Debt collections
-
అప్పు ప్రమాదఘంటికలివే..
డబ్బు.. మనిషిని ఆర్థికంగా ఎదిగేలా చేస్తుంది.. పతాలానికి తోసేస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అప్పుల మూటలు కూడగట్టుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీతం వస్తున్న వారు నిత్యం ఏదో రూపంలో అప్పులు తీసుకుంటారు. అప్పుల్లో కొన్ని మంచివి, మరికొన్ని చెడ్డవి ఉంటాయి. అప్పుచేసి ఆ సొమ్మును మరింత పెంచేలా ఎక్కడైనా పెట్టుబడిపెడితే అది మంచి అప్పు. అదే అప్పు విలాసాలకు వాడితే దాన్ని చెడు అప్పు అంటారు. తీసుకునే అప్పుపై సరైన అవగాహన లేకపోతే తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. చాలా మందికి వారు తీసుకున్న అప్పుతో మరింతో లోతుల్లోకి వెళుతున్నామని తెలియకపోవచ్చు. కానీ కొన్ని సంకేతాలను గుర్తించడం ద్వారా ఈ ప్రమాదాన్ని కొంత తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా వస్తువలు కొనాలంటే సరిపడా డబ్బు లేకుండా ఈజీ ఈఎంఐల బాట పడుతుంటారు. వ్యక్తిగత ఈఎంఐలు సులువే అనిపించినప్పటికీ, వీటివల్ల ఇతర ఖర్చులకు డబ్బు సరిపోదు. కిస్తీల విలువ నెలవారీ ఆదాయంలో 50శాతం కంటే తక్కువగా ఉండాలి. అనేక బ్యాంకులు వ్యక్తులు ఈ 50శాతం పరిమితి మించకుండా నిరోధించడానికి పరిమితులను కూడా విధించాయి. అయితే చాలా మంది ఈజీ ఈఎంఐలు, తగ్గింపులు, సేల్స్ ఆఫర్స్ ఆకర్షణకు లోనవుతారు. అనవసర ఖర్చులో మునిగిపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. కనీస అవసరాలను తీర్చుకోవడానికి తరచు అప్పు తీసుకుంటే మాత్రం ఆర్థిక పరిస్థితి గురించి మరోసారి ఆలోచించుకోవాలి. అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు వంటి సాధారణ ఖర్చులను కవర్ చేయడానికి అప్పులు తీసుకోవడం వల్ల రుణఊబిలోకి కూరుకుపోయే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో దాదాపు అన్ని బ్యాంకులతోపాటు ఆన్లైన్ పేమెంట్ యాప్‌లు సైతం క్రెడిట్ కార్డ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే చాలా మంది తమకున్న అప్పులు తీర్చడానికి క్రెడిట్‌కార్డులను తీసుకుంటుంటారు. కానీ అప్పులు తీర్చడానికి తిరిగి క్రెడిట్ కార్డ్ రూపంతో అధిక వడ్డీలకు అప్పుచేయడం దారుణం. దాంతో ఆ క్రెడిట్ కార్డ్ బకాయిలను సైతం తీర్చలేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. పరిస్థితి శ్రుతిమించితే తీసుకున్న అప్పులను రోల్ఓవర్ చేయాడానికి సైతం వెనుకాడరు. కానీ అలా చేస్తే భవిష్యత్తులో తిరిగి అప్పు పుట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం అని గ్రహించాలి. ఇదీ చదవండి: ఆగిపోతున్న సరకు రవాణా..! అప్పు తీసుకోడదా..? అంటే తీసుకోవాలి. కానీ అది మన ఆర్థిక పరిధిలో ఉండాలి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ప్రస్తుత జీతం ఆధారంగా అప్పు తీసుకోవడం మంచిదే కానీ, ఈఎంఐలను లెక్కించేటప్పుడు అన్ని కనీస అవసరాలుపోను జీతం సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. అంతకుమించి దాదాపు ఆరు నెలలకు సరిపడే అత్యవసర నిధిను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
పాస్‌పోర్ట్ నిబంధనల్ని మార్చండి
చెన్నై: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకున్న వారు దేశం విడిచి పారిపోకుండా పాస్‌పోర్టు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తనను విధుల నుంచి తొలగించడం అన్యాయమంటూ మంగళం అనే అంగన్వాడీ కార్యకర్త వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు పైవిధంగా స్పందించింది. ‘రుణ ఎగవేత దారులు చట్టం నుంచి తప్పించుకునేందుకు సుదూర దేశాలకు పారిపోతున్నారు. వారు తమ పాస్‌పోర్టులను రుణం పొందిన బ్యాంకు లేదా సంస్థ వద్ద సరెండర్ చేసేలా నిబంధనలు మార్చాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. రుణం పూర్తిగా చెల్లించేవరకు రుణదాత వద్దే పాస్‌పోర్టు ఉండాలి. ఉంచకపోతే పాస్‌పోర్టు తాత్కాలికంగా రద్దుచేయాలని, పాస్‌పోర్టు రెన్యూవల్‌కు కోర్టు అనుమతి ఉండాలని తెలిపింది. మంగళం అనే అంగన్వాడీ కార్యకర్త..అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తన బంధువు పాస్పోర్టుతో సింగపూర్ వెళ్లడంతో ప్రభుత్వం ఆమెను విధుల నుంచి తొలగించడంపై కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు ఆమెను మందలిస్తూ వారం రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మంగళంతోపాటు ఆమె బంధువుకు రేషన్‌కార్డు తదితర ప్రభుత్వ సౌకర్యాలను ఉపసంహరించాలంది. -
‘రాజధాని’కోసం నిధులు సమీకరించండి
నాలుగేళ్లలో రూ.32,500 కోట్ల ప్రాజెక్టులు చేపట్టాలి: సీఎం సాక్షి, అమరావతి: రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను రుణాల రూపంలో వేగవంతంగా సమీకరించాలని అధికారులను సీఎం చంద్రబాబు కోరారు. ఇందుకోసం తక్కువ వడ్డీకి రుణాలిచ్చే అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. వచ్చే నాలుగేళ్లలో రూ.32,500 కోట్లతో మౌలిక వసతులు కల్పించాల్సిన ఉన్న నేపథ్యంలో రుణాల సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన రాజధాని వ్యవహారాలపై సీఆర్డీఏ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజధానిలో పదేళ్లలో సుమారు రూ.43 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించామని, ఇందులో అధిక భాగం వచ్చే నాలుగేళ్లలో వినియోగించాల్సివుందని చెప్పారు. 2018 నాటికి ఐదు విభాగాల్లో 21 ప్రాజెక్టులు ప్రారంభమయ్యేలా దృష్టి పెట్టామని వివరించారు. ‘టాప్‌టెన్’ విద్యాసంస్థలు అమరావతిలో ఏర్పాటయ్యేలా చూడండి.. దేశంలోని టాప్‌టెన్ విద్యాసంస్థలు, అంతర్జాతీయ విద్యాసంస్థలను అమరావతిలో నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. కార్పొరేట్ ఆస్పత్రులు, పరిశ్రమలు, స్టార్ హోటళ్ల ఏర్పాటుతో అమరావతి సత్వరం అభివృద్ధి చెందుతుందన్నారు. 15 ఏళ్లలో అమరావతిని మెగాసిటీగా మలచాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్నిరంగాలూ వృద్ధి చెందేలా చూడాలన్నారు. కోర్ కేపిటల్లో ఉన్న భూముల్ని రాజధానికి తలమానికంగా నిలిచే సంస్థలకే కేటాయించాలన్నారు. పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధికోసం రూ.ఐదువేల కోట్లతో ఏపీ పట్టణాభివృద్ధి నిధి(ఆంధ్రప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ ఫండ్-ఏపీయూడీఎఫ్) పేరుతో ట్రస్టు ఏర్పాటుకు సీఎం చంద్రబాబుఆమోదం తెలిపారు. ఈ ట్రస్టు నిర్వహణకు ప్రత్యేకంగా ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్(ఏపీయూఐఏఎంఎల్) పేరుతో ఒక కంపెనీని నెలకొల్పాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన సవివర నివేదికను పురపాలక శాఖాధికారులు బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎంకు అందజేశారు.