devendar goud
-
CBN: ఆ నవ్వు వెనుక అంత కథ ఉందా?
ఆ మధ్య చంద్రబాబు పబ్లిక్‌గా ఏడ్చారు. తప్పేం కాదు. మనిషి ఏడ్వొచ్చు. కానీ నాయకుడు ఏడ్వకూడదు. కనీసం ఏడ్చినట్లు కూడా కనిపించకూడదు. కానీ చంద్రబాబు తన ఏడుపును రాష్ట్ర ప్రజలంతా చూసేలా ఏడ్చారు. ఏడ్చి, ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నించారు. అభాసుపాలయ్యారు. ఆయన ఏడుపును ఎవరూ నమ్మలేదు. పైగా ‘‘హవ్వా’’ అని నవ్విపోయారు. నిజానికి చంద్రబాబు ఏడ్చే నాయకుడు కాదు. ఏడిపించే నాయకుడు కూడా. ఎన్టీఆర్‌ని అలాగే కదా ఏడిపించారు కదా. అసలు సిసలు చంబ్రాబును చూడాలంటే మీరు 2003 అక్టోబర్ 1వ తేదీకి వెళ్లి ఆగాలి. తిరుపతిలో అలిపిరి దగ్గర ఆరోజు ఆయనపై నక్సల్స్ దాడి జరిగింది. ఆయన దుస్తులు రక్తసిక్తం అయ్యారు. ఆయన బెదిరిపోయారు. నిజానికి అది బెదురు కాదు. ఆలోచన! ఆ ఘటనను ఎలా తనకు అనుకూలంగా మలచుకోవాలన్న ఆలోచన. గాయాల నుంచి ఇంకా కోలుకోకుండానే, తిరిగి అధికార బాధ్యతలు చేపట్టకుండానే ఆయన పన్నిన మొదటి వ్యూహం.. నక్సలైట్ల హింసాకాండను కారణంగా చూపి శాసన సభ రద్దుకు సిఫారసు చేయడం. ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేయడం! అయితే పీపుల్స్ వార్ గ్రూప్ రాజకీయాలే ప్రధాన అజెండాగా ఓటర్ల సానుభూతి కోసం ఆయన చేసిన ‘ముందస్తు’ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. తనపైన జరిగిన దాడి తెలుగుదేశం పార్టీకి సానుభూతి ఓట్లను సంపాదించి పెడుతుందని భావించిన చంద్రబాబు.. దాడి జరిగిన సరిగ్గా నెల రోజులకు నవంబరు 2న హైదరాబాద్‌లో ఉప ప్రధాని అద్వానీ, బీజేపీ అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడుతో సమావేశం అయ్యారు. ముందస్తు ఎన్నికలపై మరోసారి ఆలోచించాలని కోరారు. (అప్పటికి నెల రోజులుగా ఈ ప్రతిపాదన తెస్తూనే ఉన్నారు.) కానీ ప్రధాని వాజ్‌పేయి ముందస్తు ఎన్నికలపై ఆసక్తి చూపకపోవటంతో అద్వానీ కూడా ఏమీ చేయలేకపోయారు. ఆ ఏడాది నవంబరు–డిసెంబరు నెలల్లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ముందస్తు గురించి ఆలోచిద్దాం అని అద్వానీ ఆ విషయాన్ని దాటవేశారు. ఆ మర్నాడే చంద్రబాబు తన సన్నిహిత పార్టీ నేతలలో ముందస్తు గురించి చర్చించారు. టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న వాస్తవం వారి చర్చల్లోకి వచ్చింది. రాష్ట్ర హోం మంత్రి దేవేందర్ గౌడ్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎర్రన్నాయుడు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, పార్టీ కోశాధికారి ప్రభాకర్ రెడ్డి, ఏపీ కె.రామ్మోహన్రావు చంద్రబాబు ముందస్తు ప్రతిపాదనపై ఏమీ చెప్పలేకపోయారు. చివరికి ‘దాడి’ని పక్కన పెట్టి, సంక్షేమ పథకాల ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికలకు అది కూడా అవి జరిగినప్పుడే వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. 2004 మే నెలలో జరిగిన ఆ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమ నాయకుడిగా వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిని ఎన్నుకున్నారు. మొత్తం 294 స్థానాల్లో కాంగ్రెస్ 185 స్థానాల్లో విజయం సాధించింది. చంద్రబాబుకు సానుభూతి దగ్గకపోగా, ఘోర పరాజయానికి గురయ్యారు. ఆయన నాటకాలు కాంగ్రెస్‌కు చేదోడు అయ్యాయి తప్పితే, సైకిల్ని ముందుకు నడిపించలేకపోయాయి. చంద్రబాబు యాక్టింగ్ మామూలుగా ఉండదు. యాక్టింగ్ క్లాసులకు వెళ్లి మరీ తన యాక్టింగ్‌ను మెరుగు పరిచేందుకు 2004 ఎన్నికల ముందు ఆయనెంతో శ్రమ పడ్డారు. చంద్రబాబు ఎప్పుడూ నవ్వుతూ కనిపించరు. ఒకవేళ కనిపించారంటే ప్రతిపక్ష నేతల్ని ప్రజల ముందు ఎద్దేవా చేయడానికి నవ్వుతారు. 2004 ఎన్నికలకు ముందు ఆయనపై సొంత పార్టీ నాయకులే ఈ విమర్శ చేశారు. ఆయనెప్పుడూ బిగదీసుకుని ఉంటారని, ప్రజల్లోకి అది వ్యతిరేక సంకేతాలను తీసుకెళుతుందనీ! దాంతో చంద్రబాబు తనని తను మలుచుకోవాలనుకున్నారు. మలుచుకోవడమే, మార్చుకోవటం కాదు. ముఖం మీదకు నవ్వు రమ్మంటే ఊరికే వస్తుందా? యాక్టింగ్ చెయ్యాలి. చంద్రబాబు సహజ నటుడే కానీ, నవ్వును ముఖంపైకి తెప్పించడం ఆయన వల్ల కాలేదు. అందుకే ట్రైనింగ్ తీసుకున్నారు. సినీ, టీవీ రంగాల నుంచి నిపుణులను రప్పించుకున్నారు. మూడు రోజుల పాటు వారి నుంచి శిక్షణ పొందారు! ఉచ్ఛారణ, బాడీలాంగ్వేజ్, వస్త్రధారణ.. విషయంలో తనను తను మెరుగుపరుచుకున్నారు. ముఖం మీదకు నవ్వు తెప్పించుకోవటం కూడా ప్రాక్టీస్ చేశారు. 2004 సార్వత్రిక ఎన్నికల సన్నాహాలలో భాగంగా టీవీ చానెళ్లలో జరిగే చర్చగోష్ఠులలో పాల్గొన్నప్పుడు ఓటర్లను ఇంప్రెస్ చేయాలన్నదే ఆ శిక్షణ వెనుక ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశం నెరవేరలేదు. ఆనాడు చంద్రబాబుకు పోస్టర్ల నాయకుడిగా కూడా పేరుండేది. అయితే ఆ ఇమేజ్ నగరాల్లో పనికొచ్చిందేమో కానీ, గ్రామాల్లోని ప్రజలు, ఓటర్లు ఈ నాటకాల నాయకుడిని తిరస్కరించారు. ప్రజలతో మమేకం అయి ఉన్న నాయకులే మనస్ఫూర్తిగా నవ్వగలరు. ఆ నవ్వు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిలో కనిపిస్తుందనే స్వయంగా టీడీపీ నాయకులే ఒప్పుకుంటారు. ఇవి చదవండి: AP: సంక్షేమం అంటే బాబుకు ‘సన్’క్షేమం : మంత్రి చెల్లుబోయిన -
మిగిలింది ముగ్గురే..!
జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణం ఆపరేషన్ ఆకర్ష్‌కు విలవిల పార్టీ కార్యక్రమాలకు కృష్ణయ్య దూరం జిల్లా రాజకీయాలకు దేవేందర్ రాంరాం ఎంపీ మల్లారెడ్డే పెద్దదిక్కు రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు విలవిల్లాడుతోంది. ఒకప్పుడు బలంగా కనిపించిన పార్టీకి ఇప్పుడు నాయకులే కరువయ్యారు. ఒకరివెంట ఒకరు గులాబీ గూటికి చేరువయ్యారు. కొందరు పార్టీలో ఉన్నా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు పార్టీ గురించి పట్టించుకుంటున్నా కార్యకర్తలు కూడా వారిని వదిలి వెళ్తుండడంతో ఏం చేయాలో తోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీకి నేడు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గత శాసనసభ ఎన్నికల్లో 15 స్థానాలు గెలిస్తే అందులో సగం సీట్లు రంగారెడ్డి జిల్లాలోవే. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో రాజకీయ సమీకరణలే మారిపోయాయి. అధికారపార్టీ సాగించిన అపరేషన్ ఆకర్ష్‌కు టీడీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మేహ శ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఫిరాయింపుతో మొదలైన వలసల పర్వం...శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీతో పూర్తయింది. మొత్తం ఏడుగురిలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మినహా మిగతా వారంతా గులాబీ గూటికి చేరిపోయారు. తీగల ఫిరాయింపు సమయంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన శాసనసభ్యులే.. ఆఖరుకు తమను టీఆర్ఎస్లో విలీనం చేయాలని లేఖను సమర్పించడం కొసమెరుపు. టీటీడీపీ ఎమ్మెల్యేల అభ్యర్థనకు సానకూలంగా స్పందించి స్పీకర్ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరినీ టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించడం రాజకీయ చర్చకు దారితీసింది. కాగా, మెజార్టీ ఎమ్మెల్యేలు గోడ దూకడంతో ఇక ఆ పార్టీకి జిల్లాలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యే పెద్ద దిక్కుగా మారారు. అయితే, ఆయన కూడా కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బీసీల సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్న ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇక పార్టీలో నంబర్ 2గా వెలిగిన రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ అనారోగ్య కారణాల రీత్యా క్రియాశీల రాజకీయాల్లో పాలుపంచుకోవడం లేదు. కేవలం హస్తిన రాజకీయాలు, పార్లమెంటులో జరిగే చర్చల్లోనే కనిపిస్తున్న గౌడ్సాబ్ జిల్లా రాజకీయాల్లో జోక్యం కూడా చేసుకోవడంలేదు. మల్కాజ్గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి గత ఎన్నికల వేళ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ వ్యతిరేక పవనాల్లోను విజయం సాధించి పార్లమెంటులో అడుగిడారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ, పార్టీ శ్రేణులు, దిగువశ్రేణి నాయకత్వమంతా పక్కపార్టీలకు పలాయనం చిత్తగించడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. దీంతో దాదాపుగా ఐసీయూలో చేరిన టీడీపీని బతికించడం దేవుడి కూడా కష్టమేనని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. -
నిరాశే మిగిలింది
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేంద్ర మంత్రి పదవుల విషయంలో జిల్లాకు తీరని నిరాశే మిగిలింది. కనీసం ఒక్క కేబినెట్ బెర్తయినా దక్కుతుందని ఆశించిన జిల్లా వాసులకు అడియాసలే మిగిలాయి. సహాయ మంత్రి పదవి కూడా లభించకపోవడం వారిని మరింత అసంతృప్తికి గురిచేస్తోంది. గడిచిన యూపీఏ-2 ప్రభుత్వంలో జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులిచ్చి పెద్దపీట వేశారు. 2009లో కొత్తగా ఏర్పడిన పార్లమెంటు నియోజవర్గాలైనప్పటికీ గెలిచిన ఇరువురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయి తే మోడీ ఏర్పరిచిన నూతన ప్రభుత్వంలో స్థానం లేకపోవడం విచారం కలిగిస్తోంది. ఒక్కరికీ అవకాశం లేదు ఎన్డీఏ కూటమి తరఫున ఇద్దరు ఎంపీలు జిల్లా నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మల్కాజిగిరి నుంచి ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం పక్షాన చామకూర మల్లారెడ్డి లోక్‌సభకు ఎన్నికవగా, అదే పార్టీకి చెందిన సీనియర్ నేత దేవేందర్‌గౌడ్ రాజ్యసభలో ఇప్పటికే కొనసాగుతున్నారు. వీరిద్దరిలో ఒక్కరికైనా ఈసారి తప్పకుండా కేంద్ర మంత్రి పదవి వస్తుందని, తద్వారా జిల్లా అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని ఆశించారు. కానీ సోమవారం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ నేతృత్వంలోని మంత్రివర్గ జాబితాలో జిల్లా ఎంపీల పేర్లు కనుమరుగయ్యాయి. రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన మల్లారెడ్డికి అనుభవం లేదన్న కారణంతో మంత్రి పదవి రాదేమోనని కొందరు భావించినా.. బీసీ వర్గాల్లో పట్టున్న నేత, రాజకీయ అనుభవజ్ఞుడైన దేవేందర్గౌడ్కైనా అవకాశం కల్పిస్తారని ఊహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీడీపీ, బీజేపీలకు గణనీయ సంఖ్యలో అసెంబ్లీ స్థానాలను కట్టబెట్టిన నేపథ్యంలో కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం జిల్లా వాసులను సంతృప్తిపరుస్తుందని భావించారు. అటు టీడీపీ గానీ, బీజేపీ గానీ వారి ఆశలను అర్థం చేసుకోలేకపోయాయి. రెండు నుంచి జీరోకు మునుపెన్నడూ లేని విధంగా యూపీఏ 2 ప్రభుత్వం మంత్రిపదవుల విషయంలో జిల్లాపై అమిత వాత్సల్యం కనబరిచింది. ఇరువురు జిల్లా ఎంపీలకు కేబినెట్లో స్థానం కల్పించి అభిమానం చాటింది. చేవెళ్ల నుంచి ఎంపికైన ఉన్నత సామాజిక వర్గ నేత జైపాల్‌రెడ్డికి, మల్కాజిగిరి నుంచి గెలిచిన దళిత నాయకుడు సర్వే సత్యనారాయణకు మంత్రి వర్గంలో స్థానం కల్పించి అటు అగ్రవర్ణాలను, ఇటు వెనుకబడిన వర్గాలకు సంతృప్తి కలిగించింది. జిల్లాకు రెండు మంత్రి పదవులు ఎలా ఇస్తారని అప్పట్లో కొందరు వ్యతిరేకించినా అత్యధిక పార్లమెంటు స్థానాలు అందించిన తెలంగాణకు, ముఖ్యం గా రెండు ఎంపీలను గెలిపించిన రంగారెడ్డి జిల్లాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇరువురికీ మంత్రి పదవులిచ్చి ఆదరించింది. కొత్తగా ఏర్పడిన మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం జిల్లాను చిన్నచూపు చూడటంతో కేంద్రమంత్రి వర్గంలో జిల్లా ప్రాతినిధ్యం రెండు నుంచి జీరోకు పడిపోయింది. ఈ పరిణామం బీజేపీ, టీడీపీ పార్టీల నేతలకే ఆగ్రహం కలిగిస్తోంది. -
కలిసిరాని ‘హోం’!
*రంగారెడ్డి జిల్లా నేతలకు అచ్చిరాని హోంమంత్రి పదవి *క్రమక్రమంగా తగ్గుతున్న రాజకీయ ప్రాభవం * ప్రభాకర్‌రెడ్డి నుంచి సబితారెడ్డి వరకూ ఇదే పరిస్థితి ‘హోం మినిస్టర్’ పదవి రంగారెడ్డి జిల్లా నేతలకు కలిసి రావట్లేదా.. ఈ శాఖలో కొనసాగిన మంత్రులు క్రమంగా కీలక పదవులకు దూరమవుతున్నారా.. క్రియాశీల రాజకీయాల్లో తమ ప్రాభవాన్ని కోల్పోతున్నారా..? అనే ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం అవుననిపిస్తోంది. ఇటీవలీ వరకూ జిల్లా కాంగ్రెస్, రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పట్లోళ్ల సబితారెడ్డి నుంచి అలనాటి హోంమంత్రి ప్రభాకర్‌రెడ్డి దాకా ఒకసారి పరిశీలిస్తే పై ప్రశ్నలకు మరింత స్పష్టత కనిపిస్తోంది. ఇందుకు ఉదాహరణలు ఇవిగో.. తనయుడి కోసం సబిత త్యాగం భర్త పి.ఇంద్రారెడ్డి ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన పట్లోళ్ల సబితారెడ్డి అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగారు. 2000 సంవత్సరంలో చేవెళ్ల ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొం దిన సబిత.. ఆ తర్వాత 2004లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో గనులు, చేనేత, జౌళి శాఖ పదవులను ఆమె అధిష్టించారు. ఆ తర్వాత చేవెళ్ల ఎస్సీ రిజర్వ్ కావడంతో 2009లో మహేశ్వరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రెండోసారి వైఎస్ మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా చరిత్ర సృష్టించారు. వైఎస్సార్ తర్వాత కె.రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లోనూ ఆమె హోంమంత్రిగా వ్యవహరించి ఉమ్మడి రాష్ట్రానికి చివరి హోంమంత్రిగా నిలిచిపోయారు. అయితే అవినీతి అభియోగాల నేపథ్యంలో సబితపై సీబీఐ కేసు నమోదు చేయడంతో 2013 ఏప్రిల్‌లో పదవికి రాజీనామా చేశారు. అప్పట్నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు. కుటుంబంలో ఒకరికే టికెట్ అన్న కోణంలో తనయుడు కార్తీక్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్ కేటాయించడంతో ఆమె పోటీ నుంచి అనివార్యంగా వైదొలగాల్సి వచ్చింది. క్రియాశీల రాజకీయాలకు దేవేందర్ దూరం రాష్ట్రంలో బలీయమైన బీసీ నేతగా ఎదిగిన దేవేందర్ గౌడ్.. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవితో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1994లో మేడ్చల్ శాసనసభకు పోటీ చేసి చంద్రబాబు మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1999 రెండోసారి ఎన్నికైన దేవేందర్.. చంద్రబాబు మంత్రివర్గంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అనూహ్యంగా టీడీపీ నుంచి బయటకొచ్చిన దేవేందర్.. నవతెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేస్తూ 2009లో ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ గూటికి చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇటు కొత్త సమీకరణాలు.. అటు అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దేవేందర్ దూరంగా ఉంటున్నారు. టీడీపీని వీడిన ఇంద్రారెడ్డి రాజకీయాల్లో చురుకైన వ్యక్తిగా పేరున్న పట్లోళ్ల ఇంద్రారెడ్డి 1985లో చేవెళ్ల శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో కార్మిక శాఖ, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1994లో తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఇంద్రారెడ్డిని హోంశాఖ వరించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ పగ్గాలు చంద్రబాబు చేతిలోకి వెళ్లడంతో ఇంద్రారెడ్డి ఆ పార్టీని వీడారు. ఆ తర్వాత వైఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని చేవెళ్ల నుంచి 1999లో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరం ఏప్రిల్‌లో మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. కందాడి ప్రభాకర్రెడ్డిదీ ఇదే పరిస్థితి..! టి.అంజయ్య ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన కందాడి ప్రభాకర్‌రెడ్డి స్వస్థలం హయత్‌నగర్ మండలం కోహెడ గ్రామం. 1978లో మలక్‌పేట నియోజకవర్గం నుంచి జనతాపార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1984లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అప్పట్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పార్టీని వీడిన తర్వాత క్రమంగా క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.