Daughters Day
-
కూతుళ్లే అందం..ప్రముఖుల బ్యూటిఫుల్ డాటర్స్..!(ఫొటోలు)
-
International Daughters Day 2024: మన కంటిపాపకు కలలే కాదు... రెక్కలిద్దాం
మన దేశంలో కొత్తగా పెళ్లయిన దంపతులను ‘సుపుత్ర ప్రాప్తిరస్తు’ అని ఆశీర్వదించడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి కాలంలో కూతురు పుట్టడమే పెద్ద అదృష్టం అనే విధంగా ఆలోచనలు మారుతున్నాయి. అన్ని రంగాల్లో ఆడపిల్లలు సాధిస్తున్న విజయాలు అందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులను చూస్తూనే ఉన్నాం. ఇంట కూతురు ఉంటే ఆ ఇంటికి వచ్చే కళ వేరు. కూతురి సామర్థ్యాలు ఇంటికి వెలుగు. భ్రూణ హత్యల వల్ల స్త్రీల జనాభా కురచగా ఉన్న రోజులు ఇకపై చెల్లిపోవాలి. ప్రతి కూతురూ ఒక వరంలా వర్థిల్లాలి. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా కూతురుగా, కూతురికి తల్లిగా ఉన్న కొంతమంది రచయిత్రుల అభి్రపాయాలు.మీ కూతుళ్లకేం ఇస్తున్నారు?‘మీకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉండి, ఒకరిని మాత్రమే చదివించే స్థోమత ఉన్నట్లయితే అమ్మాయినే చదివించండి‘ అంటారు పెరియార్. ఆడపిల్లల చదువుప్రాధాన్యతను గుర్తించడం వల్లే కావచ్చు నన్ను, మా చెల్లిని బాగా చదివించారు మా తల్లిదండ్రులు. ఆడపిల్లలకేం కావాలి అంటే మంచి బట్టలు, నగలు అని కాకుండా ఆర్థికంగా స్వావలంబన కలిగివుండాలనే వారి ఆలోచన కారణంగానే మా జీవితాల్లో మేము నిలదొక్కుకున్నాం. ఈ కారణం చేతనే కొడుకులకు మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత అనుకోకుండా వాళ్ల చివరి రోజుల్లో వారి ఆలనా పాలనా నేను చూసుకోగలిగాను. ఇప్పుడు అమ్మాయిలకి కేవలం ఆర్థిక స్వావలంబన మాత్రమే సరిపోదు. సమాజంలో భద్రత, ఆత్మరక్షణ విద్యలు కూడా అవసరం. ఇంట్లో నేను ఇద్దరు ఆడపిల్లలకు తల్లిని. కాలేజీలో నాకు ఎనిమిది వందల మంది కూతుళ్లు. వారంతా రెక్కలు తొడిగిన ఉత్సాహంతో స్వేచ్ఛగా ఎగరగలిగే వాతావరణం ఉండాలని నా ఆకాంక్ష. అమ్మాయిలు ఆర్థిక స్వావలంబనతో పాటు, ఆత్మవిశ్వాసంతో ఎదగటానికి తల్లిదండ్రులు సమాజం చేయగలిగినదంతా చేయాలి. నేటితరం కూతుళ్లందరికీ నా శుభాకాంక్షలు. – ఎం. ప్రగతి, రచయిత్రి, అనంతపురంకూతురి ప్రపంచంలోకి వెళతానుఏలూరు దగ్గర, కొక్కిరపాడు అనే పల్లెటూరులో ఆర్థికంగా చితికిపోతూ ఉన్న పెద్దరైతు కుటుంబంలో పుట్టాను. నలుగురాడపిల్లల్లో కడసారిదాన్ని. కూతురుగా ఎట్లా ఉన్నానో, ఉంటున్నానో తరచి చూసుకుంటుంటే కొత్తగా ఉంది. చిన్నప్పుడు మా అవసరాలకి డబ్బులు సరిగ్గా ఇవ్వనందుకు అమ్మానాన్నల మీద అరిచేదాన్నని అమ్మ చెపుతూ ఉంటుంది. కాని బుద్ధి పెరిగాక ఎపుడూ విసిగించింది లేదు. ‘మగపిల్లలు లేరు, అంతా ఆడమంద’ అని లోకం వెక్కిరించే రోజుల నుంచి ‘మా బిడ్డలు రత్నాలు’ అని అమ్మానాన్నలు గర్వంగా చెప్పుకునే రోజు వరకూ కూతురుగా నా ప్రయాణంలో అనేక ఎగుడు దిగుళ్లు. కులాన్ని వదిలి నా పెళ్లి నేనే చేసుకున్నందుకు, డబ్బు సంపాదన వదిలి నచ్చిన మార్గంలో వెళ్ళినపుడూ వారు రక్షకులై వెన్ను తట్టారు. చుట్టూ ప్రకృతిని, ప్రేమని ఆస్తులుగా పంచారు. ఇవ్వడం తప్ప తిరిగి అడగడం తెలీని ప్రేమమూర్తుల కూతురిని. స్త్రీలకి అన్నిరంగాలలో స్వేచ్చ ఉండాలని నమ్మే నాకు స్నిగ్ధ ఒక్కతే కూతురు. నేను నమ్మే వాటికి, పెంపకానికి మధ్య కొన్ని విషయాలలో పేచీలు వచ్చేవి, దుస్తులు, షికార్లు, ప్రేమలు వంటివి. ‘స్వేచ్ఛ అంటే నీ నిద్ర నువ్వే లేవడం కూడా’ అంటూ కొటేషన్లు చెప్పిన నాకు ఏ మాత్రం లొంగకుండా తన వ్యక్తిత్వాన్ని చక్కగా కాపాడుకున్న స్నిగ్ధని కొన్ని విషయాల్లో గురువుగా భావించే అమ్మనిపుడు. తనతో గడపడం కోసం నేను ఎదురు చూడడం కాదు, ‘అమ్మా... ముచ్చట్లు చెప్పుకుందామా?’ అని తను తరచూ అడిగే ఆకర్షణ నాలో ఉండడం కోసం ఆ వయసు వారి ప్రపంచంలోకి చొచ్చుకుపోతాను, నేర్చుకుంటాను. ‘నా విలువలకి అనుగుణంగా పెళ్లి చేసుకోకపోతే నేను రాను’ అని బెదిరించబోయానా! ‘నేను నీ ద్వారా వచ్చాను తప్ప నీ కోసం రాలేదు’ అని గట్టిగానే చెప్పింది. కూతురుగా, కూతురి తల్లిగా నా బొమ్మ వారికి సూపర్ హిట్.– కె.ఎన్. మల్లీశ్వరి, రచయిత్రి, విశాఖపట్నంఏ దేశ కరెన్సీ సరిపోదుఫలానా అమ్మాయికి మేము తల్లితండ్రులం అనే స్థాయికి ఎదిగిన ఆడపిల్లలు ఎందరో. అటువంటి అమ్మాయిలను ఆదర్శంగా తీసుకొని గొప్పగా ఎదగాలని ఇండియన్ ఆర్మీకి, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధం అయ్యాను. అనేక కారణాల చేత గమ్యం చేరుకోలేక నిస్సహాయతతో నలిగిపోయాను. ఇంట్లో పెళ్లి చేస్తాను అన్న ప్రతిసారి ‘అమ్మా! నీలాగా నా జీవితం ఇంటికి, పెళ్లి, పిల్లలకు అంకితం అవ్వకూడదు’ అని మా అమ్మను నిందించేదాన్ని. అమ్మ మౌనంగా బాధపడేది. వంటింట్లో ఉల్లిపాయలు తరుగుతూ కన్నీటిని దాచిపెట్టేది. అపుడు అర్థం అయ్యేది కాదు... నాకు పెళ్ళి అయ్యి ఒక కూతురు పుట్టే వరకు ఆమె మౌనానికి అర్థం నిస్సహాయత కాదు అది అంతర్మథనం అని నాకు తెలియలేదు. మా అమ్మ ఇద్దరు చెల్లెళ్లకు అక్కగా పుట్టింది. కొడుకులు లేని కుటుంబం. ఇద్దరూ పిన్నులు చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. కానీ మా అమ్మ పరిస్థితుల రీత్యా టాలెంట్ ఉన్నా ఇంటికే పరిమితం ఐపోయింది. కానీ ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఎవరికి ఆపరేషన్ ఐనా, ఒంట్లో బాగోలేకపోయినా, ఊరెళ్తున్నా ఇలా కారణం ఏదైనా ఆ కుటుంబానికి వండి పెట్టే బాధ్యత కూడా మా అమ్మ నిస్వార్థంగా తీసుకునేది. మా పిన్నులు జీతం సంపాదించే వారు కానీ ఇతరుల కోసం ఖర్చు చేసే సమయం సంపాదించలేక పోయారు. మా అమ్మను చూస్తూ మా తాత అనుకునేవారు..‘ ఇది నాకు కూతురు కాదు... మా అమ్మ అక్కలను కలిపి మళ్లీ పుట్టించాడు దేవుడు’ అని.. మా అమ్మ కథ విన్నాక నాకు అర్థమైంది ఏమిటంటే ఆడపిల్లగా కుటుంబానికి సహాయం చేయాలి అనుకుంటే ఉద్యోగాలే చెయ్యక్కర్లేదు.. అందరినీ నా వారు అనుకుంటూ కలుపుకుని పోతే డబ్బు సంపాదించే ఉద్యోగం చేయకపోయినా మనసులను సంపాదించొచ్చు. ఇది అర్థమయ్యాక మా అమ్మ జీవితాన్ని గమనించి ఆమె చెప్పినవి, చెప్పనివి అక్షరాలుగా రాయడం మొదలుపెట్టాను. రాయడం మొదలు పెట్టిన తరువాత తెలిసింది ఇది మా అమ్మ కథ కాదు. కొన్ని వందల వేల అమ్మల కథ. ఇంటిపట్టున మిగిలిపోయాము అని బాధపడే ఆడపిల్లల, ఆడతల్లుల మనోవ్యధ. మన దేశంలో ఆడపిల్లలు కొన్ని కోట్ల మంది ఇంటి పట్టున ఉండిపోయాము అని బాధ పడుతూ వుంటారు. మీరు ఓడిపోలేదు. మీరు కూతుర్లుగా మీ అమ్మ నాన్నల ప్రేమను, పేరును, పెంపకాన్ని నిస్వార్థంగా ప్రపంచానికి పంచుతున్నారు, కుటుంబాలను, కలలను పెంచుతున్నారు. మీరు చేస్తున్న సేవకు వెల కట్టి డబ్బు ఇవ్వాలని ఆలోచన వచ్చినా అది ఏ దేశ కరెన్సీలో ఇచ్చినా మీకు సరిపోదు. మీకు కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు. ఇదంతా రాస్తుంటే నా 17 నెలల కూతురు ‘అమ్మ జూచు జూచు’ అనుకుంటూ ఒక గ్లాస్ ను వంకర టింకరగా పట్టుకుని నా టేబుల్ దగ్గరకు వచ్చింది. నాలో ఉన్న ఆడపిల్ల నాకు పుట్టిన ఆడపిల్లను చూసి మురిసిపోయింది. – ప్రవల్లిక, రచయిత్రి, సికింద్రాబాద్కూతుళ్లు మేజిక్ చేస్తారుఇంటికి ఆడపిల్ల వుండటం గొప్ప వైభవం. నేను ఒక కూతుర్ని, ఒక కూతురికి తల్లిని. అయితే నేను మరీ అంత గొప్ప లేదా మంచి కూతుర్ని కాదు. బహుశా ఇంకొంచం బాగా వుండాల్సింది. జీవితపు ప్రతి దశలో మా అమ్మతో/కుటుంబంతో అనేక విషయాల్లో విభేదిస్తూ, గొడవ పడుతూ, అప్పుడప్పుడూ సర్దుకుపోతూ, నా స్వాతంత్ర కాంక్షను, అభి్రపాయాలను కాపాడుకుంటూ నడిపాను. మా అమ్మ కాస్త మొండిమనిషి కాబట్టి చిన్నతనంలో అలవికాని నా అల్లరిని, ఇప్పటికీ నా స్వభావంలో వుండే లోపాల్ని భరిస్తోంది. సున్నితమైన అమ్మైతే చాలా కష్టం అయేది. కూతురిగా నాకై నేనైతే జస్ట్ పాస్ మార్క్ వేసుకుంటాను. నా కూతురి దగ్గరకొస్తే తన వల్ల నేను టెన్షన్ పడిన సందర్భాలకన్నా గర్వపడిన సందర్భాలే ఎక్కువ. కూతుళ్లు, తల్లులకన్నా, తండ్రులకు సన్నిహితంగా వుంటారు అనే లోకోక్తి నేను నమ్మను. నా కూతురు నాకు దగ్గరగా వుంటుంది. నాకు కొత్త కొత్త విషయాలు నేర్పిస్తుంది. నాతో వాదిస్తుంది. నాది తప్పైతే మన్నిస్తుంది. మంచి కూతురిగా, మా అమ్మాయికి డిస్టింక్షన్ శాంక్షన్ చేస్తాను. ఇవాళ మా అమ్మ దగ్గరకువెళ్ళి అడిగితే కూడా తనకు తక్కువ మార్కులు వేసుకొని, తన కూతురికి ఎక్కువ మార్కులు ఇస్తుంది. కూతుర్లు అంతే. మురిపిస్తారు. మాజిక్ చేస్తారు. – ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, రచయిత్రి, విజయవాడ -
'నువ్వంటే నా ప్రాణం'.. వైరల్‌గా మారిన అల్లు అర్జున్ పోస్ట్!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాలో బన్నీ నటనకు గానూ ఆయనకు ఈ అవార్డ్ లభించింది. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో పుష్ప-2 రాబోతోంది. ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు బన్నీ. అయితే తాజాగా ఇవాళ అంతర్జాతీయ కూతుర్ల దినోత్సవం సందర్భంగా ఓ వీడియోను షేర్ చేశారు. తన ముద్దుల కూతురు అల్లు అర్హతో ఆడుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు. (ఇది చదవండి: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ప్రభాస్, మహేశ్ తర్వాత బన్నీయే!) వీడియోలో బన్నీ మాట్లాడుతూ.. 'ఎందుకు నువ్వు ఇంత క్యూట్‌గా ఉన్నావు.. కొంచెం క్యూట్ అయితే ఓకే.. మరీ ఇంత క్యూట్‌గా ఎలా ఉన్నావ్' అంటూ తనపై కూర్చోపెట్టుకుని కుమార్తెను ముద్దాడారు. 'నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నువ్వంటే నా ప్రాణం' అంటూ అల్లు అర్హపై ఒక తండ్రిగా ప్రేమను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సైతం అల్లు అర్హ సో క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అల్లు అర్జున్, రష్మిక నటిస్తోన్న పుష్ప-2 వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. బన్నీ కూతురు అల్లు అర్హ సైతం శాకుంతలం సినిమాత వెండితెరపై సందడి చేసింది. ప్రస్తుతం మహేశ్ బాబు నటిస్తోన్న గుంటూరు కారంలోనూ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
డాటర్స్ డే స్పెషల్.. కూతురికి మహేశ్ స్పెషల్ విషెష్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన గారాలపట్టి సితారపై మరోసారి ప్రేమను చాటుకున్నారు. ఇంటర్నేషనల్ డాటర్స్ డే సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. తన కుమార్తె సితారకు డాటర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇద్దరు కలిసి ఉన్న పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. 'నా ప్రపంచాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతం చేసే నా చిన్నారికి డాటర్స్ డే శుభాకాంక్షలు" అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. తరచుగా మహేశ్, సితారతో కలిసి సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. కొద్దిరోజులుగా పలు టీవీ షోలకు సైతం ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. (చదవండి: మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న కాజల్ అగర్వాల్.. ఆ సినిమా కోసమే..!) సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పూజా హెగ్డే కథానాయిక గా నటిస్తోంది. ఈ చిత్రానికి తాత్కాలికంగా 'SSMB28' అని పేరు పెట్టారు. ఈ సినిమాలో బింబిసార ఫేమ్ సంయుక్త మీనన్ నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ 2023 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
కుమార్తెతో సెల్ఫీకి బహుమానం
చెన్నై,టీ.నగర్: కుమార్తెల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులతో తల్లి, బామ్మలతో కలిసి సెల్ఫీ తీసుకుని పంపితే బహుమానం అందచేస్తామని తిరువణ్ణామలై కలెక్టర్ కందస్వామి మంగళవారం ఓ ప్రకటనతో తెలిపారు. మూడు తరాల మహిళలను గౌరవించే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుమార్తెలు ఉన్నవారు భేటి బచావో...బేటి బడావో అనే ఫేస్బుక్ అడ్రస్ లేదా 7397285643 అనే వాట్సాప్ నంబర్‌కు సెల్ఫీ ఫొటోలు ఈ నెల 13వ తేదీలోగా పంపాలన్నారు. -
కూతురితో బన్నీ క్యూట్ వీడియో!
ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే అల్లు అర్జున్ సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటాడు. ముఖ్యంగా తన పిల్లలకు సంబంధించిన వీడియోలు ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటాడు. ఈ రోజు ‘డాటర్స్ డే’ సందర్భంగా ఓ క్యూట్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు బన్నీ. అల వైకుంఠపురములో సినిమా టీజర్లో మురళీ శర్మ, అల్లు అర్జున్‌లు చెప్పిన డైలాగ్‌ను బన్నీ కూతురు అర్హాతో కలిసి చెప్పాడు. తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అర్హ చెప్పిన డైలాగ్స్‌కు బన్నీ ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా డాటర్స్ డే సందర్భంగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. కూతురితో కలిసి తాను దిగిన ఫోటోలను వీడియో రూపంలో పోస్ట్ చేసిన మహేష్, ‘నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు ఎప్పుడూ ఇలా మెరిసిపోతూ ఉండాలి’ అంటూ ట్వీట్ చేశారు. View this post on Instagram Daughters are the cutest thing in the world ❤️ Happy Daughters Day to all the daughters in the world ❤️. Thought I’d share a funn video I shot with my daughter. #happydaughtersday A post shared by Allu Arjun (@alluarjunonline) on Sep 22, 2019 at 1:24am PDT Happy Daughter's day my lil one...Sita Papa❤❤ you are my most adorable, lovely, and naughty daughter ever! Love you forever!😘😘 Shine bright always ✨✨ pic.twitter.com/bCGhwyvF53 — Mahesh Babu (@urstrulyMahesh) September 22, 2019 -
కంటే కూతురినే కనాలి
‘కొడుకు ఒక్కడుంటే చాలు’ అనుకొనే పాతకాలం నాటి నమ్మకాలకు కాలం చెల్లిపోయింది. తల్లిదండ్రుల నమ్మకాల్లో, ఆలోచనల్లో, అనుబంధాల్లో సమతాభావనలు వెల్లివిరుస్తున్నాయి. ‘కొడుకైనా, కూతురైనా ఒక్కటే’ననే’ భావన బలోపేతమవుతోంది. అంతేకాదు. ఇప్పుడు ఎంతోమంది తల్లితండ్రులు ‘ఒక్క కూతురు చాలు’నని సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఒకప్పుడు కూతురు అంటే భారం. గుండెలమీద కుంపటిగా భావించేవారు తల్లిదండ్రులు. ప్రస్తుతం ఆ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఎంతోమంది కూతుళ్లు తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలను పెంపొందిస్తున్నారు. గొప్ప పేరు సంపాదిస్తున్నారు. తాము ఎంచుకొన్న రంగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నారు. తాము పుట్టిపెరిగిన సమాజాన్ని, దేశాన్ని ప్రపంచ యవనికపై నిలబెడుతున్నారు. ఎంతోమంది సింధూలై, మిథాలీ, సానియా, సైనాలై విజయబావుటాలు ఎగరవేస్తున్నారు. ఎవరెస్టు శిఖాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం, ఉత్తేజభరితం. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే మరోవైపు.. కూతురు అంటే ఉన్నతమైన విలువలకు నిలువెత్తు రూపం. ఆర్తి కలిగిన బంగారు తల్లి. కన్నవారి పట్ల ఎంతో ప్రేమను ఆప్యాయతను చూపుతుంది. అచ్చం అమ్మలాగే ఆదరిస్తుంది. కంటిపాపలా పెరిగిన బిడ్డ పెద్దయ్యాక తన తల్లిదండ్రులను సైతం కంటికి రెప్పలా చూసుకోవాలని ఆరాటపడుతుంది. పేరెంటింగ్ దృక్పథంలో మార్పు వచ్చినట్లుగానే పిల్లల ఆలోచనల్లోనూ మార్పు వస్తోంది. ఎంతో మంది కూతుళ్లు ‘ది బెస్ట్ డాటర్’గా పేరు తెచ్చుకుంటున్నారు. అమ్మానాన్నల కలలను సాకారం చేయడంలో ముందువరసలో ఉంటున్నారు. నేడు కూతుళ్ల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సామ్.. సో స్మార్ట్ నా కూతురు సమంత సో స్వీట్. ఆమె ఏ రంగాన్ని ఎంచుకున్నా అప్పర్ హ్యాండ్గానే ఉంటుంది. సామ్ సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందడం, అక్కినేని లాంటి ఓ పెద్ద ఫ్యామిలీకి పెద్ద కోడలుగా వెళ్లడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. నా కూతురు చిన్నప్పటి నుంచి ప్రతిదీ నాకు చెప్పి చేసేది. సినీ ఇండస్ట్రీలోకి వెళ్తున్నప్పుడు నిలుదొక్కుకుంటుందా? లేదా? అని భయపడ్డాను. ఇప్పుడు నాకా భయం లేదు. సమంత ఇప్పుడు స్టార్ మాత్రమే కాదు... సేవా హృదయం కలిగిన వ్యక్తి కూడా. సో.. సామ్ ఈజ్ ఆల్వేస్ సో స్వీట్. – నిన్నెట్టే ఫిలోమోనో ప్రభూ, సమంత తల్లి శభాష్ బిడ్డా సాక్షి, సిటీబ్యూరో: కంటే కూతురినే కనాలి అనే నానుడిని సార్థకం చేస్తున్నారు ఆ కూతుళ్లు. వారు ఎంచుకున్న రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు. తల్లులు చూపిన మార్గంలో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. తల్లుల అడుగుజాడల్లో నడుస్తూ.. బెస్ట్ డాటర్ అనే కాంప్లిమెంట్స్‌ని సొంతం చేసుకుంటున్నారు. కుమార్తెల గురించి కొందరు తల్లులు తమ మనోగతాన్ని ఇలా వివరించారు. మై డాటర్ ఈజ్ బెస్ట్ మా అమ్మాయి సిమ్రాన్ చౌదరి బెస్ట్ డాటర్. స్కూల్ నుంచి ఇప్పటి వరకు ప్రతిదాంట్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. సిన్సీయర్‌గా ఉంటుంది. ఏం చేయాలన్నా.. పేరెంట్స్‌గా మా దృష్టికి తీసుకువచ్చి చేస్తుంది. ఫ్రీడం ఇచ్చాం కదా అని మిస్యూజ్ చేసుకోలేదు. స్కూల్లో టాపర్, డ్యాన్స్ బాగా చేసిందని ఎక్స్‌లెన్స్ అవార్డు కూడా ఇచ్చారు. కాలేజీలో బాస్కెట్ బాల్ ప్లేయర్, టీచర్స్ పెట్. ఇప్పుడు హీరోయిన్గా ఓ మంచి పొజీషిన్కు వెళ్లడాన్ని తల్లిగా ఆస్వాదిస్తున్నా.– సంగీత చౌదరి, సిమ్రాన్ చౌదరి తల్లి కూచిపూడిలో ప్రతిభావంతులు మా అమ్మాయిలు అదితినాగ్, అభనాథ్లు ఇప్పటి వారైనా నా జనరేషన్ పిల్లలని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఇద్దరూ కూచిపూడి నాట్యంలో మంచి ప్రతిభావంతులు. ఇప్పటి వరకు సుమారు 200కిపైగా ప్రదర్శనలు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారు చేస్తుండటమే కాదు.. ఇతరులకు కొరియోగ్రఫీ కూడా నేర్పిస్తున్నారు. థియేటర్ ఆర్ట్స్‌లో కూడా ఉన్నారు. పెద్దమ్మాయి అదితినాగ్ ‘నాగి’గా, చిన్నమ్మాయి అభనాథ్ ‘నథాలయ’గా రాణిస్తున్నారు. ఎన్సీసీలోనూ టాపర్లే. నేటితరం పిల్లల్లా ఉంటారే కానీ.. వాళ్ల ఆలోచనలు, బాధ్యతలన్నీ నా తరం నాటివే. – సరోజబాల ఠాకూర్ తనయా.. ఒక్కతేనయా సనత్‌నగర్: కుమారుడు అయినా, కూతురు అయినా వారికి సమానమే. కొడుకే పుట్టాలని భావించలేదు. మొదటి సంతానం ఆడబిడ్డ జన్మించినా బాధపడలేదు. ఆ ఒక్క అమ్మాయే చాలనుకున్నారు. దేవుడిచ్చిన తనయే సర్వస్వంగా బతికేస్తున్నారు. ఒకే ఒక అమ్మాయితో సరిపెట్టుకుని స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు నగరానికి చెందిన పలువురు దంపతులు. కూతుళ్ల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తున్నారు. ప్రేమాభిమానాలకు చిరునామా.. మోతీనగర్ పాండురంగానగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సురేందర్, చంద్ర దంపతుల ముద్దుల కుమార్తె మోనా. మొదట కుమార్తె జన్మించినప్పటికీ ఆ తర్వాత మగబిడ్డ కావాలని ఏనాడూ ఈ జంట ఆలోచన చేయలేదు. ఒక్కగానొక్క కుమార్తెలోనూ మగబిడ్డను చూసుకుంటూ ఆమె నుంచి అంతులేని ప్రేమాభిమానాలను పొందుతున్నామని సురేందర్ వివరించారు. బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ముందుగా కలగజేసుకుని తల్లిదండ్రులతో పంచుకునేది ఒక్క కుమార్తె మాత్రమే అని ఆయన చెబుతున్నారు. అందుకే కూతురు అంటే తమకు ఇష్టమంటున్నారు. ప్రస్తుతం మోనా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. కెరీర్ పరంగా ఏనాడూ పాప ఆశయాలను అగౌరవపరచలేదు. ఆమె లక్ష్యం ప్రకారమే డాక్టర్‌ను చేయాలనుకున్నాం. బయటకు వెళితే నాన్న ఎప్పుడు వస్తారని వేయి కళ్లతో ఎదురుచూసేంది కుమార్తె మాత్రమేనని సురేందర్ పేర్కొన్నారు. ఆడపిల్ల ఇంటికి అదృష్టం.. మూసాపేట ఆంజనేయనగర్‌కు చెందిన స్కూల్ నిర్వాహకురాలు రజనీ కొల్లూరు, బోస్ దంపతుల కుమార్తె అనఘా. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ‘అనఘాను మగరాయుడిలా పెంచుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కొడుకులు ఉన్నప్పటికీ పెళ్లయ్యాక పరిస్థితులు మారిపోతున్నాయి. దీంతో వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. అదే కూతురు ఉంటే పెళ్లై అత్తారింటికి వెళ్లిపోయినా ప్రేమాప్యాయతలు మాత్రం తల్లిదండ్రులపై శాశ్వతంగా ఉంటాయి. కూతురిని ఉన్నత స్థానంలో చూడాలని మా కోరిక. అందుకోసం ఎంతటి కష్టమైనా పడతాం’ అంటున్నారు. రజనీ, బోస్ దంపతులు. ‘తనలోనే కొడుకును చూసుకుంటూ తన మాటలకు ఎంతో విలువనిస్తారు. ఈ రోజుల్లో ఆడపిల్ల పుడితే ఏ విధంగా పరిస్థితులు ఉంటాయో అందరం చూస్తున్నాం. ఆడపిల్ల ఇంటికి అదృష్టంగా భావించే వారు నా తల్లిదండ్రులు కావడం నా అదృష్టం’ అని చెబుతోంది అనఘా. అనురాగాల ‘నిధి’ మూసాపేట మారుతీనగర్‌కు చెందిన వ్యాపారవేత్త శ్రీనివాస్‌రెడ్డి, సంయుక్త దంపతుల ముద్దుల తనయ నిధిలారెడ్డి. ఐఐటీ రామయ్యలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ‘మా దృష్టిలో వారసుడైనా, వారసురాలైనా ఒక్కటే. పాప పుట్టిన తర్వాత బాబు కావాలని ఏ రోజూ ఆలోచించలేదు. దేవుడిచ్చిన సంతానంలో పాపైనా, బాబైనా ఒక్కటే. బయట పనులపై తిరిగి ఇంటికి వచ్చిన తండ్రికి చేదోడుగా నిలిచేది భార్య తర్వాత కుమార్తె మాత్రమే. కొడుకు జేబు చూస్తాడంటారు. అదే కుమార్తె కడుపు చూస్తుందంటారు. అదే కొడుకుకు, కూతురుకు తేడా. కొడుకు కంటే తల్లిదండ్రులపై ప్రేమాప్యాయతలు ఎక్కువగా చూపించేది కూడా కూతురే. అందుకే కంటే కూతురినే కనాలి’ అంటున్నారు శ్రీనివాస్‌రెడ్డి, సంయుక్త దంపతులు కూతురిలోనే ఆత్మీయత.. వీరు కూకట్పల్లి బాలాజీనగర్‌కు చెందిన బిల్డర్ కొండేపూడి వెంకటరమణ, సుమ దంపతులు. వారి గారాలపట్టి చరిష్మ. వీరికి వివాహమైన నాలుగేళ్లకు చరిష్మ జన్మించింది. కుటుంబమంతా మగబిడ్డ కావాలని కోరుకున్నా.. ఆ దంపతులు మాత్రం ఆడపిల్ల పుట్టాలనే మొక్కుకున్నారు. విశేషమేమంటే తల్లి సుమ పుట్టిన రోజునే చరిష్మ జన్మించింది. ఇద్దరు బర్త్ డే ఒకేసారి గ్రాండ్‌గా జరుపుకొంటారు. పాప పుట్టి 17 ఏళ్లయినా వారు ఏనాడూ మగబిడ్డ గురించి ఆలోచించలేదు. చరిష్మా ప్రస్తుతం తమిళనాడులోని శాస్త్ర డీమ్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ మొదటి సంవత్సరం చదువుతోంది. కూతురు తమపై చూపించే ప్రేమ వల్లనో ఏమో మగబిడ్డ ఊసే లేదని వెంకటరమణ చెప్పుకొచ్చారు. బిజినెస్ పని మీద బయటకు వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చేవరకు ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఎక్కడున్నా తల్లిదండ్రుల సంక్షేమం గురించి ఆలోచించేది ఒక్క కూతురే. ఎన్ని జన్మలెత్తినా కూతుర్నే కనాలని నేను గర్వంగా చెబుతా. తల్లిదండ్రులుగా మనం కోరుకునే ప్రేమ, ఆప్యాయత కూతురులో మాత్రమే దొరుకుతుంది. సేవా తత్పరత నచ్చింది.. మా అమ్మాయి శ్రావ్యరెడ్డికి చిన్నప్పటి నుంచి సేవ చేయాలనే తపన. ఐఏఎస్ కావాల్సిన శ్రావ్య సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టడం సమ్‌థింగ్ ఇంట్రస్టింగ్ అనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో మమేకమై వాళ్లకు భరోసా ఇవ్వడం నాకు గర్వంగా అనిపిస్తుంది. చేనేత కుటుంబాలు ఆత్మహత్య చేసుకోకుండా వారికి తనకున్న దాంట్లో చేస్తున్న సాయం నన్ను మరింతగా ఆకర్షిస్తుంది. ఒక తల్లిగా ఇంతకన్నా నాకేం కావాలి. – నీరజారెడ్డి మా అమ్మాయి మంచి ఆర్టిస్ట్ మా అమ్మాయి ప్రియాంక ఆలే ఓ మంచి ఆర్టిస్టు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా, ఆనందంగా ఫీలవుతుంటాను. ఆర్ట్‌పై ఆమెకు మంచి గ్రిప్ ఉంది. వేసిన ఆర్ట్‌పై గంటల కొద్దీ డిబేట్ చేయడం కూడా నాకు చాలా నచ్చుతుంది. ఆమె ఆర్ట్ విషయంలో నేను జోక్యం చేసుకోను. తనే ‘అమ్మా... నేను గీసిన చిత్రాలు’ ఎలా ఉన్నాయంటూ అడుగుతుంటుంది. మావారు కూడా ఆర్టిస్టే. ఇప్పుడు కుమార్తె సైతం ఆర్టిస్టు కావడం ఓ గొప్ప వరంగా భావిస్తా. – ఆలే లలిత -
కూతురు పుడితే సంబరం
కదంబ వృక్షం అంటే తెలుసు కదా! దుర్గాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన చెట్టు. రాజస్తాన్‌లోని పిప్లాంత్రీ గ్రామంలో మనం అడుగు పెడితే పచ్చగా, అందంగా ఈ కదంబ వృక్షాలే కనువిందు చేస్తుంటాయి. ఎందుకంటారా ఆ గ్రామంలో అమ్మాయి పుడితే సంబరాలు చేసుకుంటారు. ప్రకృతికి మారుపేరైన అమ్మాయి పుట్టినందుకు ఓ మొక్క నాటుతారు. ఈ సంబరాల వెనుక ఓ విషాదం ఉంది. ఆ ఊరి మాజీ సర్పంచ్ శ్యామ్‌సుందర్ పాలీవాల్. 2006లో ఆయన 16 ఏళ్ల వయసు కుమార్తె కిరణ్ చనిపోయింది. ఆమె స్మృతి కోసం ఓ కదంబ మొక్క నాటారు. ఆ కదంబ చెట్టే తన కూతురంటూ ఆ చెట్టును వాటేసుకునేవారు. ప్రతి ఇల్లు తిరుగుతూ కూతురు పుడితే సంబరాలు చేసుకోవాలని, మొక్కల్ని పెంచాలని అవగాహన పెంచారు. అసలే కరువు ప్రాంతమైన రాజస్తాన్‌లో ఓ ఏడాది నీటి కటకట ఏర్పడింది. ప్రభుత్వం రైళ్ల ద్వారా ఆ ఊరికి నీరు సరఫరా చేసింది. దీంతో ప్రకృతి లాంటి ఆడపిల్లనే కాదు.. ప్రకృతిని కూడా కాపాడుకున్నారు. పిప్లాంత్రీతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో విపరీతంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. 3 లక్షల 50 వేలకు పైగా మొక్కలు నాటారు. ఓ కూతురుంటే తల్లిదండ్రులు ఎంత పచ్చగా ఉంటారో, ఇప్పుడా ఊరు కూడా పచ్చగా కళకళలాడుతోంది. ఎవరెస్టంత ఎత్తుకు ఎదిగింది.. ‘బిడ్డ పర్వతం ఎక్కుతానంటే నాకు భయమనిపించింది.. కానీ అమ్మాయే నాకు ధైర్యం చెప్పింది. రెండు రాష్ట్రాల్లో ఇద్దరికే అవకాశం వచ్చిందంటే నమ్మకం కుదిరింది. కశ్మీర్‌కు వెళ్లే ఒకరోజు ముందు క్షణాలు ఇప్పటికీ గుర్తున్నయ్’ అంటూ ఆ ఉద్వేగ క్షణాలను నెమరేసుకున్నారు ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ తండ్రి దేవీదాస్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాలకు చెందిన దేవీదాస్ది వ్యవసాయ కుటుంబం. కుమారుడు నరేశ్, కూతురు పూర్ణ. ‘ఐదో తరగతి వరకు పాకాల గవర్నమెంట్ స్కూళ్లోనే చదివింది. తర్వాత తాడ్వాయి గురుకులంలో చేర్చించా. పర్వతాధిరోహణ కోసం 110 మందిని సెలెక్ట్ చేసి అందులో 20 మందికి భువనగిరి కోట దగ్గర శిక్షణ ఇచ్చారు. ఇద్దరిని జమ్మూకశ్మీర్‌కు పంపించారు. పర్వతాధిరోహణకు అంతా రెడీ అయ్యాక పర్వతం ఎక్కేందుకు మాతో పంపిస్తావా అని అడిగిండ్రు. పూర్ణపై నమ్మకంతో ఓకే అని చెప్పినం.’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు దేవీదాస్. – సాక్షిప్రతినిధి/నిజామాబాద్ -
మలబార్లో డాటర్స్‌డే సెలబ్రేషన్స్
లబ్బీపేట : డాటర్స్‌డే (కూతుళ్ల దినోత్సవం)ను పురస్కరించుకుని మహాత్మాగాంధీ రోడ్డులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జూయలరీ షోరూమ్‌లో గురువారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూతుళ్లకు ప్రత్యేక బహుమతిగా అందించేందుకు ఆఫర్‌ను ప్రవేశ పెట్టారు. అందులో భాగంగా కేవలం రూ.37.900కే డైమండ్ ఇయర్ రింగ్స్, ఫింగరింగ్, పెన్డెంట్ సెట్‌ను అందచేయనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ నిఖిల చంద్రన్ చెప్పారు. నగరానికి వచ్చే పుష్కర భక్తులతో పాటు, నగర వాసులు ఈ డైమండ్ సెట్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఫాజిల మేనేజర్స్ షినోజ్, రాజేశ్వర్, అలీమ్, రంజిత్ పాల్గొన్నారు. -
అమ్మల బాటలో అందాల భామలు
నేడు డాటర్స్ డే మహిళల్ని ఆకాశంలో సగం అంటారు. సృష్టిలో వారిది ప్రత్యేక స్థానం. పూజనీయ వ్యక్తులుగా తల్లి, తండ్రి, గురువు, దైవం.. ఇలా క్రమ పద్ధతిలో కొలుస్తారు. తల్లి మొదటి స్థానంలో ఉంటారు. దీన్ని బట్టే మహిళల ప్రాధాన్యం ఏంటో అర్థమవుతుంది. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. దేశాల్ని ఏలుతున్నారు. భూమండలాన్ని దాటి రోదసీ యాత్రలు చేస్తున్నారు. మహిళల్ని గౌరవించుకోవడానికి మహిళా దినోత్సవం ఉన్నట్లే, కుమార్తెల ప్రతిభను గుర్తించడానికి 'డాటర్స్ డే' జరుపుకొంటున్నారు. ఈరోజే 'డాటర్స్ డే'. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని వివిధ రంగాల్లో రాణించిన తల్లీకూతుళ్ల వివరాలు మీకు అందిస్తున్నాం. అమ్మలాగే.. మేమూ: బాలీవుడ్లో తమ నటనతో అభిమానులు మెప్పించిన ప్రఖ్యాత కథానాయికలు ఎంతో మంది ఉన్నారు. అత్యుత్తమ ప్రతిమ కనబరిచిన తల్లీకూతుళ్లూ ఉన్నారు. నిన్నటి తరం తారలు బాలీవుడ్‌ను ఏలితే, తామేం తక్కువ కాదంటూ వారి తనయిలు దూసుకొచ్చారు. అందం, అభినయంతో చెరగని ముద్ర వేశారు. తనూజ-కాజోల్, షర్మిలా -సోహా అలీ ఖాన్, అపర్ణా సేన్- కొంకణా సేన్, హేమమాలిని-ఇషా డియోల్ ....ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా పెద్దదే అవుతుంది. తల్లీకూతుళ్లు కలసి స్క్రీన్‌పై సందడి చేసిన సందర్భాలు ఉన్నాయి. తనూజ-కాజోల్: అందం కంటే అభినయంతోనే రాణించిన నటి కాజోల్. 1990ల్లో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన కాజోల్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. శ్రీదేవి, మాధురీ దీక్షిత్, జూహీచావ్లా తదితర అందాల భామల హవా నడుస్తున్న కాలంలో నటిగా నిరూపించుకుంది. హీరో అజయ్ దేవ్‌గన్‌ను పెళ్లాడిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆమె నటించిన చివరి చిత్రం 'టూన్‌పూర్ కా సూపర్ హీరో' 2010లో విడుదలైంది. కాజోల్ తల్లి తనూజ నిన్నటితరం ప్రసిద్ధ నటి. షర్మిలా-సోహా అలీ: సోహా అలీ ఖాన్ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చింది. తల్లి షర్మిలా టాగూర్ ప్రసిద్ధ నటి. ప్రస్తుతం సోహా బాలీవుడ్లో కీలక పాత్రలు పోషిస్తోంది. తల్లి షర్మిలతో కలసి నటించాలన్న సోహా కోరిక 2009లో తీరింది. వీరిద్దరూ 'లైఫ్ గోస్ ఆన్' అనే చిత్రంలో తెరపై కనిపించారు. వీరు నిజజీవితంలో స్నేహితుల్లా ఉంటారు. అపర్ణా-కొంకణా: నిన్నటితరం నటి, దర్శకురాలు అపర్ణా సేన్ సినీ ప్రియులకు సుపరిచితురాలు. అపర్ణా వారసురాలిగా తెరంగేట్రం చేసిన కొంకణా సేన్ అనతి కాలంలోనే నటిగా సత్తాచాటింది. 'మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్' సినిమాలో నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. తల్లీకూతుళ్లు కలసి '15 పార్క అవెన్యూ' అనే సినిమాలో ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇద్దరూ కలసి బెంగాలీ సినిమా 'ఇటి మృణాళిని'లో స్ర్కీన్‌పై కనిపించారు. హేమమాలిని-ఇషా: డ్రీమ్ గర్ల్ హేమమాలిని అందం, అభినయం అపురూపం. బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. ఆమె ముద్దుల కూతుళ్లు ఇషా డియోల్, అహాన డియోల్ పలు సినిమాల్లో నటించారు. అంతేగాక తల్లీకూతుళ్లు కలసి ఎన్నో నృత్య ప్రదర్శనలు చేశారు. ఇంకా డింపుల్ కపాడియా కూతుళ్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా, మున్ మున్ సేన్ తనయలు రైమా, రియా సేన్ కూడా బాలీవుడ్లో మెప్పించారు. దక్షిణాదిలో కూడా సంధ్య కుమార్తె జయలలిత (తమిళనాడు ముఖ్యమంత్రి), రాధ గారాటపట్టి కార్తీక, మంజుల కూతుళ్లు శ్రీదేవి, రుక్మిణి నటీమణులే.