deployed army
-
19 వరకూ బెంగాల్లో 400 కంపెనీల కేంద్ర బలగాలు
2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలను ఎన్నికల సంఘం జూన్ 4న వెల్లడించనుంది. మరోవైపు గత కొన్నేళ్లుగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సుమారు 400 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపును జూన్ 19 వరకు పొడిగించాలని నిర్ణయించింది.పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిన అనంతరం 400 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపును జూన్ 19 వరకు పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు జూన్ 19 వరకు కేంద్ర బలగాల భద్రతా సిబ్బందిని మోహరించనున్నామని ఎన్నికల సంఘం అధికారి తెలిపారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలకు ఓటింగ్ జరిగింది. నేడు (సోమవారం) కొన్ని బూత్‌లలో రీపోలింగ్ జరుగుతోంది. ఓట్ల లెక్కింపు ముగిసిన రెండు రోజుల వరకూ అంటే జూన్ 6 వరకు కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం గతంలో నిర్ణయించింది. అయితే ఇప్పుడు దీనిని ఈ నెల 19 వరకూ కొనసాగించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు.బీజేపీ నేత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఇటీవల ఎన్నికల సంఘానికి చెందిన ప్రత్యేక పరిశీలకునితో సమావేశమయ్యారు. అలాగే కోడ్ ముగిసిన తర్వాత కూడా మూడు నెలల పాటు కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే ఉంచాలని గవర్నర్‌తో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. -
సందేశ్‌ఖాలీలో మళ్లీ ఉద్రిక్తత.. అప్రమత్తమైన పోలీసులు!
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఉత్తర 24 పరగణా జిల్లాలోని బసిర్హాట్ సబ్ డివిజన్లో ఉన్న సందేశ్‌ఖాలీలో బుధవారం అర్ధరాత్రి మరోమారు ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. సందేశ్‌ఖలీలో రైతులు, పేదల భూములను టీఎంసీ నాయకులు ఆక్రమించారని, మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలున్నాయి. టీఎంసీ నేతల వేధింపులకు వ్యతిరేకంగా మహిళలు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా ఈ నిరసనల్లోకి దిగింది. టీఎంసీ నేత షాజహాన్తో సహా నిందితులందరినీ అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాగా సందేశ్‌ఖాలీలో కొనసాగుతున్న హింసాకాండ కారణంగా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసు చీఫ్‌కి నోటీసు పంపింది. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలోని సందేశ్‌ఖాలీలో ఒక రాజకీయ నేత మద్దతుదారులు పేద మహిళలను హింసించారని ఆరోపిస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన నివేదికలను ఎన్హెచ్ఆర్సీ స్వీకరించింది. సందేశ్‌ఖాలీలో ఇటీవల జరిగిన సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేసేలా మానవ హక్కుల ఉల్లంఘనలను సూచిస్తున్నాయని కమిషన్ పేర్కొంది. ఈ ఘటనల్లో పాలుపంచుకున్నవారిపై చేపట్టిన చర్యలకు సంబంధించి నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ పోలీసు డైరెక్టర్ జనరల్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసు జారీ చేసింది. -
సరిహద్దుల్లో టెన్షన్..టెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లోని దక్షిణ పాంగాంగ్ ప్రాంతంలో చైనా ట్యాంకులు ,పదాతిదళాలు మోహరించాయి. ఆగస్ట్ 30న ఈ ప్రాంతంలోకి చొచ్చుకువచ్చిన చైనా దళాలను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిన అనంతరం చైనా మరోసారి దూకుడు ప్రదర్శిస్తోంది. ఎల్ఏసీకి 20 కిలోమీటర్ల దూరంలో డ్రాగన్ సైన్యం అత్యాధునిక గన్స్, యుద్ధపరికరాలతో సన్నద్ధమైంది. దక్షిణ పాంగాంగ్‌లోని మోల్ధో వద్ద చైనా స్ధావరాలకు చేరువలోనే చైనా ట్యాంకులు పదాతిదళాల కదలికలను పసిగట్టినట్టు ఓ జాతీయ న్యూస్ ఛానెల్ పేర్కొంది. చైనా భారీ ఆయుధాల కదలికను భారత సైన్యం పసిగడుతూనే ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కుంగ్ నుండి ముక్పారికి వెలుపల చైనా సైన్యం మోహరించింది. ఇందులో కీలకమైన స్పాంగూర్ గ్యాప్ యొక్క రెండు భుజాల నియంత్రణ ఉంటుంది, ఇది అధిక ఎత్తులో ఉన్న పాస్ రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో ట్యాంకులు పనిచేయగలవు. మరోవైపు భారత సైన్యం యుద్ధ ట్యాంకులతో అదనపు దళాలతో ఈ ప్రాంతంలో వివాదాస్పద ఎల్ఏసీ ప్రాంతం వెంబడి మోహరించింది. చైనా సాయుధ దళాలను ట్యాంక్ విధ్వంస క్షిపణులు, రాకెట్లు, ఇతర ఆయుధాలతో తిప్పికొట్టేలా భారత్ ఈ ప్రాంతంలో సర్వసన్నద్ధమైంది. తూర్పు లడఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో భారత్ క్షిపణి సహిత టీ-90 యుద్ధ ట్యాంకులు, టీ-72ఎం1 ట్యాంకులను సిద్ధం చేసింది. మరోవైపు ఇరు పక్షాల వైమానిక దళాలు సైతం ఎల్ఏసీపై పహారా కాస్తున్నాయి. ఎల్ఏసీ వెంబడి పరిస్థితి కొంతమేర ఉద్రిక్తంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే శుక్రవారం పేర్కొన్నారు. మన భద్రత కోసం ముందస్తుగా దళాల మోహరింపును చేపట్టామని చెప్పారు. చదవండి : దుస్సాహసానికి దిగితే తీవ్ర నష్టం: రావత్ -
దుస్సాహసానికి దిగితే డ్రాగన్‌కు బుద్ధి చెబుతాం!
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతాల్లో చైనా దళాల కదలికలకు కొద్ది రోజుల ముందే సరిహద్దు సమీపంలో చైనా వాయుసేన అత్యాధునిక జే-20 యుద్ధవిమానాలను తిరిగి మోహరించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఇప్పటికీ చైనా యుద్ధవిమానాలు విస్తృతంగా కదులుతున్నాయని అధికారులు తెలిపినట్టు ఓ జాతీయ వెబ్సైట్ పేర్కొంది. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ హాటన్ ఎయిర్‌బేస్ నుంచి డ్రాగన్ జే-20ల కదలికలు సాగుతున్నాయని, ఇక్కడే వ్యూహాత్మక బాంబర్, ఇతర యుద్ధవిమానాలను చైనా మోహరించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత రక్షణ రంగ అమ్ములపొదిలో ఇటీవల రఫేల్ యుద్ధవిమానాలు చేరిన నేపథ్యంలో లడఖ్ సమీపంలోని ఎయిర్‌బేస్‌ల వద్ద చైనా వాయుసేన అత్యాధునిక జే-20 యుద్ధ విమానాలను తిరిగి మోహరించడం గమనార్హం. దుస్సాహసానికి దిగితే భంగపాటు తప్పదు చైనా వాయుసేన కార్యకలాపాలను భారత వైమానిక దళం, ఇతర నిఘా సంస్థలు పసిగడుతున్నాయని, డ్రాగన్ ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా తిప్పికొట్టేందుకు భారత్ సన్నద్ధంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఎల్ఏసీ వెంబడి ఏడు చైనా ఎయిర్ బేస్‌లపై భారత్ ఓ కన్నేసి ఉంచింది. చైనా తన వ్యూహాత్మక ఎయిర్‌బేస్‌లను ఇటీవల అప్‌గ్రేడ్ చేసిందని, ఆయా ఎయిర్‌బేస్‌ల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ షెల్టర్లు నిర్మించడంతో పాటు రన్‌వే పొడవును విస్తరించిందని, సైనిక, మానవవనరులను మోహరించిందని అధికారులు తెలిపారు. జిన్జియాంగ్, టిబెట్ అటానమస్ సైనిక ప్రాంతంలోని ఏడు చైనా సైనిక స్ధావరాలపై శాటిలైట్లు, ఇతర పరికరాలతో విస్తృత నిఘాను ముమ్మరం చేశామని చెప్పారు. చదవండి : మా దళాలు ఎల్ఏసీని దాటలేదు: చైనా కాగా, సరిహద్దుల్లో తాజాగా కవ్వింపు చర్యలకు దిగిన చైనా ఆర్మీకి భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. తూర్పు లదాఖ్, ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్ సైనికుల కుయుక్తులను తిప్పికొట్టింది. బలగాల ఉపసంహరణ చర్చల ఒప్పందాన్ని ఉల్లంఘించిన పొరుగు దేశానికి గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ నేపథ్యంలో దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే చర్చల ద్వారా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది -
కశ్మీర్లో టెన్షన్.. టెన్షన్!
శ్రీనగర్/జమ్మూ/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం ఆదివారం నాటికి మరింత ముదిరింది. ఉగ్రవాదులు దాడిచేయొచ్చన్న వార్తల నేపథ్యంలో శ్రీనగర్‌ను వీడాలని రాష్ట్ర క్రికెట్ జట్టు కోచ్ ఇర్ఫాన్ పఠాన్‌ను అధికారులు ఆదేశించారు. అదే సమయంలో జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంట్లో సమావేశమైన అఖిలపక్ష నేతలు పరిస్థితిని మరింత దిగజార్చేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్లకు విజ్ఞప్తి చేశారు. కశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం చేసేందుకు ఇదే సరైన సమయమని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్ కశ్మీర్‌పై ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాలుచెప్పాయి. కలసికట్టుగా పోరాడుతాం: అఖిలపక్షం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటిలో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అధ్యక్షతన ఈ సమావేశానికి కాంగ్రెస్, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జేఅండ్‌కే మూవ్మెంట్, ఎన్సీ, సీపీఎం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అనిశ్చితిని రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలకు వివరించేందుకు వీలుగా ఓ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపాలని నేతలు నిర్ణయించారు. ఈ విషయమై ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ నిబంధనల్ని కాపాడేందుకు, రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలన్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా పోరాడాలని అఖిలపక్ష భేటీలో నిర్ణయించాం. ఆర్టికల్ 35 ఏ, ఆర్టికల్ 370లను రాజ్యాంగవిరుద్ధంగా రద్దుచేయడమంటే జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రజలపై దాడిచేయడమే. ఈ విషయంలో పరిస్థితులు మరింత దిగజారేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాం’ అని చెప్పారు. మరోవైపు పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నోటీసులు జారీచేసింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జమ్మూకశ్మీర్ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎవరి పేరునైనా మౌఖికంగా లేదా ఇతర మార్గాల్లో సిఫార్సు చేశారో, లేదో చెప్పాలని కోరింది. దీంతో ప్రజల్ని ఏకంచేయకుండా ప్రధాన రాజకీయ నేతల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారనీ, ఇలాంటి ప్రయత్నాలు ఫలించబోవని ముఫ్తీ స్పష్టంచేశారు. మరోవైపు రాష్ట్రంలో కర్ఫ్యూ విధించనున్న నేపథ్యంలో మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు ఇంట్లోంచి బయటకు రాకూడదని పోలీసులు ఆదేశించారు. కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎంవై తరిగామిలను అరెస్ట్ చేశారు. జమ్మూలోనూ బలగాల మోహరింపు.. జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాల మోహరింపుతో ఏర్పడిన అనిశ్చితి కొనసాగుతోంది. ఉగ్రముప్పు నేపథ్యంలో కశ్మీర్‌లోని ఆర్మీ స్థావరాలు, పోలీస్ ప్రధాన కార్యాలయం, విమానాశ్రయాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను ఆదివారం కట్టుదిట్టం చేశారు. అలాగే జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్ జిల్లాల్లో ముందు జాగ్రత్తగా బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను భారీగా మోహరించారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు కోచ్ ఇర్ఫాన్ పఠాన్‌ను రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. కశ్మీర్లో పరిస్థితులు మరింత దిగజారవచ్చన్న భయంతో స్థానికులు నిత్యావసర సరుకులు, పెట్రోల్ కొనేందుకు షాపుల ముందు భారీ సంఖ్యలో బారులుతీరారు. మరోవైపు పుల్వామా తరహాలో ఉగ్రవాదులు వాహనాలతో ఆత్మాహుతిదాడికి పాల్పడకుండా ఉండేందుకు భద్రతాబలగాలు రోడ్లపై చాలాచోట్ల బారికేడ్లను ఏర్పాటుచేశాయి. యాజమాన్యం ఆదేశాలతో నిట్–శ్రీనగర్ విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారు. అమిత్ షా–దోవల్ కీలక భేటీ.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్లో నెలకొన్న అనిశ్చితి, భారత్‌లో చొరబాటుకు యత్నించిన 5–7 మంది పాక్ బ్యాట్ కమాండోలను ఆర్మీ హతమార్చడం తదితర అంశాలపై దాదాపు గంటపాటు చర్చలుజరిపారు. మరోవైపు జమ్మూ, ఉధమ్‌పూర్, కర్తా ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లలో రాబోయే 48 గంటలపాటు టికెట్ల తనిఖీ చేయబోమని రైల్వేశాఖ ప్రకటించింది. భారీ సంఖ్యలో ఉన్న అమర్నాథ్ యాత్రికులు రిజర్వేషన్ లేకపోయినా ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని వీడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అధికారులు, వైద్య సిబ్బంది సెలవులపై వెళ్లరాదనీ, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయరాదని కార్గిల్ కలెక్టర్ ఆదేశించారు. దీటుగా బదులిస్తాం: పాక్ భారత్ ఎలాంటి దుస్సాహసానికి, దురాక్రమణకు పాల్పడినా దీటుగా బదులిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. కశ్మీరీలకు తమ దౌత్య, నైతిక, రాజకీయ మద్దతును కొనసాగిస్తామని ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశానికి రక్షణ మంత్రి పర్వేజ్ ఖట్టక్, విదేశాంగమంత్రి ఖురేషీ, త్రివిధ దళాధిపతులు, ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం పాక్ స్పందిస్తూ..‘భారత్ చర్యల కారణంగా ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి విఘాతం కలుగుతుంది. కశ్మీర్ అన్నది సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యే. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దీన్ని పరిష్కరించాలని భారత్‌ను కోరుతున్నాం. తాజాగా బలగాల మోహరింపుతో కశ్మీర్లో పరిస్థితి అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది’ అని హెచ్చరించింది. ట్రంప్ కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని చెప్పారనీ, అందుకు ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. జమ్మూలో హైదరాబాద్ రైలు ఎక్కుతున్న విద్యార్థులు -
మమతకు కేంద్రం ఝలక్
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నరేంద్ర మోదీ సర్కారు ఝలక్ ఇచ్చింది. ఆమెకు తెలియకుండానే బెంగాల్ లోని జాతీయ రహదారిపై రెండు టోల్ గేట్లు వద్ద కేంద్రం సైనిక బలగాలను దించింది. దీనిపై మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర బలగాలను ఎప్పుడూ మొహరించలేదని అన్నారు. ఇది చాలా సున్నితమైన విషయమని పేర్కొన్నారు. తాను ఆన్ ది రికార్డుగా మాట్లాడుతున్నానని, తన మాటలను కేంద్రం విస్మరించదని భావిస్తున్నట్టు మమతా చెప్పారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి టోల్ ట్యాక్స్ తిరిగి వసూలు చేయనున్న నేపథ్యంలో ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్రం బలగాలు మొహరించింది. పాత పెద్ద నోట్లను ముందునుంచి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విన్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ లో టోల్ గేట్ల వద్ద కేంద్ర బలగాలను దించడం ప్రాధాన్యం సంతరించుకుంది.