Dengu cases
-
జ్వరంతో బాధపడుతున్నారా? వెల్లుల్లి రసంతో అద్భుతం!
ప్రస్తుతం ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, వైరల్, డెంగీ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడంతో పాటు, కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఇలాంటి సమస్యలకు వెల్లుల్లి రసం లేదా వెల్లుల్లి చారు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జ్వరం తగ్గిన తరువాత నోటికి ఏమీ రుచించని వారికి కూడా ఇది చక్కటి పరిష్కారం. ఈ చారుతో అనేక ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరి వెల్లుల్లి చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి!కావాల్సిన పదార్థాలువెల్లుల్లి , కొద్దిగా చింతపండు, టమాటాలు, మిరియాలు, చారు పొడి, తాలింపు దినుసులు , పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, కొత్తిమీర.వెల్లుల్లి చారు తయారీ విధానం:ముందుగా వెల్లుల్లిని అట్ల కాడ సన్నని మొనకు గుచ్చి నిప్పుల మీద కాల్చుకోవాలి. ఆ తరువాత వీటికి కాసిన్ని మిరియాలు జోడించి చెక్కముక్కగా (మరీ మెత్తగా కాకుండా) దంచుకోవాలి. బాగా పండిన టమాటాలతో మెత్తగా రసం తీసిపెట్టుకోవాలి. ఈ రెండూ కలిపిన నీటిలో ఉప్పు, పసుపు, చీలికలు చేసిన పచ్చిమిర్చి వేసి పొంగు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా నానబెట్టిన చింతపండు, కరివేపాకు వేయాలి. తరువాత , ధనియాలు, కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకొని తయారు చేసుకున్న రసం పొడి వేయాలి. చక్కగా మరిగి కమ్మటి వాసన వస్తున్నపుడు, పోపు గింజలు, ఇంగువతో తాలింపు వేసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి చారు రెడీ. దీన్ని అన్నంలో గానీ, ఇష్టమున్న వారు ఇడ్లీలో కానీ వేసుకొని తినవచ్చు. -
దోపిడి దోమ
రాయదుర్గంలోని నేసేపేటకు చెందిన సిద్ధన్న అనారోగ్యానికి గురై ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. అతడి సలహా మేరకు ఓ సీనియర్ వైద్యుడి దగ్గరకు వెళితే.... రోగి చెబుతున్నది వినకుండానే రక్తపరీక్షలు చేయించుకుని రమ్మంటూ ఓ చీటి రాసి చేతిలో పెట్టాడు. దీంతో సిద్ధన్న ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు వెళితే.. రోగ నిర్ధారణ పరీక్షకు అక్షరాల రూ.950 బిల్లు అయింది. ల్యాబ్ నిర్వాహకుడు ఇచ్చిన రిపోర్టు తీసుకుని తిరిగి సదరు డాక్టర్ వద్దకు వెళితే... సాధారణ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపి మందులు రాసిచ్చాడు. ఈ తరహా దోపిడీతో వైద్యులు, ల్యాబ్ నిర్వాహకులు కలిసి రోగుల జేబులు గుల్ల చేస్తున్నారు. రాయదుర్గం: జిల్లాల్లో సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. దోమ కాటుతో మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి జ్వరాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. దీనికి తోడు రోగ నిర్ధారణకు సంబంధించి ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకుల వైఖరి మరీ దారుణంగా మారింది. రక్తాన్ని పీల్చే దోమ కాటుతో కోలుకోవచ్చు కానీ, నగదు కొల్లగొడుతున్న దోపిడీ దోమల దెబ్బకు రోగులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. భయాన్ని సొమ్ము చేసుకుంటూ.. సాధారణ జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతూ వైద్యుడి దగ్గరకు వెళ్లినా.. రోగ నిర్ధారణ పరీక్ష తప్పనిసరి అంటున్నారు. రోగ నిర్ధారణ పరీక్షకు సంబంధించి రిపోర్టులు లేకుంటే వైద్యం చేయలేని అసహాయ స్థితికి వైద్యులు చేరుకున్నారంటే పొరబడినట్లే. కన్సల్టెంట్ ఫీజు రూపంలో కొంత దండుకునే వైద్యుడు... రోగ నిర్ధారణ పరీక్షలకు రెఫర్ చేయడం ద్వారా మరికొంత కమీషన్ దక్కుతుండడమే ఇందుకు కారణం. విష జ్వరాలపై ప్రజల్లో ఉన్న భయాన్ని తెలివిగా దోపిడీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనుమతి పొందిన ల్యాబ్‌లు 79 ఉండగా... అనధికారికంగా నిర్వహిస్తున్నవి దీనికి రెట్టింపుగానే ఉన్నాయి. ఉచితంగా అందుబాటులో ఉన్నా.. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు గర్భిణులకు బ్లడ్ గ్రూపింగ్, హెచ్ఐవీ, బ్లడ్ షుగర్, హైపటైటిస్–బీ, యూరిన్, టీబీ పరీక్షలతో పాటు డెంగీ, ప్లేట్లేట్ కౌంట్, కిడ్నీ, లివర్ ఫంక్షన్ లాంటి ఇతర కీలక వ్యాధుల నిర్ధారణకు అవసరమైన పరీక్షలు ప్రాథమిక, అర్బన్ ప్రైమరీ ఆరోగ్య కేంద్రాల్లోనే నిర్వహిస్తుంటారు. డెంగీ పరీక్ష కోసం పీహెచ్‌సీల్లోనే రక్త నమూనాలు సేకరించి ‘ఎలిసా’ పరీక్ష కోసం జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి పంపిస్తారు. 24 గంటల్లోపు పరీక్ష చేసి రోగికి సమాచారం అందేలా చర్యలూ తీసుకున్నారు. ఇష్టారీతిన ఫీజుల వసూళ్లు.. ఉమ్మడి జిల్లాలో గడిచిన ఆరేళ్లు పరిశీలిస్తే 1,538 డెంగీ, 816 మలేరియా, 670 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. 2017–19 మధ్య డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌కు సంబంధించి 80 శాతం కేసులు నమోదు కావడం విశేషం. ప్రాణాంతకమైన ఈ రోగాలకు సంబంధించి విధిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇది కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి బిల్లు వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ధరల పట్టికను సంబంధిత ప్రైవేట్ ల్యాబ్‌ల్లో తప్పనిసరిగా ప్రదర్శనకు ఉంచాలి. అయితే అధికారిక పర్యవేక్షణ కొరవడడంతో ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. పైగా ప్రశ్నించిన రోగుల పట్ల దురుసుగా వ్యవహరించడం, గంటల తరబడి వేచి ఉండేలా చేసి ఇబ్బందులు గురి చేస్తుంటారు. టైఫాయిడ్, మలేరియా లాంటి పరీక్షలకు రూ.180 నుంచి రూ.200ల వరకు వసూలు చేస్తారు. అయితే ఈ పరీక్షలకు రూ.500 నుంచి రూ.600 వరకూ తీసుకుంటూ రోగుల జేబులు కొల్లగొట్టడం విమర్శలకు దారి తీస్తోంది. అనుమతి లేని ల్యాబ్‌లపై చర్యలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ల్యాబ్‌లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడినట్లు తేలితే అనుమతులున్నా ల్యాబ్‌లను సీజ్ చేస్తాం. – డాక్టర్ ఓబులు, జిల్లా మలేరియా అధికారి, అనంతపురం ఉచిత సేవలు సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇతర విష జ్వరాల నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేటు ల్యాబ్‌ల దోపిడీని ఉపేక్షించబోం. – డాక్టర్ విశ్వనాథయ్య, డీఎంహెచ్ఓ (చదవండి: ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు ) -
డెంగీ జ్వరాలపై హైకోర్టులో పిల్
-
రోగాల ముసురు
విశాఖపట్నం- మెడికల్/నక్కపల్లి, న్యూస్‌లైన్: రోగాలతో పల్లెలు విలవిల్లాడుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులు, కలుషిత తాగునీరు, కొరవడిన పారిశుద్ధ్యంతో వ్యాధులు చుట్టుముట్టేస్తున్నాయి. గతేడాది నమోదయిన కేసులను తలదన్నేలా డెంగీ,విషజ్వరాలు,మలేరియా, అతి సార జడలు విరబోసుకుంటున్నాయి. వం దలాది మంది మంచానపడి లేవలేని స్థితిలో అల్లాడిపోతున్నారు. జ్వరపీడితుల తో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి. బాధితుల్లో తీవ్రమైన తలనొప్పి, చలి జ్వరం, కొన్ని సందర్భాల్లో జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నవారే ఎక్కువ. విష జ్వరాలు మొడటి స్థానాన్ని ఆక్రమిస్తుండగా, మలేరియా, డెంగీ కేసు లు ద్వితీయ స్థానంలో నిలుస్తున్నాయి. ఆనందపురం మండలం గంటాపేటకు చెందిన సిరిపురపు భారతి(36) డెంగీ లక్షణాలతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారు. 20 రోజులు క్రితం జ్వరం సోకడంతో తగరపువలసలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఎంతకూ నయం కాక పోవడంతో విశాఖలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి డెంగీగా నిర్ధారించారు. జిల్లాలోని మాకవరపాలెం మండలం చౌడువాడ, ఆనందపురం మండలం గొట్టిపల్లి, పెందుర్తి మండలం కరకవాని పాలెం, మధురవాడ సమీపంలలోని వాడపాలెం, పి.ఎం.పాలెం, గాజువాక, కూర్మన్నపాలెం ప్రాంతాలలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో విషజ్వరాలు, అతిసార రోగులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గురువారం ఎస్‌రాయవరం మండలం ఉప్పరాపల్లి నుంచి విషజ్వరాలతో బాధపడుతూ పదుల సంఖ్యలో నక్కపల్లి ఆసుపత్రికి వచ్చారు. పంచాయతీ కార్యదర్శులు, ప్రజారోగ్య సిబ్బంది సమైక్యాంద్ర సమ్మెలో ఉన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా కొరవడింది. ఇటీవల అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. దీంతో అంతటా పేరుకుపోయిన చెత్త కుళ్లిపోయి దుర్గంధం వెలువడుతోంది. తాగునీటి బావులు, చెరువులు, బోర్లలోకి కొత్తనీరు చేరింది. దాదాపు ఆరుమాసాలుగా బావుల్లో క్లోరినేషన్ లేదు. గ్రామాల్లోని మురుగునీటి కాలువలు దోమల పెంపకం కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు ఏమీ చేయలేని దుస్థితి. దీంతో గ్రామాల్లో ప్రజారోగ్యం పడకేసింది. గతేడాది జిల్లా వ్యాప్తంగా ఇదే సమయానికి అన్ని రకాల వ్యాధులకు సంబంధించి 5.77లక్షల కేసులు నమోదయ్యాయి. వీరిలో 5,500 మందికి పైగా మలేరియా, 163 మందికి డెంగీ సోకినట్టు అప్పట్లో నిర్ధారించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ సుమారు 4లక్షలమంది వివిధ వ్యాధుల బారిన పడ్డారు. వీరిలో 4,500మందికి మలేరియా, 43మందికి డెంగీగా వైద్యాధికారులు నిర్ధారించారు. ఏజెన్సీ 11మండలాల్లో ఇంతవరకు 2.2లక్షల మందికి జ్వరాలు సోకాయి. వీరిలో సుమారు 2వేల మందికి మలేరియా పాజిటివ్‌గా తేలింది. డెంగీ పీడితుల్లో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడం ఎక్కువగా కనిపిస్తోంది. కాని ఈ ఏడాది అన్ని రకాల జ్వరాల బాధితుల్లోనూ ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడం కనిపిస్తోంద ని ఫిజీషియన్ డాక్టర్ పి.ఎస్.ఎస్. శ్రీనివాస్ పేర్కొన్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నివారణ చర్యలు తీసుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకున్నాం. సిబ్బందిని అప్రమత్తం చేశాం. తీవ్రమైన కేసులకు సంబంధించి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. జిల్లా మలేరియా అధికారి, ఇతర వైద్యాధికారుల సమన్వయంతో యాంటీ లార్వా ఆపరేషన్, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తున్నాం. ఏజెన్సీలో ముందస్తుగా దోమతెరల పంపిణీ, మలేరియా నివారణ మందు పిచికారీతో ఈసారి మలేరియా కేసుల సంఖ్య తగ్గింది. మొదటి విడత మలాథియాన్ స్ప్రేయింగ్ పూర్తి చేశాం. రెండో విడతగా 167గ్రామాల్లో చేపడుతున్నాం. ఈ ఏడాది డెంగీ కేసుల సంఖ్య తగ్గింది. - డాక్టర్ ఆర్.శ్యామల, డీఎంహెచ్‌వో