counting hall
-
వైఎస్సార్సీపీ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలి
సాక్షి, అమరావతి: కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధి, హైకోర్టు న్యాయవాది కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఏమన్నారంటే.. ⇒ ఉ.6 గంటలకల్లా ఏజెంట్లు కౌంటింగ్ హాల్ దగ్గర ఉండాలి. ఫారం–17 సీ కాపీని తీసుకెళ్లాలి. ⇒ పోటీలో ఉన్న అభ్యర్థులందరి ప్రతి ఓటు కరెక్టుగా నోట్ చేసుకోవాలి. ఏదైనా తప్పు కన్పిస్తే వెంటనే అక్కడే ఉన్న ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ⇒ అనారోగ్యం, ఇతర కారణాలతో బయటకు వచ్చేవారు రిటర్నింగ్ అధికారికి చెప్పి బయటకు రావాలి. ఒకసారి బయటకొస్తే లోపలికి రానివ్వరని గమనించాలి. ⇒ స్వతంత్ర అభ్యర్థులకు పోలైన ఓట్లను కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ⇒ ఏజెంట్లు ప్రతి రౌండ్ తర్వాత షీట్‌పై సంతకం చేసే ముందు మన పార్టీ అభ్యర్థి ఓట్లు మాత్రమే కాకుండా, టీడీపీ–జనసేన–బీజేపీ, ఇతర అభ్యర్థులకు పోలైన ఓట్లను స్పష్టంగా సరిచూసుకోవాలి. తేడా ఉన్నట్లుగా గుర్తిస్తే మరొక మారు కౌంటింగ్ చేయమని కోరాలి. అన్ని సరిపోయినప్పుడే సంతకం చేయాలి. ⇒ కౌంటింగ్ ఏజెంట్లతో అభ్యర్థి టచ్‌లో ఉంటూ అక్కడ ఏదైనా అవాంతరాలు ఎదురైతే, కౌంటింగ్ ఏజెంట్‌తో కానీ, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌తో కానీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అక్కడ పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలి. ⇒ ఏదైనా తప్పు జరుగుతోంది అని కౌంటింగ్ కేంద్రంలో గుర్తిస్తే చక్కటి లాజిక్‌తో ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ⇒ రిజెక్ట్ అయిన పోస్టల్ బ్యాలెట్ కంటే తక్కువ మార్జిన్ వచ్చి ఉంటే మళ్లీ పోస్టల్ బ్యాలెట్స్‌ని లెక్కించమని కోరే అధికారం అభ్యర్థికి, కౌంటింగ్ ఏజెంట్‌కి ఉంది. ⇒ పోస్టల్ ఓట్లను సంబంధిత ఫారంలో నింపి అభ్యర్థి, అబ్జర్వర్ కూడా చూసి సంతకం చేసిన తర్వాత ఆ రౌండ్ ఫలితం ప్రకటిస్తారు. ⇒ కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేవరకు కౌంటింగ్ హాల్లో అభ్యర్థి ఉండాలి. -
కల్వకుర్తి ఫలితానికి బ్రేక్
పాలమూరు, న్యూస్‌లైన్: ఆ కౌంటింగ్ హాల్ వద్ద ఉదయం 7 గంటల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పడిగాపులు కాశారు.. ‘మా పార్టీ అభ్యర్థి గెలుపు సాధిస్తారంటే.. కాదు మా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అవుతారంటూ ’ పోటా పోటీ గా నినాదాలు చేస్తూ ఉత్కంఠతో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూశారు. చివరి రౌండ్ రానే వచ్చింది.. ఆ రౌండ్ పూర్తయితే.. 633 ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం బయటపడేది.. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని 119 నంబర్ పోలింగ్ బూత్‌కు చెంది న ఈవీఎం సాంకేతికలోపం కారణంగా పనిచేయలేదు. దీంతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయిం ది. నిపుణులు వచ్చి బాగుచేస్తే ఫలితాలు వెల్లడిస్తారేమోనని.. అం తా రాత్రి 9.30 గంటల వరకు ఎదురు చూపులు చూశారు. కౌటింగ్ కేం ద్రం నిర్వహణాధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అవకాశం లేదని చెప్పడంతో ఉసూరంటూ అన్ని పార్టీలకు చెందిన వారు ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. కల్వకుర్తి 1వ రౌండ్ నుంచి 28వ రౌండ్ వర కు నువ్వా.. నేటా అన్న ట్లు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి మధ్య తీవ్రపోటీ ఏర్పడింది. కొన్ని రౌండ్లలో ఒకరు ముందంజలో నిలిస్తే.. అతర్వాత రౌండ్లలో మరొకరు మరొకరు ఆధిక్యతను ప్రదర్శించారు. ఆతర్వాత 32వ రౌండ్ వరకు ఆచారి ఆధిక్యతను ప్రదర్శించగా.. ఆతర్వాతి రౌండ్లలో వంశీచందర్ ఓటుశాతాన్ని పెంచుతూ వచ్చారు. చివరిరౌండ్ వచ్చేటప్పటికి 32 ఓట్ల ఆధిక్యతతో వంశీచందర్కు 42229 ఓట్లు నమోదయ్యాయి. ఆచారికి 42,197 ఓట్లు పోలయ్యాయి. చివరి రౌండ్ పూర్తయితేగాని వీరిద్దరిలో విజయం ఎవరిని వరించేదో తేటతెల్లమయ్యేది. చివరన ఈవీఎం పనిచేయకపోవడంతో ఫలితాలు నిలిచిపోయి. వీరితోపాటు కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి పోటీ చేసిన వారిలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్‌కు 29,687 ఓట్లు, వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎడ్మకిష్టారెడ్డికి 13,734 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి కె.నారాయణరెడ్డికి 23,999 ఓట్లు పోలయ్యాయి. బీఎస్పీ అభ్యర్థి కె.జంగయ్యకు 1892, ఆర్ఎల్డీ అభ్యర్థి వి.హుస్సేన్‌కు 916, స్వతంత్ర అభ్యర్థులు బాలాజీ సింగ్ ఠాకూర్‌కు 3,212, దోనాల క్రిష్ణారెడ్డికి 687, ఎత్తం శ్రీనివాస్‌కు 651 ఓట్లు దక్కాయి. ఇక పోతే నోటాకింద 1132 ఓట్లు పోలైనట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈసీ ఆదేశిస్తే..! ప్రెసెంట్ ఎక్సీడెడ్ సాంకేతిక లోపం కారణంగా.. ఈ వీఎం మొరాయించింది. కల్వకుర్తి నియోజకవర్గం జూపల్లి గ్రామానికి చెందిన 119 నంబర్ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒక ఈవీఎం మెషిన్ మొరాయించడంతో కౌంటింగ్ నిలిచిపోయింది. ఈ పోలింగ్ బూత్ పరిధిలో 633 ఓట్లు పోలయ్యాయి. ఈ మొత్తాన్ని లెక్కించాల్సి ఉండగా.. సాంకేతిక లోపం ఏర్పడటంతో తాత్కాలికంగా నిలపాల్సి వచ్చింది. ఈ సాంకేతిక లోపం నిపుణుల ద్వారా సరిదిద్దగలిగితే కౌంటింగ్ పూర్తిచేసి ఫలితాలు ప్రకటిస్తాం, ఒక వేళ ఈవీఎం పనిచేయకుంటే ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే.. ఆమేరకు రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. - కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ -
కొద్ది గంటల్లో ఓటరు తీర్పు
* తేలనున్న నేతలు, పార్టీల భవిష్యత్తు * నేటి ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం * 8.30 గంటల నుంచి ఈవీఎంల్లోని ఓట్ల కౌంటింగ్.. 11 గంటలకల్లా ట్రెండ్స్! * అత్యధికంగా 45 రౌండ్లలో మల్కాజిగిరి లోక్‌సభ, కూకట్పల్లి అసెంబ్లీ ఓట్ల లెక్కింపు * అతి తక్కువగా అనకాపల్లి లోక్‌సభకు 18 రౌండ్లు, చార్మినార్ అసెంబ్లీకి 13 రౌండ్లు * 17వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం విక్రయాలపై నిషేధం * లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు నిషేధం సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం ప్రారంభం కానుంది. తొలుత ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగం కారణంగా.. ఈ ప్రక్రియ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీన, సీమాంధ్రలో ఈ నెల 7వ తేదీన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా 4.82 కోట్ల మంది ఓటర్లు ఇచ్చిన తీర్పు శుక్రవారం వెలువడనుంది. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు 598 మంది పోటీ పడగా, 294 అసెంబ్లీ స్థానాలకు 3,910 మంది పోటీ పడ్డారు. ఉదయం 11 గంటలకల్లా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఏ పార్టీలు అధికారంలోకి రానున్నాయో (ట్రెండ్స్) తెలిసిపోయే అవకాశం ఉంది. కౌంటింగ్‌కు 25 వేల మంది సిబ్బంది రాష్ట్రంలోని 78 ప్రాంతాల్లో 168 కేంద్రాల్లోని 437 హాళ్లలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఉదయం 8 గంటల కల్లా అభ్యర్థుల ఏజెంట్లందరూ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను గురువారం భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 437 కౌంటింగ్ హాళ్లలో 6,955 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపునకు మొత్తం 25,000 మందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భద్రత నిమిత్తం 75,000 మంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఒక కౌంటింగ్ టేబుల్‌కు ఒకరు చొప్పున సూక్ష్మ పరిశీలకుడిని నియమించడంతో పాటు ప్రతి కేంద్రంలోను అదనపు సూక్ష్మ పరిశీలకులను నియమిస్తున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ 189 మంది పరిశీలకులను నియమించిందన్నారు. ఈవీఎంలన్నీ భద్రం ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రంగా ఉన్నాయని, ఎవరూ ఈవీఎంల దగ్గరకు వెళ్లలేదని, ఎవరూ ఈవీఎంలను ఇళ్లకు తీసుకువెళ్లలేదని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ప్రింటర్ ఆర్గనైజర్ డిస్ప్లేను భద్రపరచడంలో అలసత్వంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రజలకు ఫలితం తెలియజేసేందుకు తెరలను ఏర్పాటు చేశారు. అతి పెద్ద లోక్‌సభ స్థానం అయిన మల్కాజిగిరి ఓట్లను అత్యధికంగా 45 రౌండ్లలో లెక్కిస్తారు. అనకాపల్లి లోక్‌సభ స్థానం కౌంటింగ్ 18 రౌండ్లలోనే పూర్తి కానుంది. అలాగే కూకట్పల్లి అసెంబ్లీ ఓట్లను కూడా అత్యధికంగా 45 రౌండ్లలో లెక్కించనున్నారు. చార్మినార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు మాత్రం 13 రౌండ్లలోనే పూర్తి కానుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఎన్నికల సిబ్బంది ‘బ్యాలెట్ యూనిట్’లను ఆన్ చేస్తారు. ప్రతిరౌండ్ లెక్కింపు తర్వాత ప్రింట్అవుట్ను అభ్యర్థుల తరఫు ఏజెంట్లకు అందజేస్తారు. ఫలితాలను ఠీఠీఠీ.ఛిౌ్ఛ్చఛీజిట్చ.జీఛి.జీ వెబ్సైట్లో చూడవచ్చు. గురువారం అర్ధరాత్రి నుంచి 17వ తేదీ ఉదయం వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలను నిషేధించారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకురావడంపైనా నిషేధం విధించారు.