different sectors
-
కేంద్ర బడ్జెట్: ఇందులో నాకేంటి?
♦ రైతు మద్దతిచ్చారు... బడ్జెట్లో ఢిల్లీ చుట్టూ ఆందోళనలు చేస్తున్న రైతులకు కనీస మద్దతు ధరపై చట్టంలో హామీ దొరక్కపోయినా... బడ్జెట్లో దొరికింది. కాకుంటే కనీస మద్దతు ధర మరీ కనీసంగా.. ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు మాత్రమే ఉంది!! సాగు రుణ పరిమితి లక్ష్యాన్ని 16.5 లక్షల కోట్లకు పెంచినా ఇవ్వాల్సింది బ్యాంకులు కదా! ‘ఆపరేషన్ గ్రీన్’ 22 ఉత్పత్తులకు విస్తరించటం ఊరటే. చదవండి: బడ్జెట్ 2021: ఈ విషయాలు మీకు తెలుసా! ♦ విద్యార్థి ఆన్లైన్... అర్థమైందా? స్కూలు బ్యాగు మోసి.. క్లాసు మొహం చూసి ఏడాదవుతోంది. ఆన్లైన్ పాఠాలు అర్థమయ్యాయో లేదో అర్థంకాని పరిస్థితి. కంప్యూటర్లు, ట్యాబ్‌లు, మొబైళ్లు లేనివారి గురించి ఆలోచించలేదెవ్వరూ! ఆలోచిస్తే ఈ బడ్జెట్లో మొబైల్ రేట్లు పెంచేస్తారా ఏంటి? మరి ఊహించని సిలబస్‌ను చూసి నష్టపోయిన పిల్లలకు ఈ బడ్జెట్లో ఏమైనా ఒరిగిందా అంటే.. అదీ లేదు. డిజిటల్ విద్య ఊసే లేదు. కాకుంటే మరో 15వేల కొత్త స్కూళ్లు, 100 సైనిక్ స్కూళ్లు తెస్తామన్నారు. ఇక.. ఉన్నత విద్య నియంత్రణకొక కమిషన్, లేహ్‌లో ఓ సెంట్రల్ యూనివర్సిటీ, ఎస్టీ విద్యార్థుల కోసం 750 ఏకలవ్య స్కూళ్లు ఇలా భవిష్యత్తు బాటలు చాలా ఉన్నాయ్. కానీ కోవిడ్ లాంటి వైరస్లు కోరలు చాస్తే..? తగిన ఆన్లైన్ పాలసీ అవసరమైతే ఉంది!. చదవండి: బడ్జెట్ 2021: రక్షణ రంగం కేటాయింపులు.. ♦ ఉద్యోగి అయినా... పన్ను మారలేదు పన్ను పోటులో మార్పేమీ లేదు. కాకపోతే కొన్ని చిన్నచిన్న ఊరటలున్నాయ్. రిటర్నులు రీ–ఓపెన్ చేసే కాలాన్ని ఆరేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లో పెట్టే పెట్టుబడులపై వచ్చే వడ్డీకి టీడీఎస్ ఉండదు. ఇక తక్కువ ధరలో ఇల్లు కొనుక్కున్న వారికి రూ.1.5 లక్షల వరకూ వడ్డీ రాయితీ ఇచ్చే పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగిస్తున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు. పన్ను వివాద మెకానిజం మరింత సులభం చేశారు. కానీ మధ్య తరగతి ఆశగా చూసే ఆదాయపన్ను శ్లాబుల జోలికి మాత్రం వెSళ్లలేదు. పైగా అగ్రిసెస్సు కారణంగా వివిధ రకాల వస్తువుల ధరలు పెరిగి జేబుకు చిల్లు పడొచ్చనే ∙దిగులు వచ్చి పడింది..! చదవండి: ఎన్నికలు: ఆ రాష్ట్రాలకు వరాలపై జల్లు ♦ సీనియర్ సిటిజన్ ఇదేం రకం ఊరటబ్బా? 75 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు టాక్స్ రిటర్న్స్ వేయాల్సిన అవసరం లేదనే వెసులుబాటు తాజా బడ్జెట్లో కల్పించారు. కానీ కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయంపై ఆధారపడే సీనియర్ సిటిజన్లకే ఈ వెసులుబాటని క్లాజ్ పెట్టారు. ఈ ప్రకటనతో వారికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే పని తప్పింది కానీ, పన్ను మాత్రం రూపాయి తగ్గలేదు. బ్యాంకులే పెన్షన్‌లో పన్ను మినహాయించేసుకుంటాయి. మరి దీన్ని ఊరట అనుకోవాలా? అయినా మన దేశంలో సగటు ఆయుఃప్రమాణం 70 సంవత్సరాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ మాట. అలాంటప్పుడు 75 సంవత్సరాల పైబడినవారికి మాత్రమే ఈ వెసులుబాటు ఇస్తే ఎందరికి లాభమట? ♦ కార్పొరేట్స్ సూపరో.. సూపర్! కార్పొరేట్ల హ్యాపీ అంతా ఇంతా కాదు. ఆ సంతోషమంతా మార్కెట్లలో చూపించేశారు లెండి. పన్ను పెంచలేదు. పైపెచ్చు డివిడెండ్ మినహాయింపులు, ఇన్ఫ్రా డెట్‌ఫండ్స్ నిధులు సమీకరించుకునే వీలు, ఎన్ఎఫ్ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు, గిఫ్ట్ సిటీలో ఐఎఫ్‌ఎస్‌సీకి పన్ను ప్రోత్సాహకాలు, టాక్స్ ఆడిట్ టర్నోవర్ పెంపు, జీఎస్టీ ఫైలింగ్ సరళీకరణ, కస్టమ్స్ డ్యూటీ క్రమబద్ధీకరణ, మొబైల్స్, ఐరన్, టెక్స్టైల్స్, కెమికల్స్, బంగారం, వెండి, పునర్వినియోగ ఇంధన వనరుల రంగాలకు తాయిలాలు లాంటివన్నీ నవ్వులు పూయించేవే. ఇక ప్రయివేటీకరణ అంటూ అమ్మకానికి పెట్టిన ఆస్తులన్నీ కొనేది ఎలాగూ వీరే. అందుకే తాజా బడ్జెట్‌తో మార్కెట్ రయ్యి... మంది. -
అమ్మ హయాంలోనే ఆ రంగాల అభివృద్ధి కూడా..
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత చేపట్టిన అభివృద్ధి పథకాలు ఏమిటంటే అమ్మ క్యాంటీన్, అమ్మ మందులు, అమ్మ ఉప్పు, అమ్మ పప్పు, అమ్మ టీవీలు అంటూ ప్రజాకర్షక పథకాల పేర్లను అనర్గళంగా చెప్పేస్తారు. అది ఒక పార్శం మాత్రమే. ఆరోగ్య, పారిశ్రామిక, సామాజిక, విద్యా రంగాల్లో, నేరాలను అరికట్టడంలో ఆమె ఎంతో పురోభివృద్ధి సాధించారు. దేశంలోకెల్లానే కాకుండా ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, బెల్జీయం దేశాలకన్నా శిశు మరణాలు తమిళనాడులోనే తక్కువంటే ఆశ్చర్యం వేస్తోంది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు కూడా దేశంలోకెల్లా తమిళనాడులోనే తక్కువ. జయలలిత హయాంలో తమిళనాడులో పారిశ్రామికాభివృద్ధి పెరిగి ఎన్నో కొత్త ఫ్యాక్టరీలు వచ్చాయని, ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయని, ఆమె అధికారంలోవున్న 15 ఏళ్లలోనే విద్యారంగం కూడా ఎంతో పురోభివృద్ధి చెందిందని ‘ఇండియాస్పెండ్’ సంస్థ డేటా విశ్లేషనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆమె చేపట్టిన ఉచిత జనరంజక పథకాల వల్ల 2015, డిసెంబర్ 31నాటికి గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రం అప్పులు 92శాతం పెరిగాయి. విద్యారంగ పురోభివృద్ధి సూచికలు జాతీయ సరాసరి కన్నా ఎప్పుడూ తమిళనాడులో ఎక్కువగానే ఉన్పప్పటికీ ఆమె 15 ఏళ్ల పరిపాలన కాలంలో కూడా చెప్పుకోతగ్గ అభివృద్ధి జరిగింది. భారత్ లోని ఏ రాష్ట్రంలో లేనన్ని ఫ్యాక్టరీలు ఒక్క తమిళనాడు రాష్ట్రంలో ఉండడం మరో విశేషం. 2013-2014లో విడుదల చేసిన పారిశ్రామిక వార్షిక సర్వే ప్రకారం 37,378 ఫ్యాక్టరీలు ఉన్నాయి. రెండో స్థానాన్ని ఆక్రమించిన మహారాష్ట్రలో 29,123 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 22,876 ఫ్యాక్టరీలతో గుజరాత్ మూడవ స్థానంలో ఉంది. అత్యధికంగా కార్మికులు, అంటే 24లక్షల మంది తమిళనాడులో పనిచేస్తున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 18 లక్షల మంది, గుజరాత్లో 13 లక్షల మంది పనిచేస్తున్నారు. దేశంలో సరాసరి సగటు ఆదాయం ఎక్కువున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఐదవ స్థానాన్ని ఆక్రమించింది. జనాకర్షక ఉచిత పథకాలు.. ప్రజల సంక్షేమం కోసం ఉచిత పథకాలను తమిళనాడులో ప్రవేశపెట్టడం జయలలిత ద్వారానే ప్రారంభంకాలేదుగానీ ఆమె హయాంలో విస్తృతం అయ్యాయి. 2011లో ఎన్నికల సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వంద యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తానని, ప్రతి 11,12 తరగతి విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ ట్యాప్‌లను ఇస్తానని, ప్రతి పెళ్లికి గ్రాము బంగారం ఉచితమని, దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రతి కుటుంబానికి నాలుగు మేకలు లేదా గొర్రెలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక అమ్మ క్యాంటీన్, అమ్మ మెడికల్స్ గురించి చెప్పక్కర్లేదు. వీటన్నింటిని అమలు చేయడం ద్వారా తమిళనాడు రాష్ట్రం అప్పులు అతివేగంగా అంటే 92శాతం ఈ ఐదేళ్లకాలంలో పెరిగాయి. అయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 20 శాతం మాత్రమే ఉన్నాయి. అంటే అప్పులను అధిగమించే స్థాయిలో రాష్ట్రం పురోభివృద్ధి కొనసాగుతోంది. ఈ అప్పుల శాతం 50 శాతానికి పెరిగే వరకు తమిళనాడుకు వచ్చే నష్టమేమీ లేదు.