dcet
-
డీసెట్... అప్సెట్..!
కోర్సుపై విద్యార్థులకు తగ్గుతున్న ఆసక్తి - మూడు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ - ఇప్పటివరకు వచ్చినవి 18,550 దరఖాస్తులే - 2015లో నిర్వహించిన పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు 1.11 లక్షల మంది.. సాక్షి, హైదరాబాద్: డీఈడీ కోర్సుపై విద్యార్థుల ఆసక్తి తగ్గుతోంది. ఉపాధ్యాయ నియామకాల ప్రక్రి యలో జాప్యం జరుగుతుండడం.. దానికితోడు డీసెట్ నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండటం తదితర కారణాల వల్ల క్రమంగా ఈ కోర్సుకు ఆదరణ తగ్గుతోంది. గతేడాది డీసెట్ నిర్వహించకపోగా.. తాజాగా సెట్ నిర్వహణకు సర్కారు ఉపక్రమించింది. మరో మూడు రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుండగా ఇప్పటివరకు కేవలం 18,550 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. 2015 సంవత్సరంలో నిర్వహించిన డీసెట్ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,11,413 మంది దరఖాస్తు చేశారు. ప్రస్తుతం దరఖాస్తు చేసినవారు అందులో 20 శాతం మంది కూడా లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో 197 డీఈడీ కాలేజీలు ఉండగా.. అందులో 9,440 సీట్లు ఉన్నాయి. ఆ లెక్కన సీటుకు ఇద్దరు చొప్పున తాజాగా దరఖాస్తు చేసుకున్నారు. ఐదేళ్లుగా నియామకాల్లేవ్..! ప్రాథమిక విద్యా బోధనలో కీలకమైన ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) ఉద్యోగాలకు డీఈడీ చేసిన అభ్యర్థులే అర్హులని తేల్చడంతో తొలుత ఇబ్బడిముబ్బడిగా డీఈడీ కోర్సు చేశారు. టెట్ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించారు. కాని ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదు. దానికి తోడు పాఠశాలల హేతుబద్ధీకరణపై విస్తృత ప్రచారం జరుగుతుండ టంతో క్రమంగా ఈ కోర్సుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలే జరగలేదు. ఫలితంగా డీఈడీ చేసే అభ్యర్థుల సంఖ్య ఏడాదికేడాది తగ్గిపోతూ వస్తోంది. మరో మూడు రోజుల్లో దరఖాస్తు ముగియనుంది. అయినప్పటికీ వీటి సంఖ్య అధిక స్థాయిలో మాత్రం పెరిగే అవకాశం లేదని అధికార వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. -
నేటి నుంచి డీసెట్–2016 సర్టిఫికెట్ల పరిశీలన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : డీసెట్–2016(డైట్‌సెట్)లో భాగంగా ఆదివారం నుంచి పదో తేదీ వరకు బి.తాండ్రపాడులోని ప్రభుత్వ డైట్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం జరుగుతుందని డైట్ ప్రిన్సిపాల్ రాఘవరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు తమ వెంటనే ఆన్లైన్ అప్లికేషన్, హాల్ టిక్కెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి మార్కుల లిస్టు, ఇంటర్ మార్కుల లిస్టు, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు(ఒకటి నుంచి 10వ తరగతి), కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేదా రేషన్ కార్డులతో పాటు పీహెచ్, స్పోర్ట్స్, క్యాప్, ఎన్సీసీ(బీ ఆర్ సీ) తదితర సర్టిఫికెట్లను తీసుకొని 45్ఠ30 సైజు పాలిథిన్ కవర్లో పెట్టుకొని రావాలని సూచించారు. అంతేకాక జిల్లాలోని అన్ని ప్రై వేట్ డీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు కూడా హాజరు కావాలని కోరారు. -
నేటి నుంచి డీసెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
బుక్కపట్నం: డీసెట్ (2016) అభ్యర్థులకు ఈ నెల 7 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు డైట్ ప్రిన్సిపాల్ జనార్దన్‌రెడ్డి ఓప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్నిరెండు రోజులు పొడిగించారన్నారు. అభ్యర్థులు పీడీఎఫ్ ఆన్లైన్ దరఖాస్తు, హాల్టి కెట్, ర్యాంకు కార్డు, 10, ఇంటర్ ఇతర విద్యార్హతలు, టీసీ, స్టడీ, కు లం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. ప్రిన్సిపాళ్లు హాజరు కావాలి:జిల్లాలోని అన్ని కొత్త, పాత డీఎడ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు సర్టిఫికెట్ల పరిశీలనకు ఆదివారం బుక్కపట్నం డైట్లో హాజరు కావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. -
డీసెట్ ఏర్పాట్లు పూర్తి
గుంటూరు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) కోర్సులో ప్రవేశాల కోసం ఈనెల 17, 18, 19 తేదీల్లో జరగనున్న డీసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ పి.పార్వతి తెలిపారు. గుంటూరులోని ఏపీవోఎస్ఎస్ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తొలిసారిగా ఆన్లైన్ విధానంలో డీసెట్‌ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లుచేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసిన 84వేల మంది అభ్యర్థులకు 57 పరీక్ష ఈ-కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకూ 50 శాతం మంది అభ్యర్థులే హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని, మిగిలినవారు 17వ తేదీ లోపు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష సమయానికి గంట ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, నిర్దేశిత సమయం దాటిన తరువాత ఆలస్యం వచ్చే వారిని అనుమతించబోమని స్పష్టంచేశారు. సాంకేతికపరమైన సమస్యలను నివారించేందుకు ప్రతి పరీక్ష కేంద్రంలో ఇద్దరు సాంకేతిక సహాయక సిబ్బందిని నియమించామని వివరించారు.