David Raju
-
మేతకొచ్చాడు.. మరో నేత!
యర్రగొండపాలెం: ‘టీడీపీ జమానా.. అవినీతి ఖాజానా’ అని కమ్యూనిస్టులు ఓ పుస్తకమే అచ్చేశారు గుర్తుంది కదా.. అధికారం చేతిలో ఉంటే టీడీపీ నేతల అవినీతి దందా ఎలా సాగుతుందో ఇక ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అడ్డగోలు హామీలతో 2014లో గద్దెనెక్కిన చంద్రబాబు.. టీడీపీ అభ్యర్థులు ఓడిన చోట ‘త్రీ మెన్ కమిటీ’లకు పెత్తనం అప్పగించడం ద్వారా దుస్సంప్రదాయానికి తెరతీశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజును సంతలో పశువులా కొనుగోలు చేసి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అధికారమే అండగా తెలుగు తమ్ముళ్లు ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి చెలరేగారు. నీరు–చెట్టు పనుల పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో రూ.కోట్లు దండుకున్నారు. టీడీపీకి మళ్లీ ఓటేస్తే ఇప్పుడొచ్చిన నేత ఇంకెంత మేస్తాడోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.టీడీపీ జమానాలో పచ్చ నేతల అవినీతి దందాను కళ్లారా చూసిన వైపాలెం నియోజకవర్గ ప్రజలు.. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకెంత దోచేస్తారో అని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అధికారులను కీలు»ొమ్మలుగా మార్చి జన్మభూమి కమిటీలతో సాగించిన అరాచకాలను మరోమారు మననం చేసుకుంటున్నారు. పథకం ఇవ్వాలంటే లంచం, పని కేటాయించాలంటే కమీషన్, ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసి సొమ్ము చేసుకోవడం ద్వారా టీడీపీ నాయకులు రూ.కోట్లు గడించారు.నీరు–చెట్టు పనులకు అంచనాలు వేసే సమయంలోనే 25 శాతం కమీషన్ అందేలా టీడీపీ నేతలు పక్కాగా స్కెచ్ వేసినట్లు ఆరోపణలున్నాయి. 2015–17 మధ్య యర్రగొండపాలెం నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద 1235 పనులకు రూ.51.51 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత రెండేళ్లలో సుమారు రూ.43.5 కోట్లతో అంచనాలు రూపొందించి పనులు చేపట్టారు. దాదాపు రూ.95 కోట్లు ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టిన టీడీపీ నాయకులు.. అందులో 25 శాతం అంటే రూ.28 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారు. పనులు చేయకుండానే బిల్లులు పెట్టి సుమారు రూ.15 కోట్ల వరకు టీడీపీ నేతలు కొల్లగొట్టారు.నీరు–చెట్టులో నిధుల గోల్మాల్..యర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి చెరువులో నేషనల్ హైవే కాంట్రాక్టర్ అధికారికంగా మట్టి తవ్వుకోగా ఏర్పడిన గోతులను టీడీపీ నాయకులు నీరు చెట్టులో చేసినట్లు చూపి ఏకంగా రూ.60 లక్షల బిల్లు పొందారు. పుల్లలచెరువు మండలంలోని కాటివీరన్న చెరువులో పనులు చేపట్టకుండా మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు రూ.10 లక్షలు కాజేశారు. ఇదే పద్ధతిలో మండలంలో 26 మంది టీడీపీ నాయకులు పనులు చేయకుండానే బిల్లులు పొందారు. పెద్దారవీడు మండలంలో దేవరాజుగట్టు చెరువులో పూడిక తీసిన మట్టిని రైతుల పొలాల్లోకి తరలించకుండా అక్కడే కట్టగా పోసి బిల్లు పొందారు. పెద్దదోర్నాల, పెద్దారవీడు, త్రిపురాంతకం మండలాల్లోని చెరువుల్లో కూలీలతో పనులు చేయించాల్సిన చోట యంత్రాలను ఉపయోగించి బిల్లుల రూపంలో ప్రభుత్వ సొమ్ము దిగమింగారు.భూములు కాజేసిన పచ్చ గద్దలు!వైపాలెంలోని టోల్‌ప్లాజా పరిసరాల్లోని అగ్రహారం భూములపై కన్నేసిన టీడీపీ నాయకులు రికార్డుల్లో పూర్వీకుల పేర్లు ఎక్కించుకుని రైతులను నిలువునా ముంచారు. అప్పటి పుల్లలచెరువు టీడీపీ మండల అధ్యక్షుడు కబ్జా చేసిన భూమి విల్లు ఇప్పుడు రూ.2 కోట్లకు పైమాటే. కొందరు అక్రమార్కులు కబ్జా చేసిన భూములను సత్య ఫిష్ కంపెనీకి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈ భూములకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయి.పుల్లలచెరువు మండలంలో టీడీపీ నేతలు తమ ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను ఆన్లైన్ చేయించుకున్నారు. బోగస్ పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి లక్షలాది రూపాయలు రుణాలుగా పొందారు. పుల్లలచెరువులో సర్వే నెంబర్ 887–2 లో 0.86 సెంట్ల ప్రభుత్వ భూమిని టీడీపీ మండల నాయకుడు తన పేరుపై ఆన్లైన్ చేయించుకున్నాడు. మర్రివేముల సర్వే నెంబర్ 80లో 136 ఎకరాల అటవీ భూమిని 8 సబ్డివిజన్లు చేసి దాదాపు 30 ఎకరాలు కబ్జా చేశారు. ఐటీవరంలో సర్వే నంబర్ 991లో కొండపోరం బోకు భూమి 60 ఎకరాలను నలుగురు టీడీపీ నేతలు కబ్జా చేసి పాస్ పుస్తకాలు పొందారు. శతకోడు సర్వే నంబర్ 439లో భూమినీ కబ్జా చేశారు.త్రిపురాంతకం మండలం నర్శింగాపురం పరిధిలో రైతులకు చెందిన 118 ఎకరాల భూములను అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో పాలుట్ల రమణమ్మ పేరుపై ఆన్లైన్ చేసి ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పెద్దమీరం గ్రామానికి చెందిన మీగడ వీర సత్య పేరుపై ఆన్లైన్ చేశారు.టీడీపీ నేతల భూదాహానికి అప్పటి పెద్దారవీడు, పెద్దదోర్నాల తహసీల్దార్లు సహా ఐదుగురు వీఆర్వోలు సస్పెండయ్యారు.ఇవి చదవండి: డీబీటీ లబ్దిదారులతో టీడీపీ ముఠా చెలగాటం -
నాకు టికెట్ ఇవ్వకపోయినా, నా కోడలుకు అవకాశం కల్పించాలంటున్న డేవిడ్ రాజు?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కేడర్‌లో పసలేకపోయినా సీటు విషయమై నాలుగు వర్గాలుగా నాయకులు విడిపోయారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత కుమ్ములాటలు పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనతో ఒక్కసారిగా బయటపడ్డాయి. పార్టీ అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు.శుక్రవారం యర్రగొండపాలెంలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వస్తుండటంతో ఆయన వద్దే అమీతుమీ తేల్చుకునేందుకు నేతలు సిద్ధమయ్యారు. మన్నె రవీంద్ర x ఎరిక్షన్‌బాబు యర్రగొండపాలెం నియోజకవర్గంలో నాలుగు వర్గాలుగా చీలిన టీడీపీ నేతలు ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు అంటీ ముట్టనట్లు ఉన్న టీడీపీలోని సీనియర్ నాయకుడు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నే రవీంద్ర, టీడీపీ నియోజకర్గ ఇన్చార్జి ఎరిక్షన్ బాబు మధ్య వర్గపోరు పెల్లుబికింది. దీంతో టీడీపీకి చెందిన జిల్లా నాయకులు వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు గత రెండు, మూడు రోజులుగా విశ్వ ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. తొలివిడతలో కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామితోపాటు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులు యర్రగొండపాలెం వెళ్లి మరీ ఇరువురితో మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. అయినా వినకపోయే సరికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వెళ్లి ఇరువురితో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయినా వారిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు కాస్తా ఫ్లెక్సీల వివాదం వరకు వెళ్లినట్లు సమాచారం. బూదాల అజిత x డేవిడ్‌రాజు 2019 సాధారణ ఎన్నికల్లో యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఘోర పరాజయం చవిచూసిన బూదాల అజితారావు నాటి నుంచి నేటి వరకు పార్టీ ఊసే లేకుండా, కేడర్‌కు కూడా కనపడకుండా దూరంగా ఉన్నారు. గత నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన బూదాల అజితారావు 2019 ఎన్నికల వేళ ప్రత్యక్షమయ్యారు. పార్టీ ఆమెను పక్కన పెట్టినప్పటికీ తనకంటూ ఒక వర్గం ఉందంటూ యర్రగొండపాలెం వస్తున్న అధినేత చంద్రబాబు వద్ద బలప్రదర్శన చేసేందుకు సిద్ధమయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున బరిలోకి దిగి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిష్మాతో నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పాలపర్తి డేవిడ్‌రాజు.. చంద్రబాబు విసిరిన డబ్బుకు కక్కుర్తిపడి పచ్చ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో టికెట్ తనదేనని భావించిన డేవిడ్‌రాజుకు చంద్రబాబు మొండిచేయి చూపారు. తాజాగా డేవిడ్ రాజు కూడా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఈసారైనా తనకు టిక్కెట్ ఇవ్వండని ప్రాధేయపడేందుకు సిద్ధమయ్యారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా తన కోడలుకు పోటీచేసే అవకాశం కల్పించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చుట్టూ తిరుగుతున్నట్లు పార్టీ కేడర్‌లో గుసగుసలు వినపడుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి 2014లో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగే సమయంలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని బీసీలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నూకసాని బాలాజీని యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లలచెరువు మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీచేయించారు. వాస్తవంగా ఈ మండలం ఓసీలకు కేటాయించినప్పటికీ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన బాలాజీని మండల ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అప్పటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన జెడ్పీ వైస్ చైర్మన్‌గా కొన్నాళ్లు పనిచేశారు. అప్పటి అధికార టీడీపీలో పెత్తనం చెలాయించే ఉద్దేశంతో పచ్చ కండువా కప్పుకున్న బాలాజీ ప్రస్తుతం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గం తన గుప్పెట్లో ఉన్నట్లు భావిస్తూ కనిగిరి ప్రాంతానికి చెందిన ఎరిక్షన్‌బాబును నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగేలా సహకరించారు. ఇదిలా ఉండగా రాజకీయాలపై అంతగా అవగాహన లేని యువ వైద్యుడు డాక్టర్ అనిల్‌కుమార్ స్థానికత నినాదంతో తనకూ ఒక వర్గం ఉందంటూ చెప్పుకుంటున్నారు. -
అడ్డు తొలగించుకోవాలనే హత్య
‘ఎన్నికల్లో గెలవడానికి ఆదినారాయణరెడ్డికి మా నాన్న అడ్డంకిగా కనిపించారు. అడ్డు తొలగిస్తే తప్ప గెలవలేమని ఆదినారాయణరెడ్డి భావించారు. ఈ విషయాన్ని సిట్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా.. ఇప్పటివరకూ ఆదినారాయణరెడ్డిని మాత్రం విచారణ చేయలేదు. మా కుటుంబ సభ్యులను మాత్రం పదేపదే విచారిస్తున్నారు. మా నాన్న వైఎస్ వివేకా హత్యతో పరమేశ్వరరెడ్డి పాత్ర ఉంది. నాన్న చనిపోయి ఇన్నిరోజులైనా.. వాస్తవాలను ఎందుకు బయటపెట్టడం లేదు. మా బంధువులను అదుపులోకి తీసుకుని పది రోజులైంది. మాకున్న అనుమానాలపై అధికారులకు వివరాలు ఇచ్చినా.. ఆ దిశగా విచారణ చేయడం లేదు. పోయింది మా మనిషే. పైగా మా మీదే నింద పడింది. నాన్న చనిపోయాడని నేను, చిన్నాన్న చనిపోయాడని జగన్ అన్న బాధలో ఉంటే సానుభూతి వదిలేసి నిందలు వేయడం న్యాయమా?. నిజంగా నాన్న హత్యకేసులో మా కుటుంబంలోని వ్యక్తికే సంబంధం ఉంటే.. చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు బయట పెట్టకుండా ఆగేవారా?’ –హైదరాబాద్‌లో మీడియాతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి చంద్రబాబు చేతిలో నిలువునా మోసపోయా మాయమాటలు నమ్మి.. టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో నిలువునా మోసపోయా. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని.. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని నమ్మించి నన్ను టీడీపీలో చేర్చుకున్నారు. చివరకు మోసగించారు. అన్నదమ్ముల్లా ఉండే మాల–మాదిగల మధ్య చిచ్చుపెట్టిన చరిత్ర చంద్రబాబుది. ఈ రాష్ట్రంలో మాదిగలు సభలు జరుపుకోకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. ఎంఆర్పీఎస్ సభకు అనుమతివ్వాలని స్వయంగా నేనే వెళ్లి చంద్రబాబును అడిగా. ఇచ్చే ప్రసక్తే లేదని నాపై సీరియస్ అయ్యారు. నా దగ్గర డబ్బులేదనే టీడీపీ టికెట్ ఇవ్వలేదు. సామాన్యులకు టికెట్ ఇచ్చే గొప్ప వ్యక్తి వైఎస్ జగన్. అందుకు నిదర్శనం బాపట్ల పార్లమెంట్ సీటు పేదవాడైన నందిగం సురేశ్‌కు టికెట్ ఇవ్వడమే. ఎమ్మెల్యేను చేసిన పార్టీని కాదని టీడీపీలో చేరి పెద్ద తప్పు చేశా.’ –ఒంగోలులో మీడియాతో యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు -
‘చంద్రబాబు చేతిలో నిలువునా మోసపోయా’
సాక్షి, ఒంగోలు : మాయ మాటలు నమ్మి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేతిలో నిలువునా మోసపోయానని యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు ఫైర్ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని.. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని నమ్మించి మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం డేవిడ్ రాజు.. మీడియాతో మాట్లాడుతూ.. అన్నదమ్ముల్లా ఉండే మాల-మాదిగల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో మాదిగలు సభలు జరుపుకోకుండా చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎంఆర్పీఎస్ సభ అనుమతివ్వమని స్వయంగా తానే చంద్రబాబును కోరానని, ఇచ్చే ప్రసక్తేలేదని తనపై సీరియస్ అయ్యారని తెలిపారు. అనంతరం ఐబీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుని కలిసి మాదిగల సభకు అనుమతి అడిగానన్నారు. ఆయన రాజకీయనాయకుడిలా వ్యవహరిస్తూ.. టీడీపీ నాయకుడిలా ఏమి చేప్తే అదే చేశారన్నారు. తన దగ్గర డబ్బులేదనే టీడీపీ టికెట్ ఇవ్వలేదని, సామాన్యులకు టికెట్ ఇచ్చే గొప్ప వ్యక్తి వైఎస్ జగనని కొనియాడారు. అందుకు నిదర్శనం బాపట్ల పార్లమెంట్‌కు పేదవాడైన నందిగం సురేశ్‌కు టికెట్ ఇవ్వడమేనన్నారు. నందిగం సురేశ్‌కు మద్దతు తెలుపుతూ.. బాపట్ల లోక్‌సభకు తాను స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. నందిగం సురేశ్ విజయానికి, వైఎస్ జగన్‌ను సీఎం చేయడానికి కార్యకర్తలా కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యేను చేసిన పార్టీ కాదని టీడీపీలో చేరి పెద్ద తప్పుచేశానని పశ్చాతాపం వ్యక్తం చేస్తూ డేవిడ్ రాజు మంగళవారం తిరిగి వైఎస్సార్ సీపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ మారి చేసిన తప్పుకు క్షమించాలని డేవిడ్ రాజ్ ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలను కోరారు. చదవండి : తప్పు చేశా.. క్షమించండి ! -
తప్పు చేశా.. క్షమించండి !
సాక్షి, ఒంగోలు సిటీ: ‘‘ నాకు మంచి అవకాశం ఇచ్చిన వైఎస్సార్ సీపీని కాదని తెలుగుదేశంలోకి వెళ్లడం తప్పే.. నన్ను క్షమించండి’’ అని యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు క్షమాపణ కోరారు. వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఒంగోలులోని బాలినేని నివాసంలో డేవిడ్‌రాజు మంగళవారం వైఎస్సార్ సీపీలోకి తిరిగి చేరారు. ఆయన బాపట్ల పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలినేనిని కలిసి మాట్లాడి, తనను క్షమించాలని కోరారు. బాలినేని పార్టీ కండువా కప్పి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డేవిడ్‌రాజు మాట్లాడుతూ తనను తెలుగుదేశం పార్టీ నాయకులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా బాలినేని సహకారంతో గెలిచానని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు పశ్చిమ ప్రాంత అభివృద్ధికి అధికార పార్టీలో ఉంటే మేలు జరుగుతుందని చెప్పారని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన మాటలు నమ్మి ఆ పార్టీలో చేరానని అన్నారు. తీరా చూస్తే అవేమి జరగలేదన్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మకానికి మనిషి కాదని తేలిపోయిందని చెప్పారు. దళితుడినైన తనను నిజాయితీగా మంత్రి శిద్దా రాఘవరావు మాటలు నమ్మి షరతులు లేకుండా తెలుగుదేశంలో చేరానన్నారు. తనను మంత్రి కూడా మోసం చేశారన్నారు. నమ్మిన వారికి న్యాయం చేయలేని నిస్సహాయతలో ఆయన ఉన్నారన్నారు. మాటిస్తే తప్పని నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అని అన్నారు. ఆయన సీఎం అయితే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు.బాలినేని విజయానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తిరిగి రాజకీయ పునర్జన్మను ఇచ్చిన వైఎస్సార్ సీపీలో చేరడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే తనయుడు విజేష్‌రాజ్ కూడా బాలినేని సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
వెలుగుల రేడు డేవిడ్!
అంతా అయస్కాంత శక్తి మహిమ..ఒక్కసారి 5 హెచ్‌పీ మోటారు రూ. 20 వేలతో కొనుక్కుంటే..ఇక రోజువారీగా రూపాయి ఖర్చు లేకుండానే..రోజుకు 24 గంటలూ పంటలకు నీటిని తోడుకోవచ్చు..!కరెంటువెలుగులను పొలాల్లోనూ, ఇళ్లలోనూ నిరంతరాయంగా వెలిగించుకోవచ్చు! అంతెందుకు.. చిన్న తరహా పరిశ్రమదారులు సైతం కరెంటు కొనుక్కోనక్కర్లేదు..!ఈ అద్భుత ఆవిష్కర్త అతి సామాన్య డ్రైవర్..పుస్తకాల చదువు ఐదో తరగతికి మించి లేదు.. అయితేనేం.. కొండంత ప్రజ్ఞాశాలి! కానీ, మోటారులో జనరేటర్‌ను జగమెరుగని రీతిలో జోరుగా తిప్పేయగల ఒడుపును పసిగట్టిన వాడు! అతడే.. డేవిడ్ రాజు!!జన్మను సార్థకం చేసే ఆవిష్కరణ వెనుక రాజీ ఎరుగని దశాబ్దాల కృషి దాగి ఉంది..! ఈ వెలుగుల రేడు మదిలోకి తొంగి చూద్దాం రండి.. సృజనాత్మక తృష్ణకు అకుంఠిత దీక్ష తోడు కావటంతో గొప్ప గ్రామీణ ఆవిష్కరణ వెలుగు చూసింది. రాజీ ఎరుగని ఓ జిజ్ఞాసువు చిరకాల స్వప్నం ఎట్టకేలకు ఫలించింది.పెద్దగా చదువు లేకపోయినా, మెండుగా వనరులు అందుబాటులో లేకపోయినా.. ఆయనలోని సృజనాత్మకత అద్భుత ఆవిష్కరణకు దోహదపడింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ఎందరు ఈసడించినా.. నిరుత్సాహపడలేదు. అవిశ్రాంతంగా నీటిని తోడే అద్భుత అయస్కాంత మోటారును ఆవిష్కరించే వరకు విశ్రమించలేదు. అసాధారణమైన ఆ గ్రామీణ ఆవిష్కర్త పేరు.. దేవరపల్లి డేవిడ్‌రాజు (58)!చిన్నప్పటి నుంచీ మోటారు యంత్రాల పనితీరుపై ఉన్న గాఢమైన ఆసక్తే డేవిడ్‌రాజును ఇవాళ గొప్ప ఆవిష్కర్తగా నిలిపింది. విజయవాడలో ఆర్టీసీ డ్రైవర్‌గా ఇటీవలే రిటైరైన ఆయన తన చిరకాల స్వప్నాన్ని ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు. యంత్రాలపైనే దృష్టంతా.. కృష్ణా జిల్లా ముసునూరు మండలం వేలుపుచర్ల గ్రామంలో పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఆశీర్వాదం, జమాయమ్మ దంపతులకు కలిగిన ఆరో సంతానం ఆయన. పేదరికం వల్ల ఆయన చదువు స్థానిక బోర్డు స్కూల్లో ఐదో తరగతితో ఆగిపోయింది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనప్పటికీ ఆయన దృష్టంతా యంత్రాలపైనే ఉండేది. చెక్క రేడియోలను విప్పి చూడటం, బిగించటం వంటి పనులు చేసేవారు. మట్టితో యంత్రపు ఆకృతులు చేసేవారు. యంత్రాలపై జిజ్ఞాస కొద్దీ మోటారు మెకానిక్ పని నేర్చుకున్నారు. చెయ్యి తిరిగిన మెకానిక్‌లు పని చేస్తుంటే పక్కనే ఉండి తదేక దీక్షతో గమనించటం ద్వారా ఆ పనిలో నైపుణ్యం పొందారు. పరిశీలన ద్వారా గ్రహించిన జ్ఞానంతోనే అన్ని రకాల మోటారు వాహనాలను నడపటం నేర్చుకున్నారు. ఆ క్రమంలోనే ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరి, ఇటీవలి వరకు పనిచేశారు. గాలితో లారీ నడిపిన ఘనత ఆరేళ్ల క్రితం ఓ రోజు డేవిడ్ రాజు బస్సు నడుపుతుండగా మనసులో కొత్త ఆలోచన మెదిలింది. బస్సులో ఇంజిన్‌ను మరో విధంగా ఎందుకు నడపకూడదు? అనిపించింది. బోర్లు వేసేటప్పుడు బండరాళ్లను తొలవడానికి గాలి (కంప్రెషన్)తో రంధ్రాలు వేయటం సాధ్యమవుతున్నప్పుడు.. కంప్రెషన్‌తో బస్సును లేదా లారీని ఎందుకు నడపలేం..? అన్న ఆలోచన కలిగింది. ఆర్టీసీ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తూనే.. తన అన్వేషణ కొనసాగించారు. ఖాళీ సమయాల్లో ఇదే ఆలోచన ఆయన మదిని తొలిచేస్తూ ఉండేది. కాగితాలపై డిజైన్లు గీసి, చింపేసి కొత్తవి గీయటం.. అదే పనిలో గడిపేవారు. తన ఆలోచనను ఆవిష్కరించే క్రమంలో ఇక ఏ పనినీ పట్టించుకునే వారు కాదు. దీంతో.. బంధుమిత్రులు ఆయనకు పిచ్చెక్కిందని చమత్కరించేవారు. అయినా, వెనక్కి తగ్గని డేవిడ్ రాజు మిత్రుల తోడ్పాటుతో 2016 జనవరిలో డీజిలు, పెట్రోలు లేకుండా కేవలం గాలి(కంప్రెషన్)తో లారీని నడిపి చూపించారు. ఈ వాహనాల ద్వారా ఇంధన ఖర్చును, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చన్నది ఆయన అభిప్రాయం. అప్పట్లో పత్రికల్లో, టీవీ చానెళ్లలో కథనాలు వచ్చాయి. అయినా, ఎటువంటి ప్రోత్సాహమూ లభించకపోవటంతో ఆర్థిక శక్తి లేక మిన్నకుండిపోయారు. తిరువూరు డిపోలో పనిచేసేటప్పుడు 2014లోనే గాలి(కంప్రెషన్)తో జీపును నడిపానని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే ప్రోత్సహించకపోగా ఆగ్రహం వ్యక్తం చేశారని డేవిడ్ రాజు వాపోయారు. మాగ్నెట్ మోటారు ఆవిష్కరణ.. నిరంతరాన్వేషణ క్రమంలో శక్తికి మించి సొంత డబ్బు ఖర్చవుతున్నా.. దేశానికి, రైతులకు ఉపయోగపడే ఆవిష్కరణ ఏదైనా చేయాలని డేవిడ్ రాజు తలచారు. భార్య సుగుణ, కుమార్తె బ్లెస్సీ ఆయనకు మద్దతుగా నిలిచారు. గత కొంతకాలంగా తన మిత్రుడు శ్రీను తోడ్పాటుతో గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ కృషి ఫలితంగానే 5 అశ్వ శక్తి(హెచ్.పి.) సామర్థ్యం కలిగిన అయస్కాంత శక్తితో నడిచే మోటారును ఆవిష్కరించి.. ఇటీవల ప్రయోగాత్మకంగా నడిపి చూపించారు. ఇంధన ఖర్చు లేకుండా, పర్యావరణ కాలుష్యం లేకుండా, పంట పొలాల్లో విద్యుత్తు షాక్ మరణాలు లేకుండా.. సాగు నీటి, విద్యుత్తు అవసరాలు తీర్చే ఈ అద్భుత ఆవిష్కరణను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేగలిగితే రైతులోకానికి, మొత్తం సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది. హ్యాట్సాఫ్ టు డేవిడ్ రాజు! గంటకు 3.67 యూనిట్ల విద్యుత్తు ఆదా! ► సాధారణ విద్యుత్తుతో నడిచే 5 హెచ్.పి. మోటారు గంట నడిస్తే 3.67 యూనిట్ల విద్యుత్తు ఖర్చవుతుంది. ► ప్రభుత్వం యూనిట్ రూ. 5 చొప్పున వెచ్చించి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నది. ఈ లెక్కన 5 హెచ్.పి. మోటారు గంట సేపు సాధారణ విద్యుత్తుతో నీటిని తోడితే రూ.18.35 ఖర్చవుతుంది. ► రోజుకు రైతు పది గంటల పాటు మోటారు నడిపిస్తాడనుకుంటే.. రూ. 183 రూపాయల విద్యుత్తు ఆదా అయినట్లే. ► అయస్కాంత విద్యుత్తుతో నడిచే మోటారుకు ఈ ఖర్చేమీ ఉండదు. అంతేకాదు.. రైతుకు అవసరమైన, సమయంలో దీన్ని నడుపుకోవచ్చు. విద్యుత్తు స్తంభాలు, లైన్ల ఖర్చు.. ఇతరత్రా ఖర్చులేవీ ఉండవు. అయితే, అయస్కాంతాలు తదితర యంత్ర పరికరాలు, బుష్‌ల అరుగుదల ఖర్చు మాత్రం ఉంటుంది. ► అయస్కాంత మోటారు వాడటం అంటే.. సాంకేతిక భాషలో చూస్తే.. ‘మాగ్నటిక్ ఎనర్జీ’ని ‘రొటేషనల్ ఎనర్జీ’గా వాడటం అన్నమాట. మాగ్నెట్ మోటారు ప్రత్యేకతలు.. అయస్కాంత మోటారు ఆవిష్కర్త డేవిడ్ రాజు అందించిన వివరాల ప్రకారం.. విద్యుత్తు, డీజిల్, పెట్రోల్, సౌరశక్తి వంటి ఎటువంటి ఇంధనం అవసరం లేకుండా కేవలం అయస్కాంత శక్తితోనే మోటారు నడుస్తున్నది. ప్రారంభంలో కొద్దిసేపు బ్యాటరీ అవసరం ఉంటుంది. తర్వాత గంటల తరబడి పనిచేస్తుంది. శబ్దం పెద్దగా ఉండదు. షాక్ కొట్టదు. కాబట్టి, షాక్ వల్ల ఎవరూ మరణించకుండా చేయొచ్చు. ఈ మోటారు ద్వారా నీటిని ఎన్ని వందల అడుగుల లోతు నుంచైనా తోడవచ్చు. ఈ మోటారును ఎంతకాలం వాడినా మరమ్మతులు రావని, ఆరు నెలలకోసారి స్వల్ప ఖర్చుతో రాగి బుష్లను మార్చుకోవటం తప్ప వేరే నిర్వహణ ఖర్చు ఏమీ ఉండదని చెబుతున్నారు. రూ. 20 వేలతో 5 హెచ్.పి. మోటారు ప్రస్తుతం 5 హెచ్.పి. మాగ్నెట్ మోటారును డేవిడ్ రాజు విజయవంతంగా నడిపిస్తున్నారు. దీని తయారీకి రూ. 20 వేలు ఖర్చయ్యిందన్నారు. ఎక్కడెక్కడి నుంచో విడిభాగాలను సేకరించి తయారు చేయటం వల్ల దీని బరువు 100 కిలోల వరకు ఉంటుందని, సొంతంగా తయారు చేసుకోగలిగితే 50 కిలోల బరువుకు తగ్గించవచ్చని ఆయన అంటున్నారు. పారిశ్రామికవేత్తలు లేదా ప్రభుత్వం ముందుకొస్తే సులభంగా ఎక్కడికైనా ద్విచక్రవాహనంపై తీసుకెళ్లగలిగేలా తయారు చేయాలన్నది తన లక్ష్యమని ఆయన అంటున్నారు. 10, 20 హెచ్.పి. సామర్థ్యం కలిగిన మోటార్లనైనా అయస్కాంతాలతో తయారుచేసి నిరంతరాయంగా వాడుకోవచ్చని డేవిడ్ రాజు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. బల్బులనూ వెలిగించవచ్చు.. మాగ్నెట్ మోటారుతో నీటిని తోడటంతోపాటు దీపాలను కూడా వెలిగించుకోవచ్చని డేవిడ్ రాజు తెలిపారు. నెల రోజుల పాటు తన ఇంటిలో దీపాలను మాగ్నెట్ మోటారుతో విజయవంతంగా వెలిగించానని వెల్లడించారు. రైతులు ఆనందంగా నిద్రపోవచ్చు ఏ ఇంధనమూ అవసరం లేకుండా అయస్కాంతాలతో నడిచే మోటారు నిరంతరాయంగా నడుపుకోవచ్చు. షాక్ కొట్టదు. ప్రాణం తీయదు. రైతుల కష్టాలు తీరిపోతాయి. ఇక ఆనందంగా నిద్రపోవచ్చు.. ఇళ్లలో విద్యుత్ జనరేటర్ మాదిరిగా కూడా ఈ మోటారును ఉపయోగించవచ్చు. మా ఇంట్లో నెల రోజులు వాడాను. గతంలో గాలితో జీపును, లారీని నడిపి చూపించినా ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నో ఏళ్లు తపనపడి, సొంత ఖర్చుతో మహా ప్రయత్నం చేశాను. నా కల ఇప్పటికి ఫలించింది. పారిశ్రామికవేత్తలు లేదా ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్థికంగా తోడ్పాటునందిస్తే.. ఈ మోటార్ల విడిభాగాలన్నీ సొంతంగా తయారు చేసి రైతులకు తక్కువ ధరకే ఇవ్వాలన్నదే నా లక్ష్యం. తగిన ప్రోత్సాహం ఇస్తే ఎన్నో అద్భుతాలు సాధిస్తా.. వందల మందికి ఉపాధి చూపిస్తా..! – దేవరకొండ డేవిడ్ రాజు, గ్రామీణ ఆవిష్కర్త, విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్, విజయవాడ (డేవిడ్ రాజును 82973 65979 నంబరులో లేదా ఆయన మిత్రుడు వేపచెట్టు శ్రీనును 98481 95263 నంబరులో సంప్రదించవచ్చు) కథనం: సాగుబడి డెస్క్ ఇన్పుట్స్: తక్కెళ్లపాటి శివనాగిరెడ్డి, తాడేపల్లి రూరల్, సాక్షి, గుంటూరు జిల్లా -
రివాల్వర్‌తో కాల్చుకొని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కనగల దేవకృప డేవిడ్‌రాజు(56) రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గన్నవరం మండలంలోని దావాజిగూడెంలో నివసిస్తున్న డేవిడ్‌రాజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నాలుగేళ్లుగా రైటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం 8 గంటలకు విధులకు హాజరైన ఆయన కొద్దిసేపటి తర్వాత బైక్‌పై బయటకువెళ్లాడు. కాగా, 10.30 గంటల సమయంలో పురుషోత్తపట్నం–ముస్తాబాద గ్రామాల మధ్య పొలాలకు వెళ్లే రోడ్డులో డేవిడ్‌రాజు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన రైతులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని డేవిడ్‌రాజు మృతదేహం వద్ద ఉన్న రివాల్వర్‌ను గుర్తించారు. పాయింట్‌బ్లాంక్ రేంజ్లో తలకు కుడివైపున కాల్చుకోవడం వల్ల డేవిడ్ రాజు అక్కడికక్కడే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలిని డీసీపీ ప్రవీణ్, ఈస్ట్‌జోన్ ఏసీపీ వి.విజయభాస్కర్ సందర్శించారు. కాగా, జీవితంలో విఫలం కావడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన కుటుంబానికి అండగా నిలవాలని సూసైడ్‌నోట్‌లో డేవిడ్‌రాజు పేర్కొన్నట్లు డీసీపీ తెలిపారు. కాగా, పోలీస్‌స్టేషన్‌లో కేసు ప్రాపర్టీ డబ్బుల అవకతవకలపై డేవిడ్‌రాజును బాధ్యుడ్ని చేయడంతో పాటు ఆ నగదును చెల్లించాలంటూ స్టేషన్ అధికారి చేస్తున్న ఒత్తిడిని తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. -
టీడీపీలో చేరిన డేవిడ్ రాజు
విజయవాడ/యర్రగొండపాలెం: వైఎస్సార్ సీపీకి చెందిన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు ఆదివారం టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరినట్టు డేవిజ్ రాజు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరినట్టు డేవిడ్ రాజు తెలిపారు. యర్రగొండపాలెం అభివృద్ధికి సీఎం చంద్రబాబు హామీయిచ్చారని చెప్పారు. గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో వైఎస్సార్ సీపీలో చేరినట్టు తెలిపారు. అంతకుముందు టీడీపీలో 24 ఏళ్ల పాటు పనిచేశానని గుర్తుచేశారు. రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేయాలని అన్నారు. డేవిడ్ రాజు పార్టీ ఫిరాయించడంపై యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వలాభం కోసమే పార్టీ మారారని ఆరోపించారు. డేవిడ్ రాజు ఫ్లెక్సీలను చించివేసి నిరసన తెలిపారు. -
ప్రిన్సిపాల్ కారణంగానే రిషితేశ్వరి ఆత్మహత్య!
-
'ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయొద్దు'
ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు ప్రకటించేటప్పుడు వాటిలో ఎస్సీ, ఎస్టీ ఖాళీల వివరాలు ప్రకటించడంలేదని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయన్న తమ ప్రశ్నకు సమాధానంగా.. 4,300 పోస్టులు ఉన్నట్లు మంత్రి తన సమాధానంలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. వాస్తవానికి ఎన్నికలు జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల వివరాలు, ఖాళీల వివరాలు సేకరించడానికి, రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగాల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం కమలనాథన్ కమిటీని వేసిందని, రాష్ట్రస్థాయి, సెక్రటేరియట్ స్థాయిలో 20,630 ఖాళీలున్నట్లు ఆ కమిటీ చెప్పిందని ఆయన అన్నారు. కానీ, ఈ ఖాళీల వివరాలు ప్రకటించేటప్పుడు వాటిలో ఎస్సీ, ఎస్టీ పోస్టుల వివరాలను గుర్తించలేదన్నారు. మొత్తం ఖాళీలలో 15 వేలకు పైగా పోస్టులు ఎస్సీ, ఎస్టీలవేనని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని, ఈ విషయంలో నిరుద్యోగులు చాలా ఆందోళనలో ఉన్నారని చెప్పారు. మంత్రి దీనిపై శ్రద్ధపెట్టి, వారి ఖాళీలు వారికే దక్కేలా చూడాలని కోరారు. రికార్డులు పరిశీలించి దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి రావెల కిషోర్‌బాబు దానికి సమాధానమిచ్చారు. -
డెత్ సర్టిఫికెట్‌కు.. రూ. ఐదు వేలు ఇమ్మంటున్నారు..
విజయనగరం కంటోన్మెంట్ : తన భర్త మృతికి సంబంధించి డెత్ సర్టిఫికెట్ మంజూరుకు కార్యదర్శి డేవిడ్ రాజు ఐదు వేల రూపాయల లంచం అడుగుతున్నారని రామభద్రపురం మండలం కొండకెంగువ గ్రామానికి చెందిన పి. నరస అనే మహిళ సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో అధికారులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్లుగా సర్టిఫికెట్ కోసం తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. డెత్ సర్టిఫికెట్ వస్తే పొదుపు సంఘం ద్వారా తనకు బీమా సొమ్ము వస్తుందని, అధికారులు స్పందించి వెంటనే సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరింది. దీనికి అధికారులు స్పందిస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం 219 వినతులను కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ బి.రామారావు, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, తదితరులు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.. బోటు వేయండి తాటిపూడి రిజర్వాయర్ బోటు పాడవ్వడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని కొండపర్తి సర్పంచ్ పి. తిరుపతిరావు, ఉప సర్పంచ్ కొర్లాపు ఉగాది, తదితరులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి కిలోమీటర్ల కొద్దీ నడచి వెళ్లాల్సి వస్తోందన్నారు. బోటు ఉంటే ఉద్యోగులు, సామన్యులు సులువుగా రాకపోకలు చేయవచ్చన్నారు. దీనికి కలెక్టర్ కాంతిలాల్ దండే స్పందిస్తూ పాతబోటును వేలం వేసి వచ్చిన సొమ్ముకు ఐటీడీఏ సొమ్ము కలిపి కొత్తబోటు కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్రమాల నిగ్గు తేల్చండి! బొండపల్లి మండలం రాచకిండాంలోని ప్రాథమిక సహకార పరపతి సంఘంలో దీర్ఘ, స్వల్పకాలిక రుణాల మంజూరులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిని పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డెరైక్టర్లు బి. నారాయణరావు, పీవీఎస్ నాయుడు ఫిర్యాదు చేశారు. బలవంతంగా రాజీనామా చేయించారు ఎంపీటీసీగా పోటీ చేయాలంటే ఉద్యోగానికి తప్పకరాజీనామా చేయాలని తనతో కొంతమంది బలవంతంగా రాజీనామా చేయించారని ఎల్.కోట మండలం వీరభద్రపేట గ్రామ సాక్షరభారత్ కోఆర్డినేటర్ తూర్పాటి చిన్నమ్మలు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి వెంటనే పోటీ నుంచి తప్పుకున్నా, తనతో రాజీనామా చేయించారని వాపోయింది. తెలియక చేసిన తప్పును మన్నించి తన ఉద్యోగం తనకు ఇప్పించాలని వినతిప్రతం అందజేసింది. -
‘వెలిగొండ’పై వైఎస్సార్సీపీ గళం
ఒంగోలు అర్బన్ : జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశాల్లో వైఎస్సార్ సీపీ శాసన సభ్యులు తమ వాణి వినిపించారు. సమావేశాలు గురువారం మొదలై జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ను అభినందిస్తూ మాట్లాడే అవకాశం జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలకు లభించింది. వారిలో వైఎస్సార్సీపీ నుంచి యర్రగొండపాలెం, మార్కాపురం ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి ఉన్నారు. తొలుత స్పీకర్‌గా ఎంపికైన డాక్టర్ కోడెల శివప్రసాద్‌రావును అభినందించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. పశ్చిమ ప్రాంతం ప్రజల కష్టాలు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితేనే తీరుతాయని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందని గుర్తుచేశారు. సభాపతి గతంలో భారీ నీటిపారుదల శాఖామాత్యులుగా పనిచేశారని వారికి వెలిగొండ ఆవశ్యకత తెలుసని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పీకర్ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తాగు, సాగునీటి సమస్య తీరి పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. -
టీడీపీ వర్గీయుల దాడికి గురైన కార్యకర్తకు వైవీ పరామర్శ
ఒంగోలు అర్బన్: ఇటీవల పీసీపల్లి మండలం పెద అలవలపాడులో తెలుగుదేశం పార్టీ వారు చేసిన దాడుల్లో గాయపడిన వైఎస్సార్ సీపీ కార్యకర్తను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం పరామర్శించి ధైర్యం చెప్పారు. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతమ్మ అనే కార్యకర్తను కలసి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రజాసంక్షేమంపై దృష్టి పెట్టాలే కానీ ఇలాంటి దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు తమ కార్యకర్తలను ఈ విధంగా రెచ్చగొట్టడం మంచిది కాదని హితవు పలికారు. ఎంపీతో పాటు సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ముక్కు కాశిరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ప్రసాద్, తాళ్లూరు జెడ్పీటీసీ సభ్యులు తదితరులున్నారు. -
రుణమాఫీపై బాబుకు చిత్తశుద్ధి లేదు
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు జంకె, డేవిడ్‌రాజు, ముత్తుముల ధ్వజం మార్కాపురం టౌన్ : రైతుల రుణమాఫీపై సీఎం చంద్ర బాబుకు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ సీపీ మార్కాపురం, వై.పాలెం, గిద్దలూరు ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, ముత్తుముల అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాదయాత్రలో రైతుల కష్టాలు కళ్లారా చూశానని, రుణమాఫీతో వారి కష్టాలు తీరుస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై కమిటీలంటూ కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇవ్వకుండానే రైతుల రుణాలు మాఫీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారం చేజిక్కించుకునేందుకు బాబు సాధ్యం కాని హామీలిచ్చారని, దీన్ని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందే పసిగట్టారని చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిమితులతో కూడిన రుణ మాఫీ చేస్తానని చెబుతుండగా అక్కడి టీడీపీ శాసనసభ్యులు మాత్రం రైతులపై ఉన్న రుణాలన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేయడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందన్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో రైతుల రుణమాఫీపై పట్టుబడతామని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షనేత, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు అధిక నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తామన్నారు. దాడులు చేస్తే సహించేది లేదు పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నాయకులు ఇప్పుడు అధికారంలోకి రావడంతో గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని, దీన్ని సహించేది లేదని ఎమ్మెల్యేలు హెచ్చరించారు. పోలీసులు, అధికారులు న్యాయం పక్షాన నిలవాలని కోరారు. తొలుత ఆర్డీఓ కొండయ్య, డీఎస్పీ రామాంజనేయులును కలిసి పశ్చిమ ప్రాంతంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఎమ్మెల్యేలు డేవిడ్‌రాజు, ముత్తుముల, జంకె విజ్ఞప్తి చేశారు. విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, పార్టీ పట్టణ కన్వీనర్ బట్టగిరి తిరుపతిరెడ్డి, దోర్నాల జెడ్పీటీసీ అమిరెడ్డి రామిరెడ్డి, పుల్లలచెరువు మండల పార్టీ కన్వీనర్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ జయప్రకాశ్, చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, గాలి రమణారెడ్డి, గొట్టం వెంకటరెడ్డి, వజ్రాల కోటిరెడ్డి, దప్పిలి విజయభాస్కరరెడ్డి, బి.రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే.. జిల్లాలో ఫ్యాను గుర్తుపై గెలుపొందిన 31 మంది జెడ్పీటీసీలు వైఎస్సార్ సీపీలోనే ఉన్నారని, ఎవరూ టీడీపీలోకి వెళ్లలేదని మార్కాపురం, త్రిపురాంతకం జెడ్పీటీసీలు జవ్వాజి రంగారెడ్డి, చంద్రమౌళిరెడ్డి తెలిపారు. జిల్లా జెడ్పీ పీఠం తమదేనని చెప్పారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలంతా తమ పార్టీలోకి వస్తున్నారని టీడీపీ నాయకులు దుష్ర్పచారం చేయడంపై మండిపడ్డారు. -
బాబు సంతకాల్లో స్పష్టత లేదు : డేవిడ్‌రాజు
యర్రగొండపాలెం : రైతులను మోసం చేసే ప్రభుత్వం మనుగడ సాగించలేదని ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు చెప్పారు. మంగళవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు రుణాల రద్దుపై తొలి సంతకం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం తన మనుగడ కోల్పోక తప్పదన్నారు. దాదాపు రూ.50కోట్లతో ఆర్భాటంగా ప్రమాణ స్వీకారం చే సిన సీఎం చంద్రబాబు రుణమాఫీపై ఒక కమిటీని వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై రైతులు గందరగోళంలో ఉన్నారన్నారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో తమ పార్టీ రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారని, అధికార మదంతో చేసే చర్యలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు ఎం మంత్రూనాయక్, పుల్లలచెరువు మండల పార్టీ కన్వీనర్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు వేగినాటి శ్రీనివాస్, నాయకులు షేక్ కరీముల్లా, నర్రెడ్డి వెంకటరెడ్డి, షేక్ జానీబాషా పాల్గొన్నారు.