సాక్షి, అమరావతి : సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో బూతులు మాట్లాడేవారిపై కేసులు నమోదు చేస్తున్నామని, ఈ క్రమంలో తెలంగాణాకు వెళ్లి ఒకరిని అరెస్ట్ చేశామని, చిత్తూరులో మరొకరిని అరెస్ట్ చేశామని తెలిపారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం వాట్సప్ నెంబర్‌ను ఆయన ప్రారంభించారు. దీని ద్వారా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తల ప్రచారాలను అరికట్టవచ్చు అన్నారు. ప్రత్యేక వాట్సప్ నంబర్ 9071666667 ను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జామ్ యాప్ ద్వారా బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నిఖిల్ సిద్ధార్థ, అడవి శేష్ ఆన్‌లైన్‌లో ఇంట్రాక్ట్ అయ్యారు. (1200 మంది విస్తారా ఉద్యోగులకు షాక్ )
కరెన్సీ నోట్లపై కరోనా ఎక్కువ సమయం ఉండదు
అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. కొత్తగా పుట్టుకొస్తున్న నేరాలను పోలీసులు ఎల్లప్పుడూ అరికడుతున్నారని తెలిపారు. నేరాలు అరికట్టడంలో ప్రజలందరి సహాకారం అవసరమని కోరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యం రాజ్యాగంలో అందరికీ హక్కులు ఉన్నాయని, ఏది వాస్తవమో ఏదీ అవాస్తవామో అందరూ తెలుసుకోవాలని అన్నారు. చాలామంది వాస్తవం తెలుకోకుండా అసత్యాలు ప్రచారం చేస్తుంటారని, అలాంటి వాటిని ఏపి పోలీస్ అరికడుతుందన్నారు. మహిళలు పిల్లలను ఆదుకునేందుకు సీఎం జగన్ దిశ చట్టం, దిశా కంట్రోల్ రూంలు తెచ్చారని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లిన వారు తిరిగి రావడం వల్ల, ఢిల్లీ నిజాముద్దీన్ ద్వారా మన రాష్ట్రంలోకి కరోనా వచ్చిందని, వారిని 22 వేల మందిని గుర్తించి హోం క్వారెంటైన్ చేశామని తెలిపారు. కరెన్సీ నోట్లపై కరోనా ఎక్కువ సమయం ఉండదని, వీటి ద్వారా వైరస్ ప్రబలే అవకాశం ఉండదన్నారు. (హాలీవుడ్ సింగర్, ఆమె భర్తకు కరోనా పాజిటివ్! )
కొత్త కోవిడ్-19 కేసులు కేవలం మూడు మాత్రమే
ఇక లాక్‌డౌన్ కాలంలో ఎంత మందిపై కేసులు నమోదు చేశామనేది చెప్పాలంటే బాధగా ఉందన్నారు. అనేక మందిపై కేసులు పెట్టామని, వాహనాలు సీజ్ చేశామని తెలిపారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు.. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారికి కేవలం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని బట్టి ప్రయానించేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో రాష్ట్రంలో గృహహింస కేసులు పెరగడం లేదన్నారు. రాష్ట్రంలో ఎవరతో కాంటాక్ట్ లేని కొత్త కోవిడ్-19 కేసులు కేవలం మూడు మాత్రమే వున్నాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. (కరోనా లక్షణాలతో వెళ్తే.. డాక్టర్లు పట్టించుకోలేదు! )
కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ప్రభుత్వం మంచి విధానాన్ని తీసుకువచ్చిందని పీవీ సింధు అన్నారు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు నిఖిల్ సిద్దార్థ ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ విధానం వల్ల నేరాలు తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ పోలీస్ మంచి నిర్ణయం తీసుకుందని హీరో అడవి శేషు అన్నారు. పోలీస్ వాళ్లు వాట్సప్ ప్రారంభించడం సరైన సమయంలో తీసుకున్న నిర్ణయమని సామ్ కార్యకర్త కొండవీటి సత్యవతి అన్నారు. కోవిడ్-19 పై ఒక మతాన్ని టార్గెట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ సహకారం పోలీసులకు ఎల్లప్పుడు వుంటుందని ఆమె తెలిపారు. (గజిని ఫోటోతో పోలీసుల వినూత్న యత్నం )
Comments
Please login to add a commentAdd a comment