మన్యంలో పులుల ఉనికిపై సందేహాలు
కొయ్యూరు, న్యూస్‌లైన్: నేటి నుంచి పులుల జాడ తెలుసుకోవడానికి అటవీ శాఖ సర్వే నిర్వహిస్తుంది. డిసెంబర్లో జరగాల్సిన దీనిని జనవరికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. విస్తృత సర్వే శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మన్యంలో పులుల సంచారంపై గిరిజనుల నుంచి వివరాలు సేకరిస్తారు. వాటి అడుగుజాడలు గుర్తిస్తారు. నర్సీపట్నం, పాడేరు అటవీ డివిజన్లలో వాటిని పరిశీలిస్తారు. ఈనెల 25 వరకు దీనిని చేపడతారు.
ఏం చేస్తారు?
పులుల గణనలో భాగంగా అటవీ శాఖ కొన్ని చెట్ల మధ్య తుప్పలు నరికించింది. బాటలు శుభ్రం చేయిం చింది. మట్టిలో అడుగుల జాడ గుర్తించడానికి ఏర్పా ట్లు చేస్తోంది. అటవీ అధికారులు ప్రతి బీట్‌లో కూడా విధిగా తుప్పలు నరికించారు. చెట్ల వద్ద శుభ్రం చేయిం చారు. ఆ ప్రాంతంలో పులులు నడిస్తే వాటి అడుగులు గుర్తించేట్టు ఏర్పాట్లు చేశారు.
తర్వాత ఒకో బీట్‌లో రోజుకు ఐదు కిలోమీటర్ల వంతున అటవీ శాఖ అధికారులు తిరిగి పులుల జాడ గుర్తిస్తారు.అలా మూడు రోజుల పాటు తిరుగుతారు. ఆనవాళ్లు చూస్తారు. అదే సమయంలో కనిపించిన గిరిజనులను కూడా అడుగుతారు. వారి నుంచి వివరాలు తీసుకుని విశ్లేషిస్తారు.
జాతీయ పులుల సంరక్షణ కేంద్రం సహకారం
పులుల గణనపై జరిగే సర్వేకు జాతీయ పులుల సంరక్షణ కేంద్రం (ఎన్టీసీఏ) సహకారం అందిస్తుంది. కొన్ని సాంకెతిక వివరాలను అందజేస్తుంది.వాటి ఆధారంగా పులులను గుర్తిస్తారు. సాధారణంగా ఇన్ఫ్రా రెడ్ కెమేరాలను అమర్చాలి కానీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉంచేందుకు అటవీ శాఖ అధికారులు సంశయిస్తున్నారు. గతంలో మంప సమీపంలోని పులి నూతలలో రెండు పులులు సంచరించినట్టు గిరిజనులు అటవీ అధికారులకు చెప్పారు. కానీ ఇప్పుడు వాటి జాడ కూడా అనుమానమేనని అంటున్నారు. ఆ విష యం త్వరలో తేలుతుంది.