Deputy CM KE
-
రైతుల ముఖాల్లో చిరునవ్వులు నిండాలి
– డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పంచలింగాల( కర్నూలు సీక్యాంప్ ): సకాలంలో వర్షాలు పడి రైతుల ముఖాల్లో చిరునవ్వు నిండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆకాక్షించారు. శుక్రవారం పంచలింగాలలోని మేకల వెంకటేశ్వర్లు పొలంలో పొలం దున్ని ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాంటిస్సోరి స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది వర్షాలు ముందుగానే ఏపీని పలకరించాయని, ఆశించిన స్థాయిలో వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండాలన్నారు. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతురథం పథకం ద్వారా రైతులకు రాయితీపై ట్రాక్టర్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మీ ఇంటికి మీభూమి పథకం ద్వారా రైతుల భూములు వివరాలు ఆన్లైన్లో ఉంచామని పేర్కొన్నారు. గొందిపర్ల, ఈ.తాండ్రపాడు, దేవమాడ వంటి గ్రామాల రైతులకు అన్ని రకాలు సహాయపడడానికి తాను సిద్ధంగా ఉన్నామనిరాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయా ప్రాంతాలను మరో కోనసీమగా మారుస్తామని తెలిపారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పశుసంపదను పెంచుకుంటే ఆదాయ వనరులు పెరుగుతాయని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం సకాలంలో పూర్తి చేస్తుందని చెప్పారు. అనంతరం కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ మాట్లాడుతూ పంటలు చేతికి వచ్చినా కొనేవాళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని డిప్యూటీ సీఎంను కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు చిరుదాన్యాలను వేయడం అలవర్చుకోవాలని సూచించారు. అంతకముందు మత్స్యశాఖ, పరిశ్రమల శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను డిప్యూటీ సీఎం పరిశీలించారు. సర్పంచ్ అనంతలక్ష్మీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ,జేడీఏ ఉమామహేశ్వరమ్మ పాల్గొన్నారు. -
అభయం!
భూమా-శిల్పా మధ్య ముసలం ఉద్యోగుల బదిలీ తప్పదనే ప్రచారం ధైర్యం చెప్పే ప్రయత్నంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూమాకు మంత్రి పదవి రాకుండా మోకాలడ్డు నంద్యాల, ఆళ్లగడ్డల్లోని అధికారుల్లో గందరగోళం సమన్వయం’ ఎన్నటికో... సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో భూమా-శిల్పాల మధ్య రేగిన ముసలం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే మంత్రి పదవి విషయంలో వివాదం రాజుకుంటుండగానే.. తాజాగా అధికారుల బదిలీల విషయంలో కొత్త సమస్య తెరమీదకొచ్చింది. అన్నకు మంత్రి పదవి రాగానే అధికారులపై వేటు తప్పదనే ప్రచారం ఇప్పటికే అటు ఆళ్లగడ్డ, ఇటు నంద్యాలలో జోరందుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని.. ఏ ఒక్కరిపై బదిలీ వేటు పడకుండా చూస్తానని అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి ధైర్యం చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు అసలు మంత్రి పదవి ఆయనకు వచ్చే అవకాశమే లేదని కూడా చెబుతుండటం గమనార్హం. డీఎస్పీపై వేటు తప్పదు నంద్యాల డీఎస్పీని బదిలీ చేస్తారనే ప్రచారం ఇప్పటికే సాగుతోంది. ఈ విషయమై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును భూమా కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వ్యక్తిగత పనుల మీద కొన్ని రోజుల పాటు సెలవులో వెళ్లారు. ఇదే సందర్భంలో అధికార పార్టీ నేతలు మాత్రం ఆయన బదిలీ అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి హామీ లభించలేదని.. కేవలం నియోజకవర్గ ఇన్చార్జీల మాటే చెల్లుబాటు అవుతుందని ఇప్పటికే శిల్పా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆళ్లగడ్డలోనూ వార్ షురూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనూ ఇదే తరహా యుద్ధానికి తెరలేసింది. నియోజకవర్గంలో గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా పలువురు అధికారులను నియమించుకున్నారు. వీరందరిపైనా ఇప్పుడు వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా నియోజకవర్గంలోని ఒక మండలంలో రెగ్యులర్ తహశీల్దారును కాదని.. డిప్యూటీ తహశీల్దారునే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈయన స్థానానికి కూడా ఎసరు తప్పదనే ప్రచారం ఉంది. ఇదే జరిగితే తాడోపేడో తేల్చుకుంటామని గంగుల వర్గీయులు సవాల్ విసురుతున్నారు. తాజా చేరికలతో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుతోంది. కమిటీ వచ్చేదెన్నడో.. పార్టీలో విపక్ష ఎమ్మెల్యేల చేరిక నేపథ్యంలో పాత నేతలు, కొత్త నేతలకు మధ్య సమన్వయం చేసేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ, జిల్లా అధ్యక్షులతో కూడిన కమిటీని పార్టీ నియమించింది. అయితే, ఈ కమిటీ ఇప్పటివరకు కనీసం ఇరువురితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. కమిటీ వచ్చెదెన్నడో.. నేతల మధ్య సమన్వయం సాధించేదెన్నడో అనే చర్చ అధికారపార్టీలో జరుగుతోంది. -
కొనసాగుతోన్న చంద్రబాబు, కేఈ వార్
-
భూసమీకరణ చేసిందంతా రెవెన్యూవారే
* డిప్యూటీ సీఎం కేఈ వ్యాఖ్య * రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ లాంటివి చంద్రబాబు వంద చూశారు సాక్షి, హైదరాబాద్: రాజధాని భూసమీకరణకు స్వచ్ఛందంగా రైతులు భూములివ్వలేదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పరోక్షంగా అంగీకరించారు. సమీకరించిన 33 వేల ఎకరాల్లో ఇంకా 17 వేల ఎకరాలకు రైతులు అంగీకార పత్రాలివ్వలేదని, అయితే ఎలాగోలా వారిని ఒప్పించి భూములు తీసుకునే సత్తా సీఎం చంద్రబాబుకు ఉందన్నారు. ‘‘మంత్రి నారాయణ వింటే ఫీల్ అవుతాడు కానీ.. అసలు సమీకరణ చేసిందంతా మా రెవెన్యూవారే’’ అని వ్యాఖ్యానించారు. కేఈ శుక్రవారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రేవంత్‌రెడ్డి లాంటి ఎపిసోడ్లను చంద్రబాబు వంద చూశారని, ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేకపోయారని కేఈ అన్నారు. రేవంత్‌రెడ్డి క్లీన్‌చిట్‌తో బయటికొస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డిపై కుట్రలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర ఉందని తేటతెల్లమైందని, కావాలని కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. ప్రజలకు తానిచ్చిన హామీలన్నీ సమైక్య రాష్ట్రంలో ఇచ్చినవన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. హామీలపై సీఎం అలా ఎందుకన్నారో తనకు తెలియదన్నారు.