Cyber Crime Prevention
-
జాబ్ కోసం వెతుకుతున్నారా..? జాగ్రత్త.. లింక్డ్ ఇన్ ప్లాట్‌ఫారమ్‌లో..
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న లింక్డ్ ఇన్ ప్లాట్‌ఫారమ్ వృత్తిపరమైన వ్యక్తులతో కనెక్ట్ అవడానికి, జాబ్సెర్చ్లకు సహాయపడుతుంది. జనాదరణ పొందిన ఈ ప్లాట్‌ఫారమ్‌ను స్కామర్లు మోసాలకు ఉపయోగించుకుంటున్నారు. లింక్డ్ఇన్ స్కామ్‌ల నుండి రక్షించుకోవడానికి, వాటి బారిన పడకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు. లింక్డ్ ఇన్ మన కెరీర్ ఫీల్డ్‌లోని వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి, నెట్వర్క్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే, మీరు సెర్చ్ చేసేటప్పుడు వచ్చే ప్రతి రిక్వెస్ట్‌ను అంగీకరించే ముందు, ప్రొఫైల్ లేదా వివరాలను తనిఖీ చేయడం సరైన విధానం. లింక్డ్ఇన్ తరచుగా ఆకట్టుకోవడమే కాదు నిపుణులలో ప్లాట్‌ఫారమ్ ఎంత ప్రజాదరణ పొందిందో సూచిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాట్‌ఫారమ్ స్కామర్లను కూడా ఆకర్షించింది. లింక్డ్ఇన్లో సబ్స్రైబర్లు నిపుణులుగా ఉండటం, వారి నమ్మకం ఈ స్కామ్‌కి ప్రధాన కారణమవుతోంది. నకిలీ ప్రొఫైల్ స్కామర్లు నకిలీ ప్రొఫైల్స్‌ను సృష్టిస్తారు. వారు తమ ప్రొఫైల్స్‌ను వీలైనంత చట్టబద్ధంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. వాటి ద్వారా ఈ కింది మోసాలకు పాల్పడతారు.. అడ్వాన్స్ ఫీజు మోసాలు ముందుగా స్కామర్లు ఒక చిన్న ఫీజుతో రిక్వెస్ట్ పెడతారు. దానికి బదులుగా మీరు పెద్ద మొత్తంలో డబ్బును పొందుతారని చూపుతారు. అందుకు, సివివి నంబర్లు, ఓటీపీలతో పాటు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డ్ నంబర్లను అందించమని కూడా మిమ్మల్ని అడగవచ్చు. కొన్నిసార్లు డబ్బు పొందడానికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు. జాబ్ స్కామ్‌లు ఈ స్కామ్‌లలో సాధారణంగా రిక్రూటర్లుగా నటిస్తున్న వ్యక్తులు, యజమానులు లేదా ఉద్యోగాలను అందించే ప్లేస్మెంట్ ఏజెన్సీలు ముఖ్యంగా ఐటీ సంబంధిత కొత్త ఉద్యోగాలను ఆఫర్ చేస్తుంటారు. చాలా వరకు ఈ నకిలీ ప్రొఫైల్స్ మీకు బ్యాక్ డోర్ జాబ్‌లను అందిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేకుండా ఇంటి నుండి పనికి ఆహ్వానిస్తాయి (ఎ) ఆఫర్‌ను రిలీజ్ చేయడానికి, దరఖాస్తు ప్రక్రియ పూర్తయినందున వారు మిమ్మల్ని కొత్త మొత్తం చెల్లించమని అడుగుతారు. వారి స్కామర్లలో చాలా మంది ఉద్యోగాలను ప్రకటించే కంపెనీలలో అంతర్గత వ్యక్తిని కలిగి ఉంటారు లేదా చట్టబద్ధమైన కంపెనీల ఇ–మెయిల్లు, ఆఫీస్ ఫోన్ నంబర్లను వాడుతుంటారు. డేటింగ్, రొమాన్స్ స్కామ్‌లు ఈ స్కామర్లు మిమ్మల్ని సంప్రదించి, సన్నిహిత సంబంధంపై ఆసక్తిని వ్యక్తం చేసే మోసగాళ్ల నుండి వస్తాయి. వారు సాధారణంగా మీ ప్రొఫైల్ ఫోటోపై వ్యాఖ్యానిస్తారు. తమ రిక్వెస్ట్‌ను ఓకే చేయమని కోరుతారు. ఈ డేటింగ్, రొమాన్స్ స్కామ్‌లు చాలా వరకు సెక్స్టార్షన్ స్కామ్‌లకు దారితీయవచ్చు. ఫిషింగ్ స్కామ్‌లు ఎవరైనా ఇ–మెయిల్ చిరునామా, ఫోన్ నంబర్ లేదా వెబ్సైట్ యుఆర్‌ఎల్‌ని నకిలీగా మారుస్తారు. ఈ స్కామ్‌లు మిమ్మల్ని ట్రాప్ చేయడానికే రూపొందించబడ్డాయని గుర్తించాలి. అవార్డులు ఇస్తున్నామని, ప్రముఖ మ్యాగజైన్ మొదటి పేజీలో ప్రచురిస్తామని, సంఘాలలో సభ్యత్వాన్ని అందిస్తామని... ఇలాంటి ఆకర్షణీయమైన మెయిల్స్ ఉంటాయి. టెక్ సపోర్ట్ ప్రీమియం లింక్డ్ ఇన్ ఉచిత ఆఫర్లను అందించే టెక్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లుగా స్కామర్లను ఉపయోగిస్తారు. లేదా కస్టమర్ సపోర్ట్‌గా పేరున్న బ్రాండ్‌ను అనుకరిస్తారు. చాలా సందర్భాలలో చిన్న చిన్న లింక్‌లు స్కామర్ల ద్వారా పంపబడతాయి. చివరికి ఆ లింక్‌లు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడే మాల్వేర్ లేదా కీ–లాగర్కు దారితీస్తాయి. దీని నుంచి తమ పనులు చక్కబెట్టుకోవడానికి స్కామర్లకు సులువు అవుతుంది కాబట్టి జాగ్రత్త అవసరం. నకిలీ ప్రొఫైల్‌ల సంకేతాలివి మీకు తెలియని వ్యక్తి నుండి లింక్డ్ఇన్లో రిక్వెస్ట్ వచ్చినప్పుడు, మీరు కనెక్ట్ చేయడానికి ముందు వారి ప్రొఫైల్‌ను పూర్తిగా తనిఖీ చేయడం అలవాటు చేసుకోవాలి. లింక్డ్ఇన్ లో స్పామ్, నకిలీ ఖాతాలను సాధారణంగా గుర్తించడం చాలా సులభం. మీరు ఈ నకిలీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లలో సాధారణమైన నమూనాలు, సంకేతాలను చూడవచ్చు. నకిలీ ప్రొఫైల్‌లకు వ్యతిరేకంగా నిజమైన ప్రొఫైల్స్‌ను అంచనా వేసేటప్పుడు ఉపయోగించే కొన్ని సంకేతాలివి.. ►వారికి ప్రొఫైల్ చిత్రం ఉండదు. లేదా సరిగా లేని ఫొటో ఉపయోగిస్తారు ►వారికి అధికారిక ఇ–మెయిల్ చిరునామా ఉండదు ►వారి ప్రొఫైల్‌లో వ్యాకరణం, స్పెల్లింగ్‌లో లోపాలు ఉంటాయి ►వారి ప్రొఫైల్ అసంపూర్ణంగా ఉంటుంది. వ్యక్తిగత సమాచారం ఉండదు ►సారాంశం, నైపుణ్య విభాగాలలో నిర్దిష్టత లేని సాధారణ ప్రకటనలను ఉంటాయి ►వారి వర్క్ హిస్టరీలో చాలా వరకు ఖాళీలు ఉంటాయి ►వారు తమ ప్రొఫైల్‌లోని వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వరు ►లింక్డ్ఇన్ తో పాటు ఇతర నెట్వర్కర్స్తో కనెక్ట్ అయ్యే ముందు వారి పూర్తి ప్రొఫైల్‌ను క్రాస్ చెక్ చేయండిమీరు ఏదైనా లింక్డ్ఇన్ కనెక్ట్ నుండి వ్యక్తిగతంగా మాట్లాడే ►ముందు పూర్తి ఇ–మెయిల్ హెడర్లను చెక్ చేయండి. ►ఇ–మెయిల్ మోసపూరితంగా లేదని నిర్ధారించుకున్న తర్వాతే మాట్లాడండి. గోప్యత భద్రతా చిట్కాలు ప్రతి నెలా మీ లింక్డ్ఇన్ పాస్‌వర్డ్‌ను మార్చుకోండి. ∙మీ ప్రొఫైల్‌లో సంప్రదింపు సమాచారాన్ని పరిమితం చేయండి. మీ ప్రొఫైల్ సారాంశంలో మీ ఇ–మెయిల్ చిరునామా, ఇంటి చిరునామా లేదా ఫోన్ నంబర్‌ను ఉంచడం మానుకోండి. ►ప్రైవేట్, సెమీప్రైవేట్ మోడ్‌లో బ్రౌజింగ్ ప్రొఫైల్స్: https://www.linkedin.com/help/linkedin/answer/a567226/browsing-profiles-in-private-and-semi-private-mode?%20lang=en ►దిగువ ఇచ్చిన యుఆర్ఎల్ను ఉపయోగించి ప్రొఫైల్‌లో మీ గోప్యతా సెటింగ్‌లను సరిగ్గా పరిశీలించి, సెటప్ చేయండి. https://www.linkedin.com/mypreferences/d/categories/account ►మీ ఖాతా కోసం రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించండి దాని ప్రామాణికతను ధృవీకరించకుండా చిన్న లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు, మీరు https://-www.isitphishing.org ఉపయోగించవచ్చు. ►దిగువ యుఆర్‌ఎల్‌లో సరైన (కంటెంట్, మెసేజ్‌లు, ప్రొఫైల్స్, గ్రూప్స్) తెలియజేయడం అలవాటు చేసుకోండి. https://www.linkedin.com/help/linkedin/answer/14z6 సైబర్క్రైమ్కిరిపోర్ట్ చేయచ్చు ►లింక్డ్ ఇన్‌లో స్కామ్‌ను తెలియజేయండి. https://www.linkedin.com/help/linkedin/ask/TS-RPS l https://cybercrime.gov.in/లో ఫిర్యాదును రిజిస్టర్ చేయచ్చు. లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్లను సంప్రదించవచ్చు. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఆ లింక్స్‌లో మీ డీటెయిల్స్ ఇచ్చారంటే ఇక అంతే!
Cyber Crime Prevention Tips- మెయిల్ ఓపెన్ చేయగానే కొన్ని స్పామ్ మెయిల్స్ మనకు కనిపిస్తాయి. డిస్కౌంట్ అనో, బ్యాంక్ సిబిల్ స్కోర్ ఫ్రీ అనో, మరేవో ఆఫర్లు అనో.. ఇ– మెయిల్స్ ఊరిస్తుంటాయి. ఇవన్నీ వ్యాపార సంబంధమైనవిగా ఉంటాయి. పది మిలియన్ స్పామ్ మెయిల్స్ పంపడానికి కూడా పది పోస్టల్ సందేశాలు పంపడానికి అయ్యేంత ఖర్చు మాత్రమే అవుతుంది. దీంతో వ్యాపార సందేశాలు దాదాపుగా స్పామ్ మెయిల్స్‌ను ఎంచుకుంటుంటాయి. వీటికి ఆకర్షితులై, ఆ లింక్స్‌లో మీ డీటెయిల్స్ ఇచ్చారంటే మిమ్మల్ని మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ. స్పామ్ మెయిల్స్‌తో మీరే స్కామ్‌లో ఇరుక్కోవచ్చు. స్పామ్ నుంచి ప్రమాదం భారత జాతీయ న్యాయ చట్టంలో స్పామ్ గురించిన ప్రస్తావన లేదు. దీంతో వాక్‌స్వేచ్ఛను రక్షించాలనే విషయంలో, చట్టపరమైన పరిష్కారాలను అమలు చేయడంలో ఇది మరింత కష్టంగా మారుతోంది. అందుకే, మనమే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రోజన్ హార్స్: వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తాయి. నకిలీ లింక్‌లు, డౌన్‌లోడ్స్‌లో మారువేషంలో ఉండి తమ మోసపూరిత పనిని చక్కబెడుతుంటారు. జాంబీస్: మీ వ్యక్తిగత కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఇతర కంప్యూటర్లను స్పామ్ చేసే సర్వర్‌గా మార్చేసుకుంటారు. ఫిషింగ్ : మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసేలా మిమ్మల్ని ప్రేరేపిస్తారు. ఫలితంగా గోప్యత, కీర్తి, డబ్బు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. దీంట్లో మధ్యవయస్కులు, రిటైర్మెంట్ బాధితులు ఎక్కువ ఉంటున్నారు. ఇంటర్నెట్ స్కామ్‌లు: మీరు కొంత బహుమతి రూపంలోనో, ఉద్యోగం, వివాహం, ప్రేమ.. గెలుచుకున్నట్లు ఇ–కామర్స్ చూపుతుంటాయి. తెలుసుకోవడం సులువు ►స్పామ్ మెయిల్స్ లేదా ఎస్సెమ్మెస్‌లు మీ వ్యక్తిగత సమాచారాన్ని అభ్యర్థిస్తుంటాయి. దీనిని బట్టి అది నకిలీ మెయిల్ అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. సాధారణంగా చిరునామా, ఆధార్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్ నంబర్ లేదా బ్యాంకింగ్ సంబంధిత సమాచారం వంటి.. మీ వ్యక్తిగత సమాచారాన్ని అభ్యర్థిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వివరాలేవీ ఇవ్వకూడదు. ►అనుమానాస్పద డొమైన్ పేరుతో అసాధారణమైన అక్షరాలను ఉపయోగిస్తారు. ►అనేక నకిలీ ఇ–మెయిల్లు ప్రభుత్వ అధికారులు, బ్యాంకింగ్ అధికారులు లేదా చట్టబద్ధమైన కంపెనీల నుండి, వ్యక్తుల నుండి వచ్చినట్టు చూపుతాయి.. ►మెసేజ్ సబ్జెక్ట్ లైన్న్లో ‘అత్యవసరం‘, ‘ప్రత్యుత్తరం‘, ‘అవకాశం‘, ‘తక్షణం‘, ‘ముగింపు తేదీ‘.. వంటి పదాలు ఇ–మెయిల్లో ప్రధానాంశాలుంగా ఉంటాయి. ►స్పామ్ ఇ–మెయిల్లో అక్షరదోషాలు ఉంటాయి. చాలా నకిలీ ఇ–మెయిల్లు ప్రాథమిక అక్షరదోషాలు, పేరు తప్పుగా రాయడం, పేలవమైన వ్యాకరణంతో ఉంటాయి. మోసపూరిత ఇ–మెయిల్ చిరునామా తెలిసినవారి ఇ–మెయిల్ చిరునామాకు చాలా దగ్గరి పోలిక ఉంటుంది. స్పామ్ అని గుర్తించడానికి.. అన్ని రకాల మెయిల్స్, అనేక ఇతర వ్యాపార ఇ–మెయిల్ కార్యకలాపాలు అంతర్నిర్మిత అల్గారిథమ్‌లను కలిగి ఉంటాయి. ఇవి స్పామ్, జంక్ మెయిల్లను స్పామ్ ఫోల్డర్లోకి తరలిస్తే ఫిల్టర్ అవుతాయి. మీ మెయిల్లో స్పామ్ ఇ–మెయిల్లు పుష్కలంగా వస్తున్నట్లు చూసినట్లయితే, మీరు వాటిని పై విధంగా ఫిల్టర్ ద్వారా వదిలించుకోవచ్చు. ►జిమెయిల్ స్పామ్‌ని క్లిక్ చేసి, ఆ ఫోల్డర్లోకి ఇ–మెయిల్‌ను మాన్యువల్‌గా తరలించండి. ఎఝ్చజీ∙కూడా అనుమానాస్పద ఇ–మెయిల్స్‌ను గుర్తిస్తుంది. స్పామ్ హెచ్చరిక లేబుల్‌లను రెడ్ మార్క్‌లో ఉంచుతుంది ► ఆపిల్ మెయిల్ రిపోర్ట్ స్పామ్లో ’గీ’ గుర్తు ఉన్న ట్రాష్ క్యాన్ (జంక్ మెయిల్) చిహ్నంపై క్లిక్ చేయాలి. ►యాహూ మెయిల్ స్పామ్ ఫోల్డర్లోకి ఇ–మెయిల్‌ను మాన్యువల్‌గా తరలించాలి. అప్పుడు యాహూ అనుమానాస్పద ఇ–మెయిల్లను గుర్తిస్తుంది. ఆ ఇ–మెయిల్లను డిఫాల్ట్ స్పామ్ ఫోల్డర్లో ఉంచుతుంది. ►మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ ఇ–మెయిల్‌కు ముందు చెక్‌బాక్స్‌పై క్లిక్ చేసి, మెనూలోని జంక్ ఇ–మెయిల్ ఎంపికలపై క్లిక్ చేయాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి.. ►మెయిల్ అకౌంట్‌కు కనెక్ట్ చేసిన ఫొటోలు, ఈవెంట్ల వివరాలు, ఇతర ఇ–మెయిల్ చిరునామాలు భద్రంగా ఉండటానికి భద్రతను చెక్ చేసుకోవాలి. మీ ఎంపికల ఆధారంగా ఫీచర్లను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి టాగిల్ స్విచ్‌లను అడ్జస్ట్ చేయాలి. వ్యక్తిగత సమాచారం, గోప్యతా సెట్టింగ్‌లను కూడా తనిఖీ చేయాలి. ►అకౌంట్ సురక్షితంగా ఉండటానికి యాప్ పాస్‌వర్డ్‌ను రూపొందించుకోవడంతో పాటు అవసరం లేనప్పుడు ఆఫ్‌లైన్‌లో ఉంచాలి. ►కంప్యూటర్ భద్రతా పద్ధతులను అమలు చేయడం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ కంప్యూటర్ను ఉపయోగించనప్పుడు ఇంటర్నెట్ నుండి డిస్కనెక్ట్ (లాగ్ ఆఫ్) చేయండి. ►ఏవైనా అనవసర లింక్‌లను ఓపెన్ చేయడం, మెయిల్ ద్వారా వచ్చిన ఫైల్లు లేదా లింక్‌లను డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అలాంటి మెయిల్స్‌ను ఓపెన్ చేయకపోవడమే శ్రేయస్కరం. ►అత్యంత విశ్వసనీయత గలవాటి నుంచే ఉచిత సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేయాలి. ఉచిత సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే గేమ్‌లు, ఫైల్ షేరింగ్, స్కానర్లు ప్రోగ్రామ్‌లు, ఇతర అనుకూల ఉచిత వ్యాపార అప్లికేషన్లు .. మిమ్మల్ని ఆకర్షిస్తుంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ►అవసరం లేని వాటిని ఇ మెయిల్ నుండి తీసివేయండి. ఎందుకంటే స్పామ్ మెయిల్స్ మధ్యలో మీరు మీ అతి ముఖ్యమైన ఇ–మెయిల్‌ను కోల్పోయే అవకాశం ఉంది. -అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
సీఐడీ అదనపు డీజీ సునీల్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
సాక్షి, అమరావతి: సైబర్ నేరాల కట్టడిలో రాష్ట్ర పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థ ‘సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ (సీఆర్‌సీఐడీఎఫ్) రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును, ఎస్పీ (సైబర్ క్రైమ్స్) జీఆర్ రాధికకు సైబర్ స్టార్ అవార్డులను ప్రకటించాయి. ఐఎస్ఈఏ, సీపీఎఫ్, ఐజీఎం, ఫ్రో డిస్కవర్, పీఎస్ఎం సంస్థలతో కలసి సీఆర్‌సీఐడీఎఫ్ ‘ఉత్తమ సైబర్ విధానాలు’ అనే అంశంపై మూడో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. వర్చువల్ విధానంలో ఆదివారం నిర్వహించిన ఈ సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసింది. సైబర్ పోలీసింగ్, సైబర్ నేరాల పరిష్కారంలో వినూత్న విధానాలను ప్రవేశపెట్టినందుకు 2021కు గాను ఆయనకు ఈ అవార్డును ప్రకటించినట్లు సీఆర్‌సీఐడీఎఫ్ తెలిపింది. సైబర్ నేరాల కట్టడి కోసం తగిన రీతిలో వ్యవస్థను బలోపేతం చేసినందుకు సీఐడీ విభాగం ఎస్పీ (సైబర్ క్రైమ్స్) జీఆర్ రాధికను ‘సైబర్ స్టార్’ అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొంది. సైబర్ నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర సీఐడీ విభాగం అనుసరిస్తోన్న విధానాలను ఈ జాతీయ సదస్సులో వక్తలు ప్రశంసించారు. దేశంలో అత్యధికంగా సైబర్ సేఫ్ లాగిన్స్‌ను తయారు చేసిన ఘనత ఏపీ సీఐడీ విభాగానిదేనని పేర్కొన్నారు. సైబర్ బుల్లీషీట్స్, 4ఎస్4యు పోర్టల్, ఫ్యాక్ట్ చెక్, యూట్యూబ్ వెబినార్స్ మొదలైన వినూత్న విధానాలను పీవీ సునీల్‌కుమార్ ప్రవేశపెట్టారు. వాటిని సైబర్ క్రైమ్స్ విభాగం సమర్థంగా నిర్వహిస్తూ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేస్తోంది. రాష్ట్ర సీఐడీ విభాగం అనుసరిస్తోన్న విధానాలు, వ్యూహాలను సీఆర్‌సీఐడీఎఫ్ ప్రత్యేకంగా ప్రశంసించింది. -
ఏపీలో సైబర్ క్రైం ఫిర్యాదులకు వాట్సప్ నెంబర్
-
ఏపీ పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారు..
సాక్షి, అమరావతి : సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో బూతులు మాట్లాడేవారిపై కేసులు నమోదు చేస్తున్నామని, ఈ క్రమంలో తెలంగాణాకు వెళ్లి ఒకరిని అరెస్ట్ చేశామని, చిత్తూరులో మరొకరిని అరెస్ట్ చేశామని తెలిపారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం వాట్సప్ నెంబర్‌ను ఆయన ప్రారంభించారు. దీని ద్వారా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తల ప్రచారాలను అరికట్టవచ్చు అన్నారు. ప్రత్యేక వాట్సప్ నంబర్ 9071666667 ను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జామ్ యాప్ ద్వారా బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నిఖిల్ సిద్ధార్థ, అడవి శేష్ ఆన్లైన్లో ఇంట్రాక్ట్ అయ్యారు. (1200 మంది విస్తారా ఉద్యోగులకు షాక్ ) కరెన్సీ నోట్లపై కరోనా ఎక్కువ సమయం ఉండదు అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. కొత్తగా పుట్టుకొస్తున్న నేరాలను పోలీసులు ఎల్లప్పుడూ అరికడుతున్నారని తెలిపారు. నేరాలు అరికట్టడంలో ప్రజలందరి సహాకారం అవసరమని కోరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యం రాజ్యాగంలో అందరికీ హక్కులు ఉన్నాయని, ఏది వాస్తవమో ఏదీ అవాస్తవామో అందరూ తెలుసుకోవాలని అన్నారు. చాలామంది వాస్తవం తెలుకోకుండా అసత్యాలు ప్రచారం చేస్తుంటారని, అలాంటి వాటిని ఏపి పోలీస్ అరికడుతుందన్నారు. మహిళలు పిల్లలను ఆదుకునేందుకు సీఎం జగన్ దిశ చట్టం, దిశా కంట్రోల్ రూంలు తెచ్చారని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లిన వారు తిరిగి రావడం వల్ల, ఢిల్లీ నిజాముద్దీన్ ద్వారా మన రాష్ట్రంలోకి కరోనా వచ్చిందని, వారిని 22 వేల మందిని గుర్తించి హోం క్వారెంటైన్ చేశామని తెలిపారు. కరెన్సీ నోట్లపై కరోనా ఎక్కువ సమయం ఉండదని, వీటి ద్వారా వైరస్ ప్రబలే అవకాశం ఉండదన్నారు. (హాలీవుడ్ సింగర్, ఆమె భర్తకు కరోనా పాజిటివ్! ) కొత్త కోవిడ్-19 కేసులు కేవలం మూడు మాత్రమే ఇక లాక్డౌన్ కాలంలో ఎంత మందిపై కేసులు నమోదు చేశామనేది చెప్పాలంటే బాధగా ఉందన్నారు. అనేక మందిపై కేసులు పెట్టామని, వాహనాలు సీజ్ చేశామని తెలిపారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు.. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారికి కేవలం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని బట్టి ప్రయానించేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో రాష్ట్రంలో గృహహింస కేసులు పెరగడం లేదన్నారు. రాష్ట్రంలో ఎవరతో కాంటాక్ట్ లేని కొత్త కోవిడ్-19 కేసులు కేవలం మూడు మాత్రమే వున్నాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. (కరోనా లక్షణాలతో వెళ్తే.. డాక్టర్లు పట్టించుకోలేదు! ) కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ప్రభుత్వం మంచి విధానాన్ని తీసుకువచ్చిందని పీవీ సింధు అన్నారు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు నిఖిల్ సిద్దార్థ ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ విధానం వల్ల నేరాలు తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ పోలీస్ మంచి నిర్ణయం తీసుకుందని హీరో అడవి శేషు అన్నారు. పోలీస్ వాళ్లు వాట్సప్ ప్రారంభించడం సరైన సమయంలో తీసుకున్న నిర్ణయమని సామ్ కార్యకర్త కొండవీటి సత్యవతి అన్నారు. కోవిడ్-19 పై ఒక మతాన్ని టార్గెట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ సహకారం పోలీసులకు ఎల్లప్పుడు వుంటుందని ఆమె తెలిపారు. (గజిని ఫోటోతో పోలీసుల వినూత్న యత్నం ) -
‘సైబర్’ నేరాలకు ‘చెక్’ పడేదెలా?
సాక్షి, కడప అర్బన్ : సమాజంలో ప్రస్తుతం కళ్లకు కన్పించని నేరగాళ్లు ఎంచక్కా ప్రజల ఖాతాల్లోని డబ్బులను వివిధ రకాలుగా కాజేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్, బీమా పాలసీ అధికారుల పేర్లతోనేగాక, ఇతర వ్యక్తుల మాదిరిగా ఫోన్లు చేసి మాయమాటలు చెప్పి మన దగ్గర సమాచారం తీసుకుంటారు. వారి మాటలు నమ్మి బాధితులు వేల రూపాయల నుంచి లక్షలాది రూపాయలను సైతం నష్ట పోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ సైబర్ నేరాలను నివారించే మార్గాలపై కథనం. సైబర్ నేరాలు– రకాలు ⇔ ఓటీపీ, క్రెడిట్ లేదా డెబిట్ కార్టు మోసాలకు పాల్పడే అపరిచిత వ్యక్తులు తాము ప్రజలకు సంబంధించిన బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెబుతారు. వివరాలు చెప్పకపోతే కార్డు స్తంభించి పోతుందనీ, వాటిని సరిచేస్తామనీ చెప్పి కార్డు వివరాలను అడిగి సమాచారం తెలుసుకుంటారు. తరువాత సెల్‌ఫోన్‌కు వచ్చే ఒన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ)ను వారిచేతనే చెప్పించుకుంటారు. ఆ తర్వాత వారి ఖాతాలో ఉన్న సొమ్మును కొల్లగొడుతుంటారు. ఇలాంటి నేరాలు తరచుగా ప్రస్తుతం జరుగుతున్నాయి. బ్యాంక్ అధికారులు ఎట్టి పరిస్థితిల్లోను ఫోన్ ద్వారా తమ ఖాతాదారుల బ్యాంక్ ఖాతా వివరాలను అడగరు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాల్ని ఉంది. ⇔ ఓఎల్ఎక్స్, క్వికర్ మోసాలను అపరిచిత వ్యక్తులు ఆర్మి అధికారుల వేషధారణలో ఓఎల్ఎక్స్/క్వికర్ అకౌంట్లను తెరిచి ఫేక్ మొబైల్ నెంబర్లను జతపరిచి ఇంటర్నెట్ నుంచి తీసుకున్న కార్లు, సెల్ఫోన్ల ఫొటోలను జతపరుస్తారు. వాటిని అతి తక్కువ ధరలకే అమ్ముతామని యాడ్స్ ఇస్తారు. వాటిని నిజమని నమ్మి ప్రజలు వాటికోసం తమ డబ్బును అపరిచిత వ్యక్తులు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లకు పంపడం ద్వారా అటు వస్తువులు రాక ఇటు పంపిన డబ్బు రాక మోసపోతున్నారు. లాటరీ మోసాలు అపరిచిత వ్యక్తులు సాధారణ ప్రజల సామాజిక మాధ్యమాల సమాచారాన్ని తీసుకుని వాటి ద్వారా ప్రజలకు ఎక్కువ మొత్తంలో లాటరీ తగిలిందనో, మీరు చేసిన షాపింగ్ ద్వారా కూపన్స్ వచ్చాయనో పరిపరి విధాలుగా ఇ–మెయిల్‌కు గానీ, తమ ఫోన్‌కు మెసేజ్‌గాని పంపడం ద్వారా డబ్బును సునాయాసంగా తస్కరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా మోసాలు ప్రజలు సామాజిక మాధ్యమాలలో తమ సమాచారాన్ని (పేరు, నివాసం, వృత్తి, ఫొటోలు మొదలగునవి) పొందుపర్చడం ద్వారా ఆన్లైన్ మోసగాళ్లు ఆ సమాచారాన్ని కాజేస్తారు. ఆ ఫొటోలను మార్ఫింగ్ ద్వారా అసభ్యంగా చిత్రీకరించి సదరు వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసి లొంగతీసుకోవడం, వినకపోతే ఆ ఫోటోలను అందరికి చేరవేస్తామని బెదిరించడం, అసభ్యకమరమైన కామెంట్లను పోస్ట్ చేయడం, ఫేక్ ప్రొఫైల్ ఐడీని సృష్టించి ప్రేమవ్యవహారంతో నమ్మించి వంచించడం. కుల,మత, వర్గాల మధ్య వైషమ్యాలను పురిగొల్పడం ద్వారా వ్యక్తి స్వేచ్ఛకు, సమాజ శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నారు. ⇔ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి ⇔ బ్యాంక్ అధికారులమంటూ ఎవరైనా ఫోన్ చేసి ఏటీఎం కార్డులపై ఉన్న నంబర్లుకానీ, పిన్ నెంబర్లుకానీ అడిగితే చెప్పరాదు. ⇔ ప్రకటనలకుగానీ, ఆన్లైన్లో యాడ్లకు గానీ ఆకర్షితులై వాహనాలను, సెల్ఫోన్లను కొనుగోలు చేయరాదు. ⇔ వీసాలు, విదేశాల్లో ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల నుంచి బయటపడాలంటే గుర్తింపు ఉన్న ఏజెన్సీలను స్వయంగా సంప్రదించాలి. ప్రతి ఒక్కరూ షాపింగ్‌లు చేసినా, ఏటీఎం సెంటర్లలో డబ్బులను డ్రా చేసినా, ఇతర లావాదేవీలను జరిపిన తరువాత వారి ఏటీఎం‘పిన్ నంబర్’ను ఖచ్చితంగా తరచుగా మారుస్తుండాలి. కడపలో సైబర్ క్రైం అండ్ ఫ్రాడ్ సెల్ పోలీసు విభాగం జిల్లాలో సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ఎస్పీ అభిషేక్ మహంతి పర్యవేక్షణలో ఈ ఏడాది ప్రారంభంలో కడప నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ పైభాగాన, సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా ‘సైబర్ క్రైం, ఫ్రాడ్ సెల్ ’ను ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి ఇప్పటికి 107 ఫిర్యాదులు అందాయి. సీసీఎస్ డీఎస్పీ ఎంసీ రంగనాయకులు పర్యవేక్షణలో ఎస్ఐ లింగాల జీవన్ రెడ్డి, తమ సిబ్బందితో కలిసి కేసులను దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల్లో ఎక్కువగా విద్యావంతులే సమాజంలో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న వారిలో ఎక్కువగా విద్యావంతులే ఉన్నారు. బాధితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య రైతులు, ఇతర విభాగాలకు చెందిన వారితో పాటు అండ్రాయిడ్ ఫోన్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారే అధికంగా ఉంటున్నారు. సైబర్‌నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. – ఎంసీ రంగనాయకులు, సీసీఎస్ డీఎస్పీ, కడప -
కొత్తదారుల్లో కేటుగాళ్లు!
సాక్షి, తుళ్లూరు: వైష్ణవికి ఓ కొత్త నంబరు నుంచి ఫోన్ వచ్చింది. ‘వైష్ణవి గారు మీ క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.30 వేలు షాపింగ్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ అవతలి వ్యక్తి చెప్పడంతో షాక్‌కు గురైంది. తాను ఎలాంటి షాపింగ్ చేయలేదని ఆమె అనడంతో చెక్ చేస్తానంటూ సదరు వ్యక్తి క్రెడిట్ కార్డు నంబర్, సీవీవీ, పిన్ నంబర్లు అడిగాడు. అసలే కంగారులో ఉండడం, ఫోన్ చేసిన అపరిచితుడు పేరుతో సంబోధించడంతో ఆమె వివరాలు చెప్పేసింది. ‘సారీ.. ఆ షాపింగ్ మీ క్రెడిట్ కార్డు నుంచి జరగలేదు’ అంటూ అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. సీన్ కట్ చేస్తే.. ఆ వివరాలు వినియోగించి ‘ఫోన్ కాలర్’ ఆన్లైన్ ద్వారా రూ.50 వేలు వైష్ణవి ఖాతా నుంచి మాయం చేశాడు. ఇది వైష్ణవి ఒక్కరి సమస్యేకాదు. సైబర్ నేరగాళ్లు వల విసురుతూ అందులో చిక్కుకున్న వారి ఖాతాలను లూటీ చేస్తున్నారు. ఇటీవల కేంద్ర నిఘా సంస్థలు స్మార్ట్ఫోన్లు వినియోగించేవారికి కొన్ని సూచనలు చేశాయి. ఫోన్లలో మనం వాడే 42 యాప్‌లు దేశ సమగ్రతకు ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయని గుర్తించాయి. సైబర్ నేరగాళ్లు ఉచితమంటూ ప్రచారం చేసే యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోగానే ఆయా మొబైల్ యాజమానుల వ్యక్తిగత రహస్యాలను గుప్పిటపట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో 4.2 కోట్ల మొబైల్ యాప్‌లు ఉన్నాయని, ఇందులో కేవలం నాలుగైదు శాతం మాత్రమే సురక్షితమని చెబుతున్నారు. గతంలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి పట్టణాలకే పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడి గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు సైతం విస్తరిస్తున్నాయి. మాటలతో మభ్యపెడుతూ.. ఈ మధ్య కాలంలో పరిచయం లేని వ్యక్తుల నుంచి స్త్రీల గొంతుతో అష్టలక్ష్మి యంత్రమని, ఇన్సూరెన్స్ పాలసీపై బోనస్ వచ్చిందని, వడ్డీలేని రుణాలు పేరుతో రకరకాలుగా ఫోన్‌కాల్స్ పెరిగిపోయాయి. వారు మనకు సంబంధించిన కొన్ని వివరాలను ముందే చెబుతారు. దీంతో వారు ఆయా బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందినవారే అని నమ్మేసి వారి వలలో పడిన తరువాత ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ప్రారంభించి అందిన కాడికి దోచుకుంటారు. ఎప్పటికప్పుడు ఏటీఎం పిన్ మారిస్తే మంచిది పిన్ నంబర్లను నెలకు, రెండు నెలలకోసారి మారిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక పెద్ద లావాదేవీలు జరిపిన తక్షణమే పిన్ నంబర్ మారిస్తే.. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా బయటపడగలమని సూచిస్తున్నారు. చాలా మంది తమ పిన్ నంబర్‌ను మర్చిపోతారేమోననే ఉద్దేశంతో పిన్ నంబర్ రాసి ఉంచుతారు. ఈ తరహా చర్యలు కేటుగాళ్లకు ఊతమిచ్చినట్లే. మీ మెదడే పర్సుగా.. పాస్‌వర్డ్‌ని భద్రంగా దాచుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే సరి.. క్రెడిట్, డెబిట్ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుక విధిగా సంతకం చేయాలి. ప్రతి కార్డుకు వెనుక భాగంలో మూడు అంకెల సీవీవీ నంబర్ ఉంటుంది. దీనిని గుర్తుంచుకుని కార్డుపై చెరిపేయాలి. క్రెడిట్ కార్డులను చాలాకాలం వినియోగించకుండా ఉంటే బ్యాంకు అధికారులకు తెలియజేసి తాత్కాలికంగా మూసివేయాలి. ఆన్లైన్ ద్వారా వ్యవహారాలు సాగించేటట్లయితే సైట్ అడ్రస్ జీటీటీపీతో ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి. కార్డులను పోగొట్టుకుంటే వెంటనే సంబంధిత బ్యాంకులకు సమాచారం ఇచ్చి బ్లాక్ చేయించాలి. మీ కార్డు ద్వారా లావాదేవీలు జరిగినప్పుడు ఆ సమాచారం ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా మీకు వచ్చేలా చేసుకోండి. ఎగ్జిబిషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్‌లో గిఫ్ట్‌కూపన్లు, లక్కీడిప్స్, ఓచర్స్‌కు సంబంధించిన కాగితాల్లో సెల్‌ఫోన్ నంబర్ ఈ–మెయిల్ ఐడీలు గుడ్డిగా రాయకూడదు. స్మిషింగ్ వైరస్ స్మార్ట్ఫోన్ల ప్లాట్ ఫాంను ఆధారంగా చేసుకుని ఇటీవల స్మిషింగ్ వైరస్ పంపిస్తున్నారు. మీరు అత్యంత విలువైన కస్టమర్ అని చెబుతూ.. అదనపు సదుపాయాలు కావాలంటే ఎస్ అని, వద్దనుకుంటే నో అని టైప్ చేసి పంపాలని అందులో ఉంటుంది. అయితే ఏది నొక్కినా సైబర్ నేరగాళ్లు పంపే వైరస్ మీ సెల్ఫోన్లోకి చేరిపోతుంది. ఇక అప్పటి నుంచి ఫోన్ ద్వారా నిర్వహించే బ్యాకింగ్, క్రెడిట్ కార్డు లావాదేవీలన్నీ నేరగాళ్లకు చేరిపోతాయి. సాధారణంగా ‘5000’ వంటి నంబర్లతో వారి ఫేక్ మెయిల్ ఐడీ నుంచి జనరేట్ చేసి ఓ లింక్‌ని కూడా పంపుతారు. లింక్ ఓపెన్ చేయకుండా ఉండడమే ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఉత్తమమైన మార్గం. -
ప్రజాసేవలో సైబర్ మిత్ర!
సాక్షి, గుంటూరు: తాడేపల్లి మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు గుర్తు తెలియని అగంతకులు ఆధార్ వివరాలు చెప్పాలని మూడు రోజుల కిందట ఫోన్ చేశారు. ఆ సమాచారం మహిళ చెప్పిన వెంటనే మరలా ఫోన్ చేసి ఆర్బీఐ నుంచి ఫోన్ చేస్తున్నామని.... కార్డు నంబరుకు సంబంధించిన వివరాలు చెప్పాలని కోరారు. వారి మాటలను నమ్మిన మహిళ ఆమె క్రెడిట్ కార్డు వివరాలతో పాటుగా తన సెల్‌కు వచ్చిన ఓటీపీ నంబరు కూడా చెప్పింది. ఇక అంతే ఆమె క్రెడిట్ కార్డు నుంచి ఏకంగా రూ.లక్ష నగదు డ్రా చేసుకున్నారు. ఆపై బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పిడుగురాళ్ళకు చెందిన ఓ యువతి క్విక్కర్ యాప్‌లో ఆన్లైన్లో ఇంటి నుంచి ఉద్యోగం చేసేందుకు దరఖాస్తు చేసింది. మీకు ఉద్యోగం ఇస్తున్నామని చెప్పి ఆమెతో పది రోజుల్లో రేయింబవళ్లు వారు ఇచ్చిన పనులను పూర్తి చేయించారు. అలా చేస్తేనే మీకు ఉద్యోగం కచ్చితంగా ఇస్తామని చెప్పారు. తీరా వారి పని పూర్తయిన అనంతరం ఆమెను వారి లింక్‌లో నుంచి తొలగించారు. మోసం చేశారని గుర్తించిన యువతి ఇటీవల రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రోజురోజుకు తీవ్రమవుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రాష్ట్ర సైబర్ క్రైం కార్యాలయాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఇటీవల మహిళలు, మైనర్లు, నిరుద్యోగ యువత ఎక్కువగా సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతున్నారు. ఇలాంటి సమస్యలు అధిగమించడంతో పాటు మోసగాళ్ల చర్యలు నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సైబర్ మిత్ర పేరుతో శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత ఫేస్బుక్ అకౌంట్‌ను ప్రారంభించారు. సవాలుగా మారిన స్మార్ట్ ఫోన్లు..... ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మహిళలు, బాలికలు, విద్యార్థులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. అందుబాటులో ఉంటున్న స్మార్ట్ ఫోన్లును కొందరు యువత మంచికి ఉపయోగిస్తే మరి కొందరు చెడు పనులకు వినియోగిస్తున్నారని గతంలో పలు మార్లు విశ్లేషకులు తేల్చారు. సెల్‌ఫోన్ లేకుండా చేసేందుకు తల్లిదండ్రులు యత్నిస్తే చివరకు ఆత్మహత్యలకు సైతం వెనుకాడని సందర్భాలున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ అనివార్యంగా మారింది. దీంతో అందుబాటులో ఉన్న ఫోన్లో యువతకు కొంత అవగాహన లేని కారణంగా నకిలీ వెబ్సైట్లను నమ్మి ఉద్యోగాల కోసం డబ్బు చెల్లిస్తూ మోసపోతున్నారు. మరి కొందరు నకిలీ ఫేస్బుక్ అకౌంట్ల బారిన పడి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. ఈ తరహా కేసులు జిల్లాలో అధికంగా నమోదవుతున్నాయి. విద్యార్థులు, గృహిణిలు ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు. ఎలాగైనా సైబర్ నేరాలను తగ్గించే దిశగా కార్యాచరణ రూపొందించారు. ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ సైబర్ నేరగాళ్ల గురించి సమాచారం అందించాలన్నా, మోసపోయిన వారు సంప్రదించాలనుకున్నా త్వరగా సమాచారం తెలుసుకునేందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా 9021211100 వాట్సాప్ నంబరు కేటాయించారు. ఈ నంబరుకు సైబర్ నేరాల గురించి సమాచారం తెలియచేయవచ్చు. అలా అందిన సమాచారాన్ని సైబర్ క్రైం స్టేషన్‌లోని పోలీస్ అధికారులు వెంటనే పరిశీలించి అవసరమైతే కేసు నమోదు చేసి నిందితులను కటకటాల వెనక్కి పంపుతారు. బాధితులకు అండగా నిలుస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సైబర్ నేరాలు నమోదు కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. -
టీనేజ్ పిల్లలకు సైబర్ పాఠాలు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా వాటి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ పిల్లల్లో, ప్రత్యేకంగా టీనేజీ పిల్లల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. టెక్నాలజీ తప్పనిసరి అంటూ తల్లిదండ్రులు సైతం పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇస్తున్నారు. దీంతో పిల్లలు పక్కదారి పడుతున్నట్టు కేంద్ర హోంశాఖ పరిధిలోని సైబర్ క్రైమ్ విభాగం గుర్తించింది. స్మార్ట్ఫోన్లు వాడుతున్న 10 నుంచి 16 ఏళ్ల పిల్లలు పోర్న్సైట్లు, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారని ఇటీవల చేసిన అధ్యయనంలో బయటపడింది. ఇది ఆందోళనకర పరిణామమని పేర్కొంది. దీనితో అన్ని రాష్ట్రాల్లోని పోలీస్ శాఖలు సైబర్ నేరాల నియంత్రణపై తప్పనిసరిగా టీనేజీ విద్యార్థులకు అవగాహన కల్పించాలని కేంద్రం ఆదేశించింది. వాటి నియంత్రణకు ఎలా వ్యవహరించాలన్న అంశాలతోపాటు స్మార్ట్ఫోన్లలో విపరీతంగా అందుబాటులో ఉన్న యాప్స్ దుష్ప్రభావంపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. ఇందులో భాగంగా ‘స్మార్ట్ఫోన్లు–సైబర్ నేరాలు’అన్న అంశంపై ప్రత్యేకంగా ఒక పుస్తకం ప్రచురించడంతోపాటు 7, 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్‌శాఖ సైతం సీఐడీ ద్వారా పాఠ్యాంశం రూపకల్పనకు కృషి చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ 4 తరగతుల విద్యార్థులకు సైబర్‌నేరాలపై అవగాహన, నియంత్రణకు సంబంధించి ఒక పాఠ్యాంశం చేర్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. మార్కెట్లోకి వేలకొద్ది యాప్స్ రావడంతో టీనేజర్స్ ఏది పడితే అది వినియోగించకుండా ఉండేందుకు ‘గుడ్ టచ్–బ్యాడ్ టచ్’అనే పేరుతో ప్రత్యేకంగా చైతన్యం కలిగించనున్నారు. ఆ యాప్ వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువగా జరుగుతుందని ప్రాక్టికల్‌గా విశదీకరించేందుకు కృషి చేస్తున్నామని, దీనివల్ల టీనేజ్ యువత చెడుదారి పట్టకుండా ఉంటారని సీఐడీలోని ఓ పోలీస్ అధికారి అభిప్రాయపడ్డారు. స్మార్ట్ఫోన్లు కొనిచ్చి పిల్లలను చెడగొడుతున్న తల్లిదండ్రులకు సైతం పాఠశాలలు ఓరియెంటేషన్ ప్రోగ్రాం ద్వారా సైబర్ మోసాలపై అవగాహన కల్పిచేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ అధికారి వెల్లడించారు. -
ఐటీ చట్టానికి పదును
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ⇒ కొత్త నేరాల నేపథ్యంలో కొత్త చట్టాలు అవసరమని వ్యాఖ్య ⇒ ఏపీలో జ్యుడీషియల్ అకాడమి ఏర్పాటు చేయాలని సూచన ⇒ విజయవాడలో మేధోసంపత్తి, వాణిజ్య చట్టాలపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ⇒ సైబర్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: జస్టిస్ లోకూర్ ⇒ మేథో హక్కుల కోర్టులకు ప్రాధాన్యం: హైకోర్టు ఇన్చార్జ్ చీఫ్ జస్టిస్ రమేశ్ రంగనాథన్ ⇒ అమరావతి, తిరుపతి, విశాఖలో వాణిజ్య కోర్టులు: సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: సైబర్ క్రైమ్ నివారణకు ఐటీ చట్టాలను మరింత పటిష్టం చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. నేరాలు కొత్తగా జరుగుతున్న నేపథ్యంలో చట్టాలు కూడా అందుకనుగుణంగా కొత్తవి రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘మేథో సంపత్తి, వాణిజ్య న్యాయాలు – అందుకనుగుణమైన చట్టాలు’ అనే అంశంపై శుక్రవారం నగరంలోని ఎ కన్వెన్షన్ హాలులో బెజవాడ బార్ అసోసియేషన్, ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డు, జపాన్‌కు చెందిన జెట్రో ఆధ్వర్యంలో ప్రారంభమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. గతంలో మారుమూల ప్రాంతాల వారికి అంతగా అవకాశాలు దక్కేవి కావని, న్యాయ వ్యవస్థలో గ్రామీణ ప్రాంత న్యాయవాదులకు సరైన గుర్తింపు రాలేదని తెలిపారు. కానీ ప్రస్తుతం అందరికీ అవకాశాలు పెరిగాయన్నారు. ఏపీలో జ్యుడీషియల్ అకాడమి ఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఏపీకి చారిత్రక సంపద, సంస్కృతి ఉందని, ఎన్నో చారిత్రక ప్రదేశాలున్నాయన్నారు. విభజనకు ముందు అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో కేంద్రీకృతం అయిందని చెప్పారు. సదస్సులో ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డు సీఈఓ కృష్ణకిషోర్ స్వాగతోపన్యాసం చేయగా, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మన్మథరావు ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, కొత్తగా హైకోర్టుకు ఎన్నికైన జడ్జిలు రజని, మురళిలను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తుల ప్రొఫైల్స్ ఉన్న పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రెండో సెషన్లో ప్రాథమిక మేధో సంపత్తి హక్కులు అనే అంశంపై జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ వి సుబ్రహ్మణ్యన్, జస్టిస్ అకిర కటసె మాట్లాడారు. డిజిటల్ యుగంలో వాణిజ్య కోర్టులు, ఆధారాలు అనే అంశంపై మూడో సెషన్లో జరిగిన చర్చలో ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్ మురళీధర్, కాంపిటీషన్, ఇంటర్నెట్, ఐటీ, సైబర్ చట్టాల గురించి నాలుగో సెషన్లో జరిగిన చర్చలో జస్టిస్ వి సుబ్రహ్మణ్యన్, ఢిల్లీ సీనియర్ న్యాయవాది ప్రతిభా ఎం సింగ్ తదితరులు మాట్లాడారు. వాణిజ్య చట్టాలపై అవగాహన పెంచుకోండి మారుతున్న కాలానికి అనుగుణంగా జడ్జిలం తా వాణిజ్య కోర్టులు, కాంపిటీషన్, సైబర్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ అన్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నా ఇంకా మీమాంస కొనసాగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన అంశా లపై జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకో వాలని సూచించారు. వాణిజ్య కోర్టుల సామర్థ్యంపైనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆధారపడి ఉండడంతో న్యాయమూర్తులు పూర్తి స్థాయిలో ఆ అంశాలపై దృష్టి సారిం చాలన్నారు. చాలా ప్రాంతాల్లో వాణిజ్య కోర్టు లు ఏర్పాటైనా వాటిపై అధ్యయనం కేవలం ముంబై, ఢిల్లీ కోర్టులకే ఎందుకు పరిమిత మైందో అర్థం కావడం లేదన్నారు. మన దేశం కంటే ఇతర దేశాల్లో సైబర్ చట్టాలు బాగున్నా యని తెలిపారు. ఏపీకి ఎన్నో సవాళ్లున్నా, అనేక అవకాశాలూ ఉన్నాయని చెప్పారు. మేథో సంపత్తి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలోనూ కమర్షియ ల్ కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. కోర్టుల అవసరం ఎక్కువగా ఉంది రాజధానిగా మారుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని, అందుకనుగుణంగా కోర్టుల అవసరం ఎక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ హైకోర్టు ఇన్చార్జ్ చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్ అన్నారు. ఐటీ, ఇంటర్నెట్ ఆధారంగా అన్నీ జరుగుతున్న దశలో వాణిజ్య, మేధో హక్కుల కోర్టులకు ప్రాధాన్యం ఏర్పడిందని, వాటి అవసరం ఉందని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో మెడికల్ రంగాల రీసెర్చ్‌లో జపాన్ ముందుందని చెప్పారు. అందుకే అక్కడి వారికి ఆ రంగాల్లో నోబెల్ బహుమతులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. కొత్త చట్టాలు రావాలి ప్రపంచమంతా డిజిటల్ రంగంపై ఆధారపడి పని చేస్తున్న దశలో అందుకనుగుణంగా చట్టాలు మారాలని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జి రోహిణి చెప్పారు. న్యాయ వ్యవస్థ సైతం మారుతున్న పరిస్థితులను అన్వయించుకుని ముందుకెళ్లాల్సివుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, ముంబైలోనే ప్రస్తుతం వాణిజ్య డివిజన్లు ఉన్నాయని, దేశమంతా ఈ డివిజన్లు ఏర్పాటవ్వాల్సి ఉందన్నారు. బీబీఏ మెట్రోపాలిటన్ బార్గా మారాలి బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) మెట్రో పాలిటన్ బార్గా మారాల్సిన అవసరం ఉంద ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామ సుబ్రహ్మణ్యన్ ఆకాంక్షించారు. విజయవాడ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. లీగల్ వ్యవహారాలన్నీ మారుతున్నా న్యాయవ్యవస్థ మాత్రం అలాగే ఉందన్నారు. ప్రస్తుత చట్టాలు, న్యాయాలకు అనుగుణంగా జడ్జిలు, న్యాయవాదులకు శిక్షణ అవసరమని చెప్పారు. వాణిజ్య కోర్టులతో మెరుగయ్యాం వాణిజ్య కోర్టులు ఏర్పాటైన తర్వాత తమ దేశంలో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయని జపాన్ మేధో హక్కుల హైకోర్టు జడ్జి జస్టిస్ అకిర కటసె చెప్పారు. తమ దేశంలో 2005లో ఈ కోర్టులను ప్రారంభించామని, ప్రస్తుతం నాలుగు డివిజన్లు ఉన్నాయన్నారు. ఈ కోర్టులకు వస్తున్న కేసులు, పరిష్కరిస్తున్న విధానం గురించి ఆయన వివరించారు. నాకు సహకరించండి: సీఎం చంద్రబాబు అనేక సమస్యలు, సవాళ్ల నడుమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తనకు మద్దతు తెలపా లని ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయ మూర్తులను కోరారు. న్యాయకోవిదులు తమ వంతు సహకారం అందించాలన్నారు. సదస్సులో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జడ్జిలనుద్ధేశించి సీఎం మాట్లాడు తూ.. అమరావతి, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో వాణిజ్య కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జపాన్ విదేశీ వాణిజ్య సంస్థ (జెట్రో)తో కలసి పని చేయడం అభివృద్ధికి నాంది అని తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లాలన్నా ఏపీని తాకకుండా వెళ్లలేని పరిస్థితులు న్నాయన్నారు. అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపా రు. అమరావతిలో మోడల్ జస్టిస్ సిటీ నిర్మాణం చేపట్టామన్నారు. సీఎం డ్యాష్ బోర్డు ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచిన వివరాలను చంద్రబాబు వీడియో ద్వారా వివరించారు.