death of student
-
విద్యార్థిని మృతిపై అనుమానాలు నివృత్తి చేయండి
తాడికొండ: రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న వీఐటీ–ఏపీ యూనివర్సిటీలో విద్యార్థిని సాయిశ్రేయ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలను నివృత్తి చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సాయి శ్రేయ తల్లి మంజుల, కుటుంబ సభ్యులతో కలిసి యూనివర్సిటీ గేటు ఎదుట ఆందోళన చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి లోపలికి వెళ్లేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సాయిశ్రేయ మృతికి కారణాలు తెలియజేయాలని రెండు రోజులుగా కోరుతున్నా వీసీని కలిసేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదని మంజుల ఆవేదన వ్యక్తంచేశారు. వీసీ వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి గేటు ఎదుట బైఠాయించారు. విట్ వద్ద గొడవ గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ వచ్చి మంజులను లోపలికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ అడ్డుకున్నారు.దీంతో యూనివర్సిటీ యాజమాన్యంతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి సాయి శ్రేయ తల్లి మంజుల, కుటుంబ సభ్యులను లోపలికి తీసుకువెళ్లి వీసీ, ఇతర అధికారులను కలిశారు. ఈ నెల 17న తన కుమార్తె చనిపోయిందని, దానికి కారణాలు చెప్పాలని కోరుతున్నా పట్టించుకోకుండా యాజమాన్యం తమను ఇబ్బంది పెట్టిన తీరును వివరిస్తూ మంజుల కన్నీటిపర్యమంతమయ్యారు. ‘విద్యార్థిని చనిపోతే మాకేం సంబంధం లేదని వదిలేస్తారా...? ఆ కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడి న్యాయం చేయాలి. లేకపోతే నేను సహించను..’ అని విట్ వీసీ, సిబ్బందిని ఎమ్మెల్యే హెచ్చరించారు. -
పుట్టినరోజే మృత్యువాత
హైదరాబాద్: ఇంటర్న్‌షిప్ కోసం హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి ఉక్రెయిన్ వెళ్లాడు.. అది పూర్తి చేసుకుని తిరిగి రావడానికి టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు.. మరికొద్ది గంటల్లో విమానం ఎక్కి ఇంటికి రానున్న తరుణంలో విధి వక్రీకరించింది. పుట్టినరోజునాడే ప్రమాదవశాత్తు నదిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ నాంపల్లిలోని భాగ్యనగర్‌కాలనీకి చెందిన రాజేందర్‌సింగ్ భాటియా, జస్ప్రీత్ కౌర్‌ల కుమారుడు జస్‌ప్రీత్‌సింగ్ భాటియా (21) ముంబైలోని అమిటీ కళాశాలలో బీబీఏ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల 40 రోజుల ఇంటర్న్‌షిప్ కోసం ఉక్రెయిన్ వెళ్లాడు. శనివారం అది పూర్తి కావడంతో హైదరాబాద్ వచ్చేందుకు టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. కొద్ది గంటల్లో నగరానికి బయలుదేరాల్సి ఉండగా.. పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి ఉక్రెయిన్‌లోని ఫియో ఫానియా పార్క్ నది వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందాడు. ఈ విషయాన్ని అతడి స్నేహితులు జస్ప్రీత్ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు విషాదంలో మునిగిపోయారు. కాగా, జస్ప్రీత్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్యలు చేపట్టారని తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ ఖమ్రుద్దీన్, వైస్ చైర్మన్ శంకర్‌లూక్ తెలిపారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధికారులతో ఆయన మాట్లాడారని వెల్లడించారు. జస్ప్రీత్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచి్చనట్టు చెప్పారు. -
ప్రైవేటు వాహనం బోల్తా - విద్యార్థిని మృతి
ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ శివారులో టాటా మ్యాజిక్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆర్. శిరీష(12) అనే 7వ తరగతి విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందింది. వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదసమయంలో వాహనంలో ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. మూల రాంపూర్ గ్రామం నుంచి ఇబ్రహీంపట్నం వస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలిసింది.