గుంటూరు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) కోర్సులో ప్రవేశాల కోసం ఈనెల 17, 18, 19 తేదీల్లో జరగనున్న డీసెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ పి.పార్వతి తెలిపారు. గుంటూరులోని ఏపీవోఎస్‌ఎస్ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో డీసెట్‌ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లుచేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసిన 84వేల మంది అభ్యర్థులకు 57 పరీక్ష ఈ-కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ఇప్పటి వరకూ 50 శాతం మంది అభ్యర్థులే హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని, మిగిలినవారు 17వ తేదీ లోపు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష సమయానికి గంట ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, నిర్దేశిత సమయం దాటిన తరువాత ఆలస్యం వచ్చే వారిని అనుమతించబోమని స్పష్టంచేశారు. సాంకేతికపరమైన సమస్యలను నివారించేందుకు ప్రతి పరీక్ష కేంద్రంలో ఇద్దరు సాంకేతిక సహాయక సిబ్బందిని నియమించామని వివరించారు.
డీసెట్ ఏర్పాట్లు పూర్తి
Published Sun, May 15 2016 7:53 PM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM
Advertisement