Depot Manager
-
ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో డీఎం విందు?
కరీంనగర్: వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మురళీకృష్ణ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి ఇంట్లో విందు చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీంతో మద్యం తాగడం వ్యక్తి గతమైన విషయమైనప్పటికీ ఉద్యోగుల ఇళ్లలో ఇలా చేయడం ఇబ్బందికరమని పలువురు పోస్ట్ లు పెడుతున్నారు. దీనిపై డీఎంను వివరణ కోరగా గతేడాది జూలైలో ఉద్యోగి ఇంటికి తీజ్ ఉత్సవాలకు వెళ్లానని, ఎలాంటి మద్యం తీసుకోలేదని తెలిపారు. 10 నిమిషాలు మాత్రమే ఉండి వచ్చా నని, ఎవరో కావాలనే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. -
ఈ బస్సు ఎక్కడికీ వెళ్లదు.. ఎందుకంటే
సాక్షి, నిర్మల్ చైన్‌గేట్: ఆలోచన ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని అంటారు. ఆ మాటలను నిజం చేస్తూ చూపించారు ఆర్టీసీ అధికారులు. బస్సు కోసం ఎదురు చూసే ప్రయాణికులు ఎండలో నిలబడకుండా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ అధికారి వినూత్నంగా ఆలోచించి ఓ బస్సునే తాత్కాలిక షెల్టర్‌గా వినియోగిస్తున్నారు. పట్టణంలోని మంచిర్యాల చౌరస్తాలో ఎలాంటి షెడ్లు లేకపోవడంతో అటు వైపు వెళ్లే ప్రయాణికులు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. దీనిని గమనించిన డిపో మేనేజర్ ఆంజనేయులు ఓ బస్సును తాత్కాలిక షెల్టర్‌గా ఏర్పాటు చేయించారు. బస్సును ప్రతిరోజు శానిటైజర్ చేయించి శుభ్రంగా ఉంచుతున్నామని, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశామని మేనేజర్ తెలిపారు. హైదరాబాద్, నిజామాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు ఈ బస్సులో కూర్చొని కాసేపు సేద తీరుతున్నారు. ( చదవండి: కరీంనగర్లో ఈటల రాజేందర్‌కు నిరసన సెగ ) -
ఆర్టీసీ సమ్మె : డిపో మేనేజర్‌పై ముసుగువేసి దాడి
సాక్షి, నిర్మల్ : విధుల్లోకి వెళ్తున్న భైంసా బస్ డిపో మేనేజర్ జనార్దన్‌పై మంగళవారం ఉదయం దాడి జరిగింది. ఆయనపై ముసుగు వేసి దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. బాధ్యుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కృష్ణ కాంత్ డిమాండ్ చేశారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 32వ రోజుకు చేరింది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు విధించిన డెడ్‌లైన్ నేటి అర్ధరాత్రితో ముగియనుంది. (చదవండి : డిమాండ్లపై మల్లగుల్లాలు!) కార్మికులకు మరో అవకాశం ఇస్తున్నామని, మంగళవారం నాటికి విధ్లుల్లోకి చేరాలని సీఎం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. లేనిపక్షంలో మిగిలిన 5 వేల రూట్లను కూడా ప్రైవేటుకు అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. పెద్దపల్లి జిల్లా కుచిరాజుపల్లిలో ఆర్టీసీ బస్సుపై దాడి జరిగింది. దుండగుల దాడిలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. కరీంనగర్ నుంచి మంథని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డీఎంపై దాడితో మాకు సంబంధం లేదు : అశ్వత్థామరెడ్డి భైంసా డిపో మేనేజర్‌పై దాడితో ఆర్టీసీ కార్మికులకు సంబంధం లేదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. అధికారిపై దాడిని ఆర్టీసీ జేఏసీ ఖండిస్తోందని పేర్కొన్నారు. గత 32 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సమ్మెలో భాగంగా నేడు అన్ని డిపోల వద్ద మానవహారాలు నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు నేడు అఖిలపక్ష నేతలతో భేటీ కానున్నారు. -
స్వల్ప సంఖ్యలో విధుల్లో చేరిన కార్మికులు
సాక్షి, నెట్వర్క్: సమ్మె వదిలి 5వ తేదీలోపు కార్మికులు విధుల్లో చేరాలన్న సీఎం కేసీఆర్ పిలుపుతో ఆదివారం కొంతమంది కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఎంతమంది కార్మికులు విధుల్లో చేరేందుకు సమ్మతి తెలిపారన్న విషయాన్ని ఆర్టీసీ అధికారులు అధికారికంగా ప్రకటించలేదు. దాదాపు 20 మంది కార్మికులు సమ్మతి ప్రకటించినట్టు తెలిసింది. వీరిలో ఉప్పల్ డిపోలోని ఫైనాన్స్ డిపార్టుమెంట్లో అసిస్టెంట్ మేనేజర్ (అకౌంటెంట్)గా పనిచేస్తున్న కె.కేశవకృష్ణ, వరంగల్ రీజియన్‌లో పనిచేస్తున్న ఐదుగురు సూపర్వైజర్లు రవీంద్ర, శ్రీహరి, రామ్మోహన్, సూర్యప్రకాశ్, వీరన్న ఉన్నారు. సిద్దిపేట డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న బాలవిశ్వేశ్వర్‌రావు, మేడ్చల్ డిపో కండక్టర్ కేఎస్ రావు, కామారెడ్డి డిపో డ్రైవర్ హైమద్, ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపో డ్రైవర్ ఎండీ ముబీన్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డిపో గ్యారేజీ మెకానిక్ శ్రీనివాస్ విధుల్లో చేరుతున్నట్లు లేఖలు అందజేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపోకు చెందిన కండక్టర్ మస్తాన్‌వలి విధుల్లో చేరేందుకు లేఖను అందజేశాడు. ఆర్టీసీ జేఏసీ నేతలు అతన్ని బుజ్జగించడంతో లేఖను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఆదివారం కూడా కార్మికులు ఉధృతంగా సమ్మె కొనసాగించారు. కార్మికులతో పాటు అఖిలపక్ష నేతలు కూడా పలుచోట్ల ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోడ్డెక్కిన 4,238 ఆర్టీసీ బస్సులు.. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 4,238 ఆర్టీసీ బస్సులు, 1,914 అద్దె బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. 4,238 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,152 మంది తాత్కాలిక కండక్టర్లు వచ్చారని పేర్కొన్నారు. 5,588 బస్సుల్లో టిమ్ యంత్రాలు వాడామని, 346 బస్సుల్లో ట్రే ద్వారా టికెట్లు జారీ చేశామని పేర్కొన్నారు. -
డిపో మేనేజర్లతో ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్
-
ఆర్టీసీ డీఎం నిలదీత
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని లింగంపేట గ్రామస్తులు శనివారం డీఎం ఆంజనేయులును గ్రామస్తులు నిలదీశారు. శనివారం ఆయన బస్టాండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా 6 నెలలలుగా బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడంలేదని విద్యార్థులు, ప్రయాణికులు డీఎంను నిలదీశారు. తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్ దీపాలు, కూర్చోవడానికి బల్లలు, బస్టాండ్‌లో ఏర్పడిన గుంతలను పూడ్చాలని పలుమార్చు మొరపెట్టుకున్నా స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్ నుంచి ప్రతి సంవత్సరం దుకాణ సముదాయాలు, హోటళ్ల నుంచి ఆదాయం వస్తున్నా ఎలాంటి పనులు చేపట్టకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరిన గ్రామస్తులపై డీఎం మండిపడడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రశ్నించే హక్కు మీకు లేదని గ్రామస్తులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. నాపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకోండని చెప్పడంతో డీఎంపై నిరసన వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితం సర్పంచ్ లావణ్య రూ. 40వేలు ఖర్చు చేసి బస్టాండ్‌ను చదును చేయించారు. బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించడంతో ఆర్టీసీ అధికారులు విఫలమైనట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సదరు డీఎంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
హయత్‌నగర్‌లో ఆర్టీసీ కార్మికుల ఆందోళన
డిపో అధికారులు వేధిస్తున్నారంటూ ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు దిగారు. హయతనగర్ డిపో-01 అసిస్టెంట్ మేనేజర్ తమను వేధిస్తోందంటూ సిబ్బంది శుక్రవారం సాయంత్రం విధులు బహిష్కరించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిపో ఎదుట ధర్నా చే స్తున్నారు.