cycle raiding
-
శ్రీమంతుడు సినిమాలోలా.. రైలు వదిలి సైకిలెక్కి!
తాటిచెట్లపాలెం: ఆయన వాల్తేరు డివిజన్ డీఆర్ఎం. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు గ్రామంలో పర్యటించినట్టు డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి కూడా తాటిచెట్లపాలెం రైల్వే కాలనీలో పర్యటించారు. కాలనీ మొత్తం సైకిల్‌పైనే ప్రయాణించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకున్నారు. కాలనీ ప్రజలతో మాట్లాడారు. సదుపాయాలు, వసతులు, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, పార్కుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. పారిశుధ్య, పరిశుభ్రత, సెక్యూరిటీ విషయంలో అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని సిబ్బందిని హెచ్చరించారు. ఆయన వెంట సివిల్ ఇంజినీరింగ్ విభాగ అధికారులు, పర్యావరణ, ఆరోగ్య విభాగ సిబ్బంది ఉన్నారు. -
మళ్లీ స్టార్ట్: సైకిల్‌పై చక్కర్లు కొట్టిన స్టాలిన్
సాక్షి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఈస్ట్ కోస్టు రోడ్డులో ఆదివారం ఉదయం సైకిల్ పయనంతో దూసుకెళ్లారు. 30 కి.మీ దూరం ఆయన సైకిల్ తొక్కుతూ ముందుకు సాగారు. మార్గమధ్యలో యువత సెల్ఫీలు, ప్రజలతో పలకరింపులు సాగాయి. ఆరోగ్య పరిరక్షణ విషయంలో డీఎంకే స్టాలిన్ ఎప్పుడు ముందుంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటిస్తుంటారు. అలాగే, ఎన్నికల వేల వాకింగ్‌లతో ప్రచారం, పాదయాత్రలు అంటూ ముందుకు సాగారు. గత నెలన్నర రోజులుగా క్షణం తీరిక లేకుండా బిజిబిజీగా గడిపిన స్టాలిన్‌కు ప్రస్తుతం కాస్త విరామం దక్కింది. ఎన్నికలు ముగియడంతో గెలుపు ధీమా స్టాలిన్‌లో ఎక్కువగానే ఉంటోంది. ఎన్నికల ముందు సాగిన సర్వేలు, ఆతర్వాత సర్వేలు, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ ఇచ్చిన నివేదికతో అధికారం తమదే అన్న ధీమా స్టాలిన్‌లో పెరిగింది. గత నెలన్నర రోజులుగా వ్యాయామానికి విరామాన్ని ఇచ్చిన స్టాలిన్ మళ్లీ మొదలెట్టారు. సైక్లింగ్‌తో దూసుకెళ్లే పనిలో పడ్డారు. ఆదివారం ఉదయాన్నే తన నివాసం నుంచి సైకిల్ పయనం మొదలెట్టారు. సైక్లింగ్‌లో దూసుకెళ్లే వారి తరహాలో డ్రెస్ ధరించి, భద్రతా సిబ్బందిని దూరంగా ఉంచి తానే యువకుడిని అన్నట్టుగా చలాకీగా సైక్లింగ్‌లో దూసుకెళ్తారు. చెన్నై ఈసీఆర్ మార్గంలో ఆయన ముప్పై కిలో మీటర్లు దూరం సైకిల్ పయనం చేయడం విశేషం. ఈ పయనంలో స్టాలిన్‌ను గుర్తు పట్టిన యువత ఎందరో, వారందరు ఆయనతో సెల్ఫీలు దిగారు. కొన్ని చోట్ల ప్రజల్ని పలకరిస్తూ, అభివాదం తెలుపుతూ స్టాలిన్ ముందుకు సాగారు. వ్యాయామంపై శ్రద్ధ వహించే స్టాలిన్ గతంలో కూడా పలుమార్లు సైక్లింగ్ చేసి అభిమానులు, ప్రజల్ని పలకరించిన విషయం తెలిసిందే. చదవండి: కరోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మృతి -
ముగ్గురు మిత్రుల సాహసయాత్ర!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో చాలా టెక్ సంస్థలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించాయి. దింతో చాలా మంది ఉద్యోగులు తమ స్వంత గ్రామాలకు వెళ్లి పని చేస్తున్నారు. మరి కొంత మంది ఉద్యోగులు ఈ కరోనా భయం తగ్గే వరకు సెలవులు తీసుకున్నారు. కానీ, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు యువకులు మాత్రం చాలా కొత్తగా అలోచించి తమకు నచ్చిన సైక్లింగ్ యాత్ర చేస్తూ మధ్య మధ్య పని చేసుకున్నారు.(చదవండి: భూగర్భంలో గోల్కొండ షో!) ఈ మహమ్మారి కారణంగా దొరికిన సమయాన్ని వారు మంచిగా సద్వినియోగం చేసుకున్నారు. ఇటు ఆఫీస్ పని చేసుకుంటూనే వారు యాత్రను ఎంజాయ్ చేసారు. బక్కెన్ జార్జ్, ఆల్విన్ జోసెఫ్, రతీష్ భలేరావ్ అనే ముగ్గురు స్నేహితులు ఉద్యోగం చేస్తూనే సైకిల్‌పై ముంబయి నుంచి కన్యాకుమారి వరకు వెళ్లారు. ఎలాగూ ఆఫీస్‌కు వెళ్లాల్సిన పని లేదు కాబట్టి.. పనిచేస్తూ ఎక్కడికైనా సైకిల్‌పై విహార యాత్రకు వెళ్తే బాగుంటుందని బక్కెన్ మొదట నిర్ణయించుకున్నాడు. గతంలో బక్కెన్‌కు సైకిల్‌యాత్రలు చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే ఈ సారి ఉద్యోగం చేస్తూనే కన్యాకుమారి వరకు వెళ్లాలని బక్కెన్ నవంబర్ లో నిర్ణయించుకున్నాడు. తరువాత అతను తన ఇద్దరు స్నేహితులను ఒప్పించాడు. హోటళ్లే ఆఫీసులు ఈ యాత్రలో భాగంగా వారికీ కావాల్సిన ల్యాప్‌టాప్, మొబైల్ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లు వెంటపెట్టుకున్నారు. వారు ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి 11 గంటల వరకు సైకిల్ యాత్ర చేపట్టేవారు. తర్వాత మార్గం మధ్యలో కనిపించే దాబా లేదా హోటల్ వద్ద ఆగేవారు. అక్కడ భోజనం చేసిన తర్వాత ఆఫీస్ విధుల కోసం ల్యాప్‌టాప్‌లో లాగిఇన్ అయి.. సాయంత్రం వరకు అక్కడే పనిచేసుకునేవారు. ఇలా వీరు 26 రోజుల్లో 1,687కి.మీ ప్రయాణించి కన్యాకుమారి చేరుకున్నారు.(చదవండి: ఇదే హవా ఉంటే మూడోసారి ప్రధాని పీఠంపై) వారాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణించే వారు అని జోసెఫ్ పేర్కొన్నాడు. వీరు మార్గం మధ్యలో కోవిడ్ ఆంక్షల కారణంగా బస చేయడానికి కొన్ని సమస్యలు ఏర్పడేవని పేర్కొన్నారు. ఈ ప్రయాణం కోసం ఒక్కొక్కరికి సుమారు 25 వేల రూపాయలు ఖర్చు అయ్యాయని పేర్కొన్నారు. దీనిలో ఎక్కువ భాగం బస, భోజనానికి ఖర్చు అయ్యాయని తెలిపారు. కానీ ఈ ప్రయాణంలో భాగంగా పని చేస్తూ ప్రకృతిని ఆస్వాదించడం తమకు బాగా నచ్చిందని వారు తెలిపారు. -
సీఎం సైకిల్ తొక్కారు.. మరి మీరో!
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు మీద వెళ్తే ఎలా ఉంటుంది? భద్రతా పరమైన కారణాలతో పాటు.. అసలు సీఎం లాంటి వ్యక్తి అలా వెళ్తుంటే జనం ఫాలోయింగ్ ఎలా ఉంటుందన్న విషయం కూడా చూడాలి కదా. కానీ వీటన్నింటినీ తోసిరాజని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సైకిల్ తొక్కుకుంటూ లక్నో వీధుల్లో సందడి చేశారు. అది కూడా వెనకాల పెద్ద భద్రతా ఏర్పాట్లు ఏమీ లేకుండానే. శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు తొక్కినట్లే ఓ అత్యాధునిక సైకిల్ తీసుకుని ఆయన తొక్కుకుంటూ వెళ్లిపోయారు. మధ్యలో ఎవరో ఫొటోగ్రాఫర్ కనిపిస్తే ఫొటోకు పోజులు కూడా ఇచ్చారు. ఆరోగ్యం కోసం ఇలా సైకిల్ తొక్కడం మంచిదే. మరి సీఎం తొక్కినప్పుడు మనం ఎందుకు మొహమాట పడటం? మీరూ సైకిళ్లు తీయండి!!