divi kumar
-
‘అరుణోదయం’ రామారావు గళం
అరుణోదయ రామారావు మరణ వార్త అశనిపాతం లాంటిది. ఊహిం చలేనిది. గత నెల 12న హైదరాబాదులో కొండపల్లి సీతారామయ్య వర్ధంతి సభ రోజున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కలిసి మాట్లాడుకున్నాం. ఆ సభలో కానూరి రాసిన ‘విప్లవాగ్రణి కొండపల్లి’ అనే పాటను రామారావు పాడారు. ఆయన నోటినుండి విన్న ఆఖరి పాట అదే అవుతుందని ఎలా అనుకోగలం? 70వ దశకం చివర గుంటూరు గాంధీపార్క్‌లో కానూరి, రామారావులు ప్రదర్శించిన బుర్రకథ అనంతరం మొదటిసారి వారిరువురినీ కలిసి మాట్లాడా. 1990 నుండి 2004లో ముంబైలో జరి గిన వరల్డ్ సోషల్ ఫోరం దాకా అనేక సాంస్కృతిక వేదికల మీద రామారావుతో కలిసి ఎన్నో ప్రదర్శనల్లో పాల్గొన్నాను. రామారావు ప్రధాన కార్యదర్శిగా, ఉదయ్ కార్యదర్శిగా, చిన్న విమల, గోరటి వెంకన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉండిన ఒక అరుణోదయకు నేను అధ్యక్షుడిగా ఉండిన కాల మది. గుంటూరు జిల్లా కాజ నుండి కర్నూలు జిల్లా వెలుగోడు, బొల్లవరం దాకా, నల్లగొండ జిల్లా నకిరేకల్లు నుండి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, గోదావరి ఖని తదితర చోట్ల అనేక శిక్షణా శిబిరాలలో రామారావుతో కలిసి మేము పాల్గొన్నాం. నంద్యాల ఎంపీ స్థానంలో 1991 చివర, పీవీ నరసింహారావు పోటీ చేసినప్పుడు, అప్పటికే ఆయన ప్రధానిగా డంకెల్ ప్రతిపాదనలపై సంత కంపెట్టి, సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు దేశాన్ని లోబరిచినందుకు నిరసనగా మేము ‘అప్పుల భారతం‘ అనే కళారూపాన్ని ప్రదర్శిస్తూ ప్రచారం చేశాం. దాని సూత్రధారుడు రామారావు. ప్రధాన పాత్రధారుణ్ణి. ‘పరమవీర నారసింహ మహరాజ్’ని నేను. నంద్యాల ఎంపీ స్థానం లోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు ప్రతి మండల కేంద్రంలో మండ్ల సుబ్బారెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతుగా మా ప్రదర్శన ఉండేది. నాటి ఉమ్మడి ఏపీలో దాదాపు 19 జిల్లాల్లో అప్పుల భారతం ప్రదర్శనలు ఇచ్చాం. ముంబైలో తెలుగువారున్న ప్రాంతాలలో రోజుకి రెండు మూడు ప్రదర్శనలు చొప్పున ఐఎఫ్టియు ఏర్పాటుకై గట్టి ప్రచారం చేశాం. 1993 సెప్టెంబర్‌లో లక్నో ‘మతోన్మాద వ్యతిరేక సదస్సు’లో ‘రామ జన్మభూమి కాదురో’ వీధి నాటకాన్ని, 1993 డిసెం బర్ నెలాఖరులో కోల్‌కతలో జరిగిన మావో శత జయంతి ముగింపు సభలో ‘ఎత్తిన జెండా దించకో య్’ అనే నిశ్చలన దృశ్యరూపకాన్నీ ప్రదర్శించాం. అరుణోదయ సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా శ్రీకాకుళం నుండి కరీంనగరం దాకా జిల్లా సంఘాల నిర్మాణం కొరకు కలసి పని చేశాం. నాలుగైదు పాటల క్యాసెట్ రికార్డింగ్‌లలో రామారావుతో కలిసి పాల్గొన్నాము. వాటిలో చుండూరు నరమేధం జరిగిన కొద్ది రోజుల్లోనే విజ యవాడ సువార్త వాణిలో రికార్డు చేసిన ‘దళిత పోరాట పాటలు’ మొదటిది. ఆ తర్వాత అంగడి చెన్నయ్యమీద ఒక పాటల క్యాసెట్టు, విశ్వ మోహన్ రెడ్డిమీద మరొక పాటల క్యాసెట్టు రూపొందిం చాము. మా తంతి–తపాలా కార్మిక ఉద్యమ నాయకుడు పి.పురుషోత్తం రాజు మీద మరొక క్యాసెట్‌ని కూడా రూపొందించాము. దళిత పోరాట పాటలు లోని కేవై ఏసుదాసు రాసిన ‘చిందింది రక్తం చుండూరులోన’ పాటకు రామారావు, పల్లవికంటే ముందు ఆలపించిన సాకీ, నాటి చుండూరు విషాదాన్ని మన గుండెలను తాకేలా చేస్తుంది. రామారావు లాంటి అరుదైన గాయకుడు ప్రజా కళారంగానికి అంకితమై 45 సంవత్సరాలకు పైగా నిబద్ధతతో పని చేయడం వల్ల తెలుగునాట పీడిత ప్రజానీకాన్ని, విద్యార్థి యువజనులను విప్లవోద్యమం తన వైపుకి ఆకట్టుకోగలిగింది. ఏ రాగాన్నయినా, ఏ శృతిలోనైనా పాడగలిగిన నైపుణ్యం కలవాడు. ఒక్కొక్కసారి అతను రాగాన్ని ఎప్పుడు ఆపుతాడో, ఇంకెంతసేపు ఆలపిస్తాడోనని శ్రోతలకి గొప్ప ఉత్కంఠతని కలిగించే విధంగా ఉండేది. ఒకసారి నేను తనతో మాట్లాడుతూ మిమ్మల్ని నడిపించిన జీవశక్తులు రెండు అని చెప్పాను. అందులో కళాశక్తి కానూరిది అయితే, జీవన గమనాన్ని నడిపించిన శక్తి జీవిత సహచరి అరుణమ్మది అన్నాను. 45 ఏళ్ల పాటు తన జీవితాన్ని విప్లవోద్యమానికి, ప్రజా సాంస్కృతిక కళా రంగాలకు అంకి తం చేసి, పాలకుల వ్యామోహాల వలలో చిక్కుకోకుండా, ఆఖరి శ్వాస దాకా ప్రజలకే తన కళా ఉద్యమ నైపుణ్యాలను అంకితం చేసిన అరుణోదయ రామారావు మృతికి నివాళులర్పిస్తున్నాను. దివికుమార్ వ్యాసకర్త అధ్యక్షుడు, జనసాహితి మొబైల్ : 94401 67891 -
క్వార్టర్స్‌లో దివిజ్–బోపన్న జంట
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్ దివిజ్ శరణ్–రోహన్ బోపన్న (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్–బోపన్న ద్వయం 6–1, 6–2తో రాడూ అల్బోట్ (మాల్డోవా)–మాలిక్ జజిరీ (ట్యూని షియా) జోడీపై విజయం సాధించింది. 50 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జంట నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి జంట సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరో మ్యాచ్‌లో లియాండర్ పేస్ (భారత్)–మిగుయెల్ వరేలా (మెక్సికో) ద్వయం 6–3, 6–4తో మరేరో (స్పెయిన్)–కాస్టిలో (చిలీ) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లో దివిజ్–బోపన్న జోడీతో పోరుకు సిద్ధమైంది. సింగిల్స్ విభాగంలో భారత ఆటగాళ్లు రామ్‌కుమార్ రామనాథన్ ముందంజ వేయగా... అర్జున్ ఖడే నిష్క్రమించాడు. తొలి రౌండ్లో రామ్‌కుమార్ 4–6, 6–4, 6–3తో మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)పై నెగ్గగా... అర్జున్ ఖడే 5–7, 6–7 (6/8)తో లాస్లో జెరీ (సెర్బియా) చేతిలో ఓడిపోయాడు. క్వాలిఫయింగ్ నుంచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని కాలి గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. -
పరభాషా వేలంవెర్రి నుండి విముక్తి పొందుదాం
గత కొన్ని దశాబ్దాలుగా ముఖ్యంగా ప్రపంచీ కరణ అనే బానిస కొలువుకు కుదురుకున్న నాటి నుంచీ, రెంటికీ చెడ్డ రేవడులను సృష్టిం చే పనిలో కేంద్ర, రాష్ట్ర పాలకులు తలము నకలై ఉన్నారు. నీటిలో చేపపిల్ల ఈదినంత హాయిగా, ప్రకృతీ, సమాజాల గురించిన ప్రాథమిక జ్ఞానం ద్వారా తల్లి భాషను నేర్చుకోగలిగే ప్రక్రియను తల్లకిందులు చేశా రు. ఇంగ్లిషునొక పాఠ్యాంశంగా చేయటంతో ఆగక, ఇంగ్లిష్ మాధ్యమంలోనే పాఠాలన్నీ బోధిస్తున్నారు. ఈ తల్ల కిందుల విద్యావిధానం విద్యార్థుల సృజనను చంపేసి, వారిని ధనం మత్తుకు హత్తుకు పోయేవారిగా.. ప్రజల, దేశం పట్ల, చివరకు సొంత కుటుంబాల పట్ల బాధ్యతలేని వారిగా మారుస్తోంది. మాతృభాష ద్వారా ఎంత జ్ఞానాన్ని సముపార్జించుకుంటే అంత సులువుగా ఇతర భాషలూ వాటి ద్వారా లభించే జ్ఞానమూ పొందగల మని విద్యావేత్తల సూచనలు పాలకులు విస్మరించారు. ‘మాతృభాషలో విద్యాబోధన సాధించడానికి ఎంతటి కల్లోలం రేగినా మంచిదే’నన్న గాంధీజీ పలుకుల్నీ విస్మరించారు. దేశానికి ఆయువు పట్టులాంటి ఆర్థిక, రాజకీయరంగాలలో మార్కెట్ శక్తులకు లొంగిపోయిన వారికి, భాష విషయంలో పెద్ద పట్టింపేమీ ఉండదు. చదువుకుంటున్న వారిలో నూటికి 30 మంది మాతృభాషలో ధారాళంగా చదవలేకపోయినా, స్పుటంగా మాట్లాడలేకపోయినా, తప్పులు లేకుండా రాయలేకపో యినా.. ఆ భాష మాతృభాషగా దిగజారుతున్నట్లేనని 2001లోనే హెచ్చరించిన యునెస్కో, తెలుగుకు ‘చావు’ హోదానిచ్చింది. సాంస్కృ తిక సామ్రాజ్యవాద విషగాలులకు తెలుగుభాష, జాతి, సంస్కృతి విల విలలాడుతున్నాయి. నేటి ఇంగ్లిష్ మాధ్యమం పాఠశాలల ద్వారా గత 30 ఏళ్లలో చదువుకున్న తెలుగువారిలో ఒక్కరైనా మంచి ఇంగ్లిష్‌లో కవి త్వం, కథలాంటి సృజన చేసినవారే లేరు. మానవ హృదయ స్పంద నలను ఆవిష్కరించలేని భాషా పరిజ్ఞానం జోసఫ్ స్టాలిన్ అన్నట్లు బజా రులో ‘తట్టబేరగాళ్ల భాష’గానే ఉండిపోతుంది. ఇంగ్లిష్ వ్యామోహంలో కూరుకుపోయిన బానిస పాలకులతో చెలిమే కలిమిగా భావించే కొందరు భాషాభిమానులు, తెలుగు భాష చావుకు ప్రజలను తప్పు పట్టడంలో గొప్ప ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు. ‘బక్కవాని మీద బాహుబల ప్రదర్శనం’ గావించే ఇటువంటి వారినో కంట కనిపెట్టి ఉండాలి. ప్రస్తుత కాలంలో భాష గురించిన ఏ చర్చ అయినా నేటి ఈ ఇంగ్లిష్ పెత్తనమనే దురవస్థ నుంచి బయటపడవేసే దిగా ఉండాలి. తెలుగు భాష ప్రాచీనతను నిర్ధారించే శాస్త్రీయ వివేచ నను ఆహ్వానిద్దాం కానీ, భాషల మధ్య అనారోగ్యకరమైన పోటీకి, ఘర్షణకూ దింపే కుట్రలకు దూరంగానే ఉండాలి. ఫిబ్రవరి 21వ తేదీని ప్రపంచ మాతృభాషా పరిరక్షణ దీక్షా దినో త్సవంగా యునెస్కో ప్రకటించింది. ఇంగ్లిష్ భాషాధిపత్యం వేలంవెర్రి నుంచి తెలుగుజాతి విముక్తి కావాలని జనసాహితి కోరుకుంటోంది. నేటి మాతృభాషా పరిరక్షణ దినోత్సవాన్ని కింది కనీస కోర్కెల సాధ నకు పునరంకితమయే దీక్షా దినంగా పాటించమని జనసాహితి ప్రజ లకు పిలుపునిస్తోంది. 1. కనీసం 10వ తరగతి వరకైనా తల్లిభాషలోనే విద్య నేర్పాలి. 2. డిగ్రీవరకు తెలుగు అధ్యయనం తప్పనిసరి అంశంగా ఉండాలి. 3. ప్రభుత్వ ఆదేశాలు, నూతన పథక రచనలు తెలుగులోనే రూపకల్పన జరిగేటట్టు చర్యలు తీసుకోవాలి. 4. గ్రూప్-1, సివిల్స్ పరీక్షలకు తప్ప మిగిలిన సమస్త అంశాలు తెలుగు, ఉర్దూలో రాసే అవ కాశం ఉండాలి. 5. రాష్ట్రంలోని న్యాయస్థానాల్లో తెలుగునే వాడాలి. 6.తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారికి, తెలుగులో దరఖాస్తు చేసేవారికి ప్రభుత్వం కల్పించే అవకాశాల్లో తొలి ప్రాధాన్యత ఉండాలి. నేడు మాతృభాషా పరిరక్షణ దినోత్సవం (వ్యాసకర్త జనసాహితి ప్రధాన కార్యదర్శి, మొబైల్: 9440167891) -
పంట పొలాల్లో అనకొండలు
తినుబండారాల దిగుమతి తప్ప వడ్లగింజ పండించటం ఎరగని సింగపూర్ లాంటి కొత్త రాజధానిని నిర్మిస్తానని గంతులేస్తున్న చంద్రబాబు పలుకులు లేత సొరకాయలైతే బాధపడక్కర్లేదు కానీ నిజమైతేనే దిగులు చెందాలి. ఎందుకంటే ఏపీ ‘రాజధాని’ నేలమీదికి అప్పుడే అనకొండ పాములు దిగి విషజ్వాలల్ని చిమ్ముతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ నుండి తెలివితేటలు కూడా అరువు తెచ్చుకున్నట్లున్నాడు. గట్టిగా మన ఒక జిల్లా అంత జనాభా లేని సింగపూ ర్లోని ఎత్తై భవం తులు చూపి, దేశదేశాల ద్రవ్య జూదరుల నల్లధన కేంద్రాన్ని తన టెక్నికలర్ కలల రాజ్యంగా ప్రకట నలు గుప్పిస్తున్నాడు. 2010లో ప్రపంచంలో సంప న్నులు అధికంగా ఉన్న దేశంగా నమోదైన సింగ పూర్లో నూటికి 20 మంది అతి నికృష్ట జీవితాలు గడుపుతూ గత 10 ఏళ్లలో ఎలాంటి మెరుగుదలకూ నోచుకోకుండా ఉన్నారన్న వాస్తవాన్ని కప్పిపుచ్చుతున్నారు. సింగపూర్ అందాలకు తమ రక్తాన్ని, చెమటను చిందించింది ఈ నిరుపేదలే! భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో దిక్కులేక కడు పు చేతబట్టుకుని తమ రెక్కలను అమ్మకాలకు పెట్టుకుంటూ సింగపూర్‌లో సమస్త చాకిర్లు చేస్తూ కూడా, పగళ్లు బజారులో తమ మురికి దేహాలతో కనిపించటానికి ఇలాంటి వారికి అవకాశం లేదు. ఎలాంటి కార్మిక హక్కులకు నోచుకోకుండా, తప్ప నిస్థితిలో ఆందోళన చేస్తే క్రూర అణచివేతలకూ, తుపాకి కాల్పులకూ బలైపోయేది కూడా వీరే! మొత్తం తినుబండారాలను దిగుమతి చేసుకో వటమే తప్ప వడ్లగింజ పండించటం ఎరగని సింగపూర్ లాంటి కొత్త రాజధానిని నిర్మిస్తానని ఆకాశానికి నిచ్చెనలేస్తున్న చంద్రబాబు పలుకులు లేత సొరకాయలైతే మనం పెద్దగా బాధపడ క్కర్లేదు కానీ నిజమైతేనే నిజంగా దిగులు చెందా లి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ‘రాజధాని’ నేలమీది కి అప్పుడే అనకొండ పాములు దిగి వాటి విష జ్వాలల్ని చిమ్మటం మొదలుపెట్టేశాయి. పంట పొలాల మీద ఆధారపడి తమ వ్యవసాయ పనుల నైపుణ్యంతో జీవిస్తున్న కూలీలు, కౌలు రైతులకు వెట్టిచాకిరీ బతుకులు కళ్లలో కదలాడుతున్నాయి. కన్నవారినీ, పెరిగిన ఊరునీ, అనుబంధం పెంచు కున్న పంట పొలాల్నీ, పశువుల్నీ వీడి వలసలు పోయి కూలీలుగా, రిక్షావారిగా, గృహ నిర్మాణ కార్మికులుగా, వెట్టిచాకిరీలు చేస్తూ మురికి గుంటల పక్కన దోమల నడుమ జానాబెత్తెడు గుడిసెల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి వారికి గోచరిస్తోంది. పేద మధ్యతరగతి రైతులకు అనిశ్చి తమై కానరాని భవిష్యత్తు ఒక వైపు, తక్షణం భూములను అమ్మి సొమ్ము చేసుకో అనే ఆశల పల్లకీ మరోవైపు కనిపి స్తున్నాయి. సంపన్న రైతులు సహా ఎవరికీ కాలు నిలవదు. కునుకుపట్టదు. ఆశ చావదు. భయం వీడదు. ప్రశాంతమైన చెరువులో చంద్రశిల విరిగి పడ్డట్టు అంతా కలకలం, కల్లోలం. కలహాలూ కంగాళీ!! అమరావతి సీమ రైతాంగాన్ని చంద్రబాబు సూటిగా ఇలా ప్రశ్నిస్తున్నాడు. ‘నేను రేపు సృష్టించ బోయే మబ్బులు, అవి ఎల్లుండి కురిపించబోయే కాసుల వర్షం మీకు కావాలా? మా కార్పొరేట్ మిత్రులు నేడు ఇవ్వచూపే ఎకరాకు కోటిపైన ధన రాశి కావాలా? కోరుకోండి’ అని శకుని పాచికలు విసురుతున్నాడు. ఇలాంటి జూదంలో ఎప్పుడూ పేద మధ్యతరగతి ప్రజలు, మట్టిని నమ్మినవారూ ఓడిపో తారని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఎర్రని ఏగానీ ఇవ్వనివాడు రేపు ఏదో చేస్తానంటే నమ్మా లా? రెతుల ఆవేదన ఇది. ఆందోళన ఇది! గత నెల రోజులలో కొత్తరాజధాని ప్రాంత మైన తుళ్లూరు చుట్టుపక్కల తాడికొండ, మంగ ళగిరి పరిధిలో సుమారుగా 3,000 కోట్లు రూపాయల భూముల బేరసారాలు జరిగితే రెండు వందల కోట్ల రూపాయలలోపు కొనుగోళ్లు అమ్మ కాలుగా మాత్రమే రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదయ్యాయి. తెల్లధనానికి తోడు సుమారు 15 రెట్లు నల్లధనం చేతులు మారింది. అంటే మార్కెట్లోకి ప్రవేశించింది. అది కుటుంబాల్లో పెంచే కలహాలను పరిష్కరించటానికి పోలీసుల కు, కోర్టులకూ పని పెరుగుతుంది. ప్రైవేటు సెటిల్మెంట్ గ్యాంగులైన మాఫియాల అవసరం పెరుగుతుంది. గృహహింసలు పెరుగుతాయి. విచ్చలవిడి తాగుళ్లు పెరుగుతాయి. వ్యభిచారం, విలాసాలూ, దుబారాలు పెరుగుతాయి. తెలియని వ్యాపారాల్లో పొందే చేదు అనుభవాలు మిగులు తాయి దోసిట్లో పోసిన నీరు కారిపోయినట్లుగా, క్రమంగా నూటికి 99 మంది రైతుల చేతుల్లో నుండి సొమ్ములు జారిపోయి కార్పొరేట్ శక్తుల ఆస్తిపాస్తులుగా అమరుతాయి. హైదరాబాద్ ఔటరురింగురోడ్డు నిర్మాణ సందర్భపు అను భవం మాత్రమే కాదు, అనేక చోట్ల సెజ్జుల పేరిట రైతులను భూముల నుండి బేదఖల్ చేసిన అన్ని అనుభవాలూ ఇవే. ఇప్పటికీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోని సచివాలయం కేవలం 22 ఎకరాల్లోనూ, హైకోర్టు 12 ఎకరాల్లోనూ, అసెంబ్లీ - శాసన మండలి కలిసి ఎనిమిదిన్నర ఎకరాల్లో మాత్రమే నిర్మాణమై ఉన్నాయి. మొత్తం కలిపినా 50 ఎకరాలు లేదు. సింగపూర్ నల్లధన స్వాములకు చక్రవర్తులైన అమెరికా దేశపు రాజధానీ భవనాలు 500 ఎకరాలలో ఉండగా ఇక్కడ 30వేల ఎకరాలు కావాలనటం హాస్యాస్పదం. అన్నన్ని వేల ఎకరాల నుండి రైతుల్ని బేదఖల్ చేయటాన్ని రాష్ట్ర ప్రజలు, రైతాంగం అనుమతించకూడదు. రాష్ట్ర సీఎంగా చంద్రబాబు తొలి సంతకం చేసిన రైతుల రుణ మాఫీ అజాపజా కనబడటంలేదు. కానీ మట్టిని మాణిక్యాలుగా మార్చే రైతు నోట మట్టి కొడుతు న్నారు.‘అప్పుతెచ్చి లేపిన మిద్దెలో కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది’ అన్నా డు ‘వందేమాతరం’ గేయంలో చెరబండరాజు. వాస్తుదోషం లేకుంటే చాలు ఎంత అప్పయినా ముప్పురాదు అంటున్నాడు చంద్రబాబు. ఇప్పటికే సేకరించదలుచుకున్న 30వేల ఎకరాల్లో ప్రభుత్వ, బంజరు భూములే చాలా ఉంటాయి. వాటిలో 500 ఎకరాలు రాజధానికి సరిపోతుందని నిపుణు లే పేర్కొన్నారు. అంతకు మించి ఎక్కువ తీసుకుం టే ప్రజల్ని కొల్లగొట్టి నల్లధన యోధులకు మెక్క బెట్టే అతి తెలివైన పథకమే. కొడవటిగంటి కుటుంబరావుగారు రాసిన ‘స్వార్థబుద్ధి’ అనే కథ లో యువరాజు తన ముసలి మంత్రితో ‘‘ప్రజలకు అవసరమైన పనులు చేయటానికి తెలివితేటలు అవసరం లేదు. ప్రజలకేం కావాలో తెలిస్తే చాలు. ప్రజల్ని మోసం చేయటానికే ఎక్కువ తెలివితేటలు కావాలి’’ అంటాడు. కొ.కు. చెప్పిన ఈ మోసకా రితనాన్ని మనం చావు తెలివితేటలంటే తప్పా? ‘ప్రజాసాహితి’ సంపాదకులు