cow ghee
-
బాబు గారి ‘కొవ్వు’ బాగోతం బట్టబయలు
సాక్షి, అమరావతి: తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిపే ఆవు నెయ్యి సరఫరాకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహించిన టెండర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనన్న విషయం మరోసారి బహిర్గతమైంది. అయిన వారికి కట్టబెట్టడం కోసం అడ్డగోలుగా నిబంధనలు మార్చేశారంటూ ఆయన చేసిన ఆరోపణల్లో వీసమెత్తు నిజం లేదన్నది మరోసారి వెల్లడైంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు పది లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరాకు నిర్వహించిన టెండర్లలో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇప్పుడు అదే టెండర్ నిబంధనలతో తాజాగా పది లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరాకు ఈనెల 7న (సోమవారం) టీటీడీ మార్కెటింగ్ విభాగం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం సీఎం చంద్రబాబు బండారాన్ని బయటపెట్టింది. చంద్రబాబు ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశంతో చేసినవేనన్న విషయాన్ని స్పష్టం చేసింది. స్వచ్ఛత కోసం ప్రమాణాలు పెంపు తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ, అన్న ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి, ముడిసరుకుల సేకరణకు టీటీడీ మార్కెటింగ్ విభాగం ఎప్పటికప్పుడు టెండర్లు నిర్వహిస్తుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి సేకరణకు ఆర్నెల్లకు ఓ సారి టెండర్లు పిలుస్తుంది. నెయ్యిలో తేమ శాతం 0.3 శాతానికి మించకూడదని, బూటిరో రిఫ్రాక్టో (బీఆర్) మీటర్ రీడింగ్ 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 40–43 మధ్య ఉండాలని, ఆర్ఎం వాల్యూ కనిష్టంగా 26 ఉండాలని, బౌడౌన్, మినరల్ ఆయిల్, ఫారిన్ కలర్స్ టెస్టుల్లో నెగెటివ్ రావాలని, మెల్టింగ్ పాయింట్ 27–37 డిగ్రీల మధ్య ఉండాలనే ఎనిమిది ప్రమాణాలతో 2019 మే 29 వరకూ టెండర్లు పిలిచేవారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత స్వచ్ఛమైన ఆవు నెయ్యి సేకరణకు మరో తొమ్మిది ప్రమాణాలను అదనంగా చేర్చింది. మొత్తం 17 ప్రమాణాలతో రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించి, శ్రీవారి ఖజానాకు భారీగా ఆదా చేశారని టీటీడీ అధికారవర్గాలే చెబుతున్నాయి. నిబంధనలు మరింత కఠినతరం భూమన కరుణాకర్‌రెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి సేకరణకు నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఈమేరకు 2023 నవంబర్ 14న టీటీడీ బోర్డు సమావేశంలో తీరా>్మనాన్ని ఆమోదించి అమలు చేశారు. ఆవు నెయ్యి సేకరణ టెండర్లలో పాల్గొనాలంటే కనీసం ఐదేళ్లు వరుసగా డెయిరీలో నెయ్యిని ఉత్పత్తి చేసి ఉండాలని, జాతీయ డెయిరీలైతే రోజుకు 4 లక్షల లీటర్లు, 1500 కిలోమీటర్ల పరిధిలోని డెయిరీలైతే రోజుకు 2 లక్షల లీటర్లు, రాష్ట్రంలోని డెయిరీలైతే రోజుకు లక్ష లీటర్ల పాలను సేకరిస్తుండాలని నిబంధనలు పెట్టారు. జాతీయ డెయిరీలైతే నెలకు 360 టన్నులు లేదా ఏడాదికి 5 వేల టన్నుల ఆవు నెయ్యి ఉత్పత్తి చేసి ఉండాలని, రూ.500 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలని షరతు విధించారు. 1,500 కిలోమీటర్ల పరిధిలోని డెయిరీలైతే నెలకు 180 టన్నులు లేదా ఏడాదికి 2,750 టన్నుల ఆవు నెయ్యిని ఉత్పత్తి చేసి ఉండి, రూ.250 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగి ఉండాలని నిబంధన పెట్టారు. రాష్ట్రంలోని డెయిరీలకైతే నెలకు 90 టన్నులు లేదా ఏడాదికి 1,500 టన్నుల ఆవు నెయియని ఉత్పత్తి చేసి ఉండి.. రూ.వంద కోట్ల టర్నోవర్ ఉండాలని షరతు విధించారు. వాటిని నిక్కచ్చిగా అమలుచేయడంతో కాంట్రాక్టు పొందిన డెయిరీలు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని టీటీడీకి సరఫరా చేశాయి. ఇదే నిబంధనలతో ఎన్నికల సంఘం పర్యవేక్షణలో 2024 మార్చి 12న టీటీడీ పిలిచిన టెండర్లలో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకుంది. ఇప్పుడూ అవే నిబంధనలతో టీటీడీ టెండర్లు పిలవడం గమనార్హం. -
ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు
తిరుపతి సిటీ : టీటీడీ లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో గతంలో కల్తీ ఎక్కువగా ఉందని ఎన్డీడీబీ తేల్చిందని, అందుకోసం ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పులు తీసుకొచ్చామని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. ఆదివారం రాత్రి తిరుపతి పద్మావతి గెస్ట్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం స్వచ్ఛమైన ఆవు నెయ్యినే ప్రసాదంలో వినియోగిస్తున్నామని చెప్పారు. నందిని, ఆల్ఫా మిల్క్ వంటి పేరొందిన సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కిలో రూ.475తో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న నెయ్యిని ఎన్డీడీబీ పరీక్షలు చేసి స్వచ్ఛమైనదిగా తేల్చిందన్నారు. క్రమం తప్పకుండా ఎన్ఏబీఎస్ అక్రిడిటేషన్ ల్యాబ్‌కు శ్యాంపిల్స్‌ను పంపించే ప్రక్రియను కొనసాగిస్తామన్నారు. మొదటి సారిగా ఆవు నెయ్యి స్వచ్ఛతపై పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఇందుకోసం మైసూరు సీఎఫ్టీఆర్ఐలో ట్రైనింగ్ పొంది ల్యాబ్‌లో పని చేసిన 18 మందిని సెన్సరీ ప్యానెల్‌గా ఏర్పాటు చేశామన్నారు. వీరు నెయ్యి స్వచ్ఛతతోపాటు, రంగు, రుచి, వాసన కనుక్కునే విధానంలో నిపుణులని చెప్పారు. ఎన్డీడీబీ సంస్థ సహకారంతో డిసెంబర్‌లోపు రూ.75 లక్షల విలువగల నెయ్యి పరీక్షా పరికరాలు టీటీడీకి సమకూరుతాయని తెలిపారు. లడ్డూ పోటులో సంప్రోక్షణ పూర్తిఆలయంలోని అన్న ప్రసాదాలు, లడ్డూ పోటులలో సంప్రోక్షణ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేశామని ఈవో చెప్పారు. భక్తులలో ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే, వారి సంతోషం కోసం శాంతి హోమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్దజియ్యర్, ఆగమశాస్త్ర పండితుల సలహా మేరకు సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయంలోని బంగారు బావి వద్ద గల యాగ శాలల్లో మూడు హోమ గుండాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా, కల్తీ నెయ్యిపై మైసూరు టెస్టింగ్ సంస్థ రిపోర్ట్‌లను ఎందుకు బహిర్గతం చేయలేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఈవో స్పందించ లేదు. తాను ఏమీ మాట్లాడలేనని చేతులెత్తేశారు. 2014–19లో, 2019–24 మధ్య కాలంలో ప్రమాణాలు పాటించని ఎన్ని సంస్థలను బ్లాక్‌లో పెట్టారు.. ఎన్ని ట్యాంకర్లను వెనక్కి పంపారన్న ప్రశ్నకూ సమాధానం దాటవేశారు. చంద్రబాబు హయాంలో సైతం అతి తక్కువ ధరతో నెయ్యిని కొనుగోలు చేశారని.. ఆ సమయంలో నెయ్యి స్వచ్ఛంగానే ఉందా.. అన్న ప్రశ్నకు సైతం తన వద్ద సమాధానం లేదన్నట్టు వ్యవహరించారు. అన్ని విషయాలు సీఎం చంద్రబాబు ప్రెస్మీట్లో చెప్పారంటూ తప్పించుకున్నారు. కాగా, సీఎం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను ఈవో చదవడం తప్పు మరేమీ చెప్పడం లేదన్న వ్యాఖ్యలు మీడియా ప్రతినిధుల నుంచి వినిపించాయి. -
ఆవు నెయ్యి.. టీడీపీకి గొయ్యి!
సాక్షి, అమరావతి : తిరుమల శ్రీవారి మహా ప్రసాదమైన లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిపై ఉన్మాద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించారంటూ దుర్మార్గపు ఆరోపణలు చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా భక్తులు భగ్గుమన్నారు. వైఎస్సార్సీపీపై దుష్ఫ్రచారం చేసి, రాజకీయంగా లబ్ధి పొందడానికి తిరుమల శ్రీవారిని వాడుకుంటారా.. అంటూ హిందువులు నిప్పులు చెరిగారు. దాంతో తాను చేసిన ఆరోపణలను సమర్థించుకోవడానికి గురువారం ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) పరీక్ష నివేదికను వక్రీకరించి.. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిపారంటూ సామాజిక మాధ్యమాల్లో టీడీపీ మూకలతో హోరెత్తించారు. కానీ.. ఆ పరీక్ష నివేదికను పరిశీలిస్తే.. ఆవు నెయ్యిని పరీక్షల కోసం 2024 జూలై 12న టీటీడీ పంపగా, అది తమకు జూలై 17న చేరిందని.. పరీక్షించి జూలై 23న నివేదిక ఇచ్చినట్లు అందులో స్పష్టంగా ఉంది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే. దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు ప్రభుత్వమే.అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. టీటీడీ ఈవోగా జె.శ్యామలరావును జూన్ 14న చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఎన్డీడీబీ పరీక్ష నివేదిక టీటీడీకి ఇచ్చిన రోజు అంటే.. జూలై 23న టీటీడీ ఈవో జె.శ్యామలరావు తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ ఒక ఆవు నెయ్యి ట్యాంకర్లో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్లు కల్తీ అయినట్లు ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఆవు నెయ్యి కల్తీ చేసి సరఫరా చేసిన సంస్థను బ్లాక్ లిస్ట్‌లో ఎందుకు పెట్టకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు ఇచ్చామని చెప్పారు. మరో ట్యాంకర్ ఆవు నెయ్యిలోనూ వెజిటబుల్ ఫ్యాట్ కలిపినట్లు తేలిందని, దాన్ని సరఫరా చేసిన సంస్థకు షోకాజ్ నోటీసు ఇచ్చామని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. ఎన్డీడీబీ జూలై 23న రెండు ట్యాంకర్ల ఆవు నెయ్యిపై ఇచ్చిన పరీక్షల నివేదికలను విశ్లేషిస్తే.. అందులో వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్లు ఉందే తప్ప, ఎక్కడా జంతువుల కొవ్వు కలిసినట్లు లేదని టీడీపీ అధికార వర్గాలతోపాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తేల్చి చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే.. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించారంటూ చంద్రబాబు చేసిన ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టమవుతోంది.ఈ ప్రశ్నలకు బదులేది1 2024 జూలై 23న ఎన్డీడీబీ నివేదిక వచ్చిన వెంటనే టీటీడీ ఈవో శ్యామలరావు ప్రెస్‌మీట్ పెట్టి ఆవు నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్లు కల్తీ అయ్యాయని చెప్పారా లేదా?2 దాదాపు రెండు నెలల తర్వాత చంద్రబాబు ఎన్డీఏ కూటమి మీటింగ్‌లో ‘‘నెయ్యికి బదులు’’ జంతువుల కొవ్వు వాడుతున్నారు అని చెప్పడం దురుద్దేశం కాక మరేమిటి?. ఈ రెండు నెలల ఎందుకు మౌనంగా ఉన్నారు. బుధవారం సడెన్‌గా రాజకీయ వేదికపై ఎందుకు మాట్లాడారు.?3 టీటీడీ ఈవో మాట్లాడిన దానికి భిన్నంగా చంద్రబాబు అండ్ కో రాజకీయ విమర్శలు చేయడంలో ఆంతర్యం ఏమిటి.? 4 తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్టును రిలీజ్ చేయడం వెనుక మీకున్న కుట్రపూరిత ఆలోచన బహిర్గతం అవుతోంది కదా? 5 నీ హయాంలోనే ఎన్డీడీబీకి టెస్ట్‌కు పంపించావు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రిపోర్టు వచ్చింది. దానికి ఎవరు బాధ్యులు? సమాధానం చెప్పాల్సిన నువ్వే.. చెప్పకుండా, పైగా అరుస్తావెందుకు?టెండర్ల ద్వారా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనుగోలు శ్రీవారి నైవేద్యాలు, లడ్డూల తయారీ కోసం రోజుకు 15 టన్నుల నెయ్యిని టీటీడీ వినియోగిస్తోంది. ఈ నెయ్యిని ఈ – ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా టెండర్లు పిలిచి కొనుగోలు చేస్తుంది. తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థలకు ఆవు నెయ్యి సరఫరా బాధ్యతలను అప్పగిస్తుంది. టెండర్లలో పేర్కొన్న ప్రమాణాల మేరకు నెయ్యిని సరఫరా సంస్థలు ట్యాంకర్లలో టీటీడీకి సరఫరా చేయాలి. ప్రతి ట్యాంకర్ నెయ్యిని టీటీడీ అధికారులు తనిఖీ చేయిస్తారు. పరీక్షల్లో టెండర్లలో పేర్కొన్న ప్రమాణాల మేరకు నెయ్యి ఉంటేనే తీసుకుంటారు. లేదంటే.. సరఫరా సంస్థకు వెనక్కు పంపుతారు. కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు బ్లాక్ లిస్ట్‌లో ఎందుకు పెట్టకూడదో వివరణ ఇవ్వాలంటూ సంబంధిత సరఫరా సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. టీటీడీ చరిత్రలో ఇప్పుడే కాదు.. ఎప్పుడూ జంతవుల కొవ్వుతో కల్తీ అయిన నెయ్యిని సరఫరా సంస్థలు సరఫరా చేసిన దాఖలాలు లేవని.. అప్పుడప్పుడు వెజిటబుల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని సరఫరా చేస్తే.. దానిని వెనక్కు పంపుతున్నామని.. నెయ్యి కొనుగోలులో కీలక భూమిక పోషిస్తున్న టీటీడీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.దొంగల్లా దొరికినా రుబాబే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీకీ ఆ సంస్థ సరఫరా చేసిన రెండు ట్యాంకర్ల ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్లు మాత్రమే ఎన్డీడీబీ పరీక్ష నివేదిక ఇచ్చింది. జంతువుల కొవ్వు కలిసిన దాఖలాలే లేవని ఆ నివేదిక స్పష్టం చేయడం.. అప్పుడు అధికారంలో ఉన్నది తామే కావడంతో సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికపోయారు. అయినా సరే.. తాను చేసిన ఆరోపణలు నిజమని చాటిచెప్పేందుకు యథేచ్ఛగా గురువారం కూడా అబద్ధాలతో రుబాబు చేశారు. సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేశ్ మరో అడుగు ముందుకేసి అవాస్తవాలు వల్లె వేస్తూ.. హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతూ వైఎస్సార్సీపీపై రంకెలు వేయడం గమనార్హం. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారంటూ చంద్రబాబు, లోకేశ్‌పై శ్రీవారి భక్తులు, టీటీడీ అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.నాడు.. నేడు సరఫరా సంస్థలు ఒక్కటే» టీటీడీకి 2013 అక్టోబరు నుంచి 2019 మార్చి వరకు బరేలికి చెందిన ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 33 లక్షల కేజీల ఆవు నెయ్యి సరఫరా చేసింది. అప్పట్లో ఐదేళ్లు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.» 2016 మార్చి నుంచి ఆర్నెళ్లపాటు ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకే పూర్తి స్థాయిలో నెయ్యి సరఫరా బాధ్యతలను టీటీడీ అప్పగించింది. 2016 సెప్టెంబరులో నిర్వహించిన టెండర్లలోనూ మరో ఆర్నెళ్లపాటు నెయ్యి సరఫరా బాధ్యతలను టీటీడీ అదే సంస్థకు అప్పగించింది. అప్పట్లో అధికారంలో ఉంది చంద్రబాబు ప్రభుత్వమే. » 2017 ఏప్రిల్‌లో ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకే 8.35 లక్షల కేజీల ఆవు నెయ్యిని సరఫరా చేసే బాధ్యతలను టెండర్ల ద్వారా టీటీడీ అప్పగించింది. 2017 అక్టోబర్‌లో 8,58,216 కేజీలు, 2018 జనవరిలో 23.30 లక్షల కేజీల ఆవు నెయ్యి సరఫరా చేసే బాధ్యతలను ఇదే సంస్థకే అప్పగించింది. 2018 జూన్ 29.. 2018 అక్టోబర్ 10న నిర్వహించిన టెండర్లలోనూ ఇదే సంస్థకే నెయ్యి సరఫరా బాధ్యతలను టీటీడీ అప్పగించింది. అప్పుడంతా అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే.» వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు పలు సంస్థలకు టెండర్ల ద్వారా ఆవు నెయ్యిని సరఫరా చేసేందుకు టీటీడీ అప్పగించింది. ఈ ఏడాది జూలై 12న ఎన్డీడీబీకి టీటీడీ పంపిన ఆవు నెయ్యి శాంపుల్ ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ సరఫరా చేసిందే. » చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే.. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. జంతువుల కొవ్వు కలిసిన ఆవు నెయ్యినే టీటీడీకి సరఫరా చేసిందనుకోవాలని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ.. టీటీడీ చరిత్రలో ఎన్నడూ అలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని తేల్చి చెబుతున్నాయి. -
ఆ పవర్ బీఫ్లో కాదు.. ఆవునెయ్యిలో ఉంది
సాధారణంగా క్రీడాకారులకైనా.. ఒలింపిక్ పతకాలు గెలవాలన్నా.. శారీరక దారుఢ్యం ఉండాలి. బాడీ ఫిట్నెస్ కోసం ఏ ఆహారం తీసుకోవాలి..? యోగాగురు బాబా రాందేవ్ మాత్రం ఆవు నెయ్యి తినాలని చెబుతున్నారు. జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ బీఫ్ తినడం వల్లే తొమ్మిది ఒలింపిక్ స్వర్ణ పతకాలు గెలిచాడని బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలను రాందేవ్ తప్పుపట్టారు. ఆవు నెయ్యి తింటే నిజమైన చాంపియన్లు తయారవుతారని, బీఫ్ వల్ల కాదంటూ కౌంటర్ ఇచ్చారు. ఆవు నెయ్యిలో అంతటి శక్తి ఉందని చెప్పారు. బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బోల్ట్ చాలా పేదవాడని, బీఫ్ తినాల్సిందిగా అతని కోచ్ సలహా ఇచ్చాడని, దీనివల్లే బోల్ట్ తొమ్మిది ఒలింపిక్ పసిడి పతకాలు గెలిచాడని ట్వీట్ చేశాడు. కాగా బోల్ట్ మెనూలో బీఫ్ లేదు. బోల్ట్ మెనూలో ప్రధానంగా చికెన్, పోర్క్, చేపలు, దుంపకూరలు ఉంటాయి. -
‘కల్తీ’ గుట్టురట్టు
నువ్వుల నూనె, ఆవు నెయ్యి పేరిట పామాయిల్ అమ్మకాలు విజయవాడ పాత ఆర్ఆర్పేటలో తయారీ కేంద్రం స్థానికుల సమాచారంతో రంగంలోకి అధికారులు సరుకు, గోడౌన్ సీజ్ విజయవాడ : భక్తులు దీపారాధనకు వినియోగించే ఆవునెయ్యి, నూనెను కల్తీ చేసి వాటిని మార్కెట్లో అమ్ముతూ అక్రమార్కులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఈ వ్యవహారం విజయవాడలో వెలుగులోకి వచ్చింది. పాత రాజరాజేశ్వరిపేటలోని కొత్త మసీదు వీధిలో శ్రీలక్ష్మీసాయి అయిల్ ట్రేడర్స్ పేరిట అమరా రామసుధాకర్రావు మూడేళ్లగా దీపారాధన నూనెల వ్యాపారం చేస్తున్నారు. డాల్డా, పామాయిల్‌తోపాటు కొన్ని రసాయనాలు, రంగులను కలిసి ఆవునెయ్యి పేరుతో 50, 100, 500 మిల్లీలీటర్ల ప్యాకెట్లలో నింపుతున్నాడు. నూనె చిక్కబడేందుకు కొన్ని రసాయనాలతో కొవ్వును సైతం కలుపుతున్నట్లు సమాచారం. నువ్వుల నూనె పేరిట రైస్ బ్రాన్ ఆయిల్‌తో పాటు ఎందుకూ పనికిరాని వైట్ ఆయిల్లో సుగంధ ద్రవ్యాలను కలిపించి ప్యాకింగ్ చేయిస్తున్నాడు. డాల్డా, పామాయిల్‌తో నెయ్యి తయారీ సందర్భంలో పలు రసాయనాలను వినియోగిస్తునట్లు తెలిసింది. వాటిని వేడి చేసేందుకు గ్యాస్ పొయ్యిలను వినియోగిస్తున్నారు. నెయ్యి విక్రయాలలో పేరుపొందిన నందిని పేరును అనుకరిస్తూ శ్రీనందిని, సత్యభామ, ఎస్ఎల్ఎస్ ఆయిల్ పేరిట దీపారాధన నూనెలను మార్కెట్లోకి సంస్థ నిర్వాహకుడు సరఫరా చేస్తున్నారు. ఈ వ్యవహారం అత్యంత పకడ్బందీగా చేస్తున్నారు. ప్యాకింగ్ జరిగే భవనం ఎదురుగా ఎవరు వచ్చినా తమకు కనిపించేలా సీసీ కెమెరాలను సంస్థ నిర్వాహకుడు ఏర్పాటు చేయించారు. వాటి ద్వారా నిఘా ఉంచి, సరుకు కల్తీ గుట్టు రట్టవకుండా సంస్థ నిర్వాహకుడు జాగ్రత్తలు తీసుకున్నారు. శనివారమే బట్టబయలు మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం రాబోతుండటంతో రేయింబవళ్లు పెద్దఎత్తున కల్తీ ఆవునెయ్యి, నువ్వుల నూనెలను ఈ సంస్థలో ప్యాకింగ్‌కు సిద్ధం చేస్తున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం మధ్యాహ్నం పోలీసులకు విషయం తెలిసినా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. శనివారం రాత్రి కొత్తపేట పోలీసులు మచిలీపట్నంలోని ఫుడ్ ఇన్స్పెక్టర్లు అన్నపురెడ్డి సుందరరామరెడ్డి, ఎం.శ్రీనివాసరావులకు సమాచారం అందించారు. కొత్తపేట సీఐ వెంకటేశ్వర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు శనివారం రాత్రి నూనె గోడౌన్‌ను పరిశీలించారు. ఆదివారం పంచనామా నిర్వహించాలని భావించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా రెండు శాఖల అధికారులు జాగ్రత్తలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుడ్ ఇన్స్పెక్టర్లు మధ్యాహ్నం గోడౌన్ నుంచి ఆయిల్ శాంపిల్స్‌ను తీసుకుని హైదరాబాద్‌కు పంపారు. వీటి పరీక్షలకు సంబంధించి రిపోర్టు వచ్చే వరకు గోడౌన్‌తో పాటు స్టాక్‌ను సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. కల్తీ జరిగిందని తెలిస్తే రూ.2 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. రాష్ర్టవ్యాప్తంగా విక్రయాలు డాల్డా, పామాయిల్‌తో తయారు చేసిన ఆవునెయ్యి, నువ్వుల నూనె రాష్ర్టంలోని అన్ని ప్రముఖ దేవాలయాలతో పాటు ప్రముఖ నగరాలలో విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. భారీఎత్తున జరుగుతున్న ఈ వ్యాపారానికి ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా పలువురు అధికారులకు, స్థానిక నేతలకు సంస్థనుంచి నెలనెలా మామూళ్లు అందుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఆవునెయ్యి, నువ్వుల నూనెలను కల్తీ చేస్తున్న వ్యాపారులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. కార్పొరేషన్లో సేల్స్ టాక్స్, పుడ్ ఇన్స్పెక్టర్లకు మేనేజ్ చేసుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నామని ఈ సంస్థ నిర్వాహకుడు చెబుతున్నట్లు తెలిసింది. మరో 10 రోజులలో తమ స్టాక్‌ని రిలీజ్ చేయించుకోగలమని అతను ధీమా వ్యక్తం చేస్తున్నాడని సమాచారం. ఎలాంటి అనుమతులు లేకుండా నగరపాలక సంస్థ నుంచి తీసుకున్న ట్రేడ్ లెసైన్స్‌తో లక్షల రూపాయల కల్తీ వ్యాపారం జరుగుతున్నా తమ దృష్టికి రాలేదని సేల్స్ టాక్స్ అధికారులు చెప్పడం శోచనీయం.