‘ఢిల్లీ’ ప్రభావం ఇతర ప్రాంతాల్లో ఉండదు
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు {పహ్లాద్‌జోషి
బెంగళూరు : ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇతర ప్రాంతాల్లోని ఎన్నికల్లో ఉండబోదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి పేర్కొన్నారు. బుధవారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఢిల్లీలోని సమస్యలు, అక్కడి పరిస్థితులు ఇతర ప్రాంతాలకంటే చాలా భిన్నంగా ఉంటాయని, అందుకే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విజయాన్ని సాధించగలిగిందని అన్నారు.
ఢిల్లీ ప్రజలు స్థానిక నాయకత్వాన్ని, స్థానిక పార్టీని కోరుకున్నారని అందుకే ఆప్‌ను విజయం వరించిందని విశ్లేషించారు. అయితే ఇదే తరహా ఫలితాలు బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల్లో సైతం పునరావృతమవుతాయనడం సరికాదని అన్నారు.