిళలు ఏఎస్పీ వద్ద తమ బాధలను చెప్పుకున్నారు. వందలాది మంది కోట నుంచి ఏఎస్పీ వద్దకు వెళ్లగా కొద్దిమంది మహిళలను మాత్రమే ఆమె అనుమతించి వారి నుంచి వివరాలు సేకరించారు. ఫిర్యాదు ఇమ్మన్నారు. కాకల వెంకటరావును పిలిపించి మైనర్ బాలిక వివాహంపై ప్రశ్నించారు. అయితే ఈ విషయం తనకు తెలియదని చెప్పడంతో ఆమె ఆరా తీస్తున్నట్టు తెల్సింది. తనను రాజకీయంగా ఎదుర్కోలేక గ్రామ పెద్దలు తన హత్యకు కుట్రపన్నారని కాకల వెంకటరావు పోలీసుల వద్ద అన్నట్టు తెల్సింది. ఎదురు తిరిగిన జనం.. యువరాజు బేబీ నాయన వద్ద తమ కష్టాలను చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలు ఎప్పుడూ ఆయన మాట వినేవారు. ఈ సారి ఆయన మాట్లాడుతుంటే అడ్డుతగిలారు. ఆయన మాటలు వారు ఊహించిన విధంగా న్యాయంగా లేకపోవడంతో మాకు హామీ ఇవ్వండి. కాకల వెంకటరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఏదో ఒకటి తేల్చాలంటూ ఎదురు తిరగడం విశేషం. ఎన్నడూ లేని ఈ ప్రజాగ్రహానికి కౌన్సిలర్ వెంకటరావు కారణమంటూ కోటలోని వర్గాలు కూడా వ్యాఖ్యానించడం విశేషం. -
హోంమంత్రికి మొర పెట్టుకున్నా అరణ్యరోదనే..
పెద్దాపురం: ‘నా భర్తపై ఎస్సై చేయి చేసుకున్నా న్యాయం చేయలేని పదవి ఉంటే ఎంత, ఊడితే ఎంత. ఓ వార్డు ప్రతినిధిగా ఉంటూ నా భర్తకే రక్షణ కల్పించలేని పదవి నాకొ’ద్దంటూ అధికార టీడీపీకి చెందిన కౌన్సిలర్ యర్రా లక్ష్మి హోంమంత్రి నిమ్మకాయ ల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తు న్న నియోజకవర్గంలోని పెద్దాపురం పురపాలక సంఘం 25వ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లక్ష్మి కౌన్సిల్ సమావేశంలో అనూహ్యంగా పదవికి రాజీనా మా చేస్తున్నానని ప్రకటించి, రాజీనామా లేఖను చైర్మన్‌కు అందించి భర్తతో కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం చైర్మన్ రాజా సూరిబాబురాజు అధ్యక్షతన జరిగింది. అందరితో పాటు వచ్చిన కౌన్సిలర్ లక్ష్మి తన పదవికి రాజీనామా చేస్తున్నానని సమావేశంలో ఆరంభంలోనే రాజీనామా లేఖను చైర్మన్‌కు అందజేశారు. ఎస్సై తన భర్త హోటల్ వద్దకు వెళ్ళి రాత్రివేళ చేయి చేసుకుంటే విషయాన్ని బయటకు రాకుండా అధికారంలో ఉన్న పెద్దలపై గౌరవంతో ఆగి తే ఇప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం బాధాకరంగా ఉందన్నారు. హోం మంత్రి రాజప్ప దృష్టిలో ఉంచినా పోలీసులు, మేము ఒక్కటేనంటూ వారికి వత్తాసు పలికారని నిరసన వ్యక్తం చేశారు. తన భర్తపై చేయి చేసుకున్న పోలీసుల నుంచి రక్షణ లేని పదవి తనకొద్దంటూ తన భర్త శ్రీనుతో కలిసి అక్కడి నుంచి వెళ్ళి పోయారు. చైర్మన్ సూరిబాబురాజు స్పందిస్తూ పోలీసులను రప్పించి కౌన్సిల్ సభ్యుల ఎదుటే విచారించినా ఆమె రాజీనామా చేయడం బా«ధాకరమన్నారు. నాపై అభాండాలు తగదు : ఎస్సై కౌన్సిలర్ లక్ష్మి ఆరోపణపై ఎస్సై కృష్ణ భగవాన్ను ‘సాక్షి’ వివరణ కోరగా తాను విధి నిర్వహణలో భాగంగానే శ్రీనుకు రాత్రి 10.30 తరువాత హోటల్ ఉంచకూడదని సూచించానే తప్ప మరే విధమైన దురుద్దేశం లేదన్నారు. హోటల్ సమీపంలో రోడ్డు ప్రమాదాలు జరిగే జంక్షన్ కాబట్టి అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తే తనపై అభాండాలు వేయడం తగదన్నారు. -
నిధులిస్తలేరు
కామారెడ్డి టౌన్ : బల్దియాకు తన వార్డునుంచే ఎక్కువ ఆదాయం సమకూరుతున్నా.. సమస్యల పరిష్కారానికి తక్కువ నిధులు కేటాయిస్తున్నారని ఆవేదన చెందిన 32వ వార్డు కౌన్సిలర్ రామ్మోహన్ ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఎజెండా అంశాలు ప్రారంభం కాగానే నిధుల కేటాయింపులో తన వార్డుకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ 32 వార్డు కౌన్సిలర్ రామ్మోహన్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మతో వాగ్వాదానికి దిగారు. 32వ వార్డునుంచి బల్దియాకు ఎల్ఆర్ఎస్ ద్వారా రూ. 2 కోట్ల వరకు నిధులు సమకూరాయని, కానీ వార్డులో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేదని పేర్కొన్నారు.కౌన్సిలర్లను సంప్రదించకుండానే ఎజెండాను ఇష్టానుసారంగా సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిసారి సమావేశంలో ఆందోళన చేస్తున్నారని, ఇలాగైతే సభనుంచి సస్పెండ్ చేస్తామని చైర్పర్సన్ సుష్మ హెచ్చరించారు. దీంతో కౌన్సిలర్ రామ్మోహన్ తన వెంట తెచ్చుకున్న బ్యాగులోనుంచి కిరోసిన్ బాటిల్ తీసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. ఇతర కౌన్సిలర్లు, అధికారులు అతడిని అడ్డుకుని కిరోసిన్ బాటిల్‌ను లాక్కుని హాల్ బయట పెట్టారు. రామ్మోహన్ మరోసారి బాటిల్ తీసుకుని, చైర్పర్సన్ వద్దకు వచ్చి ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోవడానికి యత్నించాడు. సభ్యులు అడ్డుకుని బయటకు తీసుకువెళ్లి, శాంతింపజేశారు. సమావేశం వాయిదా.. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు. సభ్యులతో చర్చించి సమావేశం తేదీని ఖరారు చేస్తామని చైర్పర్సన్ తెలిపారు. కౌన్సిలర్‌పై కేసు నమోదు కామారెడ్డిక్రైం: మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆత్మహత్యకు యత్నించిన కౌన్సిలర్ రామ్మోహన్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్ తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మ ఫిర్యాదు మేరకు రామ్మోహన్‌పై ఆత్మహత్యాయత్నంతోపాటు సమావేశానికి అంతరాయం కలిగించడం, న్యూసెన్స్ చేయడం కేసులు నమోదు చేశామన్నారు. పట్టించుకోవడం లేదు.. నా వార్డులో రూ.2 కోట్ల వరకు ఎల్ఆర్ఎస్ నిధులు వచ్చా యి. నిబంధనల ప్రకారం ఇందులో 50 శాతం నిధులు మా వార్డులో ఖర్చు చేయాల్సి ఉంది. కానీ చైర్పర్సన్ దీనిని పట్టించుకోవడం లేదు. కౌన్సిల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే నాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆవేదనతో ఆత్మహత్యకు యత్నించా. – రామ్మోహన్, 32వ వార్డు కౌన్సిలర్, కామారెడ్డి అత్యధికంగా నిధులు కేటాయించాం.. 32వ వార్డుకు అన్యాయం చేస్తున్నామన్నది వాస్తవం కాదు. పట్టణంలో అన్ని వార్డులకంటే 32వ వార్డుకే ఎక్కువ నిధులు కేటాయించాం. రూ. కోటికిపైగా నిధులిచ్చాం. అయినా ప్రతిసారి రామ్మోహన్ సమావేశాన్ని అడ్డుకుంటున్నారు. – పిప్పిరి సుష్మ, మున్సిపల్ చైర్పర్సన్, కామారెడ్డి -
చెప్పులతో కొట్టుకున్న మున్సిపల్ కౌన్సిలర్లు
తాండూరు: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేదికగా ఇద్దరు కౌన్సిలర్లు పరస్పరం చెప్పులతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సోమవారం చోటు చేసుకుంది. ఎంఐఎం పార్టీకి చెందిన కౌన్సిలర్లు సోఫియా, ఫసియుద్దీన్ లకు గత కొంతకాలంగా వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. ఈ రోజు జరిగిన కౌన్సిల్ సమావేశానికి వారు ఇరువురు హజరయ్యారు. సమావేశంలో సర్వే నెంబరు 128 స్థల వివాదంలో ఒకరిని ఒకరు దూషించుకోవడంతో ఆగ్రహానికి గురై చెప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. వెంటనే స్పందించిన తోటి కౌన్సిలర్లు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినా గొడవ సద్దుమనగలేదు. కాగా, చైర్ పర్సన్ తీసుకున్న నిర్ణయాలను వైస్ చైర్ పర్సన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు తప్పుపట్టడంతో సమావేశం వాయిదా పడింది.