development agenda
-
అభివృద్ధి ఎజెండాకు విపక్షాల అడ్డంకులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆరోపించారు. ఆయన సోమవారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమీక్షా సమావేశం, పార్టీ జాతీయ ఆఫీసు బేరర్ల భేటీలో పాల్గొన్నారు. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించారు. ప్రతిపక్షాల ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో బీజేపీ కార్యకర్తలు సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేశం కోసం పనిచేశారని నడ్డా అభినందించారు. బీజేపీ జాతీయ ఆఫీసు బేరర్ల భేటీ వివరాలను చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మీడియాకు తెలియజేశారు. ఈ సమావేశంలో కోవిడ్–19 మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి ఎజెండా, ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ వంటి కార్యక్రమాలను నడ్డా ప్రస్తావించారు. వీటిని పార్టీకి చెందిన వివిధ మోర్చాల ద్వారా క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అనుసరించాలి్సన ప్రణాళికలపై చర్చ జరిగింది. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలపైనా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇన్‌చార్‌్జలుగా ఉన్న ప్రధాన కార్యదర్శులు, ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు నియమించిన ఇన్‌చార్‌్జలు ఇచ్చిన నివేదికలపై చర్చ సాగింది. వ్యాక్సినేషన్లో ఉచితంగా ఇస్తున్న టీకా డోసులు వంద కోట్లకు చేరువవుతున్నాయని, ఈ ఘట్టాన్ని జాతీయ పండుగగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. -
త్రిపురలో లెఫ్ట్‌కు చెక్
అగర్తలా: త్రిపురలో 25 ఏళ్ల అప్రతిహత కమ్యూనిస్టు పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. బీజేపీ–ఐపీఎఫ్టీ (ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) కూటమికి భారీ మెజారిటీతో పట్టంగట్టారు. ఇంతవరకు త్రిపురలో ఒక్క కౌన్సిలర్ సీటు కూడా లేని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. ఫిబ్రవరి 18న త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగగా.. శనివారం ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ కూటమి 43 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది. కమలం పార్టీ సొంతంగా 35 స్థానాలను కైవసం చేసుకోగా.. ఐపీఎఫ్టీ 8 చోట్ల విజయం సాధించింది. మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సీపీఎం 16 సీట్లకే పరిమితమైంది. గత అసెంబ్లీలో 10 స్థానాలతో విపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ఒక్క సీటుకూడా దక్కలేదు. విపక్ష మొత్తం 60 స్థానాలకు గానూ 59 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థి మృతితో ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. వామపక్షానికి షాకింగ్ ఓటమి త్రిపురలో సీపీఎంకు ఇంత దారుణమైన ఓటమి ఎన్నడూ ఎదురుకాలేదు. 1988లో కాంగ్రెస్–త్రిపుర ఉపజాతి జుబా సమితి కూటమి అధికారం సంపాదించినా.. ఇంత తక్కువ సీట్లను పొందలేదు. అటు, కౌన్సిలర్ సీటుకూడా లేని స్థానం నుంచి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను సరిగ్గా వినియోగించుకుని వ్యూహాత్మక ప్రచారంతో దూసుకెళ్లింది. మొత్తం 51 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా దాదాపు 43 శాతం ఓట్లు సంపాదించింది. 9 చోట్ల అభ్యర్థులను నిలిపిన ఐపీఎఫ్టీ దాదాపు 7.5 శాతం ఓట్లను పొందింది. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్ దేవ్ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో 50–60 శాతం ఓట్లను పొందిన వామపక్ష కూటమి ఈసారి 42.7 శాతం ఓట్లు సాధించింది. ఒక్కసీటు కూడా గెలవని కాంగ్రెస్ రెండు శాతానికన్నా తక్కువ ఓట్లు పొందింది. గిరిజనుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో బీజేపీ భారీ మెజారిటీ సంపాదించింది. ప్రజలు మార్పుకు ఓటేశారు త్రిపుర ప్రజలు మార్పును కోరుకోవటమే తమ ఘనవిజయానికి కారణమని బీజేపీ నేత రాంమాధవ్ పేర్కొన్నారు. ‘మేం ‘పరివర్తన్’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాం. ప్రజలు కూడా మార్పును బలంగా కోరుకున్నారు. అందుకే మాకు పట్టంగట్టారు’ అని ఆయన పేర్కొన్నారు. అస్సాం మంత్రి, త్రిపుర బీజేపీ ఇంచార్జ్ హిమంత బిస్వ శర్మ మాట్లాడుతూ.. ‘మాణిక్ సర్కార్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. 25 ఏళ్లుగా వారే పాలిస్తున్నా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అందుకే ప్రజలకు వారిని గద్దెదించి బీజేపీకి అవకాశమిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో బలంగా ఉన్న ఐపీఎఫ్టీ కూడా బీజేపీ విజయంలో కీలక భాగస్వామి. త్రిపుర జనాభాలో 35 శాతం ఓట్లు గిరిజనులవే. వారు ఏకపక్షంగా బీజేపీకి మద్దతిచ్చారు’ అని వెల్లడించారు. మైనారిటీలు మరీ ముఖ్యంగా క్రిస్టియన్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్న వార్తల్లో వాస్తవం లేదని.. వారంతా మనస్ఫూర్వకంగా బీజేపీకి మద్దతు తెలిపారని శర్మ పేర్కొన్నారు. ‘త్రిపుర ప్రజలు రాష్ట్రంలో బీజేపీ కూటమికి అధికారమిచ్చారు. 25 ఏళ్లుగా వారికి సేవచేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు. బీజేపీ త్రిపురతోపాటు దేశవ్యాప్తంగా విభజన రాజకీయాలకు పాల్పడుతోంది’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. నేను సిద్ధమే.. కానీ పార్టీ నిర్ణయిస్తుంది త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావటంలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చ మొదలైంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్ కుమార్ దేవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. అయితే అవకాశం ఇస్తే సీఎంగా సేవలందించేందుకు తాను సిద్ధమేనని.. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ పార్లమెంటరీ బోర్డేనన్నారు. ‘బాధ్యతలు తీసుకునేందుకు నేను సిద్ధమే. నాకు అప్పజెప్పిన పనినుంచి నేనెప్పుడూ పారిపోను. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నాకు ఇచ్చారు. దీన్ని నా సామర్థ్యానికి అనుగుణంగా నెరవేరుస్తున్నాను’ అని విప్లవ్ తెలిపారు. బీజేపీ ఇచ్చిన పిలుపుతో 25 ఏళ్ల కమ్యూనిస్టు కోటను కూకటివేళ్లతో పెకిలించి.. తమకు అధికారాన్ని కట్టబెట్టిన త్రిపుర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్‌షాలు తనను వెన్నంటి ప్రోత్సహించారన్నారు. ఇక త్రిపురను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ‘సీపీఎం పాలనలో రాష్ట్రం నష్టపోయింది. మేం సుపరిపానలతో పరిస్థితిలో మార్పు తీసుకొస్తాం’ అని దేవ్ పేర్కొన్నారు. విప్లవ్ కుమార్ దేవ్ -
గ్రామాలకు మెరుగైన రవాణా
కొండాపూర్: అభివృద్దే ప్రభుత్వ ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందరి స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. మండల పరిధిలోని మారేపల్లి గ్రామ శివారులో గల ఆర్అండ్బీ నిధుల ద్వారా రూ.70 లక్షలతో నిర్మించనున్న వంతెన పనులకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పల్లెలు అభివృద్ధి చెందాలంటే ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా ప్రతి గ్రామానికి బీటీ రోడ్డులను వేయిస్తామన్నారు.అదేవిధంగా ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్డును విస్తస్తామన్నారు.ప్రతి ఇంటికి మంచి నీరు అందించడం కోసం మిషన్ భగీరథను ప్రవేశపెట్టామన్నారు. ఆహార భద్రత కార్డు ద్వారా ఇంటిలోని ప్రతీ ఒక్కరికి ఆరుకిలోల చొప్పున బియ్యం అందిస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా కుంటుపడిన చెరువులను, కుంటలను పూడికతీత తొలగించి వాటికి మళ్లీ పూర్వవైభవం తెచ్చి భూగర్భజలాల స్థాయిని పెంచేందుకు మిషన్‌కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు.దళితుల అభివృద్ధి కోసం భూమి లేని నిరుపేద దళితులకు సాగుకు యోగ్యమైన మూడెకరాల భూమిని అందివ్వడమే కాకుండా మెదటి సంవత్సరం విత్తనాలతో పాటు,ఎరువులను కూడా అందిచామన్నారు. రైతులకు తాగు, సాగునీరు అందించడమే లక్ష్యంగా మహరాష్ట్రతో ఒప్పందం చేయడం తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప విజయమన్నారు.తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విఠల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు అమీనోద్దిన్, సర్పంచ్ రుక్మోద్దిన్, తహసీల్దార్ లావణ్య, ఎంపీటీసీ సభ్యులు పర్త్యానాయక్, సత్యాగౌడ్, నాయకులు మల్లాగౌడ్, మల్లేశం, లక్ష్మారెడ్డి, బుచ్చిరెడ్డి, నాగయ్య, బి జలేందర్, నర్సిములు, అంజిరెడ్డి, శ్రీకాంత్, అబ్దుల్‌రహీం, కుమార్ తదితరులు పాల్గొన్నారు.