నేడు డయల్ యువర్ డీఎం
సిద్దిపేట రూరల్: సిద్దిపేట, దుబ్బాక ఆర్టీసీ డిపోల పరిధిలో ప్రజల సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిద్దిపేట ఆర్టీసీ డీపో మేనేజర్ సురేశ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫోన్: 99592 26271 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.