Devlopment works
-
తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు
-
'పాడా' పనులను త్వరగా పూర్తి చేసేలా సీఎం జగన్ ఆదేశాలు
సాక్షి, పులివెందుల: పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పులివెందుల ప్రాంతంలో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో పాడా అభివృద్ధి పనులపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పులివెందులలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. పులివెందుల అభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ►జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్‌పై 41వ కిలోమీటరు వద్ద మొగమేరు అక్విడెట్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే పైడిపాలెం, కుమ్మరంపల్లె గ్రామాలకు చెందిన 535 కుటుంబాల ముంపు బాధితులకు పరిహారం మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. ►పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, పులివెందుల సిటీ సెంటర్ పనులపై దృíష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. పులివెందుల జగనన్న హౌసింగ్ కాలనీ ఇళ్ల నిర్మాణ ప్రగతిని అధికారులు వివరించగా, నిర్మాణాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ►వాటర్‌గ్రిడ్ పనుల పురోగతితోపాటు పులివెందుల మెడికల్ కళాశాల, యూజీడీ, వాటర్ సప్లయ్, బస్టాండు నిర్మాణం తదితర అంశాలపై పనుల పురోగతి గురించి అధికారులు వివరించారు. దీంతోపాటు వేంపల్లె యూజీడీ, డిగ్రీ కళాశాల, గండి ఆలయ అభివృద్ధి పనులు, వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్ పనుల పురోగతిని సైతం అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ►ఖరీఫ్, రబీ రెండు సీజన్ల అరటిసాగుకు ఈ–క్రాప్ బుకింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ►మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప, బద్వేలు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో పెండింగ్ సమస్యలపై సమావేశంలో చర్చించారు. ►కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థికశాఖ కార్యదర్శులు సత్యనారాయణ, గుల్జార్, ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వాలి: మోపిదేవి
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలను వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతోపాటు 9 ఇతర డిమాండ్లను నెరవేర్చవలసిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసి.. మత్స్య సంపద, మత్స్యకారుల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.1509 కోట్లతో మేజర్ ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దశలవారీగా రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. -
అభివృద్ధి పనుల్లో ‘అవినీతి’ రాజ్యం
కాంట్రాక్టర్ల చేతిలోనే క్వాలిటీ కంట్రోల్! మూణ్ణాళ్ల ముచ్చటగా రోడ్ల నిర్మాణాలు అధికారులకు లంచాల మేత కొమ్ముకాస్తూ బిల్లులు చేస్తున్న యంత్రాంగం ప్రత్తిపాడు : అభివృద్ధి పనుల పేరుతో అవినీతి అడ్డగోలుగా రాజ్యమేలుతోంది. ప్రతి పనిలోనూ కాంట్రాక్టర్లు కక్కుర్తి పడుతున్నారు. దీంతో నాణ్యత మచ్చుకైనా కనిపించటం లేదు. క్వాలిటీ కంట్రోల్ కాస్తా అధికారుల చేతిలో నుంచి కాంట్రాక్టర్ల చేతిలోకి వెళ్లిపోతుండటంతో అభివృద్ధి మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. లంచాల మేత ప్రభావంతో మంత్రి రావెల కిశోర్‌బాబు ఇలాకాలో అవినీతి ఊట రోడ్లపై ఏరులై పారుతోంది. అందుకు సజీవ సాక్ష్యాలే ఇవి. రూ.10 లక్షలతో మరమ్మతులు.. మండల పరిధిలో ప్రత్తిపాడు నుంచి పాత మల్లాయపాలెం వెళ్లే ప్రధాన రహదారికి ఇటీవలే రూ.10 లక్షలతో మరమ్మతులు చేపట్టారు. పనులు నాసిరకంగా చేయడంతో ఇప్పుడు ఆ రోడ్డులో ప్రయాణం నరకప్రాయంగా మారింది. కంకర రాళ్లు పైకి లేచి ప్రయాణికులను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై.. నాణ్యతను, నిబంధనలను గాలికొదిలేసి ‘క్వాలిటీ కంట్రోల్’ను తమ చేతుల్లోకి తీసుకోవడంతో రహదారి దారుణంగా తయారైంది. నాలుగు నెలలు కూడా తిరగకుండానే అక్షరాలా పది లక్షల రూపాయలు రాళ్లపాలయ్యాయి. ఏడాది తిరక్కుండానే.. తిక్కిరెడ్డిపాలెం వెళ్లే రోడ్డు పూర్తిగా ఛిద్రమైపోవడంతో కొంతమేర తారురోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. రూ.10 లక్షల జిల్లా పరిషత్ నిధులతో 550 మీటర్ల మేర సుమారు పది నెలల కిందట తారురోడ్డును నిర్మించారు. దాని నాణ్యత మేడిపండు చందంగా మారింది. నిర్మించిన రెండు నెలలకే స్పీడ్‌బ్రేకర్ ఉన్నచోట పూర్తిగా ఛిద్రమై, పగుళ్లివ్వడంతో గతంలోనే అతుకులు వేశారు. ఇప్పుడు రోడ్డు ఆరంభంలో పెద్దగుంత పడింది. దానిని పూడ్చేందుకు మధ్యలో ఓ రాయిని పడేశారు. రూ.53 లక్షల ‘తారు’ణం.. మండలంలోని 16వ నంబరు జాతీయ రహదారి నుంచి తిక్కిరెడ్డిపాలెం వరకు రూ.53 లక్షల రూపాయల పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నిధులతో సుమారు మూడు నెలల కిందట తారు రోడ్డును నిర్మించారు. అనంతరం రోజుల వ్యవధిలోనే ఆ రోడ్డు మార్జిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పగుళ్లిచ్చి అధికారుల నిర్వాకాన్ని, క్వాలిటీ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణను వెక్కిరిస్తున్నాయి. రెండు నెలలకే రోడ్డు అధ్వానంగా తయారవ్వడంపై జనం పెదవి విరుస్తున్నారు. సబ్‌ప్లాన్ పనుల్లోనూ పగుళ్లే.. గొట్టిపాడు ఆది ఆంధ్రా కాలనీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నుంచి సుమారు కోటీ 3 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. సీసీ రోడ్డుకు సపోర్టు ఉండేందుకు గాను రోడ్డుకిరువైపులా నిర్మిస్తున్న కాంక్రీట్ పనులు నాసిరంగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ పక్క పనులు జరుగుతుండగానే మరోపక్క కాంక్రీట్‌తో పోసిన సపోర్టులు పగిలిపోతుండటం ఈ పనుల్లో అవినీతికి తార్కాణం.