in devarapalli
-
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక
దేవరపల్లి : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక తయారు చేసినట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. దేవరపల్లి కరుటూరి ఫంక్షన్lహాలు వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. అన్ని పంచాయతీల్లో ప్రజలకు అవసరమైన కనీస అవసరాలు మంచినీరు, అంతర్గత రోడ్లు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ నిధులతో వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయనున్నట్టు ఆయన వివరించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.646 కోట్లు విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఈ నిధులకు 50 శాతం ఉపాధి నిధులు కలిపి గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సర్పంచ్‌లకు సూచించారు. జిల్లాకు రూ. 57.34 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. జిల్లాలో 365 భవనాల నిర్మాణానికి రూ.25.55 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. పంట సంజీవిని కింద గ్రామంలో 100 నీటికుంటలు తవ్వితే రూ.3 లక్షలు పంచాయతీరాజ్ ద్వారా బహుమతిగా ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. త్వరలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
‘స్కూల్ గేమ్స్ ’ జట్ల ఎంపిక
దేవరపల్లి: అంతర్ జూనియర్ కళాశాలల ఆటల పోటీలు, అండర్–19 స్కూల్ గేమ్స్‌కు మహిళా క్రికెట్, ఫుట్‌బాల్, సపక్‌తక్రా జిల్లా జట్లను మంగళవారం ఎంపిక చేశారు. స్థానిక ఆనంద్ ఎడ్యుకేషనల్ సొసైటీ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో జెడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపికైన జట్ల వివరాలను జిల్లా స్కూల్ గేమ్స్ అసోసియేషన్ కార్యదర్శి అద్దంకి ఐజక్ ప్రకటించారు. పోటీలను కళాశాల పీడీ కేవీడీవీ ప్రసాద్, కళాశాల చైర్మన్ డి.సువర్ణరాజు, జిల్లా పీడీ అసోసియేషన్ అధ్యక్షుడు బీహెచ్ఎస్ఎన్ తిలక్, కార్యదర్శి ఎం.రామారావు పర్యవేక్షించారు. ∙సపక్‌తక్రా బాలుర జట్టు : కె.నాగశివ, జి.చందు, పి.రాజ, ఎంవీవీఎన్. సాయి, కె.హరీష్ ∙మహిళా క్రికెట్ జట్టు : ఆర్.దుర్గాదేవి, ఎస్.హంపీరీచల్, జి.శిరీష, పి.అపర్ణ, జి.సత్యవేణి, టి.ఉమాదేవి, ఎం.లావణ్య, పి.సువర్ణ, ఎం.నీరజ, డి.మాధవి, పి.పద్మజ. ∙ఫుట్‌బాల్ బాలుర జట్టు : జి.సతీష్, పి.పెద్దిరాజు, ఎన్.శేఖర్, కె.శ్రీనివాస్, టి. తరుణ్, పి.వంశీకష్ణ, కె.వెంకటేష్, కె.పవన్‌కుమార్, ఎ.ఉదయ్‌కుమార్, ఎస్.చందు, పి.చంటిబాబు, ఎ.సతీష్‌బాబు, ఎస్.లక్ష్మీనారాయణ, ఇ.శరత్‌రాజు, కె.రాజు, ఎం.నరసింహ ∙ఫుట్‌బాల్ బాలికల జట్టు : పి.పద్మజ, కె.మాధవీలత, ఎం.నీరజ, సీహెచ్ సుభద్ర, పి.ఆర్తి, ఇ.వెంకటలక్ష్మి, పి.చంద్రకళ, జి.నిర్మల, టి.నాగజ్యోతి, ఎం.రేవతి, డీఎన్వీ లక్ష్మి, ఎం.నవ్య, ఎం.స్రవంతి, డి.మాధవి, ఎం.రమ్య, ఎస్.భవాని, పి.పార్వతి, పి.అపర్ణ