the division
-
విభజన వెనుక రాజకీయ స్వార్థం
సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు ఖమ్మం మయూరిసెంటర్ : పరిపాలన సౌలభ్యం పేరుతో జరుగుతున్న జిల్లాల విభజన వెనుక కొందరి రాజకీయ స్వార్థం దాగుందని, విభజన పేరుతో జిల్లాకు మరోసారి అన్యాయం జరుగుతుందని సీపీఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం సీపీఐ కార్యాలయంలో జరిగిన సమితి సమావేశంలో పువ్వాడ మాట్లాడుతూ జిల్లా విభజనలో హేతుబద్ధత లోపించిందని, పూటకో ప్రకటనతో గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్‌లో కలపడం వెనుక ఏ ప్రాంత ప్రజల అభివృద్ధి దాగి ఉందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకుల స్వార్థం కారణంగా జిల్లా ప్రజలు విలువైన ఖనిజ సంపదను పొగొట్టుకోవాల్సి వస్తోందన్నారు. ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదని, కార్పొరేట్లకు ప్రజా సంపదను కట్టబెట్టేందుకు బ్యాంక్ విలీన ప్రక్రియ మొదులుపెట్టారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు కూనంనేని సాంబశివరావు, టీవీ చౌదరి, బాగం హేమంతరావు, ఎస్కె సాబీర్‌పాషా పాల్గొన్నారు. -
పెద్ద మనసుతో ఆదుకోండి
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి విభజన హామీలకు సంబంధించి మాపై విమర్శలు వస్తున్నాయి హామీలపై టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయండి.. రాజధానికి భారీగా నిధులివ్వండి.. సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద మనసుతో సాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీ వచ్చిన చంద్రబాబు ఆదివారం సాయంత్రం 6.45కు ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన అంశాలను మరోసారి ప్రధాని దృష్టికి తెచ్చారు. ఈ భేటీ సందర్భంగా సీఎం అనేక అభివృద్ధి విషయాలను ప్రధానితో చర్చించారని చంద్రబాబు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి చాలినంత సాయం చేయాలని ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. 13వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నిధులను బకాయిలు లేకుండా ఒకే విడతగా విడుదల చేయాలని కోరారు. వెనకబడిన జిల్లాలకు ప్రకటించిన ప్యాకేజీ మొత్తం చాలా స్వల్పంగా ఉందని, దీనిని మరింతగా పెంచాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన ఈ రైల్వే బడ్జెట్లో ఉండేలా చూడాలని కూడా కోరారు. ఇటీవలే ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకటించామని వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు, నూతన రాజధాని నిర్మాణానికి కేంద్రం ఎలాంటి సాయం విడుదల చేయడం లేదు. అందువల్ల కేంద్ర సాధారణ బడ్జెట్లో విభజన అంశాలన్నీ ఉండేలా చూడాలని ప్రధానిని కోరారు. లోటు బడ్జెట్‌ను పూడ్చేలా రాష్ట్రం అడిగిన విజ్ఞాపన మేరకు కేంద్ర సాయం లేదని.. దానికి ఇతోధికంగా సాయం చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలోపు పూర్తిచేసేలా భారీగా నిధులు కేటాయించాలని కోరారు. అలాగే ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం గతంలో ఖర్చుచేసిన రూ. 5 వేల కోట్లు చెల్లించాలని కోరారు’’ అని బాబు సన్నిహిత వర్గాలు వివరించాయి. నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద జరిగిన ఘర్షణపై కూడా వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్డీయే భాగస్వామిగా ఉన్నప్పటికీ కనీసం విభజన హామీలను కూడా అమలు చేయించలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయని ప్రధాని వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. -
నేటి నుంచి ఆప్షన్లు
-
నేటి నుంచి ఆప్షన్లు
రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి రంగం సిద్ధం 35 శాఖల ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోనున్న కమలనాథన్ కమిటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కీలకమైన రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులను పంపిణీ చేయగానే ఆ పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పంపిణీని కమలనాథన్ అధ్యక్షతన గల రాష్ట్ర సలహా కమిటీ చేపట్టనుంది. ఇప్పటికే రాష్ర్ట స్థాయి కేడర్ పోస్టులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ 67 శాఖలకు చెందిన వివరాలను కమలనాథన్ కమిటీ నోటిఫై చేసింది. 35 శాఖల పోస్టుల పంపిణీపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఈ శాఖల్లోని పోస్టులకు చెందిన ఉద్యోగులు ఇప్పటికే ఫామ్-3లో అన్ని వివరాలను అందజేశారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి ఈ 35 శాఖలకు చెందిన రాష్ర్ట స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఆప్షన్లను తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఆన్లైన్లో ఉన్న ఆప్షన్ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని అన్ని కాలమ్‌లను నింపి ఇవ్వాల్సిందిగా ఆయా ఉద్యోగుల సెల్ నంబర్లకు ఎస్ఎంఎస్లను పంపనున్నారు. ఆప్షన్లు ఇచ్చేందుకు రెండు వారాల గడువు ఇవ్వనున్నారు. విభజన చట్టంలోని మార్గదర్శకాల మేరకు ఏ రాష్ట్ర్రానికైనా కేటాయించవచ్చునని స్పష్టం చేశారు. ఆప్షన్ పత్రంలో పేర్కొన్న ముఖ్యాంశాలు.. - ఏ శాఖలో పనిచేస్తున్నారు. ఏ ప్రభుత్వానికి చెందిన ఏ కేటగిరీ పోస్టులో ఉన్నారు. - ఏ సర్వీసుకు చెందిన ఉద్యోగి. శాఖ యూనిట్ పేరు. ఏ కేటిగిరీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి. - సర్వీసు రిజిస్టర్ ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి. ఉద్యోగి గుర్తింపు నంబర్ - పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం/గ్రామం, పట్టణం, జిల్లా పేరు. - సొంత జిల్లా. - సామాజిక హోదా: ఎస్సీ/ ఎస్టీ,/బీసీ/ ఇతర. వివాహం అయిందా లేదా? - ప్రభుత్వ సర్వీసులో చేరిన సంవత్సరం - తొలి పోస్టింగ్ హోదా. ప్రాంతం - 1975 ప్రభుత్వ ఉద్యోగుల సంబంధిత ఉత్తర్వుల (రాష్ట్రపతి ఉత్తర్వులు) ప్రకారం స్థానికుడైతే.. ఏ ప్రాంతం, ప్రస్తుతం ఆ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది. ఉద్యోగంలో చేరడానికి అర్హత పరీక్షకు ముందు ఏడేళ్లు ఎక్కడ, ఏ విద్యా సంస్థలో చదివారు?/ టెన్త్‌కు ముందు ఏడేళ్లు ఏ విద్యా సంస్థలో, ఎక్కడ చదివారు? - సంబంధిత ఉద్యోగానికి ఎటువంటి విద్యార్హత లేని పోస్టుల్లో పనిచేస్తున్న వారు ఆ పోస్టు నోటిఫికేషన్ తేదీకి ముందు ఏడేళ్లు ఎక్కడ నివాసం ఉన్నారో తెలియజేయాలి. చదివిన సర్టిఫికెట్ లేదా నివాస స్థలం సర్టిఫికెట్ జత చేయాలి. - తొలి పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారో తెలియజేసే ధ్రువీకరణ/ ఆ పోస్టు ప్రస్తుతం ఉందా? - ఆఫీస్ చిరునామా - ప్రస్తుతం ఉన్న పోస్టులో నియామకానికి అనుసరించిన విధానం డెరైక్ట్ రిక్రూట్మెంట్/ పదోన్నతి/ బదిలీ. - ప్రస్తుతం ఉన్న పోస్టులో రెగ్యులర్ నియామకమా/తాత్కాలిక నియామకమా/ఇన్‌చార్జా? - ప్రస్తుతం చేస్తున్న పోస్టు మీ స్థాయికి తగినట్లు ఉందా. - ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టుకు కాలపరిమిత ఉందా/డెప్యుటేషన్/సెలవు/సస్పెన్షన్.. సంబంధిత వివరాలు. - ఏ రాష్ట్రానికి కేటాయించాలని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ. అందుకు గల కారణాలు.