Cutoff
-
ఏ కాలేజీలో ఏ ర్యాంకు వరకు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాలల్లో 2023–24 సంవత్సరంలో సీట్లు దక్కించుకున్న కటాఫ్ ర్యాంకు వివరాలను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్ఆర్యూహెచ్ఎస్) ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 54 మెడికల్ కాలేజీలుండగా... ఇందులో 8,715 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లన్నీ ఆల్ ఇండియా కోటాలో 15 శాతం, మిగిలిన సీట్లు కన్వినర్ కోటాలో భర్తీ చేస్తుండగా... ప్రైవేటు కాలేజీల్లోని సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లలో బీ కేటగిరీ సీట్లు పోను ఎన్ఆర్ఐ, మేనేజ్మెంట్ కేటగిరీల్లో యాజమాన్యాలకు భర్తీ అవకాశాన్ని కల్పిస్తారు. 2023–24 విద్యా సంవత్సరంలో మాప్‌అప్ కౌన్సెలింగ్ ముగిసే నాటికి కాలేజీల వారీగా, కేటగిరీ వారీగా సీటు దక్కించుకున్న చివరి ర్యాంకు వివరాలతో కూడిన జాబితాను కేఎన్ఆర్యూహెచ్ఎస్ శనివారం విడుదల చేసింది. ఈ జాబితాను వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ విడుదల చేసిన చివరి ర్యాంకుల జాబితా కేవలం 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కౌన్సెలింగ్‌లోనివి మాత్రమే. రాష్ట్రంలో కొత్తగా 8 వైద్య కళాశాలలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్తగా 4 వందల సీట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో గతేడాది కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కూడా సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. స్థానికతపై తెగని పంచాయితీ... యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమైనప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ జాడలేదు. ఆల్ ఇండియా కోటా సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే తొలిరౌండ్ పూర్తి కాగా... రెండో రౌండ్ దరఖాస్తు, ఆప్షన్ల నమోదు ప్రక్రియ సైతం ముగిసింది. నేడో, రేపో రెండోరౌండ్ సీట్ల కేటాయింపు సైతం పూర్తి కానుంది. సాధారణంగా ఆలిండియా కోటా సీట్ల భర్తీ తొలి రౌండ్ పూర్తయిన వెంటనే రాష్ట్ర స్థాయిలో మొదటి రౌండ్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యేది.కానీ రాష్ట్రంలో విద్యార్థుల స్థానికత ఖరారుపై నెలకొన్న వివాదంతో కౌన్సెలింగ్ ప్రక్రియ చిక్కుల్లో పడింది. ఇప్పటికే హైకోర్టు తీర్పు వెల్లడించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్న విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మంచి కాలేజీలో సీటు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ ప్రారంభం కాకపోవడంతో ఎలాంటి కాలేజీలో సీటు వస్తుంది? ఎక్కడ చేరితే మేలు? అనే అంశంపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఈసారి 77,848 మంది నీట్ యూజీ పరీక్షకు హాజరు కాగా... 47,356 మంది అర్హత సాధించారు. పరీక్ష రాసిన వారిలో అత్యధికులు అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఏపీకి 10 శాతం కోటా సీట్ల కేటాయింపును రద్దు చేయడంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో నేషనల్ కోటా మినహా మిగిలిన కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. -
పోటీ పరీక్షలు.. ప్రమాణాలు పాతాళంలో
దేశంలో ఇంజనీరింగ్, మెడికల్, లా తదితర కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కటాఫ్ మార్కులు తగ్గించుకుంటూపోతున్నారు. నాణ్యత ప్రమాణాలతో రాజీ పడుతున్నారు. జీరో మార్కులు వచ్చిన వారు కూడా ఇంజనీరింగ్, మెడికల్, లా కోర్సుల్లో అడ్మిషన్ పొందే పరిస్థితి ఉంది. సీట్ల భర్తీ కోసం కటాఫ్‌లు తగ్గించుకుంటూ పోవడం వల్ల ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రమాణాలు పడిపోతాయి. ఇది దీర్ఘకాలంలో ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ప్రొఫెషనల్ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు కనీస ప్రమాణాలు పాటించాలని చెబుతున్నారు.. కెరీర్స్360 ఫౌండర్ చైర్మన్ మహేశ్వర్ పెరి. ప్రస్తుతం ప్రొఫెషనల్ కోర్సుల్లో పడిపోతున్న ప్రమాణాలపై ఆయన అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం.. దేశ అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ) కటాఫ్‌ను తగ్గించేందుకు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏఐబీఈ కటాఫ్‌ను తగ్గించడం వల్ల న్యాయ విద్యలో ప్రమాణాలు పడిపోతాయని పేర్కొంది. ‘‘పరీక్ష నిర్వాహకులు.. ఏఐబీఈ జనరల్ కేటగిరీ కటాఫ్ 45 మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు కటాఫ్ 40 మార్కులుగా నిర్ణయించారు.ఆ మాత్రం కూడా స్కోర్ చేయకుంటే లాయరుగా ఎలా రాణించగలరు. మీరు దాన్ని ఇంకా 40, 35కు తగ్గించాలని కోరుతున్నారు.. దయచేసి చదవండి’’ అంటూ ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రధాన న్యాయమూర్తి మనందరి తరఫున మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల్లో పడిపోతున్న ప్రమాణాలు, అర్హత మార్కులు, తగ్గుతున్న ఉత్తీర్ణత ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. నేషనల్ లా యూనివర్సిటీలు2022 సర్క్యులర్‌లో నేషనల్ లా యూనివర్సిటీల కన్సారి్టయం ప్రతి కే టగిరీలో అందుబాటులో ఉన్న సీట్లకు ఐదు రెట్ల మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలవాలని నిర్ణయించింది. దీని అర్థమేమిటంటే.. వారు కనీస ప్రమాణాలను కూడా వదిలేసి ప్రతి సీటుకు ఐదుగురిని పిలవాలని నిర్దేశించారు. ప్రవేశానికి కనీస మార్కులు నిర్దేశించకపోవడం వల్ల కనీసం నాణ్యత లేని విద్యార్థి కూడా అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. 2023లో 40 వేల కంటే ఎక్కువ ర్యాంకు వచి్చన విద్యార్థులు సైతం ఎన్ఆర్ఐ కోటాలో నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందే వీలు కలిగింది. 150కు 15–17 మార్కుల(10 శాతం మార్కులు)మధ్య వచి్చన విద్యార్థులు కూడా జాతీయ లా వర్సిటీల్లో ఎన్ఆర్ఐ కోటా ద్వారా అడ్మిషన్ పొంది.. ఈ దేశంలో లాయర్‌గా మారే అవకాశం ఏర్పడింది. నీట్ పీజీ 2023 2023లో నీట్ పీజీకి హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య.. 2,00,517. ఆ ఏడాది అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు 47,526. మొత్తం 800 మార్కులకు పరీక్ష జరిగింది. 2023లో తొలుత కటాఫ్ 291 మార్కులు(36 శాతం). ఆ తర్వాత కౌన్సెలింగ్ కొనసాగుతున్న కొద్దీ కటాఫ్‌ను తగ్గించుకుంటూ వచ్చి.. చివరకు జీరోగా నిర్ణయించారు. అంటే.. పరీక్షకు హాజరైతే చాలు.. మెడికల్ పీజీలో ప్రవేశం పొందొచ్చన్నమాట! ఇది ఒకరకంగా ప్రవేశ పరీక్షను చంపివేయడంలాంటిదే!! ప్రస్తుతం పలు మెడికల్ కాలేజీల్లో పీజీ చదువుతున్న విద్యార్థుల్లో జీరో మార్కులు వచి్చన వారుకూడా ఉండొచ్చు. నీట్ యూజీ ⇒ 2020లో మొత్తం 13,66,945 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్షకు హాజరైతే.. కటాఫ్ 147( మొత్తం 720 మార్కులకు(20.4 శాతం)గా నిర్ణయించారు. ఆ సంవత్సరం మొత్తం మెడికల్ సీట్ల సంఖ్య 93,470. కానీ డెంటల్ సీట్లు భర్తీ కాకపోవడంతో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ ఏడాది కటాఫ్‌ను 113కు తగ్గించింది. దీంతో 15.7 శాతం మార్కులు వచి్చన వారికి కూడా సీటు లభించింది. ⇒ అదే విధంగా 2021లో మొత్తం 15,44,273 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాశారు. మొత్తం మెడికల్ సీట్లు 99,695 ఉన్నాయి. ఆ ఏడాది కటాఫ్ 138(19.2 శాతం). కాని ఆయుష్ సీట్లు భర్తీ కాకపోవడంతో ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ కటాఫ్‌ను 122కు తగ్గించింది. అంటే 17% మార్కులు సాధించిన విద్యార్థులు కూడా సీటు పొందొచ్చు. ఇలా సీట్లు భర్తీ చేయడం కోసం కటాఫ్ తగ్గిస్తూ నాణ్యత విషయంలో రాజీపడుతున్నారు. నీట్ ఎండీఎస్ 2023ఈ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ మెడికల్ సైన్సెస్.. ఎండీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు కేటాయించిన మొత్తం మార్కులు 960. మొత్తం సీట్లు 6,937. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23,847. దీనికి కూడా సీట్ల భర్తీ కోసం 2021 నుంచి కటాఫ్ తగ్గించుకుంటూ వస్తున్నారు. నీట్ సూపర్ స్పెషాలిటీదేశంలో నీట్ సూపర్ స్పెషాలిటీలో మొత్తం సీట్ల సంఖ్య 4,243. ఈ పరీక్షకు 2023లో వచ్చిన దరఖాస్తులు 19,944. 2023లో మొదటి రౌండ్లో కటాఫ్ 50 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్లు భర్తీకాలేదు. దీంతో రెండో రౌండ్లో కటాఫ్‌ను 20 పర్సంటైల్‌కు తగ్గించారు. అయినా సీట్లు నిండలేదు. ఇక చివరగా స్పెషల్ రౌండ్లో అర్హతను జీరో పర్సంటైల్‌గా నిర్ణయించారు.మెడికల్, లాకే పరిమితం కాలేదు..వాస్తవానికి ఈ అర్హత మార్కులు తగ్గింపు అనేది లా, మెడికల్‌కే పరిమితం కాలేదు. 2018 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ ఐఐటీల్లో ప్రతి విభాగం, ప్రతి కేటగిరీకి సంబంధించి సీట్ల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో విద్యార్థులు అందుబాటులో ఉండేలా కటాఫ్‌ను తగ్గించాలని ఆదేశించింది. అంటే.. ఐఐటీల్లో అందుబాటులో ఉన్న మొత్తం 10వేల సీట్లకు 20 వేలమంది విద్యార్థులను జోసా కౌన్సెలింగ్ పిలుస్తారు. దీనికోసం అడ్మిషన్ బోర్డు అర్హత మార్కులను 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. ఏకంగా 10 శాతం తగ్గించారు. దీంతో తొలుత మెరిట్ లిస్ట్‌లో 18,138 మంది మాత్రమే ఉండగా.. కొత్తగా 13,842 మంది విద్యార్థులను అర్హులుగా ప్రకటించారు. ఇలా మొత్తంగా పదివేల సీట్ల కోసం 31,980 మంది విద్యార్థులు జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. -
లెక్కలతోనే ఇక్కట్లు..
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2023 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 1.9 లక్షల మంది దరఖాస్తు చేయగా, అందులో 85 శాతానికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసిన విద్యార్థుల్లో 44వేల మంది బాలికలు ఉన్నారు. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించారు. ఈసారి ఈ పరీక్షలో ప్రశ్నల సరళి గతంలో మాదిరిగానే మధ్యస్థంగా ఉన్నట్లు పరీక్షకు హాజరైన అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రశ్నలు ఒకింత సులభంగా ఉన్నా, గణితానికి సంబంధించిన ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈసారి సిలబస్‌ను బోర్డు సిలబస్‌తో సమానంగా ఉండేలా ఎన్సీఈఆర్టీ సిలబస్‌నే పేర్కొన్నప్పటికీ ప్రశ్నలను రూపొందించిన తీరు వినూత్నమైన రీతిలో ఉందని వివరించారు. ముఖ్యంగా గణితానికి సంబంధించిన ప్రశ్నల చిక్కులు విప్పడం విద్యార్థులకు కష్టంగా మారిందని హైదరాబాద్ కేంద్రంగా పరీక్షకు కోచింగ్ నిర్వహించిన కార్పొరేట్ విద్యా సంస్థ అకడమిక్ డీన్ ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రశ్నలు అర్థం చేసుకోవడానికే ఎక్కువ సమయం.. ఇక, ఐఐటీ గౌహతి ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పేపర్–1లో మొత్తం 180 మార్కులకు 51 ప్రశ్నలు అడిగారు. ఫిజిక్సు, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌లో 17 చొప్పున ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కో విభాగంలో 60 మార్కులు చొప్పున ప్రశ్నలిచ్చారు. పరీక్ష రాసిన విద్యార్థుల అభిప్రాయం ప్రకారం మేథమెటిక్స్‌లో ప్రశ్నల సరళి అంతుచిక్కని రీతిలో కఠినంగా ఉంది. ‘ప్రశ్నలను అర్థంచేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎక్కువ సమయం మేథమెటిక్స్ విభాగపు ప్రశ్నలకే వెచ్చించాల్సి వచ్చింది’.. అని హైదరాబాద్ కేంద్రంగా పరీక్ష రాసిన విద్యార్థి శ్రీకాంత్ వివరించాడు. ఫంక్షన్స్, మేట్రిక్స్, ఎల్లిప్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబులిటీల నుంచి ప్రశ్నలు వచ్చాయని తెలిపాడు. ప్రాబబులీటీ, కాంప్లెక్సు నెంబర్స్, త్రీడీ, జామెట్రీల నుంచి కొంచెం మంచి ప్రశ్నలు వచ్చాయని మరికొందరు చెప్పారు. ఇక ఫిజిక్స్ విభాగంలో కైనమేటిక్స్, థర్మో డైనమిక్స్, మోడరన్ ఫిజిక్సు, కరెంట్ ఎలక్ట్రిసిటీ, కెపాసిటర్, గ్రావిటేషన్, ఆప్టిక్స్, ఎలక్ట్రో స్టాటిస్టిక్స్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రశ్నలు వచ్చినట్లు విద్యార్థులు చెప్పారు. మేథమెటిక్స్, కెమిస్ట్రీలతో పోల్చిచూస్తే ఈసారి ఫిజిక్స్ సులభంగా ఉందనే చెప్పుకోవచ్చని పలు కోచింగ్ సంస్థల అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. కెమిస్ట్రీలో వచ్చిన ప్రశ్నలు ఒకింత అసమతుల్యంగా ఉన్నా మేథమేటిక్స్ అంత గజిబిజిగా లేదన్నారు. కెమిస్ట్రీ ప్రశ్నలను రాయడంలో విద్యార్థులు ఇబ్బందిపడినట్లు చెప్పారు. కొన్ని ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి నేరుగా ఇచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ కైనటిక్స్, లోనిక్, కెమికల్ ఈక్విలిబ్రియమ్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆటమిక్ స్ట్రక్చర్ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఇక ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆమినీస్, పాలిమర్స్, బయోమాలిక్యులస్, ఆక్సిజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ వంటి అంశాల్లో ప్రశ్నలు అడిగారు. ఎక్కువగా మిక్స్డ్ కాన్సెప్టులతో కూడిన ప్రశ్నలు వచ్చాయని విద్యార్థులు చెప్పారు. ఫిజికల్ కెమిస్ట్రీలో కన్నా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయన్నారు. జూన్ 11న ప్రిలిమనరీ కీ.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల ప్రాథమిక కీని జూన్ 11న ఐఐటీ గౌహతి విడుదల చేయనుంది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు జూన్ 9 నుంచి వారికి అందుబాటులో ఉంచనున్నట్లు నిర్వహణ సంస్థ ప్రకటించింది. జూన్ 18న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తామని ఐఐటీ గౌహతి ప్రకటించింది. సీఆర్ఎల్ కటాఫ్ 86–91 మధ్య ఉండొచ్చు.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరైన అభ్యర్థులకు వారు సాధించిన మార్కుల ఆధారంగా రెండు రకాల ర్యాంకులను ప్రకటించనున్నారు. ఒకటి కామన్ ర్యాంకు లిస్టుకు సంబంధించినది కాగా.. మరొకటి అడ్మిషన్ల ర్యాంకుకు సంబంధించినది. అడ్మిషన్ల ర్యాంకులు మొత్తం సీట్లు, పరీక్ష రాసిన అభ్యర్థులు, సంస్థల వారీగా ఆయా సంస్థల్లో సీట్ల కేటాయింపులో చివరి ర్యాంకు ఆధారంగా అడ్మిషన్ ర్యాంకు కటాఫ్ నిర్ణయిస్తారు. అలాగే, ర్యాంకు లిస్టుకు సంబంధించి కటాఫ్ మార్కులు ఈసారి జనరల్ కేటగిరీలో 86–91 మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఓబీసీలో 71–76, ఈడబ్ల్యూఎస్‌లో 77–82, ఎస్సీలకు 51–55, ఎస్టీలకు 39–44గా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. -
89 పర్సంటైల్ సాధిస్తే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 పరీక్షలు శనివారంతో ముగిశాయి. దేశవ్యాప్తంగా తొలి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు, రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 15 వరకు నిర్వహించారు. తొలి సెషన్‌కు 8.6 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా 8.23 లక్షల మంది, రెండో సెషన్ పరీక్షలకు 9.4 లక్షల మంది రిజిస్టర్ కాగా 99 శాతం మంది హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గణాంకాలు చెబుతున్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షల్లో ప్రశ్నల తీరు గత ఏడాది మాదిరిగానే ఉన్నందున అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ మార్కులు కూడా అదే విధంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత నాలుగేళ్ల కటాఫ్ స్కోరు మార్కులను పరిగణనలోకి తీసుకొని ఈసారి జనరల్ కేటగిరీకి 88 నుంచి 89 స్కోరు సాధించిన వారు అడ్వాన్స్‌డ్‌కు అర్హులవుతారని చెబుతున్నారు. రెండో సెషన్ ప్రాథమిక కీ, అభ్యర్థుల వారీగా రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ త్వరలోనే అధికారిక వెబ్సైట్లో ఉంచనుంది. వీటిపై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం ర్యాంకులతో సహా తుది ఫలితాలను ప్రకటించనుంది. 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.50 లక్షల మందికి ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అవకాశం కల్పిస్తారు. అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 30న ప్రారంభమవుతుంది. అందువల్ల నెలాఖరులోగానే మెయిన్ ఫలితాలను ఎన్టీఏ ప్రకటించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా ఎత్తేసిన అడ్వాన్స్‌డ్‌కు అర్హతకు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు పొంది ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది నుంచి ఎన్టీఏ పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్ లేదా 75 శాతం మార్కులు సాధిస్తేనే ఐఐటీ ప్రవేశ పరీక్షకు అర్హత పొందుతారు. తొలి సెషన్ మాదిరిగానే రెండో సెషన్ ప్రశ్నలు రెండో సెషన్ పరీక్షల ప్రశ్నల కాఠిన్యత మొదటి సెషన్ మాదిరిగానే ఉందని అభ్యర్థులు తెలిపారు. చివరి రోజైన శనివారం కెమిస్ట్రీ పేపర్ మోడరేట్‌గా ఉందని తెలిపారు. ఫిజికల్, ఆర్గానిక్ కెమిస్ట్రీలకన్నా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఈసారి ఫిజిక్సులో ప్రశ్నలు సులభంగా ఉన్నాయని పలు విద్యా సంస్థల అధ్యాపకులు చెప్పారు. 12వ తరగతి చాప్టర్లలోని అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. కైనమెటిక్స్, గ్రావిటేషన్, సింపుల్ హార్మొనిక్ మోషన్, హీట్ అండ్ థర్మో డైనమిక్స్, సర్క్యులర్ మోషన్, రొటేషన్ మోషన్, ఎలక్ట్రో మేగ్నటిక్ వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఏసీ సర్క్యూట్స్, మోడర్న్ ఫిజిక్సు, రే, వేవ్ ఆప్టిక్స్ అంశాలతో సహా న్యూమరికల్ ఆధారిత ప్రశ్నలను అడిగారు. మేథమెటిక్స్‌లో ప్రశ్నలు మోడరేట్‌గా, అన్ని చాప్టర్ల నుంచి వచ్చాయని అధ్యాపకులు వివరించారు. అభ్యర్థులకు ఒకరికి కష్టంగా, మరొకరికి సులభంగా ప్రశ్నలు వచ్చాయనే పరిస్థితి తలెత్తకుండా అందరికీ సమన్యాయం జరిగేందుకు నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా స్కోరు మార్కులు ప్రకటించనున్నారు. అత్యధిక, అత్యల్ప స్కోరులను ఆధారం చేసుకొని నార్మలైజేషన్ చేయడం ద్వారా అభ్యర్థులకు స్కోరు లభిస్తుంది. -
ఊహించనివిధంగా సీఎస్సీ కటాఫ్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లోనూ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ (సీఎస్సీ) కోర్సులో చేరడానికి ఎక్కువగా మొగ్గుచూపిస్తున్నారు. తాజాగా ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో జోసా నిర్వహించిన ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌లో ఇది స్పష్టమైంది. ప్రధాన ఐఐటీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల కటాఫ్ ర్యాంకులు ఊహించని విధంగా ఉన్నాయి. బాలికలకు సూపర్‌న్యూమరరీ సీట్లు కేటాయించడంతో వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఓపెన్ కేటగిరీలో కొన్ని సంస్థల్లో వందలోపు ర్యాంకు వచ్చిన వారికి కూడా సీట్లు దక్కలేదు. ముంబై, కాన్పూర్, ఢిల్లీ ఐఐటీలలో పోటీ ఈసారి తీవ్రంగా ఉంది. పాలక్కడ్, భిలాయ్ ఐఐటీల్లో 5 వేల పైన ర్యాంకు వచ్చిన వారికీ సీటు దక్కడం విద్యార్థులకు కాస్తా ఊరటనిచ్చింది. ఎన్ఐటీల్లోనూ అదే జోరు.. జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లో (ఎన్ఐటీలు) ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుకే డిమాండ్ కొనసాగింది. ఇతర బ్రాంచీలకన్నా సీఎస్సీ కోర్సులకు విద్యార్థులు 10 రెట్లు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారు. అందులోనూ ఎన్ఐటీలను మొదటి ఐచ్చికంగా ఎంచుకున్నారు. దీంతో వరంగల్ నిట్‌లో ఓపెన్ కేటగిరీలో బాలురకు 2 వేల లోపు ర్యాంకు వరకే సీట్లు దక్కాయి. తిరుచనాపల్లిలో వెయ్యిలోపు ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఏపీ, కాలికట్, జలంధర్, సిక్కిం, హమీర్పూర్ ఎన్ఐటీల్లో 10 వేల పైబడ్డ ర్యాంకుల వరకు సీట్లు లభించాయి. బాలికలకు కొంత మెరుగు తాజాగా ఐఐటీ, ఎన్ఐటీలలో కటాఫ్ తీరును పరిశీలిస్తే బాలురకన్నా, బాలికల పరిస్థితి కాస్తా మెరుగ్గా కనిపించింది. ఆరు రౌండ్ల సీట్ల కేటాయింపు తర్వాత ముంబై ఐఐటీలో బాలికలకు 305 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. తిరుపతిలో 5,901 వరకూ, భిలాయ్‌లో 7,176 వరకూ సీటు వచ్చింది. ఎన్ఐటీల విషయానికి వస్తే హమీర్పూర్ ఎన్ఐటీలో 18 వేల వరకూ కటాఫ్ ఉంటే, తిరుచనాపల్లిలో 1,852 బాలికల కటాఫ్‌గా ఉంది. దీంతో ఓపెన్ కేటగిరీలో బాలికలు సాధారణ పోటీతో సీట్లు దక్కించుకోవడం సాధ్యమైందని విశ్లేషకులు అంటున్నారు. కోవిడ్ తర్వాత జరిగిన జేఈఈ మెయిన్స్ పేపర్లు కఠినంగానే ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ర్యాంకుల సాధనలోనూ ఈసారి పోటీ వాతావరణం కనిపించింది. -
అడ్వాన్స్‌డ్‌లో మరో 13,850 మందికి అర్హత
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్‌ను ఐఐటీ కాన్పూర్ మరింత తగ్గించింది. ఈ నెల 10న ప్రకటించిన ఫలితాల్లో 18,138 మందే అర్హత సాధించడంతో తాజాగా కటాఫ్ మార్కులను తగ్గించి అర్హుల సంఖ్యను పెంచింది. మొదట ఓపెన్ కేటగిరీలో కటాఫ్ 126 మార్కులు ఉండగా, తాజాగా దానిని 90 మార్కులకు తగ్గి ంచింది. ఓబీసీ నాన్ క్రీమీలేయర్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లోనూ కటాఫ్‌ను తగ్గించింది. దీంతో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారి సంఖ్య 31,988కి పెరిగింది. తాజా తగ్గింపుతో 13,850 మంది విద్యార్థులకు అర్హత లభించింది. గత నెల 20న జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు 2.31 లక్షల మందిని అర్హులుగా ప్రకటించగా, 1,65,656 మంది దరఖాస్తు చేసుకోగా, 1,55,158 మంది పరీక్షలకు హాజరైన సంగతి తెలిసిందే. కటాఫ్ మార్కులను తగ్గించడంతో అర్హత సాధించిన బాలికల సంఖ్య రెట్టింపైంది. ఇంతకుముందు ప్రకటించిన ఫలితాల్లో 2,076 మంది బాలికలే అర్హత సాధించగా.. ప్రస్తుతం వారి సంఖ్య 4,179కి పెరిగింది. తాజా తగ్గింపుతో అదనంగా 2,013 మంది బాలికలకు అర్హత లభించింది. 1:2 రేషియో ఉండాలనే.. ఈసారి అడ్వాన్స్‌డ్‌లో అర్హుల సంఖ్య తగ్గడంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సమీక్షించింది. గత సంవత్సరాల కంటే ఈసారి అ ర్హుల సంఖ్య భారీగా తగ్గినట్లు గుర్తించింది. అందుబాటులో ఉన్న సీట్లకు కనీసం 1:2 నిష్పత్తిలో అర్హులుండాలని ఐఐటీ కాన్పూర్‌కు తెలిపింది. దీంతో కటాఫ్ మార్కులను తగ్గించి, అర్హుల సంఖ్యను పెంచింది. తగ్గిన కటాఫ్ మార్కుల ప్రకారం అర్హత సాధించిన వారి ఫలితాలను వెబ్సైట్లో ఉంచింది. నేటి నుంచి కౌన్సెలింగ్ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15 నుంచి కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడు దశల్లో ఈ కౌన్సె లింగ్‌ను నిర్వహించనుంది. రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లకు 25వ తేదీ వరకు అవకాశం కల్పించి, 27న మొదటి దశ సీట్లను కేటాయించనుంది. జూలై 3న రెండో దశ, 6న మూడో దశ, 9న నాలుగో దశ, 12న ఐదో దశ, 15న 6వ దశ, 18న చివరి దశ సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. కటాఫ్ మార్కుల వివరాలు ఇవీ.. కేటగిరీ ఇదివరకు తాజాగా ఓపెన్ 126 90 ఓబీసీ నాన్ క్రీమీలేయర్ 114 81 ఎస్సీ 63 45 ఎస్టీ 63 45 వికలాంగులు 63 45 -
కటాఫ్ వస్తేనే ‘మెరిట్’లో చోటు
► గతేడాదికంటే కాస్త సులభంగా జేఈఈ అడ్వాన్స్డ్ ► కెమిస్ట్రీలో 3 ప్రశ్నల జవాబులపై కొంత సందిగ్ధం ► వచ్చే నెల 11న ఫలితాలు, 19 నుంచి ప్రవేశాలు షురూ సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రశ్నలు గతేడాది కంటే సులభంగా వచ్చాయి. కెమిస్ట్రీలో 3 ప్రశ్నలకు, ఫిజిక్స్‌లో 3 ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల విషయంలో కొంత సందిగ్ధం నెలకొన్నట్లు సబ్జెక్టు నిపుణులు వెల్లడించారు. ఈ పరీక్షలు రాసేందుకు దేశ వ్యాప్తంగా 1.7 లక్షల మంది, తెలుగు రాష్ట్రాల నుంచి 31,695 మంది దరఖాస్తు చేసుకోగా, ఎంతమంది హాజ రయ్యారన్న కచ్చితమైన వివరాలు తెలియరా లేదు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు కనీస అర్హత మార్కులు సాధిస్తేనే మెరిట్, ర్యాంకుల జాబితాలో చోటు కల్పిస్తారు. ఓపెన్ కేటగిరీలో 35% మార్కులను విద్యార్థులు సాధించాలి. ఓబీసీ–నాన్ క్రీమీలేయర్ కేటగిరీలో 31.5 శాతం మార్కులను, ఎస్సీ కేటగిరీలో 17.5 శాతం, ఎస్టీ కేటగిరీలో 17.5 శాతం, ప్రతి కేటగిరీలో వికలాంగులు 17.5 శాతం మార్కులను సాధించాల్సి ఉంది. ఈ పరీక్షకు సంబంధించి ఈనెల 31న ఉదయం 10 గంటల నుంచి వచ్చే నెల 3 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో ఓఎంఆర్ జవాబు పత్రాలను ప్రదర్శిస్తారు. వాటిపై అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు స్వీకరి స్తారు. వచ్చే నెల 4న ఉదయం వెబ్సై ట్లో జవాబుల కీలను అందుబాటులో ఉంచుతారు. 6వ తేదీ వరకు వాటిపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. 11వ తేదీన ఉదయం 10 గంటలకు ఫలితాలను ప్రకటి స్తారు. ఆర్కిటెక్చర్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆర్కిటెక్చర్ ఆప్టి ట్యూట్ టెస్టు (ఏఏటీ) కోసం వచ్చే నెల 11, 12 తేదీల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారు. 14వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏఏటీ పరీక్ష ఉంటుంది. 18వ తేదీన వాటి ఫలితా లను విడుదల చేస్తారు. వచ్చే నెల 19న ఎన్ఐ టీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీ ల్లో సంయుక్త ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించి జూలై 18లోగా ఈ ప్రవేశాలను పూర్తి చేస్తారు. ఇదీ నిపుణుల విశ్లేషణ.. పేపరు–1లో మొత్తంగా 183 మార్కులతో కూడిన 54 ప్రశ్నలు ఇచ్చినట్లు సబ్జెక్టు నిపుణు లు ఎంఎన్‌రావు, కేదారీశ్వర్, రామకృష్ణ తెలిపా రు. పేపరు–2లోనూ అలాగే ఇచ్చారని పేర్కొ న్నారు. పేపరు–1లో మ్యాథ్స్‌లో 18, ఫిజిక్స్ లో 18, కెమిస్ట్రీలో 18 ప్రశ్నలు ఇచ్చారని వివ రించారు. ప్రతి సబ్జెక్టులో ఆబ్జెక్టివ్ విధానంలో 7 ప్రశ్నలు ఇచ్చారని, మరో 5 సింగిల్ డిజిట్ ఇంటీజర్ ప్రశ్నలు ఇచ్చినట్లు వెల్లడించారు. మరో త్రీ కాలమ్స్ మ్యాట్రిక్స్ మ్యాచింగ్ ప్రశ్న లను గతంలో ఎన్నడూలేని విధంగా ఇచ్చినట్లు వివరించారు. కొన్ని కేటగిరీల ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు లేవు. పార్షియల్ మార్కింగ్ విధానంలోనూ ప్రశ్నలు ఇచ్చారు. పేపరు మొత్తంలో 21 ప్రశ్న లకు ఒకటికంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్న ప్రశ్నలు ఇచ్చారు. 15 ప్రశ్నలు సింగిల్ డిజిట్ ఇంటీజర్ (0 నుంచి 9 లోపు ఉన్న అంకెలే సమాధానం గా ఉంటాయి.) జవాబులు కలిగిన ప్రశ్నలు ఇచ్చారు. 18 ప్రశ్నలు మ్యాట్రిక్స్‌కు సంబందించినవి ఇచ్చారు. ఇంటీజర్ టైపు ప్రశ్నల్లో నెగిటివ్ మార్కుల విధానం లేదు. ఇక పేపరు– 2లో ప్రతి సబ్జెక్టులో 7 సింగిల్ ఆన్సర్ ప్రశ్నలు ఇచ్చారు. మరో 7 మల్టీ ఆన్సర్ ప్రశ్నలు ఇచ్చారు. మరో 4 ప్రశ్నలు పాసేజ్‌కు సంబం ధించినవి వచ్చినట్లు వారు వెల్లడించారు. మొత్తంగా 54 ప్రశ్నలు 183 మార్కుల విధానాన్ని పాటించారు. ఇందులో కొన్నింటికి నెగిటివ్ మార్కుల విధానం ఉంది. పాసేజ్ విధానంలో నెగిటివ్ మార్కులు లేవు.