CSS
-
ఊహాజనిత అంచనాలొద్దు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) గాను వార్షిక బడ్జెట్ తయారీ కోసం అన్ని ప్రభుత్వ శాఖలు తమ అంచనాలను జనవరి 4వ తేదీలోగా పంపాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ మేరకు బడ్జెట్ రూపకల్పన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం... » అన్ని ప్రభుత్వ విభాగాలు ఈనెల 4వ తేదీలోగా ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో తమ బడ్జెట్ ప్రతిపాదనలను ఆయా శాఖలకు పంపాల్సి ఉంటుంది. అదే రోజున ఆయా శాఖాధిపతులు వాటిని పరిశీలించి మార్పులు, చేర్పులు చేసిన అనంతరం ఆర్థిక శాఖకు పంపాల్సి ఉంటుంది. » ఊహాజనిత అంచనాలకు పోకూడ దు. తమకు అవసరమయ్యే వాస్తవిక నిధుల కంటే ఎక్కువ లేదా తక్కువ మొత్తాలను ప్రతిపాదించకూడదు. » గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దుల కింద చేసే ఖర్చును అన్ని శాఖలు తగ్గించుకోవాలి. »ప్రతి శాఖ విధిగా వ్యవస్థీకృత వ్యయాన్ని ప్రతిపాదించాలి. ఆఫీసుల నిర్వహణ, వాహనాలు, అద్దెలు, విద్యుత్, తాగునీటి ఖర్చులు, ఔట్సోర్సింగ్ సర్వీసులు, సంక్షేమ, సబ్సిడీ పథకాలకు అయ్యే వ్యయ అంచనాలను పంపాల్సి ఉంటుంది. » డిసెంబర్ 31, 2024 వరకు ఉన్న నికర అప్పుల వివరాలను పంపాలి. ప్రతి శాఖలో ఉన్న శాశ్వత ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగుల వివరాలు పంపాలి. » అన్ని శాఖలు 2024–25 ఆర్థిక సంవత్సరపు సవరించిన అంచనాలను కూడా పంపాలి. ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశాలను రాబడి శాఖలు ప్రతిపాదించాలి. » వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రారంభించాల్సి ఉంటే అందుకు సంబంధించిన వివరాలు, అయ్యే ఖర్చును విధిగా ప్రతిపాదించాలి. »ప్రభుత్వ శాఖల్లో అమలు పరిచేందుకు వీలున్న కేంద్ర ప్రాయోజిత పథకాలను (సీఎస్ఎస్) గుర్తించడం ద్వారా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకునే వీలున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిష్పత్తిని పేర్కొంటూ ప్రతిపాదనలు పంపాలి. -
ఆ రూ. 495 కోట్లు ఇప్పించండి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాలకు (సీఎస్ఎస్) సంబంధించిన రూ.495 కోట్లు తిరిగి ఇప్పించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు డిమాండ్ చేశారు. 2014–15లో సీఎస్ఎస్ కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నగదును పొరపాటున ఆంధ్రప్రదేశ్‌లో ఖాతాలో జమచేశారని, దాన్ని తిరిగి తెలంగాణకు ఇప్పించాలని కోరారు. ఈ మేరకు హరీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా, కేంద్రానికి లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో (2014–15) కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారని, అయితే పొరపాటుగా మొత్తం సీఎస్ఎస్ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు జమ చేశారని గుర్తుచేశారు. దీంతో తెలంగాణ నష్ట పోయిందన్నారు. ఈ విషయాన్ని తాము ఇప్పటికే ఏపీ, కేంద్ర ప్రభుత్వాలతోపాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు. ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఆ రూ.495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదన్నారు. ఇప్పటికైనా ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పించేలా కృషి చేయాలని, వ్యక్తిగతంగా చొరవ తీసుకొని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని సీతారామన్‌ను కోరారు. -
పనులకు పచ్చజెండా
సాక్షి, అమరావతి: రూ.పది కోట్ల లోపు ఒప్పంద విలువ కలిగి ఇప్పటికే మొదలైన పనులన్నింటినీ కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులకు బిల్లులు చెల్లించేందుకు కూడా అనుమతిస్తూ ఆర్ధికశాఖ ఇటీవల మెమో జారీ చేసింది. ఈమేరకు బిల్లుల చెల్లింపు, పనులకు సంబంధించి ఈ ఏడాది మే 29వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మెమో జారీ చేశారు. ఒప్పందం కుదిరి, ప్రారంభం కాని రూ.పది కోట్ల లోపు విలువగల నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) పనులను కూడా కొనసాగించాలని, ఇందుకు సంబంధించిన బిల్లులను చెల్లించాల్సిందిగా ఆర్థికశాఖ స్పష్టం చేసింది. సహాయ పునరావాస, భూసేకరణ బిల్లుల చెల్లింపునకు కూడా ఆర్థిక శాఖ పచ్చ జెండా ఊపింది. ఈ నేపథ్యంలో రూ.పది కోట్ల లోపు విలువగల పనులన్నీ ప్రారంభం కానున్నాయి. తాగునీరు, రహదారులు, ఇతర అన్ని రకాల పనులు ఇందులో ఉన్నాయి. ఈ విషయంలో అన్ని శాఖలు ద్రవ్యజవాబుదారీ బడ్జెట్ నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ సూచించింది. పురోగతి ఆధారంగా నిర్ణయం.. సంబంధిత శాఖలు పనుల పురోగతితోపాటు అగ్రిమెంట్ విలువను పరిగణనలోకి తీసుకుని ఎంత పని పూర్తయిందనే అంశం ఆధారంగా పనులు కొనసాగించడమా? లేదా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని మెమోలో ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది మే 29 నాటికి చేసిన పనుల పురోగతి ఆధారంగా బిల్లుల చెల్లింపులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. సహాయ పునరావాస ప్యాకేజీ, భూసేకరణ విషయంలో బిల్లుల చెల్లింపునకు మిన హాయింపు ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. సమీక్షించనున్న మంత్రులు.. ఈ ఏడాది ఏప్రిల్ 1వతేదీ నాటికి విదేశీ, నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాలు మినహా మిగిలిన పనులు మంజూరై ఉంటే ప్రారంభించని వాటిని రద్దు చేయాలని మెమోలో పేర్కొన్నారు. రూ.పది కోట్లకుపైగా విలువగల విదేశీ, నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో మంజూరై ప్రారంభించని పనులపై సంబంధిత శాఖ మంత్రులు సమీక్షించాలి. విదేశీ, నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో రూ.పది కోట్లకు పైగా విలువగల పనులు ప్రారంభమై అగ్రిమెంట్ విలువలో 25 శాతం తక్కువ వ్యయం అయిన పనులను కూడా సంబంధిత శాఖల మంత్రులు సమీక్షించాలని ఆర్థిక శాఖ సూచించింది. సమీక్ష సమయంలో అంచనాల వ్యయ ప్రతిపాదనలు సక్రమంగా ఉన్నాయా? సింగిల్ బిడ్లు ఏమైనా దాఖలయ్యాయా? అంచనా వ్యయం కంటే ఎక్కువ మొత్తానికి టెండర్ కోట్ చేశారా? టెండర్లతో నిమిత్తం లేకుండా పనులేమైనా ఇచ్చారా? అనే అంశాలను పరిశీలించడంతోపాటు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పనుల అవసరం ఉందా? లేదా? అనేది పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. అనంతరం అనుమతి కోసం ఆర్థికశాఖ మంత్రికి పంపాలని మెమోలో సూచించారు. -
కేంద్ర పథకాల కుదింపునకు ఓకే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రాయోజిత పథకాలు (సీఎస్ఎస్) 30కి మించకుండా కుదించాలంటూ ముఖ్యమంత్రుల కమిటీ చేసిన కీలక సిఫార్సును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అలాగే ఈ పథకాల ఫ్లెక్సీ నిధులను 10 శాతం నుంచి 25 శాతానికి పెంచాలన్న సూచనకూ పచ్చజెండా ఊపింది. దీంతో నిధులను వెచ్చించడంలో నిర్ధిష్ట లక్ష్యాన్ని అందుకోవడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ లభిస్తుంది. కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రం ఫ్లెక్సీ నిధులను 30 శాతానికి పెంచారు. సీఎంల కమిటీ మొత్తం 66 కేంద్ర పథకాలను సమీక్షించింది.