current bills payments
-
ఫోన్ పే, జీపే, పేటీఎం.. ద్వారా విద్యుత్తు బిల్లు చెల్లించకూడదు
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం..వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా ఎలాంటి విద్యుత్తు బిల్లులు చెల్లించకూడదని టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చిందని చెప్పింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో టీజీఎస్పీడీసీఎల్ లేదా ఎస్పీడీసీఎల్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే విద్యుత్తు బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..‘ఎస్పీడీసీఎల్ పరిధిలో 85 శాతానికి పైగా పవర్ బిల్లు చెల్లింపులు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (టీపీఏపీ) ద్వారానే జరుగుతున్నాయి. ఇందుకోసం కొన్ని యూపీఐ ఆధారిత యాప్‌లను మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం..బ్యాంకు యాప్‌లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)లో నమోదవ్వాలి. కానీ చాలా థర్డ్ పార్టీ యాప్‌లకు సేవలందిస్తున్న బ్యాంకులు ఇంకా ఈ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసుకోలేదు. దాంతో సదరు చెల్లింపులను నిలిపేస్తున్నాం’ అని తెలిపారు.Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…— TGSPDCL (@tgspdcl) July 1, 2024ఆర్బీఐ నిబంధనలు..జులై 1 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే చెల్లింపులు చేయాలని పేర్కొంది. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇందులో భాగంగా యూపీఐ సేవలందించే బ్యాంకులు బీబీపీఎస్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. కానీ ఇప్పటివరకు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ సిస్టమ్‌ను ఎనేబుల్ చేసుకోలేదు. దానివల్ల ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే.. వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల్లో బిల్లులు చెల్లించలేరు. ఆ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డుల నుంచి కూడా బిల్లు పేమెంట్ చేయలేరు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..ఇదిలాఉండగా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్ ప్లాట్ఫామ్లో నమోదయ్యాయి. కాబట్టి పైన తెలిపిన బ్యాంక్ కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులను కొనసాగించవచ్చు. -
కరెంటు బిల్లు రూ.3వేల కోట్లు.. షాక్‌తో ఆసుపత్రిపాలు
భోపాల్: విద్యుత్తు వైర్లు తగలకుండానే ఓ వ్యక్తికి షాక్ తగిలింది. అది ఎలాగనుకుంటున్నారా? తన ఇంటి కరెంట్ బిల్లు చూసి షాక్‌తో ఆసుపత్రి పాలయ్యాడు. ఇంతకి అతని బిల్లు ఎంతనుకుంటున్నారా? రూ.3,419 కోట్లు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. గ్వాలియర్‌లోని శివ విహార్ కాలనీకి చెందిన ప్రియాంక గుప్తా ఇంటి విద్యుత్తు బిల్లు రూ.3,419 కోట్లు వచ్చినట్లు తెలుసుకుని షాకయ్యారు. ఆమె మామ ఏకంగా మూర్చపోయి ఆసుపత్రిలో చేరాడు. అయితే.. ఇది మానవ తప్పిదం వల్ల జరిగిందని విద్యుత్తు సంస్థ తెలిపింది. సవరించిన బిల్లు రూ.1,300గా ఇవ్వటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు గుప్తా కుటుంబ సభ్యులు. గృహ వినియోగానికి సంబంధించిన విద్యుత్తు బిల్లు కోట్లలో రావటం చూసి షాక్‌కి గురైన తన తండ్రి ఆసుపత్రిపాలయ్యాడని గుప్తా భర్త సంజీవ్ కంకానే పేర్కొన్నారు. జులై 20న తమకు ఇంటి విద్యుత్తు బిల్లు వచ్చిందన్నారు. భారీ మొత్తంలో ఉండటంతో మధ్యప్రదేశ్ క్షేత్ర విద్యుత్తు వితరన్ కంపెనీ(ఎంపీఎంకేవీవీసీ) పోర్టల్‌లో తనిఖీ చేయగా.. సవరించినట్లు కనిపించిందని తెలిపారు. విద్యుత్తు బిల్లు భారీగా వచ్చేలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎంపీఎంకేవీవీసీ జెనరల్ మేనేజర్ నితిన్ మంగ్లిక్. ‘యూనిట్స్ స్థానంలో వినియోగదారుడి నంబర్ ఎంటర్ చేయటం వల్ల ఇలా జరిగింది. అందుకే భారీగా బిల్లు వచ్చింది. సవరించిన బిల్లు రూ.1,300 సంబంధిత వినియోగదారుడికి ఇచ్చాం.’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఇదీ లక్కంటే.. అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టగా రూ.కోటి లాటరీ -
‘అపోహ వద్దు.. రెండు నెలల బిల్లులు విడిగానే’
సాక్షి, విజయవాడ: మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన కరెంటు బిల్లులపై అదనంగా వసూలు చేసే అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రెండు నెలలకు సంబంధించిన కరెంటు బిల్లులు కలిపి ఇస్తారనే అపోహలో చాలా మంది ప్రజలు ఉన్నారన్నారు. అయితే దానిపై ఎలాంటి గందరగోళం లేదని, రెండు బిల్లులు విడివిడిగా లెక్క కట్టామని ఆయన స్పష్టం చేశారు. గత అయిదేళ్లుగా మార్చిలో 46 శాతం వినియోగం, ఏప్రిల్‌లో నెలలో 54 శాతం వినియోగం ఉంటుందని, అందుకే ఏప్రిల్‌లో అధికంగా ఉన్న నాలుగు శాతాన్ని మార్చిలో కలిపినట్లు తెలిపారు. (‘ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా జగన్ బాటలోనే’ ) ఇక రెండు నెలలకు 50 శాతంగా లెక్క కట్టి బిల్లులు ఇవ్వడంతో స్లాబ్ మారే అవకాశం లేదన్నారు. ఏప్రిల్‌లో అదనంగా వచ్చిన యూనిట్లను మార్చిలో కలిపామని, మార్చి కి, ఏప్రిల్‌కు బిల్లులు విడివిడిగా ఎస్ఎంఎస్లు పంపుతామని చెప్పారు. మార్చి నెలకు సంబంధించిన గత సంవత్సరం టారీఫ్ ఏప్రిల్ నెలకు సంబంధించిన కొత్త టారీఫ్ ప్రకారం బిల్లులు పెట్టామని వెల్లడించారు. వినియోగదారులకు అనుకూలంగానే బిల్లింగ్ చేయడం జరిగిందని, ఎక్కడ ఒక్క యూనిట్ కూడా అదనంగా బిల్లింగ్ జరగలేదని తెలిపారు. కాగా లాక్ డౌన్ నేపథ్యంలో గృహ వినియోగం పెరిగిందని, సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. ఇక ప్రజలకు బిల్లులపై ఏమైనా అపోహాలు ఉంటే 1912కి డయల్ చేసి చేసి ఫిర్యాదు చేయాలని శ్రీకాంత్ సూచించారు. (వైరల్ ట్వీట్: ముంబై పోలీసులపై ప్రశంసలు) -
కార్పొరేషన్ నిర్లక్ష్యం...లైబ్రరీలకు శాపం
సాక్షి, గుంటూరు: నగర ప్రజలు పన్నులు చెల్లించకపోతే నానా రభస చేసే నగర పాలక సంస్థ అధికారులు మూడేళ్లగా గ్రంథాలయ సంస్థకు సెస్సు చెల్లించడం లేదు. ఎన్నిసార్లు గుర్తు చేసినా కాలయాపన చేస్తున్నారే తప్ప పట్టుమని పది లక్ష లు కూడా జమ చేయడం లేదు. దీంతో జిల్లా గ్రంథాలయ సంస్థ పరిస్థితి దయనీయంగా మారింది. ఏం చేయాలన్నా చేతిలో చిల్లిగవ్వ లేక గ్రంథాలయ సంస్థ అధికారులు అన్ని విధాలా అగచాట్లు పడుతున్నారు. నగరవాసులు చెల్లించే ఇంటి పన్నుల్లో రూపాయికి 8 పైసలు చొప్పున కార్పొరేషన్ జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లిం చాలి. ఉదాహరణకు ఇంటిపన్ను రూపేణా రూ.100 లు వసూలైతే అందులోని రూ.8 లను విధిగా లైబ్రరీ సెస్ కిం ద గ్రంథాలయ సంస్థకు కార్పొరేషన్ అధికారులు జమ చేయాలి. ఏటా ఇంటి పన్నుల రూపేణా రూ.45 కోట్లు వసూలవుతుంది. ఇందులో రూ.3.60 కోట్లు సెస్ కింద గ్రంథాలయ సంస్థకు చేరాలి. అయితే ఆరేళ్ల నుంచి ఇది జమ కావడం లేదు. ఈ బకాయిల మొత్తం రూ. 15 కోట్లు దాటింది. ఇలాగైతే కష్టమని గ్రంథాలయ సంస్థ అధికారులు నోటీసులు జారీ చేసిన ప్రతిసారీ ఐదారు లక్షలు విదిలించి కార్పొరేషన్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక గ్రంథాలయ సంస్థ కార్యదర్శి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. నిలిచిపోయిన చెల్లింపులు... జిల్లాలోని మున్సిపాల్టీలు, గుంటూరు కార్పొరేషన్ నుంచి అందే సెస్ గ్రంథాలయ సంస్థకు ప్రధాన ఆదాయ వనరు. సెస్ చెల్లింపులో మున్సిపాల్టీలు కూడా పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల నుంచి సుమారు రూ.20 కోట్ల వరకు గ్రంథాలయ సంస్థకు జమ కావాల్సి ఉంది. మున్సిపాల్టీల నుంచి సెస్ చెల్లింపులు ఆగిపోవడంతో రెండేళ్లుగా గ్రంథాలయ సంస్థ ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతింది. కొత్త పుస్తకాల కొనుగోలు, కరెంటు బిల్లుల చెల్లింపులు, దిన, వార పత్రికలకు నె లవారీ బిల్లుల చెల్లింపులు, లైబ్రరీ భవనాల రిపేర్లు వంటి పనులన్నింటికీ డబ్బులు లేక అధికారులు నానా ఇక్కట్లు పడుతున్నారు. రోజువారీ పనులు నిర్వహణకు అవసరమైన గుండుసూదులు, ఫైళ్లు, గమ్బాటిళ్లు, స్టాంప్ ప్యాడ్లు, ట్యాగ్ల కొనుగోళ్లకు సైతం పైసా లేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. గుంటూరు నగరంతో పాటు జిల్లా అంతటా ఉన్న 150 మంది బుక్ డిపాజిట్ సెంటర్స్ నిర్వాహకులకు నెలవారీగా అందజేసే హానరోరియంలు ఆగిపోయాయి. అలాగే గ్రామీణ గ్రంథాలయాల్లో తాత్కాలిక ఉద్యోగులకు చెల్లింపులు నిలిచిపోయాయి. చాలా చోట్ల లైబ్రరీల్లో దిన, వార పత్రికలు పడటం లేదు. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొంతలో కొంతైనా సెస్‌ను జమ చేస్తే బాగుంటుందని గ్రంథాలయ సంస్థ అధికారులు ఆశాభా వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి చెల్లింపులు : కమిషనర్ ఏప్రిల్ నెల నుంచి విధిగా గ్రంథాలయ సెస్‌ను ఆ సంస్థకు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్ కె. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు.