cyclone effects
-
మిగ్ జాం తుఫాన్ బీభత్సంతో కుదేలైన రైతులకు ప్రభుత్వం భరోసా
-
'టౌటే'తో బాల్కనీ పైకప్పు కూలిపోయింది: నటి
ముంబై : ఓ వైపు కరోనా సెకండ్‌వేవ్‌తో ప్రజలు అల్లాడుతుంటే టౌటే తుఫాన్ మరింత కష్టాలు తెచ్చిపెట్టింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ప్రారంభమైన టౌటే తుపాను ధాటికి ముంబై సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. మే నెలలో అత్యధికంగా 24 గంటల వ్యవధిలో 230 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి.. వీధులు నీటితో నిండిపోయాయి. తుపాను ప్రభావంతో అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో ముంబైలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలా ఇళ్లల్లో టీవీలు, ఇంటర్నెట్ కనెక్షన్లు పనిచేయడం లేదు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇంటి నుంచి పనిచేసే (వర్క్ ఫ్రం హోమ్) ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక టౌటే తుపాను తనకు కూడా ఎంతో నష్టం కలిగించిందని నటి రాఖీ సావంత్ తెలిపారు. ముంబైలో కురిసిన భారీ వర్షాలకు తన ఇంటి బాల్కనీ పైకప్పు కుప్పకూలిపోయిందని వెల్లడించారు. ఇది చూసి తానెంతో బాధపడుతున్నానని, నిన్నటి నుంచి పైకప్పు నుంచి పడుతున్న వర్షపు నీటిని బకెట్‌తో బయట పారబోశానని తెలిపింది. అంతేకాకుండా తుపాను ధాటికి చెట్లు విరిగిపోవడం గురించి స్పందిస్తూ.. ఇప్పటికే ప్రజలు ఆక్సిజన్ సిలిండర్లు లేక ప్రాణాలు కోల్పోతుంటే ఇలా చెట్లు విరిగిపోతే మనకు ప్రాణవాయువు ఎక్కడినుంచి వస్తుంది? ఇంకా దేవుడు ఏమేం చేయాలనుకుంటున్నాడో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టౌటే తుపాను మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించింది. తుపాను ప్రభావంతో ఇప్పటికి 100 మంది వరకు గల్లంతయినట్టు సమాచారం. ప్రస్తుతం అతి తీవ్ర తుపానుగా ఉన్న టౌటే మరికొద్ది గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. చదవండి : ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్ Amitabh Bachchan: ఆఫీసును ముంచెత్తిన వరద -
ఎన్నికల కోడే కాపాడింది..
తుపానును ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు.. ప్రణాళిక ప్రకారం రెస్క్యూ ఆపరేషన్.. వర్షాలు వెలిశాక చకచకా పునరుద్ధరణ పనులు.. ఇదీ ఫొని తుపాను సందర్భంగా అధికారులు అనుసరించిన వ్యూహం. ‘తిత్లీ’ నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు సాధారణ పరిస్థితులు చాలా త్వరగా నెలకొన్నాయి. తుపాను తీవ్రతలో తేడా ఉన్నప్పటికీ.. అధికారుల కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని ప్రజలు అంటున్న మాట. మరి అప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసం ఏమిటి? ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి సీఎం చంద్రబాబు అడుగుపెట్టకపోవడమే ఇందుకు కారణమా? అరసవల్లి:‘నేనొస్తేనే అంతా జరుగుతుంది... అంతా నేనే చేశాను... ప్రకృతిని ఎదిరించాను... సముద్రాన్ని ఆపేస్తాను...’ అనే ప్రకటనలే లేవు... అధికారుల్లో ఆందోళన, హడావుడి లేదు... ఆర్భాటం అస్సలే లేదు! ఒకటో రెండో ఉన్నత స్థాయి సమీక్షలు... క్షేత్ర స్థాయిలో పకడ్బందీ చర్యలు... అప్రమత్తత... తత్ఫలితంగా మన అధికారులు పెను తుపానునే జయించారు. తుపాన్ కారణంగా జిల్లాలో ఒక్క ప్రాణనష్టం లేకుండా, భారీగా ఆస్తినష్టం సంభవించకుండా జిల్లావాసులను గట్టెక్కించారు. గతంలో తుపాన్ల సమయాల్లో వారా ల తరబడి విద్యుత్ సరఫరా లేక, తాగునీరు లేక అల్లాడిపోయే పరిస్థితులు ఉండేవి. హుద్‌హుద్.. తిత్లీ.. తర్వాత ఫొని.. ఈ మూడు పెను తుపాన్లు జిల్లాలో తీర, ఉద్దాన ప్రాంతాన్నే కుదిపేసినప్పటికీ ఈసారి మాత్రం ప్రజలు అతి త్వరగానే సాధారణ స్థితికి చేరుకున్నారు. ఇదంతా ఆయన వస్తే సాధ్యమయ్యేనా...? అన్న విషయమై ఇప్పు డు జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ఇదే విషయాన్ని ఓ ఉన్నతాధికారి వద్ద ‘సాక్షి’ ప్రస్తావిస్తే....‘నిజమే... వాళ్లంతా వస్తే వారికి మర్యాదలు చేసుకోవడానికి, వాళ్ల సమీక్షల్లో పాల్గొనడానికి గంటల కొద్దీ సమయం వృథా అయ్యేది.. మా విధులు సక్రమంగా చేయలేకపోయేవాళ్లం’ అని అంగీకరించారు. దీన్ని బట్టి చూస్తే ఉద్యోగుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఏమేరకు ఒత్తిడి ఉండేదో అర్థమవుతోంది. విస్తృత పబ్లిసిటీ, ఆర్భాటాల కోసం రాష్ట్రంలో ప్రకృతి ప్రకోపాలను కూడా వాడేసుకునే చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన జిల్లాకు వచ్చి వుంటే... ఫొని తుపాన్ బీభత్సం నుంచి జిల్లా వాసులు ఇంత త్వరగా కోలుకునేవారు కారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రుల గణం రాకపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనం మిగిలిందని, ఆ మొత్తంతో ప్రజా వసరాలు తీరే అవకాశముందని ఓ అధికారి ‘సాక్షి’ వద్ద వ్యాఖ్యానించారు. చంద్రబాబు వచ్చుంటే... ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో సీఎం చంద్రబాబు తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించడం కుదరలేదు. తర్వాత సిక్కోలు సహా నాలుగు జిల్లాలను కోడ్ నుంచి మినహాయించినప్పటికీ ఆ ప్రాంతాల్లో సహాయ చర్యలకు నిధులు విడుదల చేసేంతవరకే పరిమితం. ప్రజాప్రతినిధుల కదలికలపై కొంతమేర ఆంలు కొనసాగుతాయి. ఫొని తుపాను మరికొద్ది రోజుల్లో జిల్లాను అతలాకుతలం చేస్తుందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం జిల్లా కలెక్టర్ జె.నివాస్ బృందానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. దీనిని తూచా తప్పకుండా పాటించడంతో పూర్తి స్థాయి రక్షణ చర్యలు, పునరావాస కార్యక్రమాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించివుంటే... ఇక్కడి పరిస్థితులు వేరేలా ఉండేవని చర్చ సాగుతోంది. ఆయన వచ్చుంటే... ప్రొటోకాల్ అంటూ జిల్లా కలెక్టర్ నుంచి తహశీల్దార్ వరకు ఉద్యోగులంతా ఆయన వెంటే పరుగులు పెట్టుండేవారు. ఇది చాలక ప్రతి రెండు మూడు గంటలకు ఓ సమీక్ష పేరుతో ముఖ్యమంత్రి హడావుడి మొదలయ్యేది. దీనికితోడు ఈ ప్రాంతాల్లోనే పండుగలు, సంబరాలు చేసుకోవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం జరిగేది. ఇది చాలదన్నట్లుగా తిత్లీని జయించామంటూ విజయవాడలో ఫ్లెక్సీల ఏర్పాటు చేసుకోవడం వంటి ప్రచారాలతో ఆయనకు కావాల్సిన ప్రచారం బాగా వచ్చేది కానీ బాధితులకు సాయం అందదు... ప్రణాళిక ప్రకారం ఆదుకునే పరిస్థితులుండవు. ఐదేళ్ల క్రితం చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే హుద్‌హుద్ విరుచుకుపడగా, గతేడాది తిత్లీ జిల్లాలో ఉద్దానం రూపురేఖలను ధ్వంసం చేసిన సంగతి విదితమే. ఈ రెండు తుపాన్లలో సీఎం తనదైన శైలిలో ప్రచార ఆర్భాటాలు ఎలా చేసారో ప్రజలందరికీ తెలిసిందే. తిత్లీ సమయంలో పలాస ప్రాంతంలో నాలుగైదు రోజులపాటు అక్కడే మకాం వేయడంతో పునరుద్ధరణ పనులన్నీ నిలిచిపోయాయి. సుమారు 15 రోజుల వరకు పూర్తి స్థాయిలో విద్యుత్‌ను అందించలేని పరిస్థితి ఎదురైంది. ఈసారి జిల్లా యంత్రాంగా నికి తోడుగా పనులను పర్యవేక్షించేందుకు సీఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారులు కె.ఎస్.జవహర్‌రెడ్డి, కె.ధనంజయరెడ్డి తదితరులను నియమించారు. విద్యుత్ శాఖ యుద్ధప్రాతిపదికన సుమారు 3 వేల మంది కార్మికులతో పునరుద్ధరణ పనులను పూర్తి చేసింది. 14 మండలాల్లోని 733 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, మర్నాడే పూర్తి స్థాయిలో విద్యుత్ అందించగలగడం విశేషం. ఒక్క విద్యుత్ శాఖ విషయంలోనే కాకుండా... నష్టం అంచనాలు, పారిశుద్ధ్యం, పునరావాసం, ఆహార సహాయ కార్యక్రమాలు కూడా చకచకా జరిగిపోయాయి. -
పెథాయ్ ప్రభావం కృష్ణా జిల్లాపై ఉండదు: కలెక్టర్
సాక్షి, విజయవాడ: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన పెథాయ్ తుపాన్ ప్రభావం కృష్ణా జిల్లాపై ఉండదని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సముద్ర తీరం వెంబడి ఉన్న నాలుగు మండలాలు, 181 గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి పది మంది ప్రత్యేక ఆధికారులను నియమించామని చెప్పారు. జిల్లాలో నేడు, రేపు చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో వరి కోతలు జరిగాయన్నారు. ప్రస్తుతం 20 వేల హెక్టార్లలో వరి పంట పాలుపోసుకునే దశలో వుంది. ఇప్పుడు కురుస్తున్న వర్షాం వల్ల పంటలకు ఎటువంటి నష్టం వాటిల్లదని అన్నారు. తాజా సమాచారం ప్రకారం కాకినాడ, విశాఖపట్నం మధ్య పెథాయ్ తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. -
పై-లీన్ పడగ: పోటెత్తిన సంద్రం
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పై-లీన్ రూపంలో పెనుగండం పొంచి ఉంది... తుఫాన్ తీరప్రాంత మండలాల్లో తీవ్ర అలజడి రేపుతోంది. జిల్లాలో మిగిలిన మండలాల్లో ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. సంద్రం పోటెత్తుతోంది. పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతూ తీరంలో ఉన్న గ్రామాల వైపు దూసుకువస్తున్నాయి. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని మత్స్యకార గ్రామాల వద్ద 30 నుంచి 50 మీటర్ల మేర కెరటాలు ముందుకు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే వలలు, బోట్లనుగ్రామాల్లోకి తరలించారు. 1996 సంవత్సరంలో తుఫాన్ వచ్చినప్పుడు సముద్రాన్ని ఇంత భీకరంగా చూశామని మళ్లీ ఇప్పుడు పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయని మత్స్య కారులు ఆందోళన చెందుతున్నారు. పూసపాటిరేగ మండలం కోనాడ, చింతపల్లి, తిమ్మయ్యపాలెం, తిప్పలవలసల వద్ద సముద్రం 30 అడుగులు ముందుకు వచ్చింది. భోగాపురం మండలం ముక్కాంలో 50 అడుగుల మేర ముందుకు వచ్చింది. శుక్రవారం రాత్రి నుంచి ఈదురుగాలు లు భారీగా వీస్తున్నాయి. తుఫాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ, వైద్య, విద్యుత్, పౌరసరఫరాలు, వ్యవసాయం, మత్స్య, పశుసంవర్థక శాఖ అధికారులు తమ సిబ్బందిని సన్నద్ధం చేశారు. ముందుజాగ్రత్త చర్యలు, సహా యక చర్యలు చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటూ వేటకు వెళ్లిన పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని మత్స్యకారులను వెనక్కి రప్పించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే శుక్రవారం సాయంత్రం భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో అధికారులతో కలిసి పర్యటించా రు. అక్కడ పరిస్థితులు సమీక్షించారు. ఒడిశా లో భారీ వర్షాలు కురిస్తే పార్వతీపురం, కొమరాడ మండలాలకు నాగవళి వరద ముప్పు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఐటీడీఏ పీఓ రజిత్‌కుమార్ సైనీ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. మండల కేంద్రాల్లో తహశీల్దార్, ఎంపీడీఓలు వీఆర్ఓల తో సమావేశాలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పునరావాసానికి ఏర్పాట్లు తుఫాన్ కారణంగా ఇబ్బందిపడే లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాసం, భోజన సదుపాయాలు కల్పించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. చాలా తుఫాన్ షెల్టర్లు శిథిలావస్థకు చేరుకోవడంతో సమీపంలో ఉన్న హాస్టళ్లకు బాధితులను తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. భోగాపురం ఎంఎల్ఎస్ పాయింట్లో వంద మెట్రిక్ టన్నుల బియ్యం, 20 టన్నుల పంచదార, 17 టన్నుల కందిపప్పు, పామాయిల్ ఏడు వేల ప్యాకెట్లు, చింతపండు ఐదు వేల ప్యాకెట్లు, గోధుమ పిండి పది వేల ప్యాకెట్లు, ఉప్పు ఎనిమిది వేల ప్యాకెట్లు, కారం ఐదు వేల ప్యాకెట్లను సిద్ధం చేశారు. పార్వతీపురం ఎంఎల్ఎస్ పాయింట్లో 600 మెట్రిక్ టన్నుల బియ్యం, పామాయిల్ 17 వేల ప్యాకెట్లు, కందిపప్పు 17వేల ప్యాకెట్లు, గోధుమపిండి పది వేల ప్యాకెట్లతో పాటు ఇతర సరుకులు అందుబాటులో ఉంచారు. మరమ్మతులకు ఆరు బృందాలు విద్యుత్ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం పరిధిలో ఉన్న విద్యుత్ సబ్‌స్టే„షన్ల పరిధిలో తక్షణ మరమ్మతులు చేసేందుకు ఆరు ప్రత్యేక బృందాలను పంపించారు. 50 విద్యుత్ స్తంభాలను అక్కడికి చేర్చారు. అవసరమైన సామగ్రిని సమకూర్చారు. ఈ రెండు మండలాల్లో 20 గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన ఏడు బేక్ క్యాంప్‌ల వద్ద వైద్యశాఖ మందులను సిద్ధం చేసింది. శనివారం మరింత ఉద్ధృతంగా గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 175 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని మొదట వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ప్రస్తుతం హెచ్చరికల ప్రకారం గంటకు 200 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచి బీభత్సం సృష్టించనున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఈదురు గాలుల బీభత్సానికి చెట్లతో పాటూ పాకలు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉంది. 12వ తేదీ రాత్రి వరకూ పై-లీన్ ప్రభావం ఉంటుంది. 13 సాయంత్రం నుంచి ఈ ప్రభావం తగ్గనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు.... కలెక్టరేట్‌తో పాటూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. 1077 టోల్ ఫ్రీ నంబర్‌తో పాటూ కలెక్టరేట్లో 08922-236947, విజయనగరం డివిజన్లో 08922-276886, పార్వతీపురం డివిజన్లో 08963-221006 నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. అలాగే అన్ని మండలాల అధికారులను అప్రమత్తం చేశారు. బీఎస్ఎన్ఎల్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల్లో ఉన్న 20 సెల్టవర్లలో ఎటువంటి అంతరాయం లేకుండా పని చేసే విధంగా చర్యలు చేపట్టడానికి 50 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఆర్అండ్బీ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ తదితర శాఖల ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించటానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మత్స్యశాఖ, పశుసంవర్థకశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాకు చేరుకున్న కేంద్ర విపత్తుల బృందం... ఎటువంటి పరిస్థితులు తలెత్తినా సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా 40 మందితో కూడిన జాతీయ విపత్తు రక్షణ బృందాన్ని జిల్లాకు పంపింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడంతో పాటూ సహాయక కార్యక్రమాల్లో వీరు పాల్గొంటారు. ప్రత్యేకంగా నాలుగు పడవలను తమ వెంట తీసుకొనివచ్చారు. రైతన్నలో ఆందోళన.... వర్షాలు కురుస్తాయని ఆనందంలో ఉన్న రైతులకు పై-లీన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన మొదలైంది. గాలుల బీభత్సం సృష్టిస్తే వరి, అరటి పంటలు ఒరిగిపోతాయని ఆవేదన చెందుతున్నారు. తీర ప్రాంతాల్లో 25 వేల మత్స్యకార కుటుంబాలు జిల్లాలో పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి నుంచి భోగాపురం మండలంలోని చేపలకంచేరు వరకు 28 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో మొత్తం 25 వేల మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ కుటుంబాల నుంచి చేపల వేటకు వెళ్లే వారు 11 వేల వరకు ఉంటారని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీరందరికీ మొత్తం 704 పడవులు ఉండగా అందులో ఫైబర్ బోట్లు 176, సంప్రదాయ పడవలు 528 ఉన్నాయి. తీర ప్రాంతం వెంబడి 33 తుఫాన్ షెల్టర్లు ఉన్నప్పటికీ వాటిలో కేవలం 13 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. ఈ నేపథ్యం లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం అధికారులు చర్యలు చేపట్టారు. సమ్మె కొనసాగిస్తూనే... సమైక్యాంధ్ర కోసం రెవెన్యూ, ఇతర శాఖల ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తూనే విధులకు హాజరవుతున్నారు. తొలుత తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు విధు ల్లో చేరారు. మిగిలిన వారు పరిస్థితులను బట్టి విధులు నిర్వహిస్తారని అసోసియేషన్ నాయకులు స్పష్టం చేస్తున్నారు.