Debt planning
-
రూ.5.4 లక్షల కోట్ల రుణ ప్రణాళిక సిద్ధం చేసిన ఎస్ఎల్బీసీ
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి సంబంధించి రుణ ప్రణాళికలు రూపొందించేందుకు 227వ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు. ఇందులో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు రూ.5.4 లక్షలకోట్ల రుణ ప్రణాళికను సిద్ధం చేశారు.ప్రభుత్వం రూపొందించిన రుణ ప్రణాళికలోని వివరాల ప్రకారం..విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాధాన్య రంగాలకు రూ.3,75,000 కోట్లు(గతంతో పోల్చితే 16 శాతం అధికం), ఇతర రంగాలకు రూ.1,65,000 కోట్లు అవసరం. వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్లు రుణాలు కావాల్సి ఉంది. గతంలో కంటే ఇది 14 శాతం పెరిగింది. డైరీ, ఫౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయం రంగంలో మౌళిక సదుపాయాలకు రూ.32,600 కోట్ల రుణాలు అవసరం. వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయ రంగం వృద్ధికి గతేడాదిలో రూ.2,31,000 కోట్లు రుణ లక్ష్యంగా పెట్టుకోగా అందులో 90 శాతం అనగా రూ.2,08,136 కోట్లు మంజూరయ్యాయి.ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే ఎంఎస్ఎంఈ రంగానికి 2023-24 ఏడాదిలో రూ.69,000 కోట్లు రుణాలు కావాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాది ఏకంగా రూ.87,000 కోట్లకు పెంచారు. గతంలో కంటే ఇది 26 శాతం అధికం. గృహ నిర్మాణానికి రూ.11,500 కోట్లు, సాంప్రదాయేతర ఇంథన రంగానికి రూ.8000 కోట్లు రుణాలు కావాలని ప్రాణాళికలు సిద్ధం చేశారు.ఐదు ప్రధాన విభాగాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.1. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడం, కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించడం, మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవడం. 2. పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టడం.3. డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం.4. స్కిల్ డెవలప్మెంట్ కోసం చర్యలు తీసుకోవడం.5. సంపద సృష్టించే, జీఎస్డీపీ పెంచే రంగాలకు ప్రోత్సాహం ఇవ్వడం.ఇదీ చదవండి: బడ్జెట్లో రైతన్న కోరుకుంటున్నవి..ముఖ్యమంత్రి అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్ర, ఎస్ఎల్బీసీ కన్వీనర్ సీవీఎన్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా ‘రు(ర)ణ’ రాజకీయం!
అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దేశం అప్పులు.. వాటి చెల్లింపులను అడ్డుపెట్టుకుని ఆడుతున్న రాజకీయ నాటకం ఇంకొన్ని వారాలపాటు సాగనుంది. ఆర్థిక శాఖ మంత్రి జానెట్ ఎల్లెన్ తాజా ప్రకటనను బట్టి పరిమితిని సకాలంలో పెంచకపోతే డిసెంబరు 15వ తేదీ తరువాత అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే తొలిసారి రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఎదుర్కోనుంది. అమెరికాకు అప్పులేంటి? చెల్లించ లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా.. అలాగే ఇదీనూ. కాకపోతే ఇక్కడ సమస్య డబ్బుల్లేకపోవడం కాదు. అప్పులపై ఉన్న పరిమితిని పెంచితేగానీ ప్రభుత్వం తన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేకపోవడం!! పెంచకపోతే ఏమవుతుంది? రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా తొలిసారి తాను చెల్లించాల్సిన రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అక్టోబరులో ఈ మొత్తం దాదాపు 28 లక్షల కోట్ల డాలర్ల వరకూ ఉంది. సకాలంలో రుణ వాయిదా చెల్లించకపోవడం ప్రతి ప్రభుత్వ కార్యక్రమంపై ప్రభావం చూపుతుంది. రాష్ట్రాలకు అందే నిధులు తగ్గుతాయి. గోల్డ్‌మ్యాన్ శాక్స్ సంస్థ అంచనా ప్రకారం సకాలంలో రుణ పరిమితి పెంచని పక్షంలో అమెరికన్ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయంలో నలభైశాతం కోత పడే అవకాశం ఉంది. రక్షణ దళాల సిబ్బందికి పూర్తిస్థాయిలో, సకాలంలో వేతనాలు, ఫింఛన్ల వంటివి చెల్లించలేమని పెంటగాన్ అక్టోబరులోనే ఒక ప్రకటన జారీ చేసింది. వాయిదా చెల్లింపులో విఫలమైతే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా విశ్వసనీయత దెబ్బతింటుంది. వడ్డీ రేట్లు పెరిగే అవకాశమూ ఉంది. ఇవన్నీ కలగలిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందన్నమాట. తాత్కాలిక ఉపశమనంగా 480 బిలియన్ డాలర్ల అదనపు రుణం తెచ్చుకోవడానికి అక్టోబరులో సెనేట్ ఒకే చెప్పింది.రుణపరిమితిని పెంచుకోవడానికి, రిపబ్లికన్లను ఒప్పించడానికి బైడెన్ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతిపక్ష రిపబ్లికన్లు ఏమంటున్నారు? వివాదానికి బాధ్యత డెమొక్రాట్లదేనన్నది రిపబ్లికన్ల వాదన. తమ మద్దతు లేకుండా కొత్త అంశాలపై డబ్బులు ఖర్చు పెట్టేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని.. దాన్ని అడ్డుకుంటూండటం వల్లనే వారు నిస్పృహకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. డెమోక్రాట్లు ఇంకోసారి ఏకపక్షంగా పన్నులు విధించడం, ఖర్చు పెట్టడాన్ని తాము అనుమతించేది లేదని మైనార్టీ నేత మిచ్ మెక్కానెల్ స్పష్టం చేశారు. తమ ఆర్థిక విధానాలను అమలు చేసేందుకు డెమొక్రాట్లు బడ్జెట్ సమీక్షను అడ్డుగా పెట్టుకుంటున్నారని, ఇంత చేయగలిగిన వాళ్లు రుణ పరిమితి పెంపుపై కూడా ఏదో ఒక చర్య తీసుకోవాలని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ డెమొక్రాట్ల వాదనలేమిటి? రుణ పరిమితి పెంపును రిపబ్లికన్లు అడ్డుకోవడాన్ని అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలవి ద్వంద్వ ప్రమాణాలని, ప్రమాదకరమైనవని, అమర్యాదకరమైనవి కూడా అని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థతో ఆటలాడుకుంటున్నాయన్నారు. అమెరికన్ సెనేట్‌లో దాదాపు 50 మంది డెమొక్రాట్లు (100 సభ్యులుండే అమెరికా ఎగువసభ సెనేట్‌లో 48 మంది డెమొక్రాట్లకు ఇద్దరు స్వంత్రుల మద్దతు ఉంది. మిగతా 50 మంది రిపబ్లికన్ పార్టీ సభ్యులు) ఉండగా... రుణ పరిమితిని పెంచేందుకు కనీసం మరో పది రిపబ్లికన్ ఓట్లూ అవసరమవుతున్నాయి. మొత్తం రుణాల్లో బైడెన్ హయాంలోనివి మూడు శాతం మాత్రమేనని, మిగిలినవన్నీ గత ప్రభుత్వాలవేనని డెమొక్రాట్లు అంటున్నారు. ట్రంప్ హయాంలో తాము మూడుసార్లు రుణ పరిమితి పెంపునకు సహకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమిటీ రుణ పరిమితి కథ? అమెరికా ప్రభుత్వం వివిధ రూపాల్లో సేకరించే పన్నుల మొత్తం కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఇందుకోసం అన్ని ప్రభుత్వాల మాదిరిగానే అప్పులు చేస్తుంది. ఈ వ్యవహారమంతా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా నడుస్తుంది. అప్పుల కోసం అగ్రరాజ్యం విడుదల చేసే బాండ్లు ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడులుగా భావిస్తారు. 1939లో అమెరికన్ పార్లమెంటు ప్రభుత్వం చేయగలిగే అప్పులపై ఒక పరిమితిని విధిస్తూ చట్టం చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ కనీసం వందసార్లు ఈ పరిమితిని పెంచుకున్నారు. అంటే.. అవసరాన్ని బట్టి మరిన్ని అప్పులు చేసేందుకు ఎప్పటికప్పుడు అవకాశం కల్పించుకున్నారన్నమాట. అయితే ఇలా పరిమితి పెంచుకోవాలన్న ప్రతిసారి కూడా దానిపై కాంగ్రెస్‌లోని ఇరు పక్షాల మధ్య చర్చోపచర్చలు జరుగుతాయి. చివరకు ఇరుపక్షాలు కొన్ని పట్టువిడుపులతో ఏకాభిప్రాయానికి రావడం పరిమితిని పెంచుకోవడం కద్దు. అయితే ఇటీవలి కాలంలో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. 2013లోనూ రుణ పరిమితిని దాటేసే పరిస్థితి ఏర్పడింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యయ ప్రణాళికను రిపబ్లికన్లు పూర్తిగా అడ్డుకున్నారు. అదేమాదిరిగా ఈ సారి కూడా రిపబ్లికన్లు రుణ పరిమితి అంశాన్ని అడ్డుపెట్టుకుని ఒక వివాదాన్ని సృష్టించారు. అయితే... ఇలాంటి విషయాలు చివరి నిమిషం వరకూ సాగడం.. చివరకు రాజీమార్గాలపై తెరవెనుక మంతనాలు, పట్టువిడుపులు, కొన్ని సవరణల తరువాత ఓకే కావడం చరిత్రలో ఇప్పటివరకూ జరిగిన తంతు! -
దళిత సంక్షేమానికి ప్రణాళిక
2017–18 వార్షిక రుణ ప్రణాళిక ఖరారు ► రూ.53.92 కోట్లతో 1,992 మందికి లబ్ధి ► స్వయం ఉపాధికి బాటలు ► మూడెకరాల భూ పంపిణీకి ముందడుగు ► మొదటి పంటకు ఆర్థిక సాయం అందజేత ► నిరుద్యోగులకు శిక్షణా తరగతులు ► వివరాలు వెల్లడించిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య దళితులను స్వయం ఉపాధి, సమృద్ధితో ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గతేడాది మాదిరిగానే 2017–18 సంవత్సరానికి గాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.53.92 కోట్లతో 1,992 యూనిట్లు(లబ్ధిదారులు) మంజూరు చేసేందుకు రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసింది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆమోదంతో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పెరిక యాదయ్య ప్రణాళికను విడుదల చేస్తూ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గతేడాది కార్పొరేషన్ ద్వారా 1,032 యూనిట్లకు గాను రూ.17.85 కోట్లను ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. గతేడాదికంటే 960 యూనిట్లను పెంచగా సగానికి పైగా సబ్సిడీ రుణాల మంజూరును పెంచినట్లు స్పష్టమవుతోంది. – సాక్షి, కరీంనగర్ సాక్షి, కరీంనగర్: జిల్లా యంత్రాంగం ప్రణాళిక ప్రకారం ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకుల స్వయం ఉపాధికి తోడ్పాటు కానుంది. భూ కొనుగోలు పథకం ద్వారా దళితకలకు మూడెకరాల భూ పంపిణీకి ముందడుగు పడనుంది. సాగు యోగ్యమయ్యేలా మొదటి పంటకు ఆర్థిక సాయమూ అందనుంది. నీటి వసతి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. స్వయం ఉపాధికి గాను అర్హులైన ఎస్సీలకు మొదటి కేటగిరీలో 80 శాతం సబ్సిడీ, రెండో కేటగిరీలో 70 శాతం సబ్సిడీ, మూడో కేటగిరీలో 5 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. 1,992 యూనిట్లకు గాను లబ్ధిదారులకు రూ.47.02 కోట్లు సబ్సిడీ రూపంలో అందించనున్నారు. అందులో స్వయం ఉపాధికి అర్హులైన ఎస్సీలకు బ్యాంకు లింకేజీకి రూ.15.92 కోట్ల విలువైన 922 యూనిట్లు పంపిణీ చేయనున్నారు. ఇందులో రూ.11.12 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రూపంలో ఇస్తుందని అధికారులు తెలిపారు. వాహన కొనుగోలుకు సంబంధించి 55 యూనిట్లకు గాను 2.99 కోట్ల విలువైన రుణాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు శిక్షణ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది స్టడీ సర్కిళ్లతోపాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేగాకుండా జిల్లా ప్రాధాన్యతలుగా గుర్తించి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వికలాంగులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా 56 యూనిట్ల (లబ్ధిదారులు)లో ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున 50 శాతం సబ్సిడీతో రుణ సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. భూపంపిణీకి ముందడుగు.. భూమి కొనుగోలు పథకం ద్వారా విభజిత కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది దళితులకు మూడెకరాల పంపిణీకి మోక్షం కలిగించేలా చర్యలకు ఉపక్రమించారు. 132 మందికి రూ.27.72 కోట్లు విలువ చేసే 396 ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుత కరీంనగర్ జిల్లాలో 236 ఎకరాలున్నట్లు గుర్తించగా 79 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందులో.. ఇప్పటికే 39 మందికి గాను 100 ఎకరాల ప్రైవేట్ భూమి కొనుగోలుతోపాటు సాగుయోగ్యం, నీటి వసతికి అనువుగా ఉందని గుర్తించారు. ఇంకా మిగిలినవి భూగర్భజల విభాగం, స్థానిక తహసీల్దార్ల నుంచి నివేదికలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతేడాది 411 మంది లబ్ధిదారులకు రూ.29.79 కోట్ల విలువైన 755 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఈ ఏడాది పంపిణీ చేసిన భూమికి మొదటి పంటకు ఆర్థిక సాయం ద్వారా రూ.57.82 లక్షలను మంజూరు చేయనున్నారు. అందులో రూ.1.79 కోట్ల రాయితీ ఉంటుందని అధికారులు తెలిపారు. నీటి వసతికిగాను బోర్‌వెల్స్, పంప్సెట్లు, ట్యూబ్‌వెల్, ఆయిల్ ఇంజన్లు, పైపులైన్ల రూపంలో 307 యూనిట్లు మంజూరు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. లబ్ధిపొందాలనుకుంటే దరఖాస్తు ఇలా.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిపొందాలనుకునే ఆసక్తి గల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ విధానం ఏడాది పొడవునా ఉండడంతో ఆన్లైన్లో రిజిస్టర్ అవుతుంటుందని అధికారులు చెబుతున్నారు. గతేడాది వరకు ఎంపీడీవోలు, ఆయా స్థాయిలోని అధికారుల వద్దనే 6,500 వరకు పెండింగ్ దరఖాస్తులుండడం గమనార్హం. గతం గతః అన్నట్లుగా తాజాగా ప్రభుత్వం ఎంపిక చేసే అర్హులైన లబ్ధిదారులు, విడుదల చేసే నిధులపైనే ఆధారపడి ఉంది. గతంలో పెండింగ్‌లో ఉన్న వాటికి వేరుగా నిధులు విడుదలవుతాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అభ్యర్థులు ఆధార్‌కార్డు, తెలంగాణ ప్రభుత్వంతో జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం, ఇటీవల తీసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం వివరాలతో ఠీఠీఠీ.్టటౌbఝఝట.ఛిజజ.జౌఠి.జీn/లో నమోదు చేసుకోవాలని చెబుతున్నారు. ఆన్లైన్లో నమోదు ఎంపీడీవో పరిశీలన అనంతరం గ్రామసభలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన లబ్ధిదారుడు బ్యాంకు కాన్సెంట్ ఇస్తే జిల్లాస్థాయిలో పరిశీలన కలెక్టర్ ఆమోదంతో సబ్సిడీ మంజూరు కానుందని అధికారులు వివరించారు. అయితే అధికారికంగా ఈనెల 31 వరకు దరఖాస్తుకు గడువు ఉన్నా.. సాధ్యం కాని పక్షంలో మరింత పొడిగించే అవకాశముందని ఈడీ యాదయ్య తెలిపారు.. దళారులను నమ్మొద్దు.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీలకు అత్యధిక సబ్సిడీతో స్వయం ఉపాధి, సమృద్ధి పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తోంది. 100 శాతం, 80, 70, 60 శాతం సబ్సిడీల రూపంలో దళితుల ఆర్థిక పరిపుష్టికి తోడ్పడుతోంది. ఎస్సీల అభివృద్ధికి ప్రోత్సాహాకాలిస్తోంది. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా యూనిట్లను లబ్ధి చేకూరుస్తాం. దళారులను ఆశ్రయించొద్దు. రుణాల కోసం ఎవరి మాయమాటలు నమ్మొద్దు.. – పెరిక యాదయ్య, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, కరీంనగర్