divotees
-
లక్ష్మీ దేవి ఎక్కడ నివాసం ఉంటుంది ?
-
ఆనందమయ జీవితానికి నీమ్ కరోలీబాబా సూక్తులు
నీమ్ కరోలీ బాబాను హనుమంతుని స్వరూపంగా భావిస్తారు. 20వ శతాబ్ధపు మహనీయులలో అతనిని ఒకరిగా గుర్తిస్తారు. ఆయనకు ఎన్నో సిద్ధులు కూడా ఉన్నాయని చెబుతుంటారు. ఈ సిద్ధుల కారణంగానే అతని మహిమలు ప్రపంచానికంతటికీ తెలిశాయని అంటుంటారు. కరోలీ బాబా ఆశ్రమం నైనితాల్‌కు 65 కిలోమీటర్ల దూరంలోగల పంత్‌నగర్‌లో ఉంది. బాబా తన అలౌకిక శక్తులతోనే కాకుండా తన సిద్ధాంతాల ద్వారా కూడా అందరికీ సుపరిచితమయ్యారు. 1900వ సంవత్సరంలో జన్మించిన ఆయన 1973లో కన్నుమూశారు. మనిషి ఆనందంగా ఉండేందుకు జీవితంలో ఎలా మెలగాలో నీమ్ కరోలీ బాబా లోకానికి తెలియజేశారు. వీటిని అనుసరించడం ద్వారా మనిషి ప్రశాంతంగా కూడా ఉండవచ్చని బాబా తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు నీమ్ కరోలీ బాబా చెప్పినదాని ప్రకారం మనిషి ఎంత కష్టసమయంలోనైనా ఆందోళనకు లోనుకాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. కాలం ఎంత కఠినంగా ఉన్నా, ఏదో ఒకరోజు మార్పంటూ వస్తుంది. అందుకే ఎవరైనా విపత్కర పరిస్థితుల్లోనూ శాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ప్రతీ వ్యక్తీ.. ఈరోజు పరిస్థితులు బాగులేకపోయినా రేపు మంచి రోజులు వస్తాయనే నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. మనిషి భగవంతునిపై పూర్తి నమ్మకం ఉంచాలి. డబ్బును సక్రమంగా వినియోగించాలి ప్రతీ ఒక్కరూ డబ్బును సక్రమంగా వినియోగించాలి. అటువంటివారే ధనవంతులవుతారు. డబ్బు సంపాదించడంలోనే గొప్పదనం లేదని, దానిని సరిగా ఖర్చు చేయడంలోనే ఘనత ఉందన్నారు. ఇతరులను ఆదుకునేందుకు డబ్బును వెచ్చించాలి. అప్పుడే మనిషి దగ్గర ధనం నిలుస్తుంది. హనుమంతుని పూజించండి నీమ్ కరోలీ బాబా హనుమంతునిపై తన భక్తిని చాటారు. బాబాను హనుమంతుని అవతారం అని కూడా అంటుంటారు. ఎవరైతే ప్రతీరోజు హనుమంతుని పూజిస్తారో వారికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని నీమ్ కరోలీ బాబా తెలిపారు. ప్రతీవ్యక్తి రోజూ హనుమాన్ చాలీసా పఠిస్తే ధైర్యం వస్తుందని బాబా బోధించారు. -
ప్రబోధాశ్రమంపై ఎంపీ జేసీ అనుచరుల దాడి
-
అట్టుడుకుతున్న తాడిపత్రి
తాడిపత్రి/అనంతపురం న్యూసిటీ: వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పడిన వివాదంతో తాడిపత్రి అట్టుడుకుతోంది. శనివారం ఇరువర్గాలు పరస్పరంగా దాడి చేసుకోగా.. ఆదివారం ఉదయమే ఎంపీ జేసీ అనుచరులు ప్రబోధాశ్రమంపై దాడికి తెగబడ్డారు. విచక్షణ రహితంగా ఆశ్రమంలోకి చొరబడి కనిపించిన వారినల్లా చితకబాదారు. భక్తులు కూడా ఎదురుదాడికి దిగడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయగా పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువును ప్రయోగించారు. దాడుల్లో పలువురు గాయపడగా ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులతో శనివారం ఘర్షణ జరిగిన చిన్నపొలమడ గ్రామానికి వెళ్లారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అడ్డుకోవడంతో ప్రబోధాశ్రమం సమీపంలోని రోడ్డుపైనే ఎంపీ జేసీ అనుచరులతో బైఠాయించి ఆశ్రమ నిర్వాహకులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. శనివారం రాత్రి జరిగిన ఘర్షణలో దహనమైన ట్రాక్టర్లను పరిశీలించారు. బాధితులకు నష్టపరిహారం అందజేసి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. డీఎస్పీ విజయ్‌కుమార్ ఎంపీ జేసీకి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. పలాయనం చిత్తగించిన జేసీ ఇరువర్గాల ఘర్షణల్లో 15 మంది గాయపడ్డారు. ఈ క్రమంలోనే అసలు ఘర్షణకు ప్రధాన కారణం జేసీ దివాకర్‌రెడ్డేనని భావించిన ఆశ్రమ భక్తులు.. ఎంపీ జేసీ కూర్చున్న టెంట్ వద్దకు దూసుకొచ్చి దాడి చేయబోయారు. పరిస్థితి అదుపుతప్పడంతో జేసీ అక్కడి నుంచి తన వాహనంలో పలాయనం చిత్తగించాడు. పోలీసుల వైఖరికి నిరసనగా ఎంపీ జేసీ ధర్నా భక్తుల ఆగ్రహంతో చిన్నపొలమడ నుంచి తన వాహనంలో వెనుదిరిగి వచ్చిన జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులతో కలిసి పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. తన అనుచరులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి ఆశ్రమంలోని భక్తులను ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్లే దాడులు జరిగాయని ధ్వజమెత్తారు. దీంతో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు ముందు జాగ్రత్తగా సమీపంలోని దుకాణాలన్నింటిని మూసివేయించారు. ఓ డీఐజీ.. ఇద్దరు ఎస్పీలు శనివారం రాత్రి నుంచే జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తాడిపత్రిలో ఉండి పరిస్థితి సమీక్షించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు కూడా తాడిపత్రికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ తాడిపత్రి రూరల్ స్టేషన్ కూర్చొని పరిస్థితి సమీక్షించగా... చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు చిన్నపొలమడలో బందోబస్తును పర్యవేక్షించారు. మరోవైపు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్న రాయలసీమ ఇన్చార్జి డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ చిన్నపొలమడ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కొట్టొచ్చిన పోలీసుల వైఫల్యం శనివారం రాత్రి జరిగిన సంఘటనతో మేల్కోవాల్సిన పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టకుండా నిర్లక్ష్య వైఖరి అవలంభిండచం వల్లే ఆదివారం ఆశ్రమంపై దాడి జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్టు చేయకపోగా... చిన్నపొలమడ గ్రామానికి అనుమతించడం వల్లనే తిరిగి ఘర్షణలు తలెత్తాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీ దివాకర్‌రెడ్డి అక్కడే టెంట్ వేసుకుని కూర్చోవడానికి పోలీసులు అనుమతి నిరాకరించి ఉంటే కూడా పరిస్థితి ఇంత దూరం వచ్చేదికాదని అంటున్నారు. క్షతగాత్రుల్లో ఒకరు మృతి ఇరువర్గాల దాడుల్లో తీవ్రంగా గాయపడిన పెద్దపొలమడకు చెందిన వెంకటరాముడు(40) అలియాస్ పక్కీరప్ప మృతి చెందాడు. దాడుల్లో ఇంకా పలువురు గాయపడగా... అందులో తీవ్రంగా గాయపడిన ఏడుగురిని (పెద్దిరెడ్డి, చిన్నరాముడు, రామాంజినేయులు, రమణ, అర్జున్, కృష్ణ రంగయ్య, శివకుమార్) అనంతపురంలోని క్రాంతి ఆస్పత్రిలో చేర్చారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ఆస్పత్రి వద్ద పోలీసుల పహారా కాస్తున్నారు. తాడిపత్రి ఘటనపై విచారణ కమిటీ పెద్దపొడమల ఘటనపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ విచారణకు ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ –2 ఆధ్వర్యంలో అనంతపురం ఆర్డీఓ, తాడిపత్రి డీఎస్పీ సభ్యులుగా కమిటీ వేసినట్లు ఆదివారం కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపీ సమక్షంలోనే ఆశ్రమంపై దాడి శనివారం ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆశ్రమంలోని భక్తులను ఎవరినీ బయటకు రానీయకుండా భవనంలో తలుపులు మూసివేశారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఎంపీ జేసీ... అక్కడే టెంట్ వేసుకుని బైఠాయించారు. అదే సమయంలో ఆయన అనుచరులు సుమారు 500 మంది ఆశ్రమంలోకి చొరబడి వాహనాలను, సామగ్రిని దహనం చేశారు. అడ్డొచ్చిన భక్తులపై విచక్షణ రహితంగా రాడ్లు, పైపులతో దాడులకు తెగబడ్డారు. దీంతో భవనాల్లో ఉన్న భక్తులు తలుపులను పగులగొట్టుకొని బయటికి వచ్చి జేసీ సోదరుల అనుచరులపై ప్రతిదాడులకు దిగారు. పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో జేసీ వర్గీయులకు చెందిన టాటా సఫారీ, రెండు మారుతీ కార్లు పూర్తిగా ధ్వంసం కాగా... 10 ద్విచక్రవాహనాలు కాలి బూడిదైపోయాయి. మరో 20 ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. అయితే అంత వరకు ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులు బలగాలు ఒక్కసారిగా ప్రబోధాశ్రమ భక్తులపై బాష్పవాయువును ప్రయోగించారు. -
టీటీడీ తీరుపై భక్తాగ్రహం!
సాక్షి, తిరుపతి : మహాసంప్రోక్షణ పేరుతో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఆరు రోజుల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేయాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు కొద్దిరోజుల క్రితం చేసిన ఆరోపణల నేపథ్యంలో టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే విధంగా మహాసంప్రోక్షణ నిర్వహించిన రోజుల్లో భక్తులకు యథావిధిగా దర్శనాలు కల్పించిన టీటీడీ.. ఈసారి ఆరు రోజులపాటు పూర్తిగా స్వామివారి దర్శనాన్ని నిలిపివేయడంపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. పాలక మండలి తీసుకున్న ప్రస్తుత నిర్ణయంతో గతంలో వచ్చిన ఆరోపణలకు బలం చేకూరుతోందని భక్తులు అంటున్నారు. పోటులో తవ్వకాలు జరిగాయని, పింక్ డైమండ్ మాయమైందని వచ్చిన ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకే ప్రస్తుతం ఆలయం లోపల పనులు చేపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే సంప్రోక్షణ సమయంలో భక్తులను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయం తీసుకుందని విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గతంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించే సమయంలో భక్తులకు కొన్ని గంటలపాటు శ్రీవారి దర్శనం కల్పించామని పలువురు అర్చకులు గుర్తుచేస్తున్నారు. మరోవైపు.. మహాసంప్రోక్షణ సమయంలో దర్శనం చేసుకుంటే ఫలితం వుండదని ప్రస్తుత అర్చకుల్లో కొందరు చెబుతున్నారు. దీంతో టీటీడీ నూతన పాలకమండలి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి శ్రీవారి దర్శనాన్ని ఆరు రోజులపాటు భక్తులకు దూరంచేయడం మహాపాపం.. మహా అపచారం.. మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా గతంలో టీటీడీ జేఈవో 40వేల మంది భక్తులను అనుమతిస్తామని చెప్పారు. ఇప్పుడు మాట మార్చారు. రెండు టోల్గేట్లు, రెండు నడకదారి మార్గాలను మూసివేస్తామని ప్రకటించడం టీటీడీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఆగమ సలహా మండలి, పెద్ద జీయర్, చిన్న జీయర్, మఠాధిపతులను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంవల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. గతంలో పద్మావతి అమ్మవారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం జరిగినప్పుడు అమ్మవారి ప్రతిరూపాన్ని తయారుచేసి అమ్మవారి శక్తిని ఆ ప్రతిమలలో ఆవాహన చేసి భక్తుల సందర్శనార్థం ఉంచారు. మరి తిరుమల శ్రీవారి ఆలయ సంప్రోక్షణ విషయంలో అలా ఎందుకు చేయడంలేదు? ఆలయం మూసివేసే హక్కు, అధికారం టీటీడీ ధర్మకర్తల మండలి, ఐఏఎస్ అధికారులకు లేదు. భక్తులను దర్శనానికి అనుమతించకుండా మహాసంప్రోక్షణ నిర్వహించాలని ఆగమ శాస్త్రం చెప్పిందా!? – నవీన్‌కుమార్‌రెడ్డి, శ్రీవారి భక్తుడు -
కుబేర తాళం చెవి పోవడం ఏమిటి!
భువనేశ్వర్ : శ్రీజగన్నాథుని దేవస్థానం శ్రీమందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతయింది. ఈ తాళం అత్యంత ప్రాచీన ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీ జగన్నాథ సంస్కృతిలో ఈ తాళం చెవిని కుబేర తాళం చెవిగా పేర్కొంటారు. అమూల్యమైన రత్న సంపద రత్న భాండాగారం రక్షణ కోసం వినియోగించే తాళం చెవి కావడంతో దీనికి ఆ ప్రాధాన్యం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీజగన్నాథుని కోషాగారంలో కుబేర తాళం చెవి భద్రపరుస్తారు. పకడ్బందీ అధికార బందోబస్తు మధ్య దీనిని వినియోగిస్తారు. వినియోగం తర్వాత అదే క్రమంలో ఆలయ సంప్రదాయాలతో చట్టపరమైన మార్గదర్శకాల ఆచరణతో దీనిని పదిలపరచడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కుబేర తాళం చెవి కనిపించక పోవడం సందిగ్ధతని ప్రేరేపిస్తుంది. ఈ తాళం చెవి గల్లంతు విషయం తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘ కాలం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. శ్రీజగన్నాథుని భక్త హృదయాలు స్పందించి వీధికి ఎక్కిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాయ కమిషన్ విచారణకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా కంటి తుడుపు వ్యవహారంగా శ్రీజగన్నాథ సేన విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఎంత మాత్రం నమ్మశక్యంగా లేవని వివరిస్తు శ్రీజగన్నాథ సేన ప్రముఖుడు ప్రియదర్శి పట్నాయక్ స్థానిక సీబీఐ కార్యాలయానికి విచ్చేసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు దాఖలు చేశారు. ప్రాచీనమైన కుబేర తాళం చెవి సాధారణమైనది కాదు. 3 అంచెల కొనతో ఒకటిన్నర అడుగుల పొడవైన తాళం చెవి అదృశ్యం కావడం అంటే ఆలోచించాల్సిన విషయంగా సీబీఐ గుర్తించి విచారణకు రంగంలోకి దిగాలని ఆయన సీబీఐ వర్గాలకు అభ్యర్థించారు. ఈ సందర్భంగా సీబీఐ కార్యాలయం ఎదురుగా సోమవారం శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు. -
మతమేదైనా సత్యం, శాంతినే బోధిస్తాయి
జయపురం: హిందూ, క్రిస్టియన్, సిక్కు, ముస్లిం ఇలా ఏ మతమైనా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనే బోధిస్తాయని సత్యసాయి సేవాసమితి వారు చెప్పారు. సత్య సాయి సేవాసమితి ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బాల వికాస కేంద్రం విద్యార్థులతో వాక్ ఫర్ వాల్యూస్ అనే అవగాహన ర్యాలీని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భారత మాత, గాంధీ, వివేకానందుడు, బుద్ధుడు, నెహ్రూ, మోడీ వేషధారణలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ జయపురం మహాత్మా గాంధీ రోడ్‌లోని సత్యసాయి సేవా సమితి మందిరం నుంచి ప్రధాన మార్గం మీదుగా పోలీస్‌స్టేషన్ వరకూ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ‘ప్లీజ్ ప్రామిస్ అజ్ ఫర్ బెటర్ వరల్డ్’ అనే సందేశాన్ని పోలీసు అధికారులకు సమర్పించారు. సంఘీభావం సర్వ మానవ సమానత్వం, అన్ని మతాలు ఒకటేనన్న సందేశం, వసుధైక కుటుం బంపై విద్యార్థులు అవగాహన కలిగించారు. ర్యాలీలో సత్యసాయి సేవా సమతి కోఆర్డినేటర్ ఎస్.ప్రకాశ్‌రావు, జిల్లా కోఆర్డినేటర్ మార్కం డేయ షరాఫ్, బాల వికాస్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ ఎస్.స్వర్ణలత, బాల వికాస్ ఉపాధ్యాయరాలు ఎస్.గౌరి, బాల వికాస్ కేంద్ర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న వసతి గదుల్లో ఊడిపడ్డ ఫ్యాన్
వేములవాడ: వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకుందామని వచ్చిన ఓ భక్తుడి కుటుంబానికి గురువారం చేదు అనుభవం ఎదురైంది. నిద్రిస్తున్న బెడ్‌పై ఫ్యాన్ ఊడి పడటంతో అంతా అవాక్కయ్యారు. బెడ్‌పైనుంచి అప్పుడే మూడు నెలల పసిపాపను ఎత్తుకున్న కొద్దిసేపటికే ఫ్యాన్ ఊడి పడటంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని కరీంనగర్‌కు చెందిన కరుణాకర్ అనే భక్తుడు వాపోయాడు. భక్తుడు తెలిపిన వివరాల ప్రకారం..రాజన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు తమ కుటుంబం రాజేశ్వరపురం వసతి గదుల్లోని 15వ గదిని గురువారం అద్దెకు తీసుకున్నారు. రాజన్నకు మొక్కులు చెల్లించుకుని గదిలోకి వచ్చి బెడ్‌పై పడుకున్న తమ చిన్నారిని తల్లి అప్పుడే చేతిల్లోకి తీసుకుని పాలిచ్చేందుకు యత్నిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఫ్యాన్ ఊడిపోయి బెడ్‌పై పడింది. దీంతో చిన్నారి ప్రాణాలతో బయటపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాన్ రెక్క తగలడంతో తల్లి చేతికి గాయమైనట్లు చెప్పారు. కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న రాజన్న ఆలయంలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ అధికారులకు సమాచారం అందించినా కనీసం ఎవరూ స్పందించలేదని కరుణాకర్ ఆరోపించారు. ఇటీవలే రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో నిద్రిస్తున్న ఓ చిన్నారిపైనుంచి ఆవుల మంద పరుగులు తీసిన ఘటనలో బాలుడి ప్రాణాలొదిలిన ఘటన మరచిపోకముందే వసతి గదుల్లో ఫ్యాన్ ఊడిపోయి బెడ్‌పై పడటం ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. ఈవిషయమై ఎలక్ట్రికల్ ఏఈ శేఖర్‌ను వివరణ కోరగా.. ఫ్యాన్ బోల్ట్ ఊడిపోయి కింద పడిందని, వెంటనే తమ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ ఫ్యాన్‌ను తొలగించి మరో ఫ్యాన్ బిగించినట్లు చెప్పారు. -
స్వామి దర్శనం సగం మందికే
సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడవాహన సేవలో విశ్వపతిని దర్శించాలని భక్తులు తండోపతండాలుగా తరలిరావటం, దర్శనం లేక ఆవేదనతో వెనుదిరిగిపోవటం సర్వసాధారణమైంది. ఈ ఏడాది కూడా సగం మంది భక్తులకు కూడా దర్శన భాగ్యం లభించలేదు. ఈ నేపథ్యంలో ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధుల విస్తరణ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధుల్లో 1.80 లక్షల మంది భక్తులు హాయిగా కూర్చుని ఉత్సవ మూర్తులను దర్శించవచ్చని టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి 1.5 లక్షలకు మించి భక్తులు కూర్చుని వాహన సేవలను దర్శించే అవకాశం లేదు. ఎందుకంటే సెక్యూరిటీ నిబంధనల ప్రకారం వాహన సేవలు వీక్షించే సందర్భంలో ప్రతి గ్యాలరీ పక్కన, ముందు ‘డి సర్కిల్’ పేరుతో కొంత ఖాళీ స్థలాన్ని వదలాల్సి ఉంటుంది. భద్రతా, పోలీసు సిబ్బంది భక్తులకు ఆయా స్థలాల్లో కూర్చునే అవకాశం కల్పించటం లేదు. పోలీసు కట్టడితో భక్తులకు ఇక్కట్లు పెరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు రాత్రి జరిగే గరుడవాహన సేవకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ సేవకు ప్రతియేటా 3 నుంచి 4 లక్షల మంది వరకు భక్తులు తిరుమలకు చేరుకుంటారు. మధ్యాహ్నం సమయానికే గ్యాలరీలు నిండిపోతాయి. ఆ తర్వాత వచ్చిన భక్తులను గ్యాలరీలకే కాదు... నాలుగు మాడ వీధుల చుట్టుపక్కలకూ పంపకుండా పోలీసులు కట్టడి చేస్తారు. దీంతో వాహన సేవలో స్వామిని దర్శిద్దామని వచ్చిన భక్తులు తీవ్ర ఆవేదనతో తిరిగి వెళుతుంటారు. కొత్త నిర్మాణాల వల్లే సమస్యంతా? ఆలయ నాలుగు మాడవీధులు విస్తరణ ఆలోచన 1978లో నాటి ఈవో పీవీఆర్కే ప్రసాద్ హయాంలోనే మొదలైంది. 1983 నుంచి దశలవారీగా అమలు చేశారు. 2003లో ఆలయ నాలుగు మాడవీధుల్లోని స్థానికుల ఇళ్లు, మఠాలు, చిన్న ఆలయాలు పూర్తి స్థాయిలో తొలగించారు. దీంతో భక్తులకు వాహన సేవల భాగ్యం కలుగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొందరి ఒత్తిడితో కొన్ని నిర్మాణాలు వెలిశాయి. ప్రస్తుతం బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల్లో భక్తులు ఉత్సవమూర్తిని దర్శించేందుకు ఆ నిర్మాణాల్లో అవరోధాలుగా నిలిచాయి. ఖాళీ ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చు ప్రస్తుతం ఆలయానికి తూర్పు, దక్షిణ మాడ వీధిలోని హథీరాంజీ మఠం స్థల సేకరణ అంశం కోర్టులో నడుస్తోంది. ఇక దక్షిణ మాడవీధిలోని గ్యాలరీల వెనుక వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కొంత స్థలాన్ని వినియో గించుకోవచ్చని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. పడమర మాడ వీధిలోని కొన్ని ప్రాంతాల్లోని గ్యాలరీలు అభివృద్ధి చేసే అవకాశమున్నట్లు చెబుతు న్నారు. ఇక ఉత్తర మాడవీధిలో ఎక్కువ స్థాయిలో గ్యాలరీలు అభివృద్ధి చేయవచ్చని అంటున్నారు. మాడవీధులు అభివృద్ధి చేస్తాం.. ‘‘బ్రహ్మోత్సవాల్లో యేటేటా భక్తులు పెరుగుతున్నారు. అందు లోనూ గరుడవాహన సేవ, రథోత్సవంలో భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు. వారందరికీ ఉత్సవమూర్తిని దర్శించే అవకాశం కల్పించాలంటే మాడవీధులు విస్తరించాల్సిందే. వచ్చే బ్రహ్మోత్సవాల్లోపు కొత్త గ్యాలరీలు నిర్మిస్తాం.’’ – అనిల్‌కుమార్ సింఘాల్, ఈవో, టీటీడీ తిరుమలలో పోటెత్తిన భక్తులు తిరుపతి (అలిపిరి): దసరా సెలవులు పూర్తవుతుండటంతో సోమవారం తిరుమలకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి ఆలయ మాడవీధులు, లడ్డూ కౌంటర్లు, బస్టాండ్లు, విచారణ కార్యాలయాలు, ఉచిత సముదాయాలు, అన్నప్రసాద కేంద్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శ్రీవారి సర్వదర్శన భక్తులు క్యూ వెలుపల కిలోమీటర్ వరకు బారులు తీరారు. క్యూలో గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో అవస్థలు పడ్డారు. వైకుంఠం కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వైభవంగా బాగ్ సవారి తిరుపతి (అలిపిరి): తిరుమలలో సోమవారం బాగ్ సవారి వైభవంగా సాగింది. సాధారణంగా అన్ని ఉత్సవాలు, సేవలు, ఊరేగింపుల్లో ఉత్సవర్లు ఆలయానికి ప్రదక్షిణంగానే ఊరేగు తారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు మాత్రమే మలయప్ప ఆలయానికి, పుష్కరిణికి అప్రదక్షిణగా ఊరేగుతా రు. దీనిలో భాగంగా మలయప్ప అనంతాళ్వారుల తోటలో పూజా నివేదనలు అందుకున్నారు. తిరిగి అప్రదక్షిణగానే ఆల యానికి చేరుకున్నారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కోదండరామారావు, డాలర్ శేషాద్రి ఉన్నారు. -
ముగిసిన అంత్య పుష్కరాలు
రెంజల్ : పవిత్ర గోదావరి నది అంత్య పుష్కరాలు ముగిశాయి. చివరి రోజైన గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. దీంతో కందకుర్తి త్రివేణి సంగమంలో సందడి నెలకొంది. జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. పుష్కర క్షేత్రంలోని 4 ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. పుణ్య స్నానాలు చేసిన అనంతరం నదిలోని పురాతణ శివాలయంతో పాటు ఒడ్డన గల పుష్కరరాజ్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అంతిమ పుష్కరాల చివరి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రెంజల్ ఎస్సై రవికుమార్ పర్యవేక్షణ చేపట్టారు. గజ ఈతగాళ్ళను అప్రమత్తం చేశారు. సుమారు 5 వేల మంది కందకుర్తిలో పుణ్యస్నానాలను ఆచరించినట్లు అర్చకులు తెలిపారు. -
పుష్కర క్షేత్రంలో భక్తుల సందడి