Cue
-
నగదు కొరత..తీరని వ్యథ
- మారని బ్యాం‘క్యూ’ల తీరు - ఏటీఎంలదీ అదే పరిస్థితి - డబ్బు వచ్చినా..పంపిణీ నామమాత్రం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నగదు కష్టాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు డబ్బులేక సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలలో 20 రోజులైనా కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంక్ ఖాతాలో జమైన డబ్బు తీసుకోలేని పరిస్థితి. జిల్లాలోని ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీలకు కలిపి 148 కోట్ల కొత్త కరెన్సీ వచ్చింది. సోమవారం ఈ కరెన్సీ అందుబాటులోకి వచ్చినా.. పలు బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. కలెక్టరేట్లోని ట్రెజరీ బ్రాంచీ సహా దాదాపు అన్ని ఎస్బీఐ బ్రాంచిల్లో ఖాతాదారులకు రూ.4000 ప్రకారమే పంపిణీ చేశారు. కొన్ని బ్యాంకుల్లో రూ.2000 ప్రకారం ఖాతాదారులకు అందించారు. జీతాలు తీసుకోని ఉద్యోగులు 2వేలు పైనా.. డిసెంబరు నెలలో 20 రోజలు గడుస్తున్నా ఇప్పటికీ జీతంలో ఒక్క రూపాయి కూడా తీసుకోని ఉద్యోగులు 2వేల పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు ఉండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడం.. బయట నగదు కొరత తో అప్పులు పుట్టకపోవడంతో ఉద్యోగులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. డిపాజిట్లు రూ. 8వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నవంబరు 8న రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోనే అన్నిబ్యాంకులకు దాదాపు 8వేల కోట్ల రూపాయల డిపాజిట్లు వచ్చాయి. ప్రజలు దాచుకున్న డబ్బులు బ్యాంకులకు వెళ్లినా ఆర్బీఐ నుంచి బ్యాంకులకు వచ్చిన మొత్తం అంతంతమాత్రంగానే ఉంది. దీంతో నగదు కొరత తీవ్రం అయింది. అడ్డదారుల్లో తరలుతున్న కరెన్సీ కట్టలు.... జిల్లాకు వచ్చిన కరెన్సీ అడ్డదారుల్లో తరలుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. సామాన్యులను మూడు, నాలుగు గంటలు వరుసలో పెట్టి రూ. 2000 ఇస్తున్న బ్యాంకర్లు కొంత మందికి మాత్రం అడ్డుగోలుగా కరెన్సీ కట్టలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు, ఆదోని, డోన్‌లోని ప్రధాన బ్యాంకు శాఖల నుంచి రూ. 2000 నోట్ల కట్టలు అడ్డదారుల్లో వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు బ్యాంకర్లు 20 శాతం వరకు కమీషన్లు తీసుకున్నట్లు సమాచారం. ఇంతవరకు రూపాయి తీసుకోలేదు సాయిబాబ, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, తూనికలు, కొలతల శాఖ నాకు కలెక్టరెట్లోని ట్రెజరీ బ్రాంచీలో ఖాతా ఉంది. ఇంత వరకు నేను జీతంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. బ్యాంకుకు నాలుగు సార్లు వచ్చాను. ప్రతిసారి నో క్యాష్ బోర్డు కనిపిస్తోంది. సోమవారం రూ.4000 ప్రకారం ఇస్తున్నారని వచ్చాను.. అ మొత్తం తీసుకుందామంటే టోకన్లు అయిపోయినాయని చెప్చారు. ఎన్నాళ్లు ఇలా బ్యాంకులు చుట్టూ తిరగాలి. -
పే..ద్దక్యూ
కల్లూరు(రూరల్): కరెన్సీ కష్టాలు రోజురోజుకూ రెట్టింపవుతున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం..బ్యాంకులు పనిచేయకపోవడం..ఏటీఎంలు మూసి ఉండడంతో నగదు దొరకడం గగనమైంది. అత్యవసరాలను తీర్చుకోలేక శనివారం..జిల్లాలో పలువురు ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అక్కడక్కడ పనిచేస్తున్న ఏటీఎంల వద్ద గంటల తరబడి నిలుస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. పెట్టిన డబ్బు కొన్ని గంటల్లోనే ఖాళీ కావడం..నో క్యాష్ బోర్డులు కనిపిస్తుండడంతో ప్రజల వేదన వర్ణనాతీతం. బ్యాంక్ ఖాతాలకు పింఛన్ డబ్బు జమ చేయడంతో వృద్ధుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. డబ్బు లేకపోతే ఎలా బతకాలి నాయనా అంటూ కొందరు కన్నీరు పెడుతున్నారు. - కర్నూలు(అగ్రికల్చర్) ఆరు గంటలు క్యూలో.. కర్నూలు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎంకు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినా. దాదాపు నాలుగు గంటలు క్యూలో నిల్చున్నా. ఇంకా నా ముందు 50 మంది ఉన్నారు. డబ్బు అవసరం ఉండటంతో రాత్రి 8 గంటల వరకు క్యూలోనే ఉండిపోయా. ఏటీఎం నుంచి కేవలం రూ.2,500 వస్తాయి. ఈ డబ్బు కుటుంబ అవసరాలకు ఏమాత్రం సరిపోవు. ప్రతి రోజు రూ.5వేలు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు క్యూలో నిలబడి కాళ్లనొప్పులు తెచ్చుకుని మరీ డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి. నగరంలోని ఎస్బీఐ ఏటీఎంలతో పాటు అన్ని బ్యాంకుల ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంచితే సమస్య పరిష్కారం అవుతుంది. – జి.సోమశేఖర్, దేవనగర్, కర్నూలు -
పింఛను అందక వృద్ధురాలి మృతి
గడివేముల: కుటుంబానికి ఆసరగా ఉంటున్న పింఛను అందకపోవడంతో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా గడివేములలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దూదేకుల హుసేనమ్మ(65) గత మూడు రోజులుగా తనకు రావాల్సిన వితంతు పింఛన్ డబ్బు కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతోంది. సోమవారం కూడా బ్యాంకుకు మూడు పర్యాయాలు తిరిగింది. బ్యాంకు వద్ద ఎంతకీ క్యూ తగ్గకపోవడంతో సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి ముఖం పట్టింది. అయితే పాత పోలీసుస్టేషన్ వద్దకు చేరుకోగానే బీపీ తగ్గిపోయి పడిపోగా స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఆ వెంటనే ఆమెను 108 వాహనంలో నంద్యాలకు తరలిస్తుండగా గడివేముల పొలిమేరకు చేరుకోగానే మరణించింది. మృతురాలికి ముగ్గురు కుమారులు, కుమార్తె సంతానం. ఈ కుటుంబానికి అవసరమైన నిత్యావసరాల కొనుగోలుకు పింఛను ఒక్కటే ఆధారం కావడం.. ఐదు రోజులు గడుస్తున్నా ఆ మొత్తం అందకపోవడంతోనే హుసేనమ్మ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఎనీటైం మూతే..!
కర్నూలు (అగ్రికల్చర్): ఏటీఎం సేవలు పూర్తిగా స్తంభించాయి. జిల్లాలో 485 ఏటీఎంలు ఉండగా..పట్టుమని 10 కూడా పని చేయడం లేదు. ఆంధ్రాబ్యాంకుతో సహా వివిధ బ్యాంకుల ఏటీఎంలు పది రోజులుగా మూతపడ్డాయి. కొన్నిచోట్ల మాత్రం ఎస్బీఐ ఏటీఎంలు పని చేస్తున్నాయి. వీటి దగ్గర నగదు కోసం వందలాది క్యూ కడుతున్నారు. రూ.2వేలు, కొత్తగా వచ్చిన రూ.500 నోట్లు ఏటీఎంలలో పెట్టేందుకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాల్సి ఉండటం, నగదు లేకపోవడం వల్ల అవి మూతపడిపోయాయి. ఎస్బీఐ ఏటీఎంల్లో సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేసినా ఫలితం లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా 10 ఏటీఎంల్లో పెడుతున్న నగదు గంట, రెండు గంటల్లోనే ఖాళీ అవుతుండటంతో వందలాది మందికి నిరాశనే మిగులుతోంది. జిల్లాలో 34 బ్యాంకులకు సంబంధించి 445 బ్రాంచ్‌లు ఉండగా, వీటిల్లో రూ.2000 నోట్లు తప్ప ఇతరత్రా కరెన్సీ లేదు. ఇటీవల జిల్లాకు వచ్చిన రూ.160 కోట్లు అన్ని బ్యాంకులకు పంపిణీ చేశారు. ఈ నగదు వివిధ బ్యాంకుల్లో ఉండటంతో సోమవారం ప్రజలు పోటెత్తారు. ప్రతి బ్యాంకులో కనీసం 400 నుంచి 600 మంది వరకు రావడంతో బ్యాంకులు కిటకిట లాడాయి. నగదు నిల్వలు పడిపోవడంతో బ్యాంకు కౌంటర్లలో కేవలం రూ.4000 నుంచి రూ.6000 వరకు పంపిణీ చేశారు. ఉద్యోగుల్లో ఇప్పటికి 20 శాతం మంది జీతాలకు నోచుకోలేదు. -
సర్వదర్శనం క్యూలోకి పాము
భక్తులతో కిక్కిరిసిన సర్వదర్శనం క్యూలోకి ఆదివారం మధ్యాహ్నం ఓ పాము చొరబడింది. భక్తులు భయంతో కేకలు వే శారు. ఆ పాము ఇద్దరిని కాటు వేసి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లింది. సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠంలోని 31 షెడ్లలో నిండిపోవడంతో వెలుపల ఆళ్వారుచెరువు చుట్టూ క్యూ విస్తరించింది. ఇదే క్యూలోకి పక్కనే చెట్ల పొదల నుంచి హఠాత్తుగా ఓ పాము వచ్చింది. దీన్ని గుర్తించిన భక్తులు పాము..పాము.. అంటూ ఒకరిపై ఒకరు దూకుతూ కేకలు పెట్టారు. ఆ శబ్దానికి పాము బెదిరింది. కర్ణాటకలోని మాండ్యపట్టానికి చెందిన గౌరమ్మ (55), బళ్లారిలోని విజయపురానికి చెందిన భవాని (5) పాదంపై కాటేసి జారుకుంది. వెంటనే వారిని తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. తర్వాత తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఏకంగా క్యూలోకి పాము వచ్చి కాటే సి కష్టాలపాలు చేయటంపై బాధితులు టీటీడీ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.