Department of underground mines
-
చరిత్ర ఎరుగని 'ఆసరా' ఇది
రాష్ట్రంలో 7,97,000 పొదుపు సంఘాల్లో ఉన్న 78,76,000 మంది అక్కచెల్లెమ్మలు 2019 ఏప్రిల్ నాటికి రూ.25,517 కోట్లు బ్యాంకులకు బాకీ పడ్డారు. ఈ మొత్తాన్ని 4 విడతల్లో ఉచితంగా వారి చేతికే అందిస్తామని చెప్పాం. ఆ మాటకు కట్టుబడి తొలి ఏడాది రూ.6,318 కోట్లు ఇచ్చాం. రెండో ఏడాది రూ.6,440 కోట్లు జమ చేస్తున్నాం. రెండు విడతల్లో రూ.12,758 కోట్లు లబ్ధి కలిగించాం. ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ ఒంగోలు సబర్బన్: ‘గత ప్రభుత్వం చేసిన మోసానికి పొదుపు సంఘాలన్నీ కకావికలం అయ్యాయి. వడ్డీతో కలిపి అప్పులు తడిసిమోపెడయ్యాయి. లక్షలాది రూపాయల టర్నోవర్‌తో ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న సంఘాలు ‘సి’, ‘డి’ గ్రేడ్‌కు పడిపోయాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న అక్కచెల్లెమ్మలను ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఆదుకుంటానని చెప్పాను. ఎన్నికల నాటికి ఉన్న అప్పులను నాలుగు విడతల్లో ఇస్తానని మాట ఇచ్చాను. ఆ మాట నిలుపుకుంటూ ఇవాళ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, అవన్నీ అక్కచెల్లెమ్మల కష్టాల ముందు చిన్నవే అని భావించి రెండో విడత వైఎస్సార్ ఆసరా కింద సాయం పంపిణీని ప్రారంభిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాన్ని గురువారం ఆయన ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రారంభించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆసరా రెండో విడత డబ్బును పొదుపు సంఘాల ఖాతాల్లో జమ చేసే ఈ కార్యక్రమం ఈ నెల 18వ తేదీ వరకు (13, 15వ తేదీల్లో పండగ మినహాయింపు) కొనసాగుతుందని చెప్పారు. నవరాత్రుల మొదటి రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మండలం ఒక యూనిట్‌గా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులందరూ పాలుపంచుకోవాలని కోరారు. ఉప ఎన్నిక కోడ్ ఉన్నందున వైఎస్సార్ జిల్లాలో మాత్రం నవంబర్ 6 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ నాడు అప్పుల ఊబిలో 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ► స్వయం సహాయ సంఘాలకు రుణమాఫీ చేస్తామని, రుణాలు కట్టవద్దని, 2014 ఎన్నికల్లో అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన మాటను నమ్మి ఆయన్ను గద్దెనెక్కించారు. ఆయన మాత్రం అక్కచెల్లెమ్మలను దగా చేశారు. 2014లో రూ.14,204 కోట్లుగా ఉన్న పొదుపు సంఘాల రుణాలు.. అసలు, వడ్డీలు, ఆ వడ్డీల మీద వడ్డీలు కలిసి 2019 ఎన్నికల నాటికి రూ.25,517 కోట్లకు చేరాయి. ► ఫలితంగా అక్కచెల్లెమ్మలు రోడ్డున పడే పరిస్థితి. 18.36 శాతం సంఘాలు బకాయిలు చెల్లించలేక (ఎన్పీఏ – నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) మూతపడ్డాయి. చాలా సంఘాలు నిర్వీర్యం అయిపోయాయి. సున్నా వడ్డీ పథకాన్ని కూడా 2016 అక్టోబర్ నుంచి పూర్తిగా రద్దు చేశారు. దీంతో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు సుమారు రూ.3,036 కోట్లు బ్యాంకులకు అపరాధ వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ► చంద్రబాబు కారణంగా దాదాపు 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు నష్టపోయారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఈ పరిస్థితుల మధ్య నా పాదయాత్రలో ఆ రోజు నేను ఇచ్చిన మాటనే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. ఆ మాట మేరకు వారిని అప్పుల ఊబి నుంచి బయట పడేసేందుకు వైఎస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చూట్టాం. నేడు తిరిగి ‘ఎ’ గ్రేడ్‌లోకి సంఘాలు ► వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా 7.97 లక్షల డ్వాక్రా పొదుపు సంఘాల్లోని 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు గత ఏడాది మొదటి విడత రూ.6,318 కోట్లు, ఇప్పుడు రెండో విడత మరో రూ 6,440 కోట్లు నేరుగా అందిస్తున్నాం. రెండు విడతల్లో మొత్తంగా దాదాపు రూ.12,758 కోట్లు వారి చేతుల్లో పెట్టినట్లవుతోంది. ► సున్నా వడ్డీ పథకం కింద సకాలంలో రుణాలు చెల్లించిన 9.41 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 98 లక్షల అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి రెండేళ్లలో రూ.2,362 కోట్లు జమ చేశాం. వీటితో పాటు ‘వైఎస్సార్ చేయూత’ అనే పథకం ద్వారా చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. ► తద్వారా ఇవాళ పొదుపు సంఘాలన్నీ తిరిగి నిలదొక్కుకున్నాయి. ఎన్నో సంఘాలు ‘ఎ’ గ్రేడ్‌లోకి చేరాయి. దీంతో ఎన్పీఏ గ్రూపుల శాతం 18.36 నుంచి 0.73 శాతానికి తగ్గిందని సగర్వంగా చెబుతున్నా. పర్యవసానంగా బ్యాంకులకు రికవరీ రేటు శాతం 99.5గా నమోదవుతోంది. రెండో విడత వైఎస్సార్ ఆసరా పథకం కింద డబ్బులు తమ ఖాతాల్లో పడడంతో విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న మహిళలు వైఎస్సార్ చేయూతతో మరింత భరోసా ► 45–60 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.75 వేల సాయం అందిస్తూ అండగా నిలిచాం. 24.56 లక్షల మందికి రెండు విడతల్లో రూ.8,944 కోట్లు ఇచ్చాం. ఆర్థిక చేయూతతో పాటు సాంకేతిక, బ్యాంకింగ్, మార్కెటింగ్, శిక్షణ, తదితర సహకారం ఇస్తూ వాళ్లు వ్యాపారాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ► ఇప్పటికే ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ, రిలయన్స్, హిందూస్థాన్ లీవర్, అమూల్æ, అలానా గ్రూప్, మహేంద్ర గ్రూపు, కేపీ గ్రూప్, టానగేర్ వంటి వ్యాపార దిగ్గజాలు, బహుళజాతి సంస్థలతోపాటు, బ్యాంకులతో కూడా ఒప్పందాలు చేసుకుని అక్కచెల్లెమ్మలు వ్యాపార వేత్తలుగా రాణించేందుకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్నాం. ► ఇప్పటి వరకు 3,05,754 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా షాపులు.. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం వంటి వ్యాపారాలు చేపట్టి నెలకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు అదనపు ఆదాయం పొందుతున్నారు. అమూల్‌తో ఒప్పందం వల్ల మార్కెట్లో పోటీ పెరిగి లీటరు పాలపై రూ.5 నుంచి రూ.15 వరకు అదనపు ఆదాయం లభిస్తోంది. పదవుల్లోనూ మహిళా పక్షపాతమే.. ► దేశ చరిత్రలో తొలిసారిగా నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ కాంట్రాక్టుల్లో 50 శాతం మహిళలకు దక్కేలా ఏకంగా చట్టం చేశాం. హోం మంత్రిగా ఒక మహిళకు స్థానం కల్పించాం. ఉప ముఖ్యమంత్రిగా ఒక ఎస్టీ మహిళకు స్థానం దక్కింది. ఇద్దరు మైనార్టీ మహిళలను ఎమ్మెల్సీలుగా పంపించాం. ఒక బీసీ మహిళకు స్థానం కల్పించాం. చివరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కూడా చరిత్రలో తొలిసారిగా ఒక మహిళను నియమించాం. ► నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లలో మహిళలకు 52 శాతం పదవులు దక్కాయి. మునిసిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ చైర్మన్లు, మేయర్లు.. వీటన్నింటిలో 60.47 శాతం పదవులు అక్క చెల్లెమ్మలకే ఇచ్చాం. ► 13 జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానాల్లో ఏడుగురు మహిళలే కనిపిస్తున్నారు. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మహిళ అని.. నాకు తల్లిలాంటిదని సగర్వంగా తెలియజేస్తున్నా. మేయర్ కూడా నాకు అక్కలాంటిదే. వైస్ చైర్మన్ పదవుల్లో 26 మందికి గాను 15 మంది మహిళలే. ► మద్యాన్ని నియంత్రించగలిగాం. దిశ చట్టం బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. దిశ యాప్ 75 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లోని సెల్ఫోన్లలో ఉంది. ఆపద వేళ వెంటనే ఆదుకుంటుంది. దిశ పోలీసు స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రతి గ్రామ సచివాలయంలో మహిళ పోలీసు కనిపిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చిట్టి తల్లులకు ప్రత్యేకంగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. 7 నుంచి 12వ తరగతి వరకు చిట్టి తల్లుల కోసం స్వేచ్ఛ కార్యక్రమాన్ని మొన్ననే ప్రారంభించాం. ► ఇలా అడుగడుగునా మహిళా పక్షపాతం చూపిస్తున్న ఈ ప్రభుత్వానికి దేవుని ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలు కలకాలం ఉండాలని కోరుకుంటూ వైఎస్సార్ ఆసరా రెండో విడత నగదు పంపిణీ ప్రారంభిస్తున్నా. ► ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, నందిగం సురేష్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఎన్నెన్నో పథకాలు.. ఎంతగానో లబ్ధి ► 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించాలని నిండు మనస్సుతో చిత్తశుద్ధితో మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. జగనన్న అమ్మఒడి ద్వారా 44.50 లక్షల మంది తల్లులకు, 85 లక్షల మంది పిల్లలకు మంచి జరిగేలా ఏటా రూ.6,500 కోట్లు చొప్పున ఇప్పటికే రూ.13,023 కోట్లు అందజేశాం. ► వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా 61 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. (గత ప్రభుత్వ హయాంలో ఇందులో సగం కంటే కొంచెం ఎక్కువ) అప్పట్లో రూ.వెయ్యి వస్తుంటే ఈరోజు రూ.2,250 ఇస్తున్నాం. అప్పట్లో నెలకు రూ.450 కోట్లు మాత్రమే ఖర్చు. ఈ రోజు నెలకు రూ.1450 కోట్లు. ఇప్పుడిస్తున్న 61 లక్షల పెన్షన్లలో 36.70 లక్షల మంది అవ్వలకు, మహిళా వికలాంగులకు, వితంతువులకు ఇచ్చిన మొత్తం రూ.20,894 కోట్లు. ► ‘అర్హులైన పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. రెండు విడతల్లో ఇళ్లు కూడా కట్టిస్తున్నాం. గృహ నిర్మాణం ద్వారా ఇంటికి నలుగురు చొప్పున దాదాపు 1.25 కోట్ల మందికి అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి లబ్ధి కలుగుతోంది. నిర్మాణం పూర్తయ్యాక ప్రతి అక్క, ప్రతి చెల్లి చేతికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వరకు నేరుగా అందించినట్లవుతుంది. ఈ లెక్కన రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద వారి చేతుల్లో పెడుతున్నాం. ► జగనన్న విద్యాదీవెన (ఫీజు రీయింబర్స్మెంట్ పథకం) ద్వారా 18.81 లక్షల మంది తల్లులకు ఇప్పటికే రూ.5,573 కోట్లు ఇచ్చాం. ► హాస్టల్ ఖర్చులకు ఇబ్బంది ఉండకూడదని జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 15.58 లక్షల మంది అమ్మల ఖాతాల్లో రూ.2,270 కోట్లు నేరుగా జమ చేశాం. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద దాదాపు కోటి మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,354 కోట్లు అందజేశాం. ► గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాం. 30.16 లక్షల మందికి మేలు చేస్తూ రూ.2,881 కోట్లు ఖర్చు చేశాం. ► రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లుగా, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మారుస్తూ అడుగులు ముందుకేశాం. ► వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు రూ.982 కోట్లు 3.28 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా మనందరి ప్రభుత్వం వారి చరిత్రను తిరగరాస్తే.. వారు మన రాష్ట్ర చరిత్రను తిరగ రాస్తున్నారు. పని చేస్తున్న ప్రభుత్వాన్ని నిండు మనసుతో దీవిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలతో మొదలైన ఆ దీవెన.. మునిసిపల్, కార్పొరేషన్, తిరుపతి ఉప ఎన్నిక, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. ఇలా ప్రతి ఎన్నికల్లో కనిపిస్తోంది. నా మీద, మనందరి ప్రభుత్వం మీద మీరు చూపిస్తోన్న ఆదరణ, ఆప్యాయత, ప్రేమానురాగాలకు తోడు మీ కష్టానికి మీకెంత చేసినా తక్కువే. యుద్ధ ప్రాతిపదికన వెలిగొండ పనులు కాసేపటి క్రితం వాసన్న (మంత్రి బాలినేని) అడిగిన రూ.409 కోట్ల నీటి ప్రాజెక్టు మంజూరు చేస్తున్నా. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పనులు పూర్తయ్యాయి. రెండో టన్నెల్ పనులు వేగవంతం చేసి.. యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. 2022 ఆగస్టు నాటికి మొదటి టన్నెల్లో 3 వేల క్యూసెక్కుల నీళ్లు పారతాయి. రెండో టన్నెల్ కెపాసిటీ మరో 9 వేల క్యూసెక్కులు. ఈ ప్రాజెక్ట్ నాన్న కల. 2023 ఫిబ్రవరి నాటికి రెండో టన్నెల్ కూడా పూర్తవుతుంది. పుట్టింటోళ్లలా ఆదుకున్నారు కష్టాలొచ్చినప్పుడు పుట్టింటోళ్లు ఎలా ఆదుకుంటారో మీరు (వైఎస్ జగన్) అలా మమ్మల్ని ఆదుకున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో మీరు మా కష్టాలు చూశారు. అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం మేము బ్యాంకులకు బాకీ పడిన మొత్తాలను చెల్లిస్తున్నారు. గత ఏడాది రూ.24 వేలు, ఇప్పుడు రూ.24 వేలు వచ్చింది. చంద్రబాబు పాలనలో అప్పుల పాలయ్యాం. అప్పట్లో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి. అంతకు ముందు వైఎస్సార్ పాలనలో పావలా వడ్డీ కింద రుణాలిచ్చారు. మీరు అధికారంలోకి వచ్చాకే మళ్లీ పావలా వడ్డీ రుణాలు అందుతున్నాయి. వైఎస్సార్ చేయూత, ఇతరత్రా పథకాల ద్వారా కూడా లబ్ధి పొందుతున్నాం. పిల్లలకు మంచి చదువు ఇచ్చి జీవితాలను సుఖమయం చేస్తున్నారు. ఎప్పుడూ మీరే సీఎంగా ఉండాలి. – స్వాతి, పాకల, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా మీ పాలనలో మహిళల్లో సంతోషం రుణాల మాఫీ అని చంద్రబాబు నిలువునా మోసం చేశారు. చివరకు వడ్డీల మీద వడ్డీలు పెరిగి నానా అవస్థలు పడ్డాం. మీరు తండ్రికి తగ్గ తనయుడిలా పాలన సాగిస్తున్నారు. నవరత్నాలతో అన్ని వర్గాలను ఆదుకుంటున్నారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా పథకాల ద్వారా తొలి ఏడాదిలోనే మాకు రూ.97 వేలు అందాయి. వీటితో పొలం పనులు, డ్వాక్రా చూసుకుంటూనే రెండు గేదెలను కొనుక్కున్నాను. అమూల్ పాల కేంద్రంలో పాలు పోసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. లీటరు ధర రూ.50 నుంచి రూ.75 వరకు వస్తోంది. పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాను. స్త్రీ నిధి లోను ద్వారా మరో రెండు గేదెలు కొనుక్కున్నాను. ఇప్పుడు మీ ద్వారా ఇల్లు కూడా కట్టుకుంటున్నాం. మీ పాలనలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారన్నా. – అశ్విని, అల్లూరు, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా ఆ లేఖ ఏదో బాబుకే రాయండి సీఎం వైఎస్ జగన్‌కు ఈ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారట. మీకు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే ఆ లేఖ ఏదో మీ చంద్రబాబుకు రాయాల్సింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రకాశం జిల్లాకు ఒక్క నిర్దిష్టమైన పని చేశారా? అని లేఖ రాయాల్సింది. ఆ ఐదేళ్లలో జిల్లా ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టి ప్రజలు చీదరించుకుంటున్నారని చంద్రబాబుకు లేఖ రాయాల్సింది. అలా రాసి ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. చంద్రబాబు చేసిన మోసాన్ని డ్వాక్రా మహిళలు మరచిపోలేదు. పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసే ధైర్యం లేదు. ఇక జనసేనానిఒంటరిగా పోటీ చేసి.. రెండు సీట్లు తెచ్చుకోమనండి చూద్దాం. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు 151 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు సీఎం జగన్ హామీలన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఒంగోలు నగరంలో నాలుగు రోజులకు ఒకసారి మంచినీళ్లు ఇవ్వాల్సి వస్తోంది. ప్రజల దాహార్తి తీర్చడానికి రూ.400 కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నాం. – బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు రెండో విడత వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ద్వారా ఒంగోలుతో పాటు రాష్ట్రమంతా దసరా పండుగ వారం ముందే వచ్చినట్లుంది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారు. మహిళా పక్షపాతిగా సీఎం వైఎస్ జగన్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అమ్మలోని మొదటి అక్షరం ‘అ’ ను, నాన్నలోని రెండో అక్షరం ‘న్న’ను తీసుకొని.. అన్నగా, జగనన్నగా, తోబుట్టువుగా, మా పిల్లలకు మేనమామగా.. అంటూ అక్కచెల్లెమ్మలు సీఎం జగన్‌ను తమ తమ కుటుంబ సభ్యునిగా భావిస్తున్నారు. ఈ దృష్ట్యా మన సీఎం.. అక్క, చెల్లెమ్మల జీవితాల్లో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చైతన్యాన్ని తీసుకొస్తూ ఇంటి పెద్దగా బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా, కులాల మధ్య చిచ్చు పెట్టినా, మతాల మధ్య మనస్పర్థలు రేపినా రాష్ట్ర ప్రజలు మాత్రం జగనన్న పక్షానే ఉంటారన్నది గుర్తు పెట్టుకోవాలి. – ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నాయకుడంటే జగన్‌లా ఉండాలి వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు 3,648 కిలో మీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని రెండు పేజీలతో మేనిఫెస్టో రూపొందించారు. వాటిలో ఇప్పటికే 90 శాతం పైగా పూర్తి చేశారు. ఇతరత్రా ఎన్నో హామీలు నెరవేర్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి అంటే 2014కు ముందు డ్వాక్రా మహిళల రుణాలు రూ.14,200 కోట్లు ఉన్నాయి. అధికారంలోకి వస్తే మాఫీ చేస్తానన్నాడు. ఆ మాట నిలుపుకోలేదు. 2019 ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగే నాటికి ఆ రుణాలు కాస్తా అసలు, వడ్డీ, చక్ర వడ్డీలు కలుపుకొని రూ.25,517 కోట్లకు చేరాయి. నాలుగు విడతల్లో ఈ రుణాల మొత్తాన్ని మన సీఎం డ్వాక్రా మహిళలకు అందజేస్తున్నారు. చంద్రబాబు అటకెక్కించిన సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి ప్రారంభించారు. రూ.2.361.5 కోట్ల బకాయిలు చెల్లించారు. నాయకుడంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లా ఉండాలి. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి -
ఇసుక తవ్వకాలకూ ఈ–పర్మిట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలకు ఇకపై ఈ పర్మిట్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు భూగర్భ గనుల శాఖ సంచాలకులు (డీఎంజీ) వీజీ వెంకటరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఇతర మినరల్స్‌కు అనుమతులు ఇచ్చేందుకు ఈ పర్మిట్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇకపై ఇసుక తవ్వకాలకు కూడా ఇదే విధానం వర్తింప చేస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇసుక తవ్వకాలను అప్పగించే క్రమంలో టెండర్లను దక్కించుకున్న జేపీ పవర్ వెంచర్స్‌తో జరిగిన అగ్రిమెంట్లోనే ఈ మేరకు అంగీకారం కుదిరిందన్నారు. ఇసుకకు ఈ పర్మిట్ కోసం మైనింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అమలులోకి తీసుకు వస్తున్నామని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. జేపీ పవర్ వెంచర్స్ సంస్థ రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకాలు జరిపేందుకు ఆన్లైన్లో ఈ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆయా రీచ్‌ల పరిధిలోని మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను పరిశీలించి, ఎటువంటి జాప్యం లేకుండా డీఎంజీ కార్యాలయం నుంచి ఈ పర్మిట్‌ను జారీ చేస్తామని పేర్కొన్నారు. తద్వారా ఏ రీచ్‌లో ఎంత మేరకు మైనింగ్ జరిగిందనేది కచ్చితంగా తెలుస్తుందని, మరింత పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందని తెలిపారు. -
ఏపీ: ఇకపై ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్
సాక్షి, అమరావతి: ఇకపై ఏపీలో ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్ తప్పనిసరి చేశామని.. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసినట్లు భూగర్భ గనుల శాఖ సంచాలకులు (డీఎంజీ) వీజీ వెంకటరెడ్డి తెలిపారు. ఇసుకకు ఈ-పర్మిట్ కోసం మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేశామని, ఇప్పుడు అమలులోకి తీసుకువస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు ఇతర మినరల్స్‌కు అనుమతులు ఇచ్చేందుకు ఈ-పర్మిట్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇకపై ఇసుక తవ్వకాలకు కూడా ఇదే విధానం వర్తింపచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్న జేపీ పవర్ వెంచర్స్ సంస్థ ఇకపై రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకాలు జరిపేందుకు ఆన్లైన్లో ఈ-పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆయా రీచ్‌ల పరిధిలోని మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ల ద్వారా ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి ఎటువంటి జాప్యం లేకుండా డీఎంజీ కార్యాలయం నుంచి ఈ-పర్మిట్‌ను జారీ చేస్తామన్నారు. ఈ పర్మిట్ వల్ల ఏ రీచ్‌లో ఎంత ఇసుక తవ్వకానికి సంబంధించి అనుమతులు ఇచ్చాం. ఏ మేరకు మైనింగ్ జరిగిదనేది ఖచ్చితంగా తెలుస్తుందని, ఆన్లైన్లో దీనికి సంబంధించిన వివరాలు నమోదవ్వడం వల్ల మరింత పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందన్నారు. చదవండి: వ్యాక్సినేషన్: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ఈ ఏడాదిని చీని, నిమ్మ సంవత్సరంగా ప్రకటిస్తున్నాం: కన్నబాబు -
క్వారీ లీజుల జారీకి సింగిల్ డెస్క్ పోర్టల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్వారీ లీజుల జారీకి వివిధ విభాగాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా సింగిల్ డెస్క్ పోర్టల్ (ఏకగవాక్ష తరహా) విధానానికి భూగర్భ గనుల శాఖ శ్రీకారం చుట్టింది. క్వారీ లీజులు/ రెన్యువల్ కోసం ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తోంది. మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరించే విధానాన్ని రద్దు చేసింది. ఇకపై ఎవరైనా క్వారీ లీజులు/ రెన్యువల్ కోసం ఆంధ్రప్రదేశ్ భూగర్భ గనుల శాఖ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న విధంగా సింగిల్ డెస్క్ పోర్టల్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూమిలో లీజు కోసం దరఖాస్తు చేస్తే దానిని సంబంధిత సహాయ సంచాలకులు/ ఉప సంచాలకులు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోసం ఆన్లైన్లోనే ఆ ప్రాంత తహసీల్దారుకు పంపుతారు. తహసీల్దారు దానిని పరిశీలించి గ్రామ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకుని, వ్యక్తిగతంగా పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే ఆన్లైన్లోనే గనుల శాఖకు ఎన్ఓసీ పంపుతారు. అటవీ భూమి అయితే.. ఒకవేళ అటవీ భూమిలో లీజు కోసం దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారి ఆ దరఖాస్తును ఆ ప్రాంత డివిజనల్ అటవీ అధికారికి పంపుతారు. ఆయన నిబంధనలను పరిశీలించి, దరఖాస్తుదారు ప్రత్యామ్నాయ భూమికి, ప్రత్యామ్నాయ వనీకరణ కింద నిధులు జమ చేసేందుకు అంగీకరిస్తే అటవీ శాఖకు నివేదిక పంపుతారు. అటవీశాఖ దానిని పరిశీలించి అనుమతిస్తుంది. ఎక్కువ విస్తీర్ణమైతే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పారదర్శకంగా, జవాబుదారీతనంతో లీజుల జారీకి నిబంధనలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సింగిల్ డెస్క్ పోర్టల్’విధానం అమల్లోకి తెచ్చామని గనుల శాఖ సంచాలకులు వెంకటరెడ్డి తెలిపారు. దీనివల్ల దరఖాస్తుదారుల డబ్బు, సమయం కూడా ఆదా అవుతాయని చెప్పారు. -
మీట నొక్కితే పర్మిట్లు
సాక్షి, అమరావతి: భూగర్భ గనుల శాఖ సంస్కరణల దిశగా సాగుతోంది. ఖనిజ దోపిడీ, అక్రమ తవ్వకాలు, రవాణాను నియంత్రించడం ద్వారా రాబడి పెంపు లక్ష్యంగా చర్యలు చేపట్టింది. విజిలెన్స్ తనిఖీలను ముమ్మరం చేసి ఖనిజ దోపిడీదారులకు భారీ అపరాధ రుసుం విధిస్తోంది. అక్రమాలకు పరోక్షంగా సహకరించిన అధికారులపైనా కఠినంగా వ్యవహరిస్తోంది. ‘ఖనిజ వనరులను దోచుకుంటే ఎంతటివారైనా వదలొద్దు. కఠినంగా వ్యవహరించి ఖజానాకు ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోండి. అక్రమార్కులకు సహకరించినట్లు తేలితే అధికారులపైనా కొరడా ఝుళిపించండి’ అని భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు. పారదర్శకంగా ఆన్లైన్లో.. పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా ప్రభుత్వం ఆన్లైన్లోనే దరఖాస్తు, మంజూరు విధానాన్ని అమలు చేస్తోంది. ఆన్లైన్ విధానం వల్ల క్వారీ లీజులు, పర్మిట్లు, ట్రాన్సిట్ పాసులు పొందేందుకు అధికారుల వద్దకు పరుగులెత్తాల్సిన పని ఉండదు. ఇంటి నుంచో ఆఫీసు నుంచో దరఖాస్తు చేసుకుంటే చాలు. అధికారులు కంప్యూటర్లలో పరిశీలించి ఆన్లైన్లోనే అనుమతులు ఇస్తారు. లీజుదారులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ట్రాకింగ్ ఉన్న వాహనాలకే ట్రాన్సిట్ పాసులు జారీ అవుతాయి. మరోవైపు రాబడి పెంపు లక్ష్యంగా నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్ లీజులకు కూడా టెండరు విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అక్రమార్కులపై ఉక్కుపాదం గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు, బినామీ లీజుదారులు రాయల్టీ, ఇతర రుసుములు చెల్లించకుండా ఎగ్గొట్టి అక్రమంగా గ్రానైట్ తవ్వి రూ.వేల కోట్లు కాజేశారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ దర్యాప్తులో తేలడంతో ఎగ్గొట్టిన రాయల్టీ, అపరాధ రుసుము కలిపి చెల్లించాలంటూ గనుల శాఖ సంచాలకులు డిమాండ్ నోటీసులు జారీ చేశారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 105 మందికి ఇలా డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. అక్రమాలకు సహకరించారనే అభియోగంపై కొందరు సహాయ సంచాలకులపైనా ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తద్వారా అక్రమార్కులపై ఉక్కుపాదం తప్పదని గట్టి సంకేతాలనిచ్చింది. -
‘ఇసుక సరఫరా’కు టెండర్లు
సాక్షి, అమరావతి: పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజలకు ఇసుక అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ బాధ్యతల నిర్వహణ కోసం అర్హమైన సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఇసుక తవ్వకం, రీచ్‌లు/ స్టాక్ పాయింట్ల వద్ద ప్రజలకు సరఫరా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఉత్తమ సంస్థల ఎంపిక అత్యంత కీలకమైనది. అందువల్ల టెండర్ల ద్వారా అర్హత ఉన్న సంస్థలను ఖరారు చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ)కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాన్ని మూడు జోన్లు (విభాగాలు)గా విభజించి ఎంఎస్టీసీ బిడ్లు స్వీకరించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఎంఎస్టీసీ ఈ నెల 4వ తేదీన అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. 13 జిల్లాలు మూడు జోన్లుగా విభజన రాష్ట్రంలోని 13 జిల్లాలను మూడు జోన్లుగా ప్రభుత్వం విభజించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలను ఒక జోన్‌గా పేర్కొంది. అలాగే పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఒక జోన్‌గా, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలను మరొక జోన్‌గా పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో ఇసుక తవ్వకం/ సరఫరాకు ఆసక్తిగల సంస్థల నుంచి ఎంఎస్టీసీ వేర్వేరుగా బిడ్లు ఆహ్వానిస్తుంది. మొదట టెక్నికల్ బిడ్లు నిర్వహిస్తుంది. టెండర్లలో పాల్గొనే సంస్థలకు ఉండాల్సిన ఆర్థిక, నిర్వహణ సామర్థ్యం, అలాగే అనుభవం లాంటి వాటిని ప్రభుత్వంతో చర్చించి ఎంఎస్టీసీ ఖరారు చేస్తుంది. దీని ప్రకారం టెక్నికల్ బిడ్లు స్వీకరిస్తుంది. వీటిలో అర్హమైన సంస్థల నుంచి ఫైనాన్షియల్ బిడ్లు స్వీకరిస్తుంది. తక్కువ మొత్తానికి కోట్ చేసిన (ఎల్–1గా నిలిచిన) సంస్థలకు వేర్వేరుగా ఆయా ప్రాంతాల్లో ఇసుక నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించనుంది. ప్రజలే ఎంపిక చేసుకోవచ్చు ► ఎంపికైన సంస్థలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ప్రజలకు రీచ్‌లు/ స్టాక్ పాయింట్లలో ఇసుకను అందించాల్సి ఉంటుంది. నయాపైసా కూడా ఎక్కువ వసూలు చేయడానికి వీలుండదు. ► ప్రజలు ఏ రీచ్కైనా/ స్టాక్ పాయింట్‌కైనా వెళ్లి స్వయంగా పరిశీలించి నాణ్యమైన ఇసుకను ఎంపిక చేసుకోవచ్చు. ► అక్కడికక్కడే డబ్బు చెల్లించి రసీదు తీసుకుని నచ్చిన అద్దె/ సొంత వాహనాల్లో ఇసుక తీసుకెళ్లవచ్చు. మట్టి ఇసుక వచ్చిందనే మాటే ఉండదు. పరిమాణంపై ఎలాంటి పరిమితులు ఉండవు. ఎంత అవసరమైతే అంత తీసుకెళ్లవచ్చు. ► ఆన్లైన్ బుకింగ్ విధానం స్థానే ఆఫ్‌లైన్ విధానం ఉంటుంది. అందువల్ల సర్వర్ పనిచేయలేదనే బాధలు, ఆన్లైన్ మోసాలు, సిఫార్సుల ఊసుండదు. ► ప్రజలకు నాణ్యమైన ఇసుకను అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. ఎడ్ల బండ్లలో ఉచితమే ► నదీ పరిసర ప్రాంతాల్లోని వారు సొంత అవసరాల కోసం ఎడ్ల బండ్లలో ఇసుక ను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వం నిర్మించే సహాయ పునరావాస కాలనీల ఇళ్లకు కూపన్ల ద్వారా ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చు. ► ప్రజలకు ఇసుక కొరత లేకుండా అందుబాటులోకి తేవడం కోసం ప్రభుత్వం ఇప్పటికే 500 ఇసుక రీచ్‌లను గుర్తించింది. వాటికి త్వరగా అన్ని రకాల అనుమ తులు తెచ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో జలవనరులు, భూగర్భ గనుల శాఖలు డ్రెడ్జింగ్ ద్వారా పెద్ద ఎత్తున ఇసుక అందుబాటులోకి తెచ్చే ప్రయ త్నాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇక్కడ భారీగా ఇసుక నిల్వలు ఉన్నట్లు కూడా గుర్తించారు. -
జేసీ కుటుంబానికి మైనింగ్ శాఖ నోటీసులు
తాడిపత్రి అర్బన్, రూరల్: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబీకులు నిర్వహిస్తున్న సుమన, భ్రమరాంబ మైనింగ్ సంస్థల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించామని మైనింగ్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణారావు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రెండు డోలమైట్ మైనింగ్ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు నిర్వహించడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. విధుల్లో భాగంగానే మైన్స్‌ను తనిఖీ చేశామని, ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని డీడీ పేర్కొన్నారు. పోలీసులను అవహేళన చేయడంపై జేసీపై కేసు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. విధి నిర్వహణలోని పోలీసులను అవహేళనగా మాట్లాడటంతో పాటు సమాజంలో వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా.. వివిధ రకాల వ్యవస్థలను కించపరిచేలా వ్యాఖ్యానించడంపై ఆయనపై కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని మైన్స్ కార్యాలయం వద్ద విధుల్లో వున్న ఓ పోలీసు అధికారిని జేసీ అవహేళనగా మాట్లాడారు. అంతేకాక ప్రభుత్వంలోని పలు వ్యవస్థలపై బెదిరింపు ధోరణితో వ్యవహరించారు. దీంతో పోలీసు అధికారి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జేసీపై కేసు నమోదు చేశారు. -
మా వాళ్లు రాక్షసులు.. మీ రక్తం తాగుతారు: జేసీ
తాడిపత్రి అర్బన్: ‘‘మా అనుచరులు రాక్షసులు. పచ్చి రక్తం తాగేవాళ్లు నా చుట్టూ ఉన్నారు. వాళ్లు మీ రక్తాన్ని పులి, సింహాల్లాగా తాగుతారు.’’ అని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అధికారులను బెదిరించే ధోరణిలో వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మమ్మల్ని అధికారులు సన్మానిస్తే, మేము అధికారంలోకి వచ్చాక వారిని రెట్టింపు స్థాయిలో సన్మానిస్తాం అంటూ వ్యంగ్యంగా హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో జేసీ దివాకర్‌రెడ్డి నిర్వహిస్తున్న క్వారీలో అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ విషయమై శుక్రవారం తాడిపత్రిలోని భూగర్భ గనుల శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి వచ్చిన జేసీ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తన క్వారీలను అధికారులు తనిఖీ చేస్తున్నారని, రాయల్టీల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇవ్వడం లేదని మండిపడ్డారు. అధికారులు ట్రాన్ఫర్లకు బయపడి తన గనులు మూసేయాలని చూస్తున్నారనీ, తనకు అన్నం దొరకకుండా చేసి చంపాలనుకుంటున్నారనీ ఆరోపించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీఐ తేజోమూర్తిని ‘మీరు కూడా వెళ్లారా మా క్వారీ వద్దకు అంటూ’ జేసీ ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పకపోవడంతో.. ‘నీ సర్వీస్ ఇంకా ఎన్ని రోజులు ఉంది? మేము అధికారంలోకి వస్తే మీ పని పనిపడతాం’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. -
‘బీఎంఎం’పై సర్కారు ప్రేమ
సాక్షి, హైదరాబాద్: బీఎంఎం సిమెంట్స్‌పై సర్కారు అవ్యాజ ప్రేమ కనబరుస్తోంది. మైనింగ్ లీజులకోసం వచ్చిన వేలాది దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన సర్కారు బీఎంఎం సిమెంట్స్‌కు మాత్రం అనంతపురం జిల్లా యాడికి మండలం గుడిపాడు గ్రామంలో 1,123.32 ఎకరాల సిమెంట్ గ్రేడ్ సున్నపురాయి మైనింగ్ లీజును మంజూరు చేసింది. ఈ మేరకు భూగర్భ గనులశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రప్రభుత్వం ఈ ఏడాది జనవరి 12న కొత్త మైనింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ చట్టం-2015 ప్రకారం మేజర్ మినరల్స్ లీజులన్నింటినీ వేలం విధానం ద్వారానే కేటాయించాలనేది ముఖ్యమైన అంశం. అయితే అప్పటికే మైనింగ్, ప్రాస్పెక్టింగ్ లీజుల మంజూరుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిన, నిబంధనలకనుగుణంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు మాత్రం పాత విధానంలోనే కేటాయించవచ్చనే వెసులుబాటు ఉంది. దీని ఆధారంగానే టీడీపీ ప్రభుత్వం తాజాగా బీఎంఎం సిమెంట్స్‌కు మైనింగ్ లీజు జారీచేసింది. అయితే మైనర్ మినరల్ పాలసీ వచ్చేవరకూ లీజులు జారీ చేయబోమంటూ వేలాది దరఖాస్తుల్ని పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం.. ఈ సంస్థకు మాత్రం లీజు ఇవ్వడంలో ‘ప్రత్యేక అభిమానం’ చూపడం గమనార్హం. -
‘జియోమైసూర్’కు జీ హుజూర్!
2223.95 ఎకరాల అభయారణ్యంలో ఖనిజాన్వేషణకు పచ్చజెండా * సాధుకొండ ప్రాంతంలో రూ. 60 వేల కోట్ల నుంచి * 80 వేల కోట్ల ఖనిజ నిక్షేపాలు సాక్షి, హైదరాబాద్: చిత్తూరుజిల్లా సాధుకొండ అభయారణ్యంలో 2223.95 ఎకరాల (9 చదరపు కిలోమీటర్ల) అభయారణ్యంలో బంగారం, వెండి, రాగి, ఇనుము, లెడ్, జింక్ అన్వేషణకు వీలుగా మూడేళ్లు అమల్లో ఉండేలా ప్రభుత్వం ప్రాస్పెక్టింగ్ లెసైన్సు (పీఎల్) మంజూరు చేసింది. ఈమేరకు భూగర్భ గనుల శాఖ కార్యదర్శి రావత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల ఆందోళనను తోసిరాజంటూ బెంగుళూరుకు చెందిన జియోమైసూర్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు అనే సంస్థకు పీఎల్ మంజూరు చేయడం వెనుక ప్రభుత్వ పెద్దలే ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. వేలాది కోట్ల విలువైన బంగారం, వెండి, ఇనుము ఇతర ఖనిజ నిక్షేపాలు పెద్దమొత్తంలో ఉండటంవల్లే ప్రభుత్వం ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఈ సంస్థకు జీహుజూర్ అందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.... చిత్తూరు జిల్లాలోని సాధుకొండ అభయారణ్యంలోని మల్లయ్యకొండ, సాధుకొండ, ఇనుముకొండల్లో భారీ స్థాయిలో బంగారం, వెండి, ఇనుము, రాగి తదితర నిక్షేపాలున్నాయని జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో తేల్చింది. ఇనుము ఎక్కువగా ఉన్నందునే ఇక్కడి కొండను ప్రజలు ఇనుము కొండ అంటున్నారు. దీంతో ఇక్కడ లీజు తీసుకుని ఖనిజాలు తవ్వి విక్రయించడం ద్వారా వేల కోట్లు గడించాలని పలు సంస్థలు దృష్టి సారించాయి. ‘జియోమైసూర్’ సంస్థ గతంలోనే ఈ ప్రాంతంలోని 2223.95 చదరపు ఎకరాల్లో పీఎల్ కోసం దరఖాస్తు చేసింది. దీనిపై నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానిదే అయినందున అప్పటి ప్రభుత్వం ఫైలును కేంద్రానికి పంపింది. కేంద్రం విధించిన షరతులను ఆ కంపెనీ నెరవేర్చకపోవడంతో ఆ ఫైలును పక్కన పెట్టేసింది. దీంతో చేసేదేంలేక మౌనంగా ఉన్న జియోమైసూర్ 2012లో తన ప్రయత్నాలను మొదలుపెట్టింది. అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకుని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఒత్తిడి పెంచింది. అప్పట్లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోకుండా చంద్రబాబు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే తమ దరఖాస్తును ఆమోదించాలంటూ జియోమైసూర్ ప్రతినిధులు ఏకంగా మూడుసార్లు (సెప్టెంబరు 3న, నవంబరు 6న, డిసెంబరు 6న) ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో జిల్లాలోని పలు ప్రాంతాల వారు ఆందోళనలు చేపట్టారు. పవిత్రమైన దేవాలయాలున్న ప్రాంతంలో తవ్వకాలకు అనుమతించరాదంటూ ధర్నాలు, ప్రదర్శనలకు దిగారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండలో మైనింగ్‌కు అనుమతించే ప్రసక్తే లేదని 2012 నవంబరు 10న అప్పటి ప్రభుత్వం వెల్లడించింది. తదుపరి భూగర్భ గనులు, అటవీ, రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి ఈ కొండల్లో 40పైగా గుళ్లు, గుహలు ఉన్నాయని ప్రకటించారు. ఆ తర్వాత విభజన ఉద్యమం, ఎన్నికల నేపథ్యంలో ఆ ఫైలు పక్కన పడిపోయింది. తాజాగా టీడీపీ ప్రభుత్వంలోని కీలక నేత నేరుగా సంబంధిత అధికారులను ఆదేశించి పీఎల్ మంజూరు చేయించారు. ప్రాధాన్యం ఎందుకంటే... సాధుకొండ ప్రాంతంలో రూ. 60 వేల కోట్ల నుంచి 80 వేల కోట్ల విలువైన బంగారం, ఇనుము, వెండి, రాగి తదితర ఖనిజ నిక్షేపాలున్నాయని గతంలో సర్వేలు తేల్చాయి. స్వాతంత్య్రం రాక మునుపే 1942లో బ్రిటిషు ప్రభుత్వ హయాంలోనే మల్లయ్యకొండ, సాధుకొండ ప్రాంతాల్లో బంగారు ఖనిజం వెలికితీతకు రంగం సిద్ధం చేసినా.. సహాయ నిరాకరణ ఉద్యమం ఎగిసిపడటంతో వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో బంగారం తవ్వకాల్లో అనుభవం ఉన్న జియోమైసూర్ సంస్థ ఈ ప్రాంతంలో మొదట పీఎల్ తీసుకుని తర్వాత మైనింగ్ లెసైన్సు తీసుకోవడం ద్వారా తవ్వకాలు జరపాలని నిర్ణయించుకుంది. ఖనిజాన్వేషణకు సంబంధించి ఈ సంస్థ నివేదిక సమర్పించిన తర్వాత మైనింగ్ లీజు కోసం దరఖాస్తు చేయడం... దానికే లీజు మంజూరు చేయడం ఖాయమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘పీఎల్ వచ్చిందంటే తర్వాత ఎంఎల్ వచ్చినట్లే. గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం - 2015కు లోబడి ఈ సంస్థ దరఖాస్తు అమల్లో ఉందని ప్రత్యేకంగా ప్రభుత్వం పేర్కొనడాన్ని బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది’ అని భూగర్భ గనుల శాఖకు చెందిన ఒక అధికారి ‘సాక్షి’తో చెప్పారు. -
డ్వాక్రాలకు ఇసుక ర్యాంపులు హుళక్కే?
అనకాపల్లి సర్కిల్ నదుల్లో అధికారుల పరిశీలన శారద, తాండవ పరిధిలో అధికారిక రీచ్‌లు లేనట్టే వరహా నదిలో మూడింటి అనుమతికి అవకాశం తుది నిర్ణయం జిల్లా కలెక్టర్ చేతుల్లోనే అనకాపల్లి : ఇసుక రీచ్‌ల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ అనకాపల్లి సర్కిల్ పరిధిలో అధికారికంగా వాటిని నిర్వహించే వీలు లేకుండాపోతోంది. అనకాపల్లి సర్కిల్ భూగర్భ గనుల శాఖ పరిధిలో ఏ ఏ చోట్ల ఇసుక రీచ్‌లు నిర్వహించవచ్చో తెలుసుకొనేందుకు వివిధ శాఖల అధికారులు చేపట్టిన సంయుక్త సర్వేలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. అనకాపల్లి సర్కిల్లోని జాజిగెడ్డ- 1, 2, కల్యాణపులోవ, తాండవ రిజర్వాయర్ పరిధిలో స్వయం సహా యక గ్రూపులు రీచ్‌లు నిర్వహించేం దుకు సరిపడా ఇసుక లేదని అధికారులు కొద్దిరోజుల క్రితం తేల్చారు. తాజాగా నదుల్లో ఇసుక రీచ్ లు ఏ ఏ చోట్ల నిర్వహించవచ్చో అంచనా వేసేం దుకు భూగర్భ గనుల శాఖ, నీటి పారుదల శాఖ, భూగర్భ జల వనరుల శాఖకు చెందిన బృందాలు ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకూ శారదా, వరహా, తాండవ, సర్ప నదు ల్లో సర్వే చేపట్టాయి. 39 ప్రాంతాల్లో ఇసుక తవ్వకానికి గల అవకాశాలు, సాంకేతిక అవరోధాలను పరిశీలించాయి. వాల్టా చట్టం అవరోధంగా మారడంతో ఒక్క వరహా నదీ పరివాహక ప్రాంతంలో మాత్రమే మూడుచోట్ల ఇసుక రీచ్‌లు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సర్వేలో గుర్తిం చాయి. అయితే సర్వే బృందం సమర్పించిన నివేదిక పరిశీలించి నిర్ణయం తీసుకునేది కలెక్టర్ కావడంతో ఎన్ని రీచ్‌లకు అనుమతి లభిస్తుందనేది ఉత్కంఠగా ఉంది. 21 మండలాలతో విశాలంగా ఉండే అన కాపల్లి సర్కిల్ పరిధిలో ఇసుక రీచ్‌ల నిర్వహణకు అవకాశాలు లేకపోవడం డ్వాక్రా గ్రూపులకు నిరాశ కల్గించినట్టే. అక్రమార్కులపై చర్యలు శూన్యం అనధికారికంగా ఇసుక ర్యాంప్‌లు నిర్వహిస్తున్న వారిని అధికార యంత్రాంగం ఏమీ చేయలేకపోతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకోవాల్సింది మండల స్థాయి అధికారులని చెప్పి తప్పించుకుం టున్నారు.