deepam scheme
-
దీపం-2 పథకంపై శాసనమండలిలో వాడీవేడి చర్చ
-
అమ్మకానికి ‘ఎనిమీ ప్రాపర్టీ’ షేర్లు
న్యూఢిల్లీ: దేశీయంగా 84 కంపెనీల్లోని 2.91 లక్షల ’ఎనిమీ ప్రాపరీ్ట’ షేర్లను విక్రయించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి విడతలో 20 కంపెనీల్లో 1.88 లక్షల షేర్లను విక్రయించనుంది. ఇందుకోసం 10 కేటగిరీల కొనుగోలుదార్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఇందులో వ్యక్తులు, ప్రవాస భారతీయులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదార్లు, ట్రస్టులు, కంపెనీలు ఉన్నాయి. ఫిబ్రవరి 8 కల్లా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) ఈ మేరకు ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది. 1947–1962 మధ్య కాలంలో శతృదేశాలైన పాకిస్తాన్, చైనాకు వెళ్లిపోయి, అక్కడి పౌరసత్వం తీసుకున్న వారికి భారత్‌లో ఉన్న ఆస్తులను ’ఎనిమీ ప్రాపరీ్ట’గా వ్యవహరిస్తారు. ఇవి కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్ ఫర్ ఇండియా (సీఈపీఐ) అ«దీనంలో ఉన్నాయి. బిడ్డర్లు తమకు ఏ కంపెనీల్లో ఎన్ని షేర్లు, ఏ ధరకు కావాలనేది బిడ్‌లో తెలపాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒకో కంపెనీ షేర్లకు నిర్దిష్ట ధరను రిజర్వ్ రేటుగా నిర్ణయిస్తుంది. దీన్ని వెల్లడించదు. అంతకన్నా తక్కువ రేటు కోట్ చేసే బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ఈ ప్రక్రియకు మర్చంట్ బ్యాంకర్‌గా వ్యవహరిస్తుంది. -
ఐఆర్ఎఫ్సీ నుంచి ఓఎఫ్ఎస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్(ఐఆర్ఎఫ్సీ) ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను చేపట్టనుంది. కంపెనీలో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) నిబంధన అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఆరి్థక సంవత్సరం(2023–24)లో 11శాతానికిపైగా వాటాను విక్రయించే వీలున్నట్లు అధికారిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం రైల్వే రంగ ఫైనాన్సింగ్ కంపెనీలో ప్రభుత్వం 86.36 శాతం వాటా ను కలిగి ఉంది. దీపమ్, రైల్వే శాఖల సీనియర్ అధికారులతో ఏర్పాటైన అంతర్‌మంత్రివర్గ గ్రూప్ ఎంతమేర వాటా విక్రయించాలనే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సెబీ ఎంపీఎస్ నిబంధనలో భాగంగా ప్రభుత్వం 11.36 శాతం వాటాను ఆఫర్ చేయవలసి ఉంటుంది. స్టాక్ ఎక్సే్ఛంజీలలో 2021 జనవరిలో లిస్టయిన కంపెనీ ఐదేళ్లలోపు ఎంపీఎస్‌ను అమలు చేయవలసి ఉంది. అయితే వాటా విక్రయ అంశంపై ఇన్వెస్టర్ల ఆసక్తిని గమనిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. బీఎస్ఈలో ఐఆర్ఎఫ్ఎస్ షేరు దాదాపు రూ. 51 వద్ద కదులుతోంది. ఈ ధరలో 11.36 శాతం వాటాకుగాను ప్రభుత్వం రూ. 7,600 కోట్లు అందుకునే వీలుంది. కాగా.. ప్రభుత్వం కొంతమేర వాటాను విక్రయించనుండగా.. మరికొంత తాజాగా జారీ చేయనున్నట్లు అంచనా. ఓఎఫ్ఎస్ వార్తల నేపథ్యంలో ఐఆర్ఎఫ్సీ షేరు బీఎస్ఈలో తొలుత రూ. 52.7 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. చివరికి 0.6 శాతం బలపడి రూ. 51.2 వద్ద ముగిసింది. ఈ నెలలో ఇప్పటివరకూ షేరు 38 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
మంత్రుల చేతికి ‘దీపం’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేద మహిళలకు ‘దీపం’ పథకం కింద ఇచ్చే వంటగ్యాస్ కనెక్షన్లలో మళ్లీ రాజకీయ జోక్యం పెరిగిపోనుంది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పూర్తిగా జిల్లా ఇన్చార్జి మంత్రులకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జీవో విడుదల చేసింది. అయితే గతంలోనూ ఇదే తరహాలో ‘దీపం’ లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఇన్చార్జి మంత్రుల ఆధీనంలో ఉండేది. కానీ పారదర్శకత లోపించిందనే ఆరోపణల కారణంగా గత ఫిబ్రవరిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పూర్తిగా కలెక్టర్లకు అప్పగించింది. తాజాగా తిరిగి మంత్రులకే అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అప్పట్లో ఈ విధానాన్ని తప్పుబట్టిన నేతలే ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలుగా తిరిగి దానిని అమల్లోకి తెచ్చారనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇన్చార్జి మంత్రి చేతిలో.. ‘దీపం’ కనెక్షన్ కోసం లబ్ధిదారుల గుర్తింపు జరిగాక జాబితాను ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, వార్డుల్లో ప్రదర్శించి, అభ్యంతరాలు స్వీకరిస్తారు. మూడు రోజుల తర్వాత గ్రామ, వార్డు సభల్లో జాబితాను చదువుతారు. ఏవైనా అభ్యంతరాలుంటే అక్కడికక్కడే పరిష్కరించి సర్పంచ్ సంతకం తీసుకొని జాబితాను జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. అన ంతరం కలెక్టర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఇందుకోసం ప్రతిపాదిత మహిళ గతంలో వంటగ్యాస్ కనెక్షన్ కలిగిలేరని, సిలిండర్, రెగ్యులేటర్ కొనే పరిస్థితిలో లేరని, ఈ గ్యాస్ కనెక్షన్‌ను గృహ అవసరాలకు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉందనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఇప్పటివరకు తుది ఎంపిక అధికారం పూర్తిగా కలెక్టర్లకే ఉండేది. కానీ ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక తుది బాధ్యతను జిల్లా ఇన్చార్జి మంత్రికి కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనివల్ల తుది ఎంపిక జాబితాకు ఇన్చార్జి మంత్రి ఆమోదం తెలపాలి. ఆయన సూచనల మేరకు మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ఆ తర్వాతే కలెక్టర్లు జాబితాను సంబంధిత కంపెనీలకు పంపాలి. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం ఈ సవరణలు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. తమవారికి ‘దీపం’ కనెక్షన్లు ఇప్పించుకునేందుకే లబ్ధిదారుల తుది ఎంపిక బాధ్యతను మంత్రులకు కట్టబెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఎంపిక ప్రక్రియ షురూ వంటగ్యాస్ కనెక్షన్ లేని స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి, వారికి ‘దీపం’ పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2014-15లో 5.95 లక్షల మందికి వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.96 కోట్లు కేటాయించగా, 2015-16లో మరో రూ.50 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.