'ఎమ్మెల్యేలను లాక్కోవడం అప్రజాస్వామికం'
హైదరాబాద్: విద్యుత్ ఒప్పందాల విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘించిందని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో ఏపీ సర్కారుపై తెలంగాణ ప్రభుత్వం చేసే పోరాటానికి కాంగ్రెస్ మద్దతిస్తుందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి విషయంలోఅధికార టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలతో కూడా కలవడానికే కూడా సిద్ధమేనన్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తామన్నారు.
ప్రజల, హక్కులను, స్వేచ్ఛను హరించేవిధంగా ప్రభుత్వం వ్యవహరించరాదన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లాక్కోవడం అప్రజాస్వామికమన్నారు. ఇలాంటి విధానాలతో నవతెలంగాణ నిర్మాణం జరపలేరన్నారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదని జైపాల్‌రెడ్డి అన్నారు.