distict
-
India GDP Growth: జీడీపీలో జిల్లాల వాటా ఎంతంటే..
దేశ స్థూలజాతీయోత్పత్తి వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8 శాతంగా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. వ్యవసాయం, ఆర్థిక రంగాల పని తీరుతో ఇది సాధ్యమైందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అయితే దేశంలోని జిల్లాల అభివృద్ధిపై జీడీపీ ఆధారపడుతుంది. ప్రముఖ నగరాలున్న జిల్లాలు దేశాభివృద్ధికి ఎంతో సహకారం అందిస్తున్నాయి. 2020-21 సంవత్సరానికిగాను జీడీపీ వృద్ధిరేటులో భాగంగా దేశంలోని జిల్లాల్లో అత్యధికంగా ముంబయి తన సహకారాన్ని అందించించినట్లు సమాచారం. 2020-21 ఏడాదికిగాను గణాంకాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం వివిధ జిల్లాల వాటా వివరాలు కింది విధంగా ఉన్నాయి. ముంబయి-రూ.22లక్షల కోట్లు దిల్లీ-రూ.21లక్షల కోట్లు కోల్‌కతా-రూ.12లక్షల కోట్లు బెంగళూరు అర్బన్-రూ.9.9లక్షల కోట్లు పుణె-రూ.9.7లక్షల కోట్లు హైదరాబాద్-రూ.9.5లక్షల కోట్లు అహ్మదాబాద్-రూ.9.4లక్షల కోట్లు చెన్నై-రూ.9లక్షల కోట్లు సూరత్-రూ.6.6లక్షల కోట్లు థానే-రూ.6.6లక్షల కోట్లు జూపుర్-రూ.5.4లక్షల కోట్లు నాగ్‌పుర్-రూ.5.1లక్షల కోట్లు నాసిక్-రూ.4.6లక్షల కోట్లు -
విషాదాంతమైన BRS ఆత్మీయ సమ్మేళనం
-
అక్షరాస్యతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలి
జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత కూసుమంచి: అక్షరాస్యత సాధనలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. కూసుమంచిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరాస్యతలో రాష్ట్రం దేశంలో 32వ స్థానంలో ఉండటం దురదృష్టకరమన్నారు. దీనిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరు చదవడం, రాయడం నేర్చుకున్న రోజే సమాజం మీద వారికి అవగాహన కలిగి అభివృద్ధి చెందుతారన్నారు. జిల్లాలోని సాక్షరభారత్ కేంద్రాలను పటిష్టంగా నిర్వహిస్తూ ప్రజలను అక్షరాస్యులుగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సాక్షరభారత్ స్టేట్ రిసోర్స్ పర్సన్ కాత్యాయని మాట్లాడుతూ సాక్షరభారత్ కేంద్రాల ద్వారా జిల్లాలో 6.95 లక్షల మంది అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో ఐదు వయోజన విద్యాకేంద్రాలను ఆదర్శ కేంద్రాలుగా మార్చి కంప్యూటర్, ఎల్సీడీలను సమకూర్చినట్లు తెలిపారు. అంతకు ముందు అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షరభారత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. సాక్షరభారత్ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఎంసీఓలు, వీసీఓలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ వడ్త్యియ రాంచంద్రునాయక్, బారి శ్రీను, సాక్షరభారత్ డీడీ ధనరాజ్, ఎంఈఓ శ్రీనివాస్, హెచ్ఎం లక్ష్మీనారాయణ, ఎస్ఎంసీ చైర్మన్ హకీంపాషా, డీసీఓలు రమ్య, భవానీ, ఎంసీఓలు కళ్లెం అంజిరెడ్డి, నూకల చెన్నయ్య, వీరయ్యలు పాల్గొన్నారు. -
విభజనాగ్ని
విభజనాగ్ని సాక్షి, కాకినాడ : రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణ బిల్లును ఆమోదించడంపై మంగళవారం జిల్లావ్యాప్తంగా నిరసన జ్వాలలు పెల్లుబికాయి. రాస్తారోకోలు..ధర్నాలు..దిష్టిబొమ్మల దహనాలతో జిల్లా ప్రజలు మళ్లీ రోడ్డెక్కి తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతల తీరు వల్లే ఈ దుర్గతి పట్టిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడునెలలుగా ఉవ్వెత్తున సాగిన విభజనాగ్ని ఉద్యమం సమైక్యద్రోహుల వల్ల నీరు గారిందంటూ జిల్లా ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. జూలై-30న సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది మొదలు నేటి వరకు సాగిన సమైక్య ఉద్యమంలో జిల్లావాసులు ఆగ్రభాగన నిలిచారు. రెండునెలలపాటు జిల్లా మొత్తం ధర్నాలు, ఆందోళనలు, బంద్‌లతో స్తంభించిపోయింది. ఏపీఎన్జీఒలకు ప్రభుత్వశాఖలన్నీ అండగా నిలిచి సమ్మెబాట పట్టాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులు వినూత్న ఆందోళనలతో కదం తొక్కాయి. జీర్ణించుకోలేకపోతున్న జనం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు మూజువాణి ఓటుతో మంగళవారం లోక్‌సభ ఆమోదముద్ర వేయడాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరు దశాబ్దాలుగా కలిసి ఉన్న తెలుగుజాతిని సీట్లు-ఓట్ల కోసం కాంగ్రెస్-బీజేపీ-టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలతో ముక్కలు చేశాయని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సమైక్యద్రోహులుగా మారిన ఈ పార్టీల ప్రజాప్రతినిధుల తీరు వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి నుంచి విధుల్లోకి ఎన్జీవోలు విభజన బిల్లు అసెంబ్లీకి పంపడాన్ని నిరసిస్తూ ఈ నెల ఆరవ తేదీ నుంచి ఏపీఎన్జీఒలు మళ్లీ నిరవధిక సమ్మె బాటపట్టారు. గత 13 రోజులుగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్న ఏపీఎన్జీఒలు వినూత్న రీతిలో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. తాము సమ్మెను విరమించి గురువారం నుంచి విధులకు హాజరవుతామని ఏపీఎన్జీఓ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం తెలిపారు. ఆగ్రహ జ్వాలలు జిల్లా కేంద్రమైన కాకినాడలో కలెక్టరేట్ వద్ద ఏపీ ఎన్జీఓలు సోనియా, దిగ్విజయ్, షిండే, జై రామ్ రమేష్, సుష్మాస్వరాజ్‌లతో రూపొందించిన ఫ్లెక్సీలకు నిప్పుపెట్టి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదు సెంటర్లో సమైక్యవాదులు టైర్లకు నిప్పుపెట్టి సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ నిరసన రాజమండ్రి దేవీచౌక్ సెంటర్లో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో రాజ్‌కుమార్‌తోపాటు జక్కంపూడి రాజా, ఆదిరెడ్డి వాసు, రాష్ర్ట ఎస్సీ సెల్ సభ్యుడు మాసా రామజోగ్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ సెంటర్లో రాస్తారోకో చేశారు. బీజేపీ జెండాలను దహనం చేసి ఆందోళనకు దిగారు. దీంతో విజయలక్ష్మితో సహా పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కోరుకొండ మండల కన్వీనర్ చింతపల్లి చంద్రం గుండుగీయించుకొని నిరసన తెలిపారు. అమలాపురం హైస్కూల్ సెంటర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో బీజేపీ స్థూపం ధ్వంసం చేసి రాహుల్ గాంధీ ఫ్లెక్సీలకు నిప్పుపెట్టారు. జేఏసీ కోనసీమ చైర్మన్ విఎస్ దివాకర్, కన్వీనర్ బండారు రామ్మోహనరావు వైఎస్సార్సీపీ నాయకులు మిండగుదిటి మోహన్‌తో పాటు జేఏసీ, పార్టీ నాయకులు రాస్తారోకో చేశారు. మామిడికుదురులో వైఎస్సార్సీపీ రాష్ర్టరైతు విభాగం కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ తదితరుల ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏలేశ్వరం బాలాజీచౌక్ సెంటర్లో వైఎస్సార్సీపీ నాయకులు అలమండ చలమయ్య, శిడగం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పిఠాపురంలోని పార్టీ కార్యాలయం ఎదుట సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. సఖినేటిపల్లి మండలం శృంగవరపుపాడులో స్థానికులు రాస్తారోకో చేయగా, రాజోలులో రాస్తారోకో నిర్వహించి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అరకు పార్లమెంటు నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొత్తపల్లి గీత యువసేన కార్యకర్తలు రంపచోడవరంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. అనపర్తి దేవీచౌక్ సెంటర్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కిర్లంపూడిలో ఎంపీడీఒ ప్రసాద్ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. -
నేడు జిల్లా బంద్
నేడు జిల్లా బంద్ నిరంకుశంగా సాగిన రాష్ట్ర విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు బుధవారం జిల్లాలో బంద్ జరగనున్నది. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో టీబిల్లు ఆమోద సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ఎమర్జెన్సీకన్నా దారుణంగా ఉందని రాజశేఖర్ విమర్శించారు. తలుపులు వేసి, టీవీ ప్రసారాలు నిలిపివేసి చీకటిలో బిల్లును ఆమోదించినట్టు ప్రకటించటం ప్రజాస్వామ్య వ్యవస్థకే దుర్దినమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీల కుట్ర ఫలితంగా విభజన జరిగిందని ధ్వజమెత్తారు. పార్లమెంటు సాక్షిగా తెలుగువారి అత్మగౌరవాన్ని మంటగలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ఆర్టీసీ, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి నిరసన తెలపాలని కోరారు. కాగా, విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో 48 గంటలపాటు సీమాంధ్రలో బంద్ జరగనున్నదని రాష్ట్ర కోఆర్డినేటర్ మండూరి తెలిపారు. -
ముర్ు పర్ రహం కరో..!
ముర్ు పర్ రహం కరో..! అరచేతిలో వైకుంఠం చూపడం అధికారులకు అలవాటే. సంక్షేమ ఫలాలు అందరికీ అందిస్తున్నామంటూ ప్రకటనల ద్వారా ప్రగల్భాలు పలకడం వారికి పరిపాటే. పలువురు పేదల జీవితాల్లో తొంగిచూస్తే అధికారులు చెప్పుకుంటున్నదంతా ఉత్తిదే అనిపిస్తుంటుంది. నగరానికి చెందిన జాన్‌బీ పరిస్థితి అలాంటిదే. పుట్టుకతో మూగ అయినప్ప టికీ ఆమెను కనికరించే వారు కరువయ్యారు. ‘ముర్ు పర్ రహం కరో..’ (నాపై కరుణ చూపండి) అంటూ పలకని గొంతుకతో ఆమె వేడుకుంటోంది. నగరంలోని ఆర్డీఓ కార్యాలయం సమీప హైమద్నగర్కు చెందిన జాన్‌బీ పుట్టుకతో మూగ. నిరుపేద కుటుంబంలో ఆమె 1978లో జన్మించింది. తండ్రి షేక్ హిదాయతుల్లా. బండరాళ్లు, కంకర సరఫరా చేస్తూ పిల్లలను పోషించుకున్నాడు. జాన్‌బీకి ఇద్దరు పిల్లలు. భర్త షేక్ మునీర్‌పాషా వెల్డింగ్‌షాపులో పనిచేస్తున్నాడు. చాలీచాలని రోజువారీ వేతనంతో బతుకుబండిని లాగుతున్నాడు. జాన్‌బీకి వంద శాతం వైకల్యం ఉందంటూ 1990లో జిల్లా ప్రభుత్వాస్పత్రి సర్టిఫికెట్ మంజూరు చేసింది. అనంతరం ఆమెకు రైల్వే శాఖ రాయితీ పాస్ కూడా ఇచ్చింది. తనకు పింఛను కూడా ఇవ్వాలంటూ జాన్‌బీ అధికారులకు పలుమార్లు కోరింది. గ్రీవెన్స్‌సెల్‌లో దరఖాస్తు చేసుకుంది. అయినప్పటికీ పట్టించుకున్న దాఖలాలులేవు. ఈ నేపథ్యంలో ఎంపీ నామా నాగేశ్వరరావును కలిసి జాన్‌బీ తన గోడు వినిపించింది. భర్త పనిచేయగా వచ్చే డబ్బుతో కుటుంబం గడవడం కష్టంగా ఉందని, పిల్లల చదువులు భారంగా మారాయని సైగలతో వివరించింది. అయినా ఆమెకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. దీంతో జాన్‌బీ కన్నీటి పర్యంతమవుతోంది. తనకు పింఛను ఇప్పిస్తే ఆసరాగా ఉంటుందని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పెడచెవిన పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. చివరకు వికలాంగుల శాఖ సంక్షేమ అధికారిని కూడా జాన్‌బీ కలిసిందని, అయినా పింఛను మంజూరు కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తన పట్ల ఇప్పటికైనా అధికారులు కనికరం చూపాలని జాన్‌బీ మూగభాషతో వేడుకుంటోంది.