cross border trade
-
2 లక్షల కోట్ల డాలర్లకు ఎగుమతులు
న్యూఢిల్లీ: 2030 నాటికి వస్తు, సేవల ఎగుమతులను 2 లక్షల కోట్ల డాలర్లకు పెంచుకోవాలన్న లక్ష్యం ఆచరణ సాధ్యమేనని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఎస్సీ అగర్వాల్ తెలిపారు. సులభంగా వాణిజ్య రుణాల లభ్యత ఇందుకు కీలకంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. ఎగుమతుల్లో పోటీపడేందుకు ఇది తోడ్పడగలదని అగర్వాల్ వివరించారు. ఇటు దేశీయ వ్యాపారాలతో పాటు అటు సీమాంతర వాణిజ్యానికి కూడా సులభంగా రుణాలు లభించేలా చూడటంపై ప్రభుత్వం, ట్రేడర్లు కలిసి పని చేయాలని ఆయన సూచించారు. (ఆన్లైన్ ఫ్రాడ్: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్ డైరెక్టర్ లబోదిబో) ‘సీమాంతర వాణిజ్యంతో పోలిస్తే దేశీయంగా వ్యాపారాల కోసం రుణాలను పొందడం సులభతరంగా ఉంటుందని నాకు చెబుతుంటారు. సీమాంతర వాణిజ్యం చాలా రిస్కులతో కూడుకున్నదనే అభిప్రాయమే దీనికి కారణం కావచ్చు. మనం ప్రపంచ మార్కెట్లో పోటీపడాలంటే దీన్ని సరిదిద్దాలి. ఇందులో రుణాల లభ్యత కీలక పాత్ర పోషిస్తుంది‘ అని అగర్వాల్ చెప్పారు. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 2021–22తో పోలిస్తే 2022–23లో వస్తు, సేవల ఎగుమతులు 14.68 శాతం పెరిగి 676.53 బిలియన్ డాలర్ల నుంచి 775.87 బిలియన్ డాలర్లకు చేరాయి. (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) ఈ నేపథ్యంలో 2030 నాటికి వీటిని 2 ట్రిలియన్ డాలర్ల (లక్షల కోట్లు)కు పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది. మరోవైపు, ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలతో వాణిజ్య నిర్వహణ తీరుతెన్నుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయని నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు సంజీత్ సింగ్ తెలిపారు. కార్మిక శక్తి, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, పర్యావరణ అభివృద్ధి మొదలైనవి వ్యాపారాల్లో కీలకంగా మారాయని, పలు దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు. వాణిజ్యం విషయంలో భారత్‌ను ఏ దేశమూ వదులుకునే పరిస్థితి లేదని, మన ప్రయోజనాలను కాపాడుకునేందుకు తగు రక్షణాత్మక చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని సింగ్ చెప్పారు. -
రూపీ ట్రేడ్‌పై దక్షిణాసియా దేశాలతో చర్చలు
న్యూఢిల్లీ: రూపాయి మారకంలో సీమాంతర వాణిజ్య లావాదేవీలు నిర్వహించడంపై దక్షిణాసియా దేశాలతో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ చర్చలు జరుపుతోంది. యూపీఐ విధానం ద్వారా ప్రాంతీయంగా సీమాంతర చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా యూపీఐకి సంబంధించి ఇప్పటికే భూటాన్, నేపాల్ తదితర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. శుక్రవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాలు తెలిపారు. అలాగే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ప్రస్తుతం ప్రయోగదశలో ఉందని ఆయన చెప్పారు. క్లోనింగ్‌వంటి రిస్కులు ఉన్న నేపథ్యంలో డిజిటల్ రూపీని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ ఆచితూచి వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వంతో కలిసి అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో సెటిల్ చేసుకునే విధానంపై ఆర్బీఐ కసరత్తు చేస్తోంది. ప్రాంతీయంగా ఇప్పటికే కొన్ని దేశాలతో చర్చలు జరుపుతోంది‘ అని దాస్ వివరించారు. ద్రవ్యోల్బణ కట్టడికి ప్రాధాన్యం .. కోవిడ్, ద్రవ్యోల్బణం, ఆర్థిక మార్కెట్ల నిబంధనలు కఠినతరం కావడం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి సవాళ్ల నేపథ్యంలో దక్షిణాసియా ప్రాంత దేశాలు విధానపరంగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయన్నారు. భారత్ వంటి దక్షిణాసియా దేశాలు ద్రవ్యోల్బణ కట్టడిపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఇందుకోసం విశ్వసనీయమైన ద్రవ్యపరపతి విధానాలతో పాటు సరఫరాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం, ద్రవ్య.. వాణిజ్య విధానాలు, పాలనాపరమైన చర్యలు అవసరమని ఆయన వివరించారు. ఇటీవల కమోడిటీ ధరలు, సరఫరాపరమైన సమస్యలు కొంత తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టవచ్చని పేర్కొన్నారు. అయితే ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగిన పక్షంలో వృద్ధికి, పెట్టుబడులకు రిస్కులు ఏర్పడవచ్చని దాస్ చెప్పారు. దక్షిణాసియా ప్రాంత దేశాలు ఇంధనాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుండటం వల్ల, ఇంధన దిగుమతిపరమైన ద్రవ్యోల్బణంతో సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాలు వాణిజ్యం విషయంలో పరస్పర సహకరించుకుంటే ప్రాంతీయంగా వృద్ధికి, ఉపాధికి మరిన్ని అవకాశాలు లభించగలవని దాస్ చెప్పారు. -
CrossBorderTrade: డాలర్‌తో పనిలేకుండా రూపాయితో!
న్యూఢిల్లీ: సీమాంతర వాణిజ్యాన్ని డాలర్‌కు బదులు రూపాయి మారకంలో నిర్వహించే మార్గాలపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి సారించింది. యూఎస్ డాలర్‌కు బదులుగా రూపాయిలో సరిహద్దు వాణిజ్యాన్ని ప్రోత్సహించే మార్గాలను చర్చించేందుకు డిసెంబరు నెల 5న బ్యాంకుల చీఫ్‌లతో చర్చించనుంది. (ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ రియాక్షన్) ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆరు అగ్రగామి ప్రైవేటు బ్యాంకుల సీఈవోలను సమావేశానికి ఆహ్వానించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. విదేశాంగ శాఖ, వాణిజ్య శాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఇతర భాగస్వాములు సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నట్టు తెలిపాయి. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. (ఇండియన్ ఎకానమీకి వచ్చే పదేళ్లు అద్భుతం: నందన్ నీలేకని) కంపెనీల కొనుగోళ్ల నిబంధనల సమీక్ష సెబీ అత్యున్నత స్థాయి కమిటీ కంపెనీల కొనుగోళ్ల నిబంధనలను సులభతరం చేయడానికి, అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా మార్చేందుకు వీలుగా సెబీ ఓ అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. న్యాయస్థానాల గత తీర్పుల కోణంలో ప్రస్తుత నిబంధనలను సమీక్షించనున్నారు. 20 మంది సభ్యుల కమిటీకి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ షివాక్స్ జల్ వాజిఫ్‌దార్ నేతృత్వం వహించనున్నారు. సెబీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, న్యాయ సేవల సంస్థల సభ్యులు ఈ కమిటీలో భాగంగా ఉంటారు. గణనీయ మొత్తంలో షేర్ల కొనుగోలు లేదా కంపెనీల కొనుగోలు విషయంలో నిబంధనలపై తమ సూచనలు అందించనున్నారు. చదవండి: అమెజాన్‌కు ఏమైంది? వారంలో మూడో బిజినెస్‌కు బై..బై..! -
పాక్‌కు షాక్: వ్యాపారానికి తాత్కాలిక బ్రేక్
జమ్మూకశ్మీర్: పాకిస్తాన్‌తో క్రాస్ బోర్డర్ ట్రేడ్‌ను తాత్కాలికంగా నిషేధిస్తూ భారత ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ పదేపదే ఉల్లంఘించడమే ఇందుకు కారణమని తెలిపింది. మంగళవారం ఫూంచ్ సెక్టార్ వద్ద పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. దీంతో అక్కడ ఉన్న ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్(టీఎఫ్సీ) ధ్వంసం అయింది. పాక్ తరచూ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో సోమవారం ముందు జాగ్రత్త చర్యగా ఫూంచ్ నుంచి పాకిస్తాన్‌కు ఉన్న బస్సు మార్గాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. పాకిస్తాన్‌కు పంపాల్సిన సరుకులతో కొన్ని ట్రక్కులు ఎల్వోసీ వద్దకు చేరుకోగా.. పాకిస్తాన్ అధికారులు గేట్లు తెరవలేదని టీఎఫ్సీ అధికారి తన్వీర్ అహ్మద్ తెలిపారు. దీంతో ట్రక్కలను వెనక్కు తీసుకువచ్చినట్లు చెప్పారు. కాగా, పలు సందర్భాల్లో పాకిస్తాన్ నుంచి వచ్చే ట్రక్కుల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు లభ్యమయ్యాయి. దీంతో భద్రతా చర్యల్లో భాగంగా నిఘాను పెంచారు. 2008లో భారత్ పాకిస్తాన్ల మధ్య వ్యాపారసంబంధాలు ప్రారంభమయ్యాయి. కాగా, గత ఏడాది ఆగష్టులో ఎలాంటి కారణాలు చెప్పకుండా పాకిస్తాన్ భారత్‌తో క్రాస్ బోర్డర్ ట్రేడింగ్‌ను నిలిపివేసింది.