క్రిష్‌కు కిక్కిచ్చిన 'కంచె'
హైదరాబాద్: కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న తరుణంలో విలువలతో కూడిన సినిమాను తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ కెరీర్లో మరో మెట్టు పైకి ఎక్కాడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన కంచె అనుకున్నట్టుగానే విజయాన్ని సాధించింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డును దక్కించుకుంది. దీంతో కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డులలో బాహుబలికి ఉత్తమ జాతీయ చిత్రం, ఇటు కంచె సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు ద్వారా టాలీవుడ్ పేరును సగర్వంగా నిలిచింది.
తన సినిమాకు జాతీయ అవార్డు రావడం పట్ల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఉబ్బితబ్బిబవుతున్నారు. అవార్డు సాధించే సత్తా ఉన్నప్పటికీ, ఈ పురస్కారాన్ని తాను ఊహించలేదని మీడియాతో తెలిపారు. కానీ ఇప్పటివరకు తాను చేసిన సినిమాల్లో 'కంచె'అత్యంత అసాధారణ చిత్ర మన్నారు. దీనికోసం చాలా కష్టపడ్డాడనని ఆయన చెప్పారు.
అటు తన రెండో సినిమాగా ప్రయోగాత్మక సినిమాను ఎంపికచేసుకొని సాహసం చేసిన టాలీవుడ్ మెగాహీరో తన తొలి అవార్డును ఖాతాలో వేసుకున్నాడు. దీనిపై వరుణ్ తేజ్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు సాధించిన కంచె సినిమాలో నటించడం పట్ల ట్విట్టర్లో సంతోషం వ్యక్తంచేశాడు. కంచె దర్శకుడు కెప్టెన్ క్రిష్‌కు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశాడు.
కాగా మెగా వారసుడు వరుణ్‌తేజ్ ముకుంద సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా తెరకెక్కిన ఈ మూవీలో ప్రేమ, యుద్ధం రెండూ ఒకటే.. అంటూ ప్రేమలోని యుద్ధాన్ని విభిన్నంగా ఆవిష్కరించాడు క్రిష్.
Humbled to be part of a national award-winning film thanks to the captain of #kanche @DirKrish and our entire team!!..
Thank you all!
— Varun Tej (@IAmVarunTej) 28 March 2016