Crop water
-
సాగు సంబరం
జిల్లాలో వ్యవసాయ సాగు సంబరం నెలకొంది. గడిచిన ఐదేళ్లలో తొలి పంటకే సాగునీటికి కటకటలాడిన పరిస్థితులు. అరకొర విస్తీర్ణానికే ఐఏబీలో నీటి కేటాయింపులు. మొదటి పంటపైనే ఆశలు లేని పరిస్థితులకు భిన్నంగా ఈ ఏడాది రబీ, వచ్చే ఏడాది ముందస్తు ఖరీఫ్‌కు సైతం సాగు నీరు విడుదల చేస్తామని పాలకులు, అధికారులు ప్రకటించడంతో అన్నదాతల్లో ఆనందం తాండవం ఆడుతోంది. జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో వర్షాల సీజన్‌కు ముందే నీరు పుష్కలంగా ఉండడంతోపాటు, చెరువుల్లో జలకళ తొణికిసలాడుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన ఐఏబీ సమావేశంలో కాలువల వారీగా నీటి కేటాయింపులు వెల్లడించారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా రైతాంగ చరిత్రలో ఇది చారిత్రాత్మకం. వర్షాలకు ముందే జిల్లాలో ప్రధాన జలాశయాలతో పాటు చెరువులు, రిజర్వాయర్లలో 118.75 టీఎంసీలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో సాగునీటి అవసరాలను తీర్చేందుకు పక్కా ప్రణాళికలతో పాలకులు, అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. రబీ సీజన్ కంటే దాదాపు 60 రోజుల ముందు నుంచే జిల్లాలోని ప్రధాన చెరువులు, కాలువలకు నీరు విడుదల చేశారు. ఏటా జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం తర్వాత నీటి లభ్యతను బట్టి లెక్కలు అంచనాలు వేసి నీటి కేటాయింపులు జరిగేవి. కానీ ఈ పర్యాయం దీనికి పూర్తి భిన్నంగా చివరి ఆయకట్టు వరకు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుత రబీ సీజన్‌కు జిల్లాలో 8.23 లక్షల ఎకరాలకు నీరు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించి ఆ మేరకు నీటి కేటాయింపుల వివరాలను వెల్లడించారు. రబీ సీజన్ కోసం నీరు విడుదల చేసిన తర్వాత కూడా రిజర్వాయర్లలో నీరు భారీగా ఉండే పరిస్థితి ఉండటంతో రెండో పంటకు కూడా నీరు ఇస్తామని ఇప్పుడే ప్రకటించారు. ఇక పొరుగు రాష్ట్రం చెన్నైకు నీటి హక్కుగా విడుదల చేయాల్సిన దాని కంటే 40 వేల క్యూసెక్కుల నీరు అదనంగా విడుదల చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వానిదన్నారు. గడిచిన 15 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటి సారి రబీ సీజన్ కంటే ముందుగానే జిల్లాలో రెండు రిజర్వాయర్లలో నీటితో పాటు ఇప్పటి వరకు చెరువులు, కాలువలు, తాగునీటి అవసరాల అన్నింటికి కేటాంపులతో కలిపి 118.75 టీఎంసీల నీరు ఉంది. కరుణించిన వరుణుడు..కలిసొచ్చిన వరదలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొద్ది నెలల క్రితమే కొలువు తీరింది. వరుణుడు కరుణించడంతో ఎగువ ప్రాంతాల్లో బాగా వర్షాలు పడి వరదలు వచ్చి సోమశిలకు భారీగా ఇన్‌ఫ్లో చేరింది. జిల్లా చరిత్రలో గతంలో లేని విధంగా కేవలం 4 నెలల వ్యవధిలో సుమారు 100 టీఎంసీల నీరు జిల్లాలోని జలాశయాలు, జలవనరులకు చేరాయి. బుధవారం జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు అధ్యక్షతన జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ప్రజాప్రతిని«ధులు రైతాంగం తరఫున ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్‌యాదవ్ కూడా జిల్లాకు చెందిన వ్యక్తే కావడంతో చివరి ఆయకట్టు వరకు నీటిని ఇవ్వాలనే యోచనతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగారు. గత జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు సోమశిలకు 118.75 టీఎంసీల నీరు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చింది. జూన్ మొదటి వారం ముందు వరకు పూర్తిగా డెడ్ స్టోరేజీ స్థాయి దాటి తక్కువ నీరు రిజర్వాయర్‌లో నిల్వ ఉంది. తాగునీటి ఇబ్బందులతో పాటు జిల్లాలో వందలాది చెరువులు, ప్రధాన కాలువలు ఎండిపోయిన పరిస్థితి. ఈ ఏడాది వర్షాలు కొంత ఆశాజనకంగా ఉండడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి లక్షల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా రావడంతో రబీ సీజన్ కంటే అరవై రోజులు ముందుగానే నీరు విడుదల చేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు సోమశిల వచ్చిన 118.75 టీఎంసీల నీటిలో రబీతో నిమిత్తం లేకుండా 15.11 టీఎంసీల నీటిని విడుదల చేశారు. నెల్లూరు నగర తాగునీటి అవసరాలకు 1.88 టీఎంసీలు, రాళ్లపాడు కెనాల్, నార్త్ ఫీడర్ కెనాల్‌కు 1.99 టీఎంసీలు, సౌత్ ఫీడర్ కెనాల్‌కు 0.6 టీఎంసీలు, కావలి కెనాల్‌కు 1.89 టీఎంసీలు, కనిగిరి, కనుపూరు, సంగం, పెన్నా బ్యారేజీలకు 9.7 టీఎంసీల నీటిని విడుదల చేశారు. రాష్ట్ర విభజనకు ముందు చెన్నైకు ఏటా కండలేరు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రా వాటా 3.6 టీఎంసీలు, తెలంగాణ వాటా 1.4 టీఎంసీలు, కర్ణాటక, మహరాష్ట్ర కలిపి 7 టీఎంసీలు విడుదల చేయాలి. రాష్ట్ర వాటా 3.6 టీఎంసీలే అయినప్పటికీ నీటి లభ్యత బాగా ఉండడం, ఆ రాష్ట్ర ప్రతినిధుల వినతితో 4 టీఎంసీలకు పైగా నీటిని చెన్నై తాగునీటి అవసరాలకు కేటాయించారు. ప్రస్తుతం సోమశిలలో 72 టీఎంసీలు కండలేరులో 32.18 టీఎంసీల నీరు రిజర్వాయర్లలో నిల్వ ఉంది. దీంతో జిల్లాలో డెల్టాతో పాటు మెట్ట ప్రాంతాలకు సాగు నీరు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రజాప్రతినిధులంతా ఏకీభావం బుధవారం జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో పాటు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వెలగపల్లి వరప్రసాద్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీటి కేటాయింపులు, చివరి ఆయకట్టు వరకు నీరు అందించే పరిస్థితి ఉండటంతో సమావేశం పూర్తిగా ప్రశాంతంగా ముగిసింది. సమావేశంలో చర్చించిన అంశాలపై ప్రజాప్రతినిధులందరూ ఏకీభవించారు. -
'బస్తా'మే సవాల్!
కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోవేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఆంధ్రా కాల్వ భవిష్యత్తుపై నీలినీడలు అలముకుంటున్నాయి. జలాశయానికి ఎగువ ప్రాంతం ఖమ్మం జిల్లా నుంచి వచ్చే నీరు పదేళ్లుగా క్రమేపీ తగ్గుతోంది. కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వంతో పాటు అక్కడి రైతులు సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగుపై ఇసుక బస్తాలు వేసి ఆంధ్రా కాల్వకు రావాల్సిన నీటిని అడ్డుకుంటున్నారు. రాష్ట్రానికి చెందినఇరిగేషన్ అధికారులు ఇసుక బస్తాలను తొలగించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోయింది. కయ్యానికి కాలుదువ్వే విధంగా అక్కడి రైతులవ్యవహారం ఉంది. పశ్చిమగోదావరి, చింతలపూడి: దశాబ్దాల కాలంగా ఆంధ్రాకాల్వ కింద ఉన్న మెట్ట ప్రాంతంలోని 21 చెరువులతోపాటు జిల్లాలోని తమ్మిలేరు ప్రాజెక్టు కూడా దీనిపైనే ఆధారపడి ఉంది. తమ్మిలేరు ప్రాజెక్టు ద్వారా ఏటా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో అధికారికంగా 9,100 ఎకరాలు సాగవుతుండగా, రిజర్వాయరు ఎగువ భాగంలో 20,230 ఎకరాలు, దిగువ భాగంలో ఏలూరు వెళ్లే ఇరుపక్కలా 15 ఏటి కాలువల ద్వారా 14,200 ఎకరాలు సాగవుతున్నాయి. ఆంధ్రా కాలువ ద్వారా తమ్మిలేరుకు వచ్చే వరద నీరు రాకుండా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ఎత్తును పెంచి అక్కడి ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. గతంలో ప్రభుత్వం ఈ వివాదంపై ముగ్గురు రాష్ట్ర స్థాయి రిటైర్డ్ ఇంజినీర్లను నియమించినా ఫలితం లేకుండా పోయింది. తర్వాత కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో శాశ్వతంగా వరద నీరు రాకుండా అక్కడి రైతులు ఇసుక బస్తాలు వేసి వరద నీటిని అడ్డుకుంటున్నారు. అటకెక్కిన ఇందిరా సాగర్ ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో 2.50లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం మూలన పడింది. 2005లో అప్పటి ముఖ్యమంతి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,824 కోట్ల నిధులు మంజూరు చేశారు. వేలేరుపాడు మండలం రుద్రమకోట వద్ద శబరి నది, గోదావరి కలిసే చోట ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఖమ్మం జిల్లాలోని 9 మండలాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాలకు, కృష్ణా జిల్లాలోని 2 మండలాలకు 24,500 ఎకరాలకు, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ఆంధ్రా కాల్వ ద్వారా 46 వేల ఎకరాలకు సాగునీరు అందేలా రూపకల్పన చేశారు. మొత్తం 47 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా, పనులు నిలిచిపోయే నాటికి 38 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. సుమారు రూ.900 కోట్లు ఖర్చు పెట్టారు.పంపు హౌస్‌ల కోసం జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న భారీ మోటార్లు 10 ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ప్రాజెక్టు ప్రాంతం ఆంధ్రాలోను, ప్రధాన కాల్వలు తెలంగాణలో ఉండటంతో సమస్య నెలకొంది. -
వారబందీతో సాగునీరు నిలిపివేత దారుణం
గుంటూరు, వినుకొండ: సాగర్ కుడి కాల్వకు నీరివ్వడంలో ప్రభుత్వం అలక్ష్యం చూపిస్తోందని, పంటలు ఎండిపోతుంటే వారబందీ అంటూ నెలకు పది రోజులు సాగు నీరు నిలిపివేయడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, లావు శ్రీకృష్ణదేవరాయలు, బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో నియోజకవర్గ రైతులతో శుక్రవారం భారీ ర్యాలీ, ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ ఏడాది సాగర్ నుంచి రెండు పంటలకు నీళ్లిస్తామని ప్రకటించిన ప్రభుత్వ మాటలు నమ్మి మాగాణి సాగు చేసిన రైతుల నోట్లో మట్టికొట్టడానికి ప్రభుత్వం వారబందీ పెట్టడం అమానుషమన్నారు. మాగాణికి నీళ్లు అందకపోతే నష్టపోయేది రైతులే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని, రైతులు ఆగ్రహిస్తే ప్రభుత్వాలు మట్టికొట్టుకుపోతాయని హెచ్చరించారు. తక్షణమే వారబందీ నిబంధన ఎత్తివేసి సాగు నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి లేని పాలన చంద్రబాబుది అని.. అందుకే వరుణుడు సైతం ముఖం చాటేస్తున్నాడని, గత 9 ఏళ్ల పాలనలో రైతులు కరువును చూశారని, ఇప్పుడు నాలుగేన్నరపాలనలో సైతం కరువు తాండవించిందని గుర్తు చేశారు. కృష్ణా బేసిన్లో వర్షాలు పడి సాగర్‌కు నీరోచ్చిందని, ఆ నీటిని సక్రమంగా వినియోగించుకోలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రైతుల నుంచి విశేష స్పందన రైతుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నాకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి వెయ్యి మందికి పైగా రైతులు తరలివచ్చారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ బస్టాండ్ మీదుగా శివయ్య స్తూపం సెంటర్‌కు చేరుకుంది. అక్కడ భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం ఎన్ఎస్పీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డీఈఈ శ్రీహరికి వినతి పత్రం అందజేశారు. రైతుల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం : శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు రైతుల కష్టాలు కనపడకపోవడం శోచనీయమన్నారు. జగనన్న రైతుల సంక్షేమం కోసం నవరత్నాలతో అనేక పథకాలు ప్రకటించారని గుర్తు చేశారు. పంట వేయగానే గిట్టుబాటు ధర ప్రకటించడం, రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ప్రయోజనముంటుందని తెలిపారు. చంద్రబాబు పీఎం కావాలన్న ఆశల్లో దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాష్ట్ర పాలనను గాలికి వదిలి వేశాడని విమర్శించారు. రైతులు ఎలా బతకాలి : బొల్లా నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో ఈ ప్రాంతం ఏడారిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ నీళ్లు కావాల్సిన వరికి ప్రభుత్వం 18 రోజులు మాత్రమే ఇస్తామంటే రైతులు ఎలా బతకాలి? అని ప్రశ్నించారు. సాగు ప్రారంభంలో రెండు పంటలకు పుష్కలంగా నీరిస్తామన్న ప్రభుత్వం మాటలు నమ్మిన రైతుల్ని నేడు నట్టేట్లో ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వమే తప్పించుకునే ధోరణితో మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే బొల్లాపల్లి మండలంలో వరికపూడిశల నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటామని తెలిపారు. -
తడవని మడి..అన్నదాత అలజడి
యలమంచిలి: సాగునీటి ఎద్దడి రైతులను వెం టాడుతోంది. దాళ్వా పంటలో నాలుగు డబ్బులు వెనకేసుకుందామని సాగుకు ఉపక్రమించిన రైతులకు అధికారులు, ప్రజాప్రతినిధులు చుక్కలు చూపిస్తున్నారు. యలమంచిలి మండలంలోని కొంతేరు చానల్ పరిధిలోని కొక్కిరాయికోడు, దిగమర్రు చానల్ పరిధిలోని చీమలకోడు, కాజ పడమర పరిధిలో సుమా రు 150 ఎకరాల వరి సాగవుతోంది. కాలువ శివారు భూములకు సుమారు 20 రోజులుగా నీరు అందకపోవడంతో చేలన్నీ బీళ్లు తీశాయి. ఆఖరుగా 20 రోజుల క్రితం వంతునీరు ఇచ్చినప్పుడు కొంతమేర శివారు భూములు తడిచాయి. గత శుక్రవారంతో వంతు ముగిసినా ఇప్పటికీ నీరందలేదు. అక్కడికీ రైతులు సొంతంగా నీరు తోడుకుంటాం నీరు కాలువ శివారుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేకుండాపోయాడు. దాళ్వా ప్రారంభానికి ముందు జనవరి ప్రారంభంలో సాగు చేసిన రైతులకు మార్చి నెలాఖరు వరకు సాగునీటి కొరత రానివ్వబోమని ప్రచా రం చేసిన అధికారులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. కౌలు గింజలు కూడా రావేమో.. ఎకరాకు 7 బస్తాలు కౌలు ఇచ్చేలా ఆరున్నర ఎకరాలు సాగు చేస్తున్నాను. నీరందక చేను మొత్తం ఎండిపోయింది. ఇప్పు డు చేను పాలుపోసుకునే దశలో ఉంది. ఈ దశలో నీరు పెట్టకపోతే కంకులలోని గింజ గట్టిపడక తప్పలుగా మారే ప్రమాదముంది. అదే జరిగితే కౌలు గింజలు కూడా దక్కవు. పెట్టుబడి మొత్తం నష్టపోతాను. అధికారులు కనికరించి వంతు సమయం పెంచి శివారు భూములకు నీరివ్వాలి. – పామర్తి సత్యనారాయణ, కౌలు రైతు, కొంతేరు -
సాగు నీటి కోసం పోరాటం
వెలుగోడు: సాగునీటి కోసం పోరాటం చేస్తానని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులన్నీ 90 శాతం పూర్తి చేశారన్నారు. గాలేరు నగరి, మల్యాల ఎత్తిపోతల పథకం, అలగనూరు రిజర్వాయర్, పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కుల సామర్థ్యం పెంచేందుకు వైఎస్ఆర్ కృషి చేశారని గుర్తు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మిగిలిన పనులు పూర్తి చేయడం లేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి రైతును అని చెప్పుకుంటూ అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 7 టీఎంసీల ఉంటే మార్చి ఆఖరి వరకు సాగునీరు ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేసినట్లే అన్నారు. ఒక ఎకరా కూడా రెండో పంట ఎండిపోకుండా వీబీఆర్ నుంచి మే చివరి వరకు నీరందించాలని డిమాండ్ చేశారు. లేదంటే పది వేల మంది రైతులతో పాదయాత్ర చేస్తానని హెచ్చరించారు. టీడీపీ నేతలు కాంట్రాక్టు పనులు చేసుకొని రైతుల కడుపు కొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతులకు అన్ని విధాల అండగా ఉంటానని భరోసా కల్పించారు. తాను గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు వీబీఆర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్న సమయంలో కూడా వన్‌ఆర్, వన్ ఎల్ తూముల నుంచి రైతులకు నీరందించానని గుర్తు చేశారు. సిద్ధాపురానికి తరలిరండి సిద్ధాపురం ఎత్తిపోతల పథకం వద్ద ఈ నెల ఆఖరున లేదంటే వచ్చే నెలలో నిర్వహించే వైఎస్ఆర్ జలహారతి కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి సిద్ధాపురం చెరువు వద్దకు ట్రాక్టర్ల మీద తరలిరావాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు అంబాల ప్రభాకర్‌రెడ్డి, తిరుపంరెడ్డి, మండ్ల శంకర్‌రెడ్డి, పెద్ద స్వామన్న, వంగాల నాగేశ్వరరెడ్డి, నడిపి స్వామన్న, శ్రీనివాసులు, భూపాల్‌చౌదరి పాల్గొన్నారు. -
విడతల వారీగా సాగునీరు
– పది రోజుల నిలుపుదల.. అనంతరం సరఫరా – నవంబర్ ఆఖరు వరకు ఇదే విధానంలో కాలువలకు నీరు – నేటి నుంచి నీటి విడుదల నిలుపుదల – తుంగభద్ర ఐసీసీ సమావేశంలో తీర్మానం సాక్షి, బళ్లారి : తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తుంగభద్ర డ్యాంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున నవంబర్ ఆఖరు వరకు కాలువలకు విడతల వారీగా నీరు విడుదల చేయాలని తుంగభద్ర నీటిపారుదల సలహా సమితి (ఐసీసీ) సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం బెంగళూరులోని వికాససౌధలో బళ్లారి జిల్లా ఇన్చార్జ్ మంత్రి సంతోష్‌లాడ్ అ«ధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 41 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉన్నందున అన్ని కాలువలకు యథాప్రకారం నీరు విడుదల సాధ్యం కాదని అధికారులు తెలిపారు. యథాప్రకారం విడుదల చేయాలంటే 71 టీఎంసీల నీరు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో డ్యాంపై ఆధారపడిన హెచ్చెల్సీ, ఎల్ఎల్సీ, ఎల్‌బీఎంసీ, రాయబసవణ్ణ తదితర కాలువలకు నెలలో 10 రోజుల పాటు నీరు నిలుపుదల చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ విధానాన్ని నవంబర్ వరకు కొనసాగించాలని, పది టీఎంసీలను తాగునీటి కోసం నిల్వ ఉంచుకోవాలని నిర్ణయించారు. హెచ్చెల్సీ, ఎల్ఎల్సీలకు ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు 10 రోజుల పాటు ఏకకాలంలో నీటి విడుదల నిలిపివేస్తారు. 27 నుంచి అక్టోబర్ 11 వరకు హెచ్ఎల్సీకి 1,200 క్యూసెక్కుల చొప్పున, ఎల్ఎల్సీకి 700 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తారు. అక్టోబర్ 12 నుంచి 21 వరకు మళ్లీ కాలువలకు నీటి విడుదల ఆపేస్తారు. 22వ తేదీ నుంచి నవంబర్ 5 వరకు మళ్లీ యధాప్రకారం విడుదల చేస్తారు. నవంబర్ 6 నుంచి 15 వరకు ఆపేసి.. 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు యధాప్రకారం నీటిని విడుదల చేయాలని తీర్మానించారు. -
రిమోట్ సెన్సింగ్‌తో పంట నష్టం అంచనా
రైతు యూనిట్‌గా పంటల బీమా అమలుకు సన్నాహాలు రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటుకు సన్నాహాలు 25వ తేదీ నాటికి మార్గదర్శకాలు ఖరారు చేయనున్న ఐఆర్డీఏ హైదరాబాద్: రిమోట్ సెన్సింగ్ చిత్రాల సాయంతో ఒక రైతుకు చెందిన వ్యవసాయభూమిలో పంట నష్టం ఎంత జరిగిందో తేల్చి ‘రైతు యూనిట్‌గా పంటల బీమా’ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) నిర్ణయించినట్లు తెలిసింది. దేశంలోనే మొట్టమొదటగా రైతు యూనిట్‌గా పంటల బీమాకు రాష్ట్రంలో సన్నాహాలు జరుగుతున్నాయి. పెలైట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు వ్యవసాయశాఖతో కలసి డీఆర్డీఏ కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 25వ తేదీ నాటికి పెలైట్ ప్రాజెక్టు ఎలా ఉండాలి? ఎలా అమలు చేయాలన్న దానిపై ఐఆర్డీఏ మార్గదర్శకాలు ఖరారు చేయనుంది. దిగుబడి తగ్గింపుపై నిర్ణయం ఎలా? తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత పంటల బీమా పథకంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. వ్యక్తిగతంగా రైతుకు నష్టం జరిగితే బీమా ద్వారా నష్టపరిహారం అందడం లేదని భావించింది. ఈ మేరకు వ్యక్తిగతంగా పంట నష్టం జరిగినప్పటికీ రైతుకు బీమా సొమ్ము అందాల్సిందేనంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. ఐఆర్డీఏ సహా పలు బీమా కంపెనీలు కూడా దీనిపై సుముఖత వ్యక్తం చేశాయి. దీనిపై ఈ నెల 25వ తేదీన జరిగే కీలక సమావేశం జరిగే నాటికి మార్గదర్శకాలు ఖరారు చేయనున్నారు. పంటల నష్టానికి సంబంధించి ఒక గ్రామానికి లేదా మండలానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడం సాధ్యమే కానీ... ఒక రైతుకు వ్యక్తిగతంగా జరిగిన నష్టాన్ని ఎలా అంచనా వేయగలం అన్న దానిపైనే బీమా సంస్థలు మల్లగుల్లాలు పడుతున్నాయి. పైగా దిగుబడి ఎంత తగ్గిందనే అంశాన్ని రైతు వారీగా నిర్ణయించడం ఏ మేరకు సాధ్యమనే ప్రశ్న తలెత్తింది. ఈ నేపథ్యంలోనే రిమోట్ సెన్సింగ్ చిత్రాల సాయంతో సంబంధిత రైతు వ్యవసాయ భూమిలో పంట ఏమేరకు నష్టం జరిగిందోనని అంచనా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, కరువు, అతివృష్టి సమయాల్లో పంట నష్టపోయిన రైతులందరికీ సామూహికంగా బీమా చెల్లించడం కుదరదన్న దానికి కూడా పరిష్కారం కనుక్కోవాలని భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు... రైతు యూనిట్‌గా పంటల బీమా అమలు చేయడం దేశంలోనే మొదటిసారి కాబట్టి ముందుగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో అమలు చేయాలని యోచిస్తున్నారు. అయితే అన్ని జిల్లాల్లోని కొన్ని మండలాలు లేదా గ్రామాల్లో అమలు చేయాలా? లేకపోతే ఒకే జిల్లాలోని నిర్ణీత గ్రామాల్లో అమలు చేయాలా? అన్న విషయంపై ఇంకా నిర్ణయానికి రాలేదు.